సౌర కుటుంబం - భూమి
Sakshi Education
సౌర కుటుంబంలో సూర్యుడు, నవగ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు ఉంటాయి. సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం. నవగ్రహాల్లో భూమి ఒకటి. సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది.
నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ‘పాలపుంత’ అంటారు. దీన్నే ‘పాలవెల్లి’, ‘ఆకాశగంగ’ అని కూడా అంటారు.
సౌర కుటుంబం ఆవిర్భావం గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. అవి:
సూర్యుడి ఉపరితలంపై 6000°C, కేంద్రంలో 10,00,000 °C ఉష్ణోగ్రత ఉంటుంది.
గ్రహాలను రెండు భాగాలుగా విభజించారు. అవి...
అంతర గ్రహాలు: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు.
బాహ్య గ్రహాలు: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్.
గమనిక: 2006లో ప్రేగ్లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి డ్వార్ఫ్ (మరుగుజ్జు) గ్రహంగా ప్రకటించారు.
భూమి సూర్యుడి నుంచి 149.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. భూమి ఉపగ్రహం చంద్రుడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారు 3,84,365 కి.మీ.
అంతర గ్రహాలన్నీ చిన్న గ్రహాలు. వీటిలో పెద్ద గ్రహం భూమి. ఇవి అధిక సాంద్రత, ఉష్ణోగ్రతను కలిగి ఉన్నాయి. వీటిని భౌమ గ్రహాలు అని కూడా పిలుస్తారు.
1. బుధుడు
2. శుక్రుడు
3. భూమి
4. అంగారకుడు (కుజుడు)
6. శని
7. యురేనస్
8. నెప్ట్యూన్
సౌర కుటుంబం ఆవిర్భావం గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. అవి:
సిద్ధాంతకర్త | సిద్ధాంతం |
చాంబర్లీన్, మౌల్టన్ | గ్రహాల పరికల్పన సిద్ధాంతం |
కాంట్ | గ్యాసియస్ మాస్ థియరీ |
లాప్లాస్ | నెబ్యులార్ థియరీ |
జీన్స్, జెఫ్రీ | టెడల్ సిద్ధాంతం |
రస్సెల్, లిటిల్ టన్ | బైనరీ స్టార్ హైపోథిసిస్ |
సూర్యుడి ఉపరితలంపై 6000°C, కేంద్రంలో 10,00,000 °C ఉష్ణోగ్రత ఉంటుంది.
గ్రహాలను రెండు భాగాలుగా విభజించారు. అవి...
అంతర గ్రహాలు: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు.
బాహ్య గ్రహాలు: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్.
గమనిక: 2006లో ప్రేగ్లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి డ్వార్ఫ్ (మరుగుజ్జు) గ్రహంగా ప్రకటించారు.
భూమి సూర్యుడి నుంచి 149.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. భూమి ఉపగ్రహం చంద్రుడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారు 3,84,365 కి.మీ.
అంతర గ్రహాలన్నీ చిన్న గ్రహాలు. వీటిలో పెద్ద గ్రహం భూమి. ఇవి అధిక సాంద్రత, ఉష్ణోగ్రతను కలిగి ఉన్నాయి. వీటిని భౌమ గ్రహాలు అని కూడా పిలుస్తారు.
1. బుధుడు
- ఇది అతి చిన్న గ్రహం. సూర్యుడికి అతి దగ్గరగా (58 మి.కి.మీ.) ఉన్న గ్రహం.
- సూర్యుడి చుట్టూ అత్యధిక వేగంతో తిరిగే గ్రహం (47.9 కి.మీ./సె).
- దీనికి ఉపగ్రహాలు లేవు. దీన్ని ‘అపోలో’ అని కూడా పిలుస్తారు.
2. శుక్రుడు
- దీన్ని ‘ఉదయ తార’ లేదా ‘సంధ్య తార’ అని పిలుస్తారు.
- శుక్రుడు సూర్యుడి చుట్టూ తిరగడానికి 225 రోజులు, తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది.
- సౌర కుటుంబంలో అత్యధిక వేడి (ఉష్ణోగ్రత) ఉన్న గ్రహం శుక్రుడు. దీని వాతావరణంలో 95 శాతం కార్బన్ డై ఆక్సైడ్ ఉండటమే దీనికి కారణం.
- సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైంది కాబట్టి దీన్ని ‘వేగుచుక్క’ అని కూడా పిలుస్తారు.
- ద్రవ్యం, పరిమాణం, సాంద్రతల్లో భూమిని పోలి ఉండటం వల్ల దీన్ని ‘భూమికి కవల గ్రహం’గా పేర్కొంటారు. దీనికి ఉపగ్రహాలు లేవు.
- ఇది సూర్యుడి నుంచి రెండో గ్రహం.
3. భూమి
- ఇది జీవం ఉన్న గ్రహం.
- భూమికి ఒకే ఒక్క సహజ ఉపగ్రహం చంద్రుడు.
- భూమిని ‘నీలి గ్రహం’ అంటారు.
- ఇది సూర్యుడి నుంచి దూరంలో మూడో గ్రహం. పరిమాణంలో అయిదో గ్రహం.
- గ్రహాలన్నింటిలో సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రహం భూమి. దీని వైశాల్యం 510 మి.చ.కి.మీ.
- భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్య పొడవు 965 మి.కి.మీ.
4. అంగారకుడు (కుజుడు)
- దీన్నే అరుణ గ్రహం అంటారు.
- దీనికి రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. అవి.. ఫోబస్, డెమోస్.
- రోమన్లు దీన్ని ‘గాడ్ ఆఫ్ వార్’గా పేర్కొంటారు.
- ఇది సూర్యుడి నుంచి నాలుగో గ్రహం.
- అంగారక గ్రహ అధ్యయనానికి భారతదేశం 2013 నవంబర్ 5న పీఎస్ఎల్వీ-సి-25 రాకెట్ ద్వారా ‘మంగళయాన్’ అనే ఆర్బిటర్‌ను పంపింది.
బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ బాహ్య గ్రహాలు. ఇవి పరిమాణంలో పెద్ద గ్రహాలు. హైడ్రోజన్, హీలియం ఘనీభవించడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. వీటికి ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి.
5. బృహస్పతి
5. బృహస్పతి
- దీన్ని ‘గ్రహాల రాజు’ అని పిలుస్తారు.
- గ్రహాలన్నింటి కంటే పెద్దది. భూమి కంటే 11 రెట్లు పెద్దది. అత్యధిక ఉపగ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుంచి 5వ గ్రహం.
- దీనికి తక్కువ ఆత్మభ్రమణ కాలం ఉంది.
- దీనికి సౌర వ్యవస్థలో కెల్లా అతిపెద్ద ఉపగ్రహం ‘గానిమైడ్’ ఉంది.
- ఇది షూమేకర్ లేవీ తోకచుక్కను ఢీకొన్న గ్రహం. అందువల్ల దీన్ని రెడ్ రింగ్డ్ ప్లానెట్‌గా పిలుస్తారు.
6. శని
- పరిమాణంలో రెండో అతి పెద్ద గ్రహం.
- దీనికి ‘టైటాన్’ అనే ఉపగ్రహం ఉంది. ఇది సౌర కుటుంబంలో రెండో అతిపెద్ద ఉపగ్రహం.
- దీనికి అతి తక్కువ సాంద్రత ఉంది.
- సూర్యుడి నుంచి ఆరో గ్రహం.
7. యురేనస్
- ఇది పరిమాణంలో మూడోది. ఈ గ్రహ ఉపరితలంపై మీథేన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
- ఇది తూర్పు నుంచి పడమరకు భ్రమిస్తుంది.
- దీనికి మిరండా, ఏరియల్, ఒబెరాన్, టిటానియా, ఉమ్‌బ్రియల్ మొదలైన ఉపగ్రహాలున్నాయి.
- సూర్యుడి నుంచి ఏడో గ్రహం.
8. నెప్ట్యూన్
- ఇది అతి చల్లని గ్రహం.
- దీని పరిభ్రమణ కాలం - 165 ఏళ్లు.
- సూర్యుడి నుంచి అత్యధిక దూరంలో ఉన్న గ్రహం ఇది.
- ఇది విష వాయువులైన మీథేన్, అమ్మోనియాలను కలిగి ఉంది.
- సూర్యుడి నుంచి 8వ గ్రహం. పరిమాణంలో నాలుగోది.
Published date : 27 Jan 2016 05:51PM