హిమాలయ పర్వత వ్యవస్థ - ప్రాధాన్యం
1. కిందివాటిలో ఏ పర్వత శ్రేణులను ‘ఉప హిమాలయూలు’గా పిలుస్తారు?
ఎ) హిమాచల్ శ్రేణులు
బి) హిమాద్రి పర్వతాలు
సి) కారకోరం పర్వతాలు
డి) శివాలిక్ పర్వతాలు
- View Answer
- సమాధానం:డి
2. హిమాలయాలకు చెందిన కింది పర్వతాలను ‘ఆసియా ఖండ వెన్నెముక’గా వ్యవహరిస్తారు?
ఎ) కారకోరం పర్వతాలు
బి) జాగ్రోస్ పర్వతాలు
సి) లడఖ్ పర్వతాలు
డి) పిర్‌పంజాల్ పర్వతాలు
- View Answer
- సమాధానం: ఎ
3. కశ్మీర్ లోయ ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది?
ఎ) జాస్కర్-హిమాద్రి పర్వతాలు
బి) హిమాద్రి పర్వతాలు-పిర్‌పంజాల్
సి) పిర్‌పంజాల్ శ్రేణులు-జమ్ము కొండలు
డి) కారకోరం పర్వతాలు-లడఖ్ పర్వతాలు
- View Answer
- సమాధానం:బి
4. కుమావున్ పర్వత శ్రేణులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) జమ్ముకశ్మీర్
బి) హిమాచల్ ప్రదేశ్
సి) అరుణాచల్ ప్రదేశ్
డి) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం:డి
5. హిమాలయ పర్వత పంక్తులు ఏ కోవకు చెందుతారుు?
ఎ) నవీన ముడుత పర్వతాలు
బి) ప్రాచీన ముడుత పర్వతాలు
సి) అవశిష్ట పర్వతాలు
డి) భ్రంశ పర్వతాలు
- View Answer
- సమాధానం: ఎ
6. వాణిజ్యానికి తిరిగి తెరిచిన ‘నాథూలా’ కనుమ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) అరుణాచల్ ప్రదేశ్
బి) ఉత్తరాఖండ్
సి) సిక్కిం
డి) జమ్ముకశ్మీర్
- View Answer
- సమాధానం: సి
7. ‘కశ్మీర్ లోయ ముఖద్వారం’గా దేనిని పిలుస్తారు?
ఎ) కారకోరం
బి) మానా
సి) బనిహల్
డి) పిర్‌పంజాల్
- View Answer
- సమాధానం: సి
8. భారత్‌లో లేని హిమాలయ పర్వత శ్రేణులు?
ఎ) మహాభారత్ శ్రేణులు
బి) కారకోరం శ్రేణులు
సి) ధవులాదార్ కొండలు
డి) జాస్కర్ శ్రేణులు
- View Answer
- సమాధానం: ఎ
9. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఎవరెస్ట్ (సాగరమాత) శిఖరం ఏ హిమాలయ పర్వత పంక్తుల్లో ఉంది?
ఎ) టిబెటన్ హిమాలయాలు
బి) హిమాద్రి పర్వతాలు
సి) హిమాచల్ పర్వతాలు
డి) శివాలిక్ పర్వతాలు
- View Answer
- సమాధానం: బి
10. వేసవి విడిది కేంద్రమయిన డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) సిక్కిం
బి) అసోం
సి) అరుణాచల్ ప్రదేశ్
డి) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: డి
11. లడఖ్‌లోని ‘పూగా లోయ’ వేటికి ప్రసిద్ధి?
ఎ) వేడినీటి బుగ్గలు
బి) హిమానీ నదాలు
సి) దట్టమైన అరణ్యాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
12. హిమాలయూల్లోకెల్లా అతిపెద్ద హిమానీనదం ఏది?
ఎ) గంగోత్రి
బి) యమునోత్రి
సి) బయిఫూ
డి) సియాచిన్
- View Answer
- సమాధానం: డి
13. టిబెటన్ హిమాలయాల్లోని మానస సరోవరం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?
ఎ) నాగటిబ్బ
బి) కైలాస పర్వతాలు
సి) సయాడియా పర్వతాలు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
14. కశ్మీర్ హిమాలయాల్లోని సోనామెర్గ్, గుల్మెర్గ్ వేటికి ప్రసిద్ధి?
ఎ) కోనిఫెరస్ అరణ్యాలు
బి) వన్యమృగాలు
సి) పచ్చిక బయళ్లు
డి) హిమానీ నదాలు
- View Answer
- సమాధానం: సి
15. హిమాలయాలు ఉద్భవించిన భౌమ్య యుగం?
ఎ) ప్రీకాంబ్రియన్
బి) మీసోజాయిక్
సి) కెయినో జాయిక్
డి) టెరిషరీ
- View Answer
- సమాధానం: డి