భారత రాష్ట్రపతి
Sakshi Education
ఆర్టికల్ -52 ప్రకారం భారతదేశానికి రాష్ర్టపతి ఉంటారు. ఆయనే దేశంలో అత్యున్నత వ్యక్తి.
ఆర్టికల్-53 ప్రకారం.. రాష్ర్టపతి రాజ్యాంగ అధినేత, ప్రధాన కార్యనిర్వాహక అధికారి, దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. ఆర్టికల్ 53(1) ప్రకారం భారతదేశ కార్యనిర్వహణ మొత్తం రాష్ర్టపతికే అప్పగించారు. ఆయనకు సహాయపడేందుకు ఆర్టికల్ 74(1) ప్రకారం ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది. కాబట్టే ప్రధానమంత్రిని వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా, రాష్ర్టపతిని నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతిగా పేర్కొంటారు.
చదవండి: Indian Polity Study Material: భారత రాష్ట్రపతి
Published date : 11 Jan 2022 01:32PM