ప్రపంచ ప్రధాన సహజ సిద్ధ మండలాలు
Sakshi Education
మానవుడు తాను నివసించే భూగోళం గురించి ఉష్ణోగ్రత ఆధారంగా పరిశీలించాడు. భూ ఉపరితలంపై ఒకే రకమైన శీతోష్ణస్థితి, వృక్ష, జంతు సంపదల గురించి తెలిపే ప్రాంతాలను ప్రపంచ సహజ సిద్ధ మండలాలుగా పేర్కొంటారు. ప్రపంచాన్ని ప్రధానంగా 13 సహజ సిద్ధ మండలాలుగా విభజించారు.
ఒక ప్రాంత ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు ఆ ప్రదేశ సహజ వృక్ష సంపద విస్తరణ గురించి తెలుపుతాయి. భూ ఉపరితలంపై ప్రధానంగా మూడు రకాల ఉష్ణోగ్రత మండలాలున్నాయి. అవి.. అత్యుష్ణ మండలం, సమశీతోష్ణ మండలం, అతిశీతల మండలం.
సహజ సిద్ధ మండలాల్లో ముఖ్యమైనవి..
1) భూమధ్య రేఖా మండలం
2) అయన రేఖా (ఉష్ణ మండల ఎడారులు)
3) ఉష్ణ మండల పచ్చిక బయళ్లు (సవన్నాలు)
4) సమశీతోష్ణ గడ్డిభూములు (స్టెప్పీలు)
5) రుతుపవన (మాన్‌సూన్) మండలం
6) మధ్యదరా ప్రకృతి సిద్ధ మండలం
7) టైగా మండలం
8) టండ్రా మండలం
భూమధ్య రేఖా మండలం
ఈ మండలం భూమధ్య రేఖకు ఇరువైపులా 10° ఉత్తర, దక్షిణ అక్షాంశాల వరకు విస్తరించి ఉంది. పవనాభిముఖ ప్రాంతంలో 10° నుంచి 20° ఉత్తర, దక్షిణ అక్షాంశాల వరకు విస్తరించి ఉంది. ఈ మండలంలో దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది ప్రాంతాలు, ఆఫ్రికాలోని కాంగో నది ప్రాంతాలు, ఆగ్నేయాసియా దేశాలు, వెస్టిండీస్ దీవులు ఉన్నాయి. ఈ మండలాన్ని ‘డోల్‌డ్రమ్స్’, ‘ప్రశాంత మండలం’, ‘ఉష్ణ మండల (సంవహన) వర్షపాత ప్రాంతం’గా పేర్కొంటారు. ఈ మండలంలో అత్యల్ప జనసాంద్రత ఉంది.
అయన రేఖా(ఉష్ణ మండల) ఎడారులు
ఉష్ణ మండల ఎడారులు ఖండాల పశ్చిమ తీరంలో 15° నుంచి 30° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి.
1. సహారా ఎడారి - ఆఫ్రికా. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ మండల ఎడారి.
2. అరేబియా ఎడారి - ఇది అరేబియా ద్వీపకల్పంలో (ఆసియా ఖండం) ఉంది.
3. థార్ ఎడారి - ఇది భారత్, పాకిస్థాన్‌లో (ఆసియా ఖండం) విస్తరించి ఉంది.
4. ఆస్ట్రేలియా ఎడారి - ఆస్ట్రేలియా. ఇది దక్షిణార్ధ గోళంలో అతిపెద్ద ఎడారి.
5. కలహారి ఎడారి - ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో విస్తరించి ఉంది.
6. అటకామా ఎడారి - ఆండీస్ పర్వతాలు, చిలీ, పెరూ దేశాలు (దక్షిణ అమెరికా).
7. సోనారన్ ఎడారి - ఉత్తర అమెరికా.
సహారాలో టౌరెన్లు, కలహారిలో బుష్‌మెన్లు, అరేబియాలో బిడోనియన్లు, ఆస్ట్రేలియాలో బిండిబాలు లాంటి జాతులు ఉంటాయి. చిలీ నైట్రేట్లకు, కాలిఫోర్నియాలోని శాండియాగో విమాన తయారీ పరిశ్రమకు, ఆస్ట్రేలియాలోని కాల్‌గూర్లి, కూల్‌గార్డి బంగారం గనులకు ప్రసిద్ధి.
1) నైలు నది (ఆఫ్రికా)
2) సింధూనది (ఆసియా)
3) కొలరాడో నది (ఉత్తర అమెరికా)
4) ఆరెంజ్ నది (దక్షిణ ఆఫ్రికా)
5) డార్లింగ్ నది (ఆస్ట్రేలియా)
సవన్నా మండలం
ఇది 10° – 20°C ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది. ఈ మండలంలో 1 మీ. నుంచి 6 మీ. వరకు పెరిగే ఏనుగు గడ్డి ఉంటుంది. దక్షిణ అమెరికా ఉత్తర ప్రాంతం (ఒరినాకో నది పరీవాహక ప్రాంతం)లోని గడ్డి భూములను ‘లానోలు’, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, బొలీవియా దేశాల్లోని గడ్డి భూములను ‘కంపాలు’ అంటారు. ఆఫ్రికాలోని సవన్నాలను ‘పార్‌కలాండ్’ అంటారు. అనాస పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే హవాయి ఈ మండలంలోనే ఉంది. వెనెజులా - పెట్రోలియానికి, నైజీరియా - తగరం, క్యూబా - పంచదార ఉత్పత్తికి ప్రసిద్ధి. కెన్యాలో కికియూ తెగవారు నివసిస్తారు.
30° నుంచి 55° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య స్టెప్పీ గడ్డి భూములు విస్తరించి ఉన్నాయి. ఇవి యురేసియా (ఆసియా+యూరప్)లోని వాయవ్య చైనా, టర్కీ, స్పెయిన్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఉత్తర అమెరికాలో 100° రేఖాంశం నుంచి ఇంటర్ మౌంటేన్ వరకు ఉన్న గడ్డి భూములను ‘ప్రయరీలు’, దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో ఉన్న గడ్డి భూములను ‘పంపాలు’, దక్షిణ ఆఫ్రికాలోని డ్రాకెన్‌సబర్గ్వద్ద ఉన్న గడ్డి భూములను ‘వెల్డులు’, ఆస్ట్రేలియాలో ఉన్న గడ్డి భూములను ‘డౌన్లు’ అంటారు. ఈ మండలాన్ని అర్ధ శుష్క ప్రాంతంగా పేర్కొంటారు. ఈ మండలంలో అమెరికా దేశంలో ‘ది గ్రాండ్ కానియన్ ఆఫ్ కొలరాడో’ ఉంది. ఆస్ట్రేలియాలో గొర్రెలను పెంచే ఎస్టేట్‌లను ‘రాంచీలు’, అర్జెంటీనాలో గొర్రెలను పెంచే ఎస్టేట్‌లను ‘ఎస్టాన్షియన్లు’ అంటారు. హంగేరిలోని సమశీతోష్ణ మండల గడ్డి భూములను ‘పుస్తాజ్’ అంటారు. ఈ మండలంలో ప్రధాన పంట - గోధుమ.
ఖండాల తూర్పు తీరంలో 10°- 30° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య రుతుపవన మండలం విస్తరించి ఉంది. ఈ మండలంలో దక్షిణ, ఆగ్నేయ ఆసియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూ గినియాలోని దక్షిణ ప్రాంతాలున్నాయి. ‘మౌసమ్’ అంటే ‘రుతువు’ అని అర్థం. అరబిక్ పదమైన ‘మౌసమ్’ నుంచి ‘మాన్‌సూన్’ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది.
ఈ మండలంలో పెరిగే వృక్షాలకు వెడల్పాటి ఆకులు ఉంటాయి. వీటిని ఆకురాల్చే అడవులు అంటారు. ఇక్కడ పెరిగే మడ అడవులను ‘సుందర అరణ్యాలు’ అంటారు. ప్రపంచ జనాభాలో 25 శాతం ఈ మండలంలో నివసిస్తున్నారు.
ఖండాల పశ్చిమ భాగంలో 30°-40° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఈ మండలం విస్తరించి ఉంది. ఈ మండలాన్ని ‘శుష్క వేసవి ఉప అయన రేఖా ప్రాంతం’గా పేర్కొంటారు. ప్రపంచ జనాభాలో 4% ఈ మండలంలో నివసిస్తున్నారు. ఈ మండలంలో వేసవి కాలంలో వీచే శీతల పవనాలను బోరా (యుగోస్లేవియా), మిస్ట్రల్ (ఫ్రాన్‌స) అంటారు. ఈ మండలంలోని కాలిఫోర్నియా నారింజ పండ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. చిలీ దేశంలోని విశాలమైన వ్యవసాయ క్షేత్రాలను ‘హోసియోండాలు’ అంటారు. ఈ మండలంలో లభించే ప్రధాన చేపలు సార్టెన్, ట్యూనా.
ఈ మండలంలో..
ఇది ఉత్తరార్ధ గోళంలో 55° - 70° ఉత్తర అక్షాంశాల మధ్య వ్యాపించి ఉంది. దీన్ని ఉప ఆర్కిటిక్ ప్రాంతం అంటారు. టైగా అనేది రష్యన్ భాషా పదం. ‘టైగా’ అంటే ‘శృంగాకార అడవులు’ అని అర్థం. ఈ మండలం ప్రపంచంలో అత్యధిక వార్షిక శీతోష్ణ వ్యత్యాసాలను కలిగి ఉంటుంది. 1982లో వెర్కోయాన్క్స్ వద్ద ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ ఉష్ణోగ్రత ‘-68°’గా నమోదైంది. సంవత్సరంలో 210 రోజులపాటు ఘనీభవించే నది ‘లీనా’ ఈ మండలంలోనే ఉంది. ఈ మండలం ఫర్న్ ఉత్పత్తికి ప్రధానకేంద్రం. ప్రపంచంలో అతిపెద్ద అల్యూమినియం కర్మాగారం కెనడాలోని ఆర్పిడా. కొయ్యగుజ్జు తయారీలో ప్రథమస్థానంలో ఉన్న దేశం కెనడా. టైగా ప్రాంతంలో చక్రవాత వర్షపాతం అధికం.
ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న నగరం ముర్మాన్‌స్క్. టైగా మండలంలో కెల్లా పెద్ద నగరం ఆర్ఖేంజెల్. సైబీరియాలో ప్రధాన నగరం ఇర్‌కుట్‌స్క్. ఈ మండలంలో ఉత్తర అమెరికా ఖండంలోకెల్లా పెద్ద నగరం ఫెయిర్ బాంక్స్ (అలస్కా) ఉంది. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంను ‘బాల్టిక్ సముద్రపు రాణి’గా పిలుస్తారు.
టండ్రా అంటే నిస్సారమైన భూములు లేదా ఎడారి అని అర్థం. టండ్రాలో వేసవి సగటు ఉష్ణోగ్రత 12°. వృక్షాలు లేని ఏకైక ఖండం అంటార్కిటికా. ఈ మండలంలో పక్షుల గుంపులను రోకరీలు అంటారు. ఈ మండలంలో జీవించే ప్రధాన పక్షులు టార్మిగాన్, ధ్రువపు గుడ్లగూబ. ఈ మండలంలో యురేసియాలో ‘లాపులు’ నివసిస్తారు. ఉత్తర అమెరికాలోని టండ్రా ప్రాంతంలో నివసించేవారు ‘ఎస్కిమోలు’. వీరు ఉపయోగించే పడవలను ‘డయాక్’ అంటారు. గడ్డకట్టిన మంచుపై ఉపయోగించే వాహనాలను స్లెడ్జి బండ్లు అంటారు. ధ్రువ ప్రాంత ప్రజల ఆయుధం హార్పూన్. మంచుగడ్డలతో అర్ధ చంద్రాకారంలో ఉన్న ఇళ్లను ‘ఇగ్లూలు’ అంటారు. ఉత్తరార్ధ గోళంలో కనిపించే కాంతులను ‘అరోరా బొరియాలిసిస్’ అంటారు.

- భూమధ్య రేఖా మండలం సగటు ఉష్ణోగ్రత 26°C (21°C నుంచి 31°C).
- ఈ మండలంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం - ఆఫ్రికాలోని కామెరూన్ పర్వత శిఖరమైన ‘డెబుంచ’.
- ఈ మండలంలో ప్రపంచంలోకెల్లా దట్టమైన అడవులను ‘సెల్వాలు’ అంటారు. తీగ జాతికి చెందిన చెట్లు అల్లుకొని విశాల పత్రాలతో విస్తరించి ఉంటాయి. వీటిని ‘లయనాలు’ అంటారు.
- వెస్టిండీస్ దీవుల్లో పెరిగే జాపోట్ వృక్షాల నుంచి చూయిమ్‌గమ్‌ను తయారు చేసే ‘చికిల్’ పదార్థం లభిస్తుంది.
- ఈ మండలంలో ప్రధాన విష సర్పం పింజర. లయనాలపై కనిపించే సర్పాలు అనకొండలు.
- ఈ మండలంలో పెద్ద నగరం సింగపూర్.
అయన రేఖా(ఉష్ణ మండల) ఎడారులు
ఉష్ణ మండల ఎడారులు ఖండాల పశ్చిమ తీరంలో 15° నుంచి 30° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి.
- ఎడారులు లేని ఖండాలు - అంటార్కిటికా, ఐరోపా.
1. సహారా ఎడారి - ఆఫ్రికా. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ మండల ఎడారి.
2. అరేబియా ఎడారి - ఇది అరేబియా ద్వీపకల్పంలో (ఆసియా ఖండం) ఉంది.
3. థార్ ఎడారి - ఇది భారత్, పాకిస్థాన్‌లో (ఆసియా ఖండం) విస్తరించి ఉంది.
4. ఆస్ట్రేలియా ఎడారి - ఆస్ట్రేలియా. ఇది దక్షిణార్ధ గోళంలో అతిపెద్ద ఎడారి.
5. కలహారి ఎడారి - ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో విస్తరించి ఉంది.
6. అటకామా ఎడారి - ఆండీస్ పర్వతాలు, చిలీ, పెరూ దేశాలు (దక్షిణ అమెరికా).
7. సోనారన్ ఎడారి - ఉత్తర అమెరికా.
సహారాలో టౌరెన్లు, కలహారిలో బుష్‌మెన్లు, అరేబియాలో బిడోనియన్లు, ఆస్ట్రేలియాలో బిండిబాలు లాంటి జాతులు ఉంటాయి. చిలీ నైట్రేట్లకు, కాలిఫోర్నియాలోని శాండియాగో విమాన తయారీ పరిశ్రమకు, ఆస్ట్రేలియాలోని కాల్‌గూర్లి, కూల్‌గార్డి బంగారం గనులకు ప్రసిద్ధి.
- ఈ మండలంలో పెద్ద నగరం కైరో.
- ఇస్లాం మతస్థుల పవిత్ర పుణ్యక్షేత్రం ‘మక్కా’ ఈ మండలంలోనే ఉంది.
- ప్రపంచంలో అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం అబుదాన్ (ఇరాన్)లో ఉంది.
- ఎడారి వృక్ష సంపదను ‘గ్జీరోఫైట్స్’ అంటారు.
- భూ ఉపరితలంపై అత్యధిక ఉష్ణోగ్రత 58°C సహారా ఎడారిలోని లిబియా దేశంలో ‘అజీజియా’ వద్ద 1922 సెప్టెంబర్ 13న నమోదైంది.
- ఎడారుల్లో సగటు వర్షపాతం 25 సెం.మీ. కంటే తక్కువ.
- ఎడారుల్లో ప్రవహించే నదులను ‘ఎగ్జోటిక్ నదులు’ అంటారు.
1) నైలు నది (ఆఫ్రికా)
2) సింధూనది (ఆసియా)
3) కొలరాడో నది (ఉత్తర అమెరికా)
4) ఆరెంజ్ నది (దక్షిణ ఆఫ్రికా)
5) డార్లింగ్ నది (ఆస్ట్రేలియా)
సవన్నా మండలం
ఇది 10° – 20°C ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది. ఈ మండలంలో 1 మీ. నుంచి 6 మీ. వరకు పెరిగే ఏనుగు గడ్డి ఉంటుంది. దక్షిణ అమెరికా ఉత్తర ప్రాంతం (ఒరినాకో నది పరీవాహక ప్రాంతం)లోని గడ్డి భూములను ‘లానోలు’, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, బొలీవియా దేశాల్లోని గడ్డి భూములను ‘కంపాలు’ అంటారు. ఆఫ్రికాలోని సవన్నాలను ‘పార్‌కలాండ్’ అంటారు. అనాస పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే హవాయి ఈ మండలంలోనే ఉంది. వెనెజులా - పెట్రోలియానికి, నైజీరియా - తగరం, క్యూబా - పంచదార ఉత్పత్తికి ప్రసిద్ధి. కెన్యాలో కికియూ తెగవారు నివసిస్తారు.
- ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పొందే (1234.4 సెం.మీ.) ‘వయోలిలి’ శిఖరం ఈ మండలంలోనే ఉంది.
- ఈ మండలంలో ప్రఖ్యాత జలపాతం ‘విక్టోరియా’. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది.
30° నుంచి 55° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య స్టెప్పీ గడ్డి భూములు విస్తరించి ఉన్నాయి. ఇవి యురేసియా (ఆసియా+యూరప్)లోని వాయవ్య చైనా, టర్కీ, స్పెయిన్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఉత్తర అమెరికాలో 100° రేఖాంశం నుంచి ఇంటర్ మౌంటేన్ వరకు ఉన్న గడ్డి భూములను ‘ప్రయరీలు’, దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో ఉన్న గడ్డి భూములను ‘పంపాలు’, దక్షిణ ఆఫ్రికాలోని డ్రాకెన్‌సబర్గ్వద్ద ఉన్న గడ్డి భూములను ‘వెల్డులు’, ఆస్ట్రేలియాలో ఉన్న గడ్డి భూములను ‘డౌన్లు’ అంటారు. ఈ మండలాన్ని అర్ధ శుష్క ప్రాంతంగా పేర్కొంటారు. ఈ మండలంలో అమెరికా దేశంలో ‘ది గ్రాండ్ కానియన్ ఆఫ్ కొలరాడో’ ఉంది. ఆస్ట్రేలియాలో గొర్రెలను పెంచే ఎస్టేట్‌లను ‘రాంచీలు’, అర్జెంటీనాలో గొర్రెలను పెంచే ఎస్టేట్‌లను ‘ఎస్టాన్షియన్లు’ అంటారు. హంగేరిలోని సమశీతోష్ణ మండల గడ్డి భూములను ‘పుస్తాజ్’ అంటారు. ఈ మండలంలో ప్రధాన పంట - గోధుమ.
- ఈ మండలంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వజ్రాల గని కింబర్లీన్ (దక్షిణ ఆఫ్రికా).
- అమెరికాలో అంగోరా జాతి గొర్రెల నుంచి మేలు రకం ఉన్ని లభిస్తుంది.
ఖండాల తూర్పు తీరంలో 10°- 30° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య రుతుపవన మండలం విస్తరించి ఉంది. ఈ మండలంలో దక్షిణ, ఆగ్నేయ ఆసియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూ గినియాలోని దక్షిణ ప్రాంతాలున్నాయి. ‘మౌసమ్’ అంటే ‘రుతువు’ అని అర్థం. అరబిక్ పదమైన ‘మౌసమ్’ నుంచి ‘మాన్‌సూన్’ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది.
ఈ మండలంలో పెరిగే వృక్షాలకు వెడల్పాటి ఆకులు ఉంటాయి. వీటిని ఆకురాల్చే అడవులు అంటారు. ఇక్కడ పెరిగే మడ అడవులను ‘సుందర అరణ్యాలు’ అంటారు. ప్రపంచ జనాభాలో 25 శాతం ఈ మండలంలో నివసిస్తున్నారు.
- ఈ మండలంలో అధిక వర్షపాతం కురిసే ప్రాంతాలు - మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్‌రాం, చిరపుంజీ. ఇవి ప్రపంచంలో అధిక వర్షపాతం పొందే ప్రాంతాల్లో 2, 3 స్థానాల్లో ఉన్నాయి.
- ప్రపంచంలో టేకు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు మయన్మార్, థాయిలాండ్; ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశం బంగ్లాదేశ్ ఈ మండలంలోనే ఉన్నాయి.
ఖండాల పశ్చిమ భాగంలో 30°-40° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఈ మండలం విస్తరించి ఉంది. ఈ మండలాన్ని ‘శుష్క వేసవి ఉప అయన రేఖా ప్రాంతం’గా పేర్కొంటారు. ప్రపంచ జనాభాలో 4% ఈ మండలంలో నివసిస్తున్నారు. ఈ మండలంలో వేసవి కాలంలో వీచే శీతల పవనాలను బోరా (యుగోస్లేవియా), మిస్ట్రల్ (ఫ్రాన్‌స) అంటారు. ఈ మండలంలోని కాలిఫోర్నియా నారింజ పండ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. చిలీ దేశంలోని విశాలమైన వ్యవసాయ క్షేత్రాలను ‘హోసియోండాలు’ అంటారు. ఈ మండలంలో లభించే ప్రధాన చేపలు సార్టెన్, ట్యూనా.
ఈ మండలంలో..
- పాదరసం, కరారా పాలరాయికి ప్రసిద్ధి చెందిన దేశం- ఇటలీ.
- ఆస్ట్రేలియాలో యశదం, సీసం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ‘బ్రోకెన్ హిల్స్’.
- కాలిఫోర్నియాలోని పెట్రోలియం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం సిగ్నల్ హిల్స్.
- సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధిచెందిన ప్రాంతం ఫ్రాన్స్ లోని ‘గ్రాసే’.
- కాలిఫోర్నియా (యూఎస్‌ఏ)లోని ‘మాంటరె’ ప్రపంచ సార్డెన్ చేపల రాజధానిగా గుర్తింపు పొందింది.
- ఆలీవ్ ఉత్పత్తిలో మొదటి స్థానం స్పెయిన్.
- కాసినోలకు ప్రసిద్ధిచెందిన దేశం మొనాకో.
ఇది ఉత్తరార్ధ గోళంలో 55° - 70° ఉత్తర అక్షాంశాల మధ్య వ్యాపించి ఉంది. దీన్ని ఉప ఆర్కిటిక్ ప్రాంతం అంటారు. టైగా అనేది రష్యన్ భాషా పదం. ‘టైగా’ అంటే ‘శృంగాకార అడవులు’ అని అర్థం. ఈ మండలం ప్రపంచంలో అత్యధిక వార్షిక శీతోష్ణ వ్యత్యాసాలను కలిగి ఉంటుంది. 1982లో వెర్కోయాన్క్స్ వద్ద ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ ఉష్ణోగ్రత ‘-68°’గా నమోదైంది. సంవత్సరంలో 210 రోజులపాటు ఘనీభవించే నది ‘లీనా’ ఈ మండలంలోనే ఉంది. ఈ మండలం ఫర్న్ ఉత్పత్తికి ప్రధానకేంద్రం. ప్రపంచంలో అతిపెద్ద అల్యూమినియం కర్మాగారం కెనడాలోని ఆర్పిడా. కొయ్యగుజ్జు తయారీలో ప్రథమస్థానంలో ఉన్న దేశం కెనడా. టైగా ప్రాంతంలో చక్రవాత వర్షపాతం అధికం.
ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న నగరం ముర్మాన్‌స్క్. టైగా మండలంలో కెల్లా పెద్ద నగరం ఆర్ఖేంజెల్. సైబీరియాలో ప్రధాన నగరం ఇర్‌కుట్‌స్క్. ఈ మండలంలో ఉత్తర అమెరికా ఖండంలోకెల్లా పెద్ద నగరం ఫెయిర్ బాంక్స్ (అలస్కా) ఉంది. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంను ‘బాల్టిక్ సముద్రపు రాణి’గా పిలుస్తారు.
- ప్రపంచంలోనే లోతైన మంచినీటి సరస్సు బైకాల్ (రష్యా) ఈ మండలంలో ఉంది.
టండ్రా అంటే నిస్సారమైన భూములు లేదా ఎడారి అని అర్థం. టండ్రాలో వేసవి సగటు ఉష్ణోగ్రత 12°. వృక్షాలు లేని ఏకైక ఖండం అంటార్కిటికా. ఈ మండలంలో పక్షుల గుంపులను రోకరీలు అంటారు. ఈ మండలంలో జీవించే ప్రధాన పక్షులు టార్మిగాన్, ధ్రువపు గుడ్లగూబ. ఈ మండలంలో యురేసియాలో ‘లాపులు’ నివసిస్తారు. ఉత్తర అమెరికాలోని టండ్రా ప్రాంతంలో నివసించేవారు ‘ఎస్కిమోలు’. వీరు ఉపయోగించే పడవలను ‘డయాక్’ అంటారు. గడ్డకట్టిన మంచుపై ఉపయోగించే వాహనాలను స్లెడ్జి బండ్లు అంటారు. ధ్రువ ప్రాంత ప్రజల ఆయుధం హార్పూన్. మంచుగడ్డలతో అర్ధ చంద్రాకారంలో ఉన్న ఇళ్లను ‘ఇగ్లూలు’ అంటారు. ఉత్తరార్ధ గోళంలో కనిపించే కాంతులను ‘అరోరా బొరియాలిసిస్’ అంటారు.
- ధ్రువ ప్రాంతాల్లో మే నుంచి జూలై వరకు సూర్యుడు అస్తమించడు. ధ్రువప్రాంత ప్రజల భాషలు 1) అల్యూయిట్, 2) యూపిక్, 3) ఇన్యూవిక్.
ప్రాంతం | ప్రధాన తెగలు |
1. అమెజాన్ | రెడ్ ఇండియన్స్ |
2. కాంగో | పిగ్మీలు (చెట్లపై ఇళ్లు నిర్మించుకుంటారు) |
3. మలేషియా | సెమాంగ్‌లు, సకామీలు |
4. బోర్నియా | హెడ్ హంటర్స్, దయాక్‌లు |
5. సుమిత్ర | కాబులు |
6. శ్రీలంక | వెడ్డాలు |
మాదిరి ప్రశ్నలు
1. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా కోకో పండించే దేశం?
ఎ) ఘనా
బి) నైజీరియా
సి) బ్రెజిల్
డి) ఐవరీకోస్ట్
- View Answer
- సమాధానం: ఎ
2. కాగితం గుజ్జు, కాగితం పరిశ్రమ అధికంగా అభివృద్ధి చెందిన దేశం ఏది?
ఎ) మెక్సికో
బి) సెంట్రల్ అమెరికా
సి) అమెరికా
డి) కెనడా
- View Answer
- సమాధానం: సి
3. ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం?
ఎ) చిలీ
బి) పెరూ
సి) బొలీవియా
డి) మెక్సికో
- View Answer
- సమాధానం:ఎ
4. అత్యంత లోతైన సరస్సు ఏది?
ఎ) కాస్పియన్ సముద్రం
బి) బైకాల్ సరస్సు
సి) సుపీరియర్ సరస్సు
డి) విక్టోరియా సరస్సు
- View Answer
- సమాధానం: బి
Published date : 30 Sep 2015 02:35PM