రామప్ప దేవాలయంను నిర్మించిందెవరు?
దక్షిణ భారతదేశ చరిత్ర :
1. విష్ణుకుండినులు ఏర్పాటు చేసిన ‘ఘటికలు’ అంటే ఏమిటి?
1) వర్తక కేంద్రాలు
2) ఓడరేవు కేంద్రాలు
3) విద్యా కేంద్రాలు
4) పన్నులు
- View Answer
- సమాధానం: 3
వివరణ: సంస్కృత భాషలో బోధించే విద్యా కేంద్రాలను ‘ఘటికలు’ అంటారు. తెలుగు నేలలో విష్ణుకుండినులు వీటిని ప్రథమంగా ఏర్పాటు చేశారు. భాష, సాహిత్యంను వీరు ప్రోత్సహించారు. ఘటికలలో వేదాల అధ్యయనం కీలకమైంది.
- సమాధానం: 3
2. ‘త్రివర నగర భవనగత సుందరీ హృదయ నందన’ అనే బిరుదు ఉన్న విష్ణుకుండిన రాజు?
1) రెండో మాధవ వర్మ
2) మొదటి గోవింద వర్మ
3) రెండో విక్రమేంద్ర వర్మ
4) రెండో ఇంద్రవర్మ
- View Answer
- సమాధానం: 1
వివరణ: పొలమూరు శాసనం ప్రకారం రెండో మాధవ వర్మకు ఉన్న బిరుదు ఇది. త్రివర నగరం నర్మదా నదిపై ఉన్న జబల్పూర్ సమీపంలోని ‘త్రిపురి’ అని కొందరి అభిప్రాయం. రెండో మాధవ వర్మ కాలాన్నివిష్ణుకుండినుల పాలనా చరిత్రలో ‘స్వర్ణయుగం’ అంటారు.
- సమాధానం: 1
3. ‘ఉత్పత్త్తి పిడుగు’ అనే లేఖనం ఎక్కడ లిఖించారు?
1) మొగల్రాజపురం
2) భైరవకోన
3) ఉండవల్లి
4) గుమ్మడిదుర్రు
- View Answer
- సమాధానం: 3
వివరణ: విష్ణుకుండినుల కాలంలో మొగల్రాజపురంలో ఐదు గుహలు ప్రాధాన్యత పొందాయి. ఇందులో అర్ధనారీశ్వరమూర్తి విగ్రహం ఉంది. భైరవకోన 8 గుహలు కలిగిన శివాంకిత ప్రాంతం. ఉండవల్లిలో అనంతశయనశాయి విగ్రహం ప్రాధాన్యత పొందింది. గుమ్మడిదుర్రు ప్రముఖ బౌద్ధ క్షేత్రం.
- సమాధానం: 3
4. భైరవకోనలోని ఎనిమిది గుహలు ఏ దేవునికి అంకితం చేశారు?
1) విష్ణువు
2) ఇంద్రుడు
3) బ్రహ్మ
4) శివుడు
- View Answer
- సమాధానం: 4
వివరణ: భైరవకోనలో విష్ణుకుండినులు 8 గుహలను తొలిపించారు. ఇవి అన్నీ శివునికి అంకితం చేశారు. ఇక్కడే త్రిముఖ దుర్గ విగ్రహం కూడా ఉంది. కుంభ శీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాలు ఉన్నాయి. కాపాలికులకు ఈ ప్రాంతం రెండో కేంద్రం శ్రీశైలం (మొదటిది).
- సమాధానం: 4
5. భూతగ్రహస్వామి అని ఏ దేవునిని అంటారు?
1) వినాయకుడు
2) యమధర్మరాజు
3) బ్రహ్మదేవుడు
4) పరమేశ్వరుడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: విష్ణుకుండినుల కాలంలో యముడిని భూతగ్రహస్వామి అని పిలిచేవారు. వినాయకుడిని దంతముఖస్వామి అని వ్యవహరించారు. తర్వాత బ్రహ్మను పద్మ సంభవుడు అని, పరమేశ్వరుని అర్ధనారీశ్వరుడు అని అంటారు. వివిధ కాలాల్లో ఈ పేర్లుతో దేవుళ్ళను పిలిచేవారు.
- సమాధానం: 2
6. జతపరచండి.
జాబితా-1
1. అర్ధనారీశ్వర గుహాలయం
2. త్రిముఖ దుర్గ శిల్పం
3. పూర్ణకుంభం
4. బౌద్ధక్షేత్రం
జాబితా-2
ఎ. బొజ్జన్నకొండ
బి. ఉండవల్లి
సి. భైరవకోన
డి. మొగల్రాజపురం
1) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
- View Answer
- సమాధానం: 3
వివరణ: విష్ణుకుండినులు వివిధ ప్రాంతాలలో తమ శిల్పకళలు విస్తృతపరిచారు. అర్ధనారీశ్వరుడు అంటే శివుడు స్త్రీ, పురుష భంగిమలో కనిపిస్తాడు, దుర్గమాతకు మూడు ముఖాలతో భైరవకోనలో శిల్పీకరణ చూపరులను ఆకట్టుకుంటుంది. ఉండవల్లిలో ఉన్న పూర్ణకుంభంను చూసి సూరిశెట్టి ఆంజనేయులు చిత్రీకరించారు. దీనినే ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట చిహ్నంగా స్వీకరించారు. (ఇప్పుడు పూర్ణఘటం). బొజ్జన్నకొండలో బుద్దుణ్ణి బొజ్జన్న అని పిలుస్తారు.
- సమాధానం: 3
7. విష్ణుకుండినులు తమ రాజ్యంను దేనితో పోల్చుకున్నారు?
1) పాంచజన్యం
2) ఖట్వాంగం
3) కౌస్తుభం
4) స్వస్థిక్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కౌస్తుభం అనేది మహా విష్ణువు రత్నం. ప్రపంచంలో అత్యంత విలువైనదిగా పేర్కొంటారు. ఖట్వాంగం శివుని ఆయుధం, పాంచజన్యం శ్రీకృష్ణుని శంఖం, స్వస్థిక్ సర్వాభివృద్ధికి సంకేతం.
- సమాధానం: 3
8. విష్ణుకుండినుల రాజ్యాన్ని అంతం చేసిన పశ్చిమ చాళుక్య రాజు?
1) మొదటి పులకేశి
2) మంగళేసు
3) రెండో పులకేశి
4) రవికీర్తి
- View Answer
- సమాధానం: 3
వివరణ: చివరి విష్ణుకుండిన రాజు అయిన మంచన భట్టారకుడిని ఓడించి క్రీ.శ.624లో రెండో పులకేశి ఆ రాజ్యాన్ని ఆక్రమించాడు. తర్వాత తన సోదరుడైన కుబ్జవిష్ణువర్థనుడికి ఆ ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యమే వేంగి సామ్రాజ్యంగా అభివృద్ధి చెందింది.
- సమాధానం: 3
9. గజదళాధిపతిని ఏమని పిలుస్తారు?
1) హస్తికోశ
2) వీరకోశ
3) స్కంధావారం
4) గుల్మిక
- View Answer
- సమాధానం: 1
వివరణ: హస్తి అంటే ఏనుగు లేదా గజరాజు. ఈ రకమైన దళాన్ని హస్తికోశ అని పిలుస్తారు. ఈ ఏనుగుల దళం యుద్ధ సమయాలలో అత్యంత కీలకమైన దళం. వీరకోశ అంటే పదాతి దళం. స్కంధావారం అంటే శాతవాహనుల కాలం నాటి తాత్కాలిక సైనిక శిబిరం, గుల్మిక అంటే సరిహద్దు రక్షణాధికారి అని శాతవాహనుల కాలం వివరాల ద్వారా తెలుస్తుంది.
- సమాధానం: 1
10. శాలంకాయన రాజు హస్తివర్మ కాలంలో వేంగిపై దండెత్తిన గుప్తరాజు ఎవరు?
1) శ్రీగుప్తుడు
2) మొదటి చంద్రగుప్తుడు
3) సముద్రగుప్తుడు
4) భానుగుప్తుడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: అలహాబాద్ శాసనం ప్రకారం గుప్తరాజు సముద్రగుప్తుడు తన దక్షిణ దిగ్విజయ యాత్రలలో భాగంగా వేంగిపై దండెత్తాడు. ఈ శాసనంను హరిసేనుడు రచించాడు. గోదావరి నది ప్రాంత విషయాలు ఈ శాసనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
- సమాధానం: 3
11. చిత్రరథస్వామి పాదభక్తులము అని చెప్పుకున్న రాజులు?
1) విష్ణుకుండినులు
2) ఇక్ష్వాకులు
3) శాతవాహనులు
4) శాలంకాయనులు
- View Answer
- సమాధానం: 4
వివరణ: శాలంకాయనుల ఆరాధ్య దైవం చిత్రరథస్వామి. ఈ దైవ స్వరూపంను సూర్యుడు అని, కొందరు శివుడు అని వ్యవహరిస్తున్నారు. శాలంకాయన అంటే నంది అని అర్థం. టాలమీ లాంటి విదేశీయులు వీరిని గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు.
- సమాధానం: 4
12. సప్త మాతృక విగ్ర హాలు ఉన్న ప్రాంతం ఏది?
1) నారాయణ వనం
2) నందిగామ
3) సోమశిల
4) చేజెర్ల
- View Answer
- సమాధానం: 4
వివరణ: తొలిసారి శక్తి ఆరాధనకు హారితీ దేవాలయం (నాగార్జున కొండ), పెదముడియాల మొదలగు ప్రాంతాలను ఉదహరించవచ్చు. దేవాలయాలలో సప్తమాతృకలను నెలకొల్పి ఆరాధించేవారు. చేజెర్లలో సప్తమాతృకల విగ్రహాలున్నాయి. ఆదిపరాశక్తి రూపాలే ఇవి. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండి ఈ రూపాలు.
- సమాధానం: 4
13.త్రిమూర్తి ఆరాధనకు ప్రాచీన ఆంధ్ర దేశంలో లభించిన ఆధారం ఏ ప్రాంతంలో ఉంది?
1) భైరవకోన
2) సంగమయ్య గుహ
3) బెలుంగుహలు
4) ఏనుగు మల్లమ్మ కొండలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: భైరవకోనలో శివునికి ద్వారపాలకులుగా బ్రహ్మ, విష్ణు శిల్పాలు ఉన్నాయి. ఈ ప్రాంతం కాపాలికులకు రెండో కేంద్రం (మొదటిది శ్రీశైలం), సంగమయ్య గుహ శ్రీకాకుళంలో, బెలుంగుహలు కర్నూలులో, ఏనుగు మల్లమ్మ కొండలు మదనపల్లి (చిత్తూరు)లో చారిత్రాత్మక ప్రాంతాలు.
- సమాధానం: 1
14. జతపరచండి.
రాజవంశం:
1. వేంగి చాళుక్యులు
2. ఆనంద గోత్రజులు
3. విష్ణుకుండినులు
4. రాష్ర్టకూటులు
చిహ్నం:
ఎ. వృషభం
బి. వరాహం
సి. పంజా విసిరిన సింహం
డి. గరుడ
1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
- View Answer
- సమాధానం: 2
వివరణ: వరాహం వేంగి చాళుక్యుల చిహ్నం. ఈ రూపం విష్ణువు మూడో అవతారం (దశావతారాలలో). వృషభం ఆనందగోత్రజుల చిహ్నం. పంజా విసిరిన సింహం విష్ణుకుండినుల చిహ్నం. రాష్ర్టకూటుల చిహ్నం గరుడ (విష్ణువు వాహనం).
- సమాధానం: 2
15. బృహత్పలాయనుల రాజధాని ఏది?
1) వేంగి
2) కోడూరు
3) తుమ్మలగూడెం
4) హన్మకొండ
- View Answer
- సమాధానం: 2
వివరణ: కోడూరు లేదా గుడూరు కృష్ణా జిల్లా మచిలీపట్నం అని గుర్తించారు. ఇది బృహత్పలాయనుల రాజధాని. వేంగి శాలం కాయనుల రాజధాని ఆ తర్వాత తూర్పు చాళుక్యుల రాజధాని, తుమ్మలగూడెం విష్ణుకుండినుల రాజధాని, హన్మకొండ తొలి కాకతీయుల రాజధాని.
- సమాధానం: 2
16. గోలాంగులము అంటే?
1) గరుడ
2) కోతి
3) పంజా విసిరే సింహం
4) సింహం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆనందగోత్రజుల విజయకేతనం గోలాంగులము (కోతి) అని చేజెర్ల శిలా శాసనం చెబుతుంది. అయితే వీరి రాజలాంఛనం వృషభం. సింహం శాతవాహనులకు, పంజా విసిరే సింహం విష్ణుకుండినులకు, గరుడ గుప్తరాజుల రాజ చిహ్నాలు. ఇవి వారి వారి మత విశ్వాసాలను కూడా వ్యక్తీకరిస్తాయి.
- సమాధానం: 2
17. తాడికొండలో శాక్యభిక్షు విహారం నిర్మించింది ఎవరు?
1) పృథ్వీమూలుడు
2) హరివర్మ
3) రెండో విక్రమేంద్ర వర్మ
4) అనంతవర్మ
- View Answer
- సమాధానం: 2
వివరణ: హరివర్మ తాడికొండలో శాక్యభిక్షు విహారం నిర్మించాడు. ఈయన బౌద్ధ మతాభివృద్ధికి కృషి చేశాడు. ఆదుర్రులో కూడా విహారం నిర్మించి, తండ్రి పృథ్విమూలుని నుంచి పొందిన కట్టు చెరువు గ్రామాన్ని దానం చేశాడు. మహామేఘవాహన విహారానికి కల్వచెరువును దానం చేశాడు. ఇది వర్థమానపురంలో ఉంది. గుణపాశపురంలో ఉన్న లోకవిఖ్యాత మహా విహారానికి అట్టలువుడ గ్రామాన్ని దానం చేశాడు.
- సమాధానం: 2
18. శాలంకాయన అంటే అర్థం ఏమిటి?
1) చిలుక
2) సింహం
3) నెమలి
4) నంది
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇక్ష్వాకుల అనంతరం ఉత్తర తీరాంధ్రలో అధికారంలోకి వచ్చినవారు శాలంకాయనులు. శాలంకాయన అంటే అర్థం నంది. శాలంకాయన అనేది గోత్రనామం. వీరు శైవ మతాభిమానులు.
- సమాధానం: 4
19. హిరణ్య గర్భయాగం అంటే ఏమిటి?
1) పుట్టుకతో బ్రాహ్మణుడు కాకున్నా యాగంతో కావడం
2) పుట్టుకతో క్షత్రియుడు కాకున్నా యాగంతో కావడం
3) పుట్టుకతో వైశ్యుడు కాకున్నా యాగంతో కావడం
4) పుట్టుకతో శూద్రుడు కాకున్నా యాగంతో కావడం
- View Answer
- సమాధానం: 2
వివరణ: పుట్టుకతో క్షత్రియుడు కాకున్నా హిరణ్యగర్భయాగంతో క్షత్రియుడు కావచ్చు. ఉదాహరణకు శాలంకాయన రాజు అత్తివర్మ హిరణ్యగర్భ ప్రసవుడను అని చెప్పుకున్నాడు. పాలకులు సంతానం కోసం పుత్రకామేష్ఠి యాగం, రాజ్య విస్తరణకు అశ్వమేథ యాగం మొదలగు యాగాలు చేసేవారు.
- సమాధానం: 2
20. ఖారవేలుడు జారీ చేసిన హతిగుంఫా శాసనం ఏ భాషలో ఉంది?
1) ప్రాకృతం
2) సంస్కృతం
3) తెలుగు
4) ఒరియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: కళింగ రాజు ఖారవేలుడు హతిగుంఫా శాసనంను జారీ చేశాడు. ఇది ప్రాకృత భాషలో ఉంది. ఆయన ‘మూషికాధిపతి’ అని పిలువబడ్డాడు. ఈ శాసనంలో ఆయన రాజ్య విస్తీర్ణం మొదలగు విషయాలు ఉన్నాయి.
- సమాధానం: 1
21. విజయనగర రాజులు ఆదరించిన తొలి తెలుగు కవి?
1) తెనాలి రామలింగకవి
2) ధూర్జటి
3) పింగళి సూరన
4) నాచన సోముడు
- View Answer
- సమాధానం: 4
వివరణ: సంగమవంశ విజయనగర రాజు మొదటి బుక్కరాయలు ఆదరించిన తొలి తెలుగు కవి నాచన సోముడు. ఈ కవికి పెంచికలదిన్నెను బహుకరించాడు. ఉత్తర హరివంశం అనే గ్రంథాన్ని ఈయన రాశాడు. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం, తెనాలి రామలింగకవి పాండురంగ మహత్యం, పింగళి సూరన కళాపూర్ణోదయం మొదలగు గ్రంథాలు రాసిన ్రపముఖులు.
- సమాధానం: 4
22. రామప్ప దేవాలయంను నిర్మించిందెవరు?
1) రేచర్ల ప్రసాదాదిత్యుడు
2) గోన గన్నారెడ్డి
3) రేచర్ల రుద్రుడు
4) గోన బుద్ధారెడ్డి
- View Answer
- సమాధానం: 3
వివరణ: క్రీ.శ. 1213లో గణపతి దేవుని సామంతుడు రేచర్ల రుద్రుడు, పాలంపేటలో రామప్ప దేవాలయంను నిర్మించాడు. దీని ఇటుకలు నీటిలో బెండు వలె తేలే స్వభావాన్ని కల్గి ఉన్నాయి. రంగనాథ రామాయణం రాసింది గోన బుద్దారెడ్డి, రుద్రమకు సహకరించింది రేచర్ల ప్రసాదాదిత్యుడు, గోన గన్నారెడ్డి. వీరు కాకతీయుల కాలంలో గల ప్రముఖులు.డి
- సమాధానం: 3
23. బ్రహ్మ నాయుడు పంచలోహ స్తంభంను ఎక్కడ నాటించాడు?
1) మోటుపల్లి
2) త్రిపురాంతకం
3) పులికాట్
4) చేజెర్ల
- View Answer
- సమాధానం: 2
వివరణ: పల్నాటి బ్రహ్మనాయుడు వీర వైష్ణవాన్ని ప్రచారం చేశాడు. పంచలోహ స్తంభాన్ని త్రిపురాంతకంలో నాటించాడు. అందరూ ఒక్కటే అనేది ఆయన అభిమతం. మోటుపల్లి కాకతీయుల ఓడరేవు, పులికాట్ (ప్రళయకావేరి) వేంగి చాళుక్యుల సామంతుడు పండరంగడు నిర్మాణాలు ఉన్న ప్రాంతం, చేజెర్ల కపోతేశ్వర ఆలయం గల ప్రాంతం.
- సమాధానం: 2
24. శ్రీలక్ష్మీ, శంఖంలను తమ శాసనాలపై చిహ్నాలుగా లిఖించుకున్న తొలి రాజులు?
1) విష్ణుకుండినులు
2) శాలంకాయనులు
3) తూర్పు చాళుక్యులు
4) కాకతీయులు
- View Answer
- సమాధానం: 1
వివరణ: శ్రీలక్ష్మి రాజ్య ఆర్థికాభివృద్ధికి చిహ్నం. మహా విష్ణువుకు ప్రతిరూపం శంఖం, హైందవ సంస్కృతిని వ్యాప్తి చేయటంలో విష్ణు కుండినులు కీలక పాత్ర పోషించారు.
- సమాధానం: 1
25. రాణి రుద్రమదేవి కాలంలో ప్రసూతి వైద్యశాల నిర్మించిన ప్రాంతమేది?
1) మందడం
2) త్రిపురాంతకం
3) చందుపట్ల
4) పానగల్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాణి రుద్రమ దేవి కాలంలో మందడం అనే ప్రాంతంలో ఉచిత ప్రసూతి వైద్యశాలను నిర్మించారు. త్రిపురాంతకం ప్రముఖ ైశె వ క్షేత్రం. చందుపట్ల రుద్రమదేవి మరణ వివరణ ఉన్న శాసనం గల ప్రాంతం, ఛాయా సోమేశ్వరాలయం గల ప్రాంతం పానగల్లు. దీనిని కుందూరు చోడులు నిర్మించారు.
- సమాధానం: 1