జీవావరణం - పర్యావరణం
Sakshi Education
- రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న పరివర్తన ప్రాంతం?
ఎకోటోన్ - నీటి అడుగున ఉన్న జీవులు?
బెంథాస్ (Benthos) - జీవావరణ శాస్త్రం (Ecology) పదానికి మూలభాష ఏది?
గ్రీక్ - ఒక జాతి జీవులు, వాటి చుట్టూ ఉన్న పరిసరాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం?
ఆటెకాలజీ (Autecology) - భిన్న జీవజాతులు, వాటి చుట్టూ ఉన్న పరిసరాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం?
సినెకాలజీ - జనాభా శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు?
డెమోగ్రఫీ - ఆవరణ వ్యవస్థలో ఒక జీవి నిర్వహించే క్రియాశీల పాత్ర?
ఇకలాజికల్ నిషే - రుతువులకు అనుగుణంగా జంతువులు ప్రదర్శించే వలసల అధ్యయనాన్ని ఏమంటారు?
ఫినాలజీ - అధిక జీవవైవిధ్యం ఉన్న మొదటి 17 మెగా బయోడైవర్సిటీ దేశాల్లో భారత్ స్థానం?
7 - అంతరించే ప్రమాదమున్న స్థాయికి చేరిన బట్టమేక పక్షి (Great Indian Bustard) శాస్త్రీయ నామం?
ఆర్డియోటిస్ నైగ్రీసెప్స్ - దేశంలో బట్టమేక పక్షులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి?
రాజస్థాన్ - ఆవరణ వ్యవస్థలోని గతిశీల భాగం ఏది?
ఆహార శృంఖలం - భూమిపై ఉన్న జీవులన్నింటికీ మూల శక్తి ప్రదాత?
సూర్యుడు - మొక్కలు.. గ్రహించిన సౌరశక్తిలో ఎంత శాతాన్ని కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగించుకుంటాయి?
ఒక శాతం మాత్రమే - స్వాదు జలావరణ వ్యవస్థల అధ్యయనాన్ని ఏమంటారు?
లిమ్నాలజీ - ప్రవహించే స్వాదు జలాశయాలను ఏమంటారు?
లోటిక్ - నదీ ముఖద్వారం ఏ రకమైన ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ?
ఎకోటోన్ - ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చుతగ్గులను తట్టుకోగల జీవులు?
యూరి థర్మల్ - గుహల్లో జీవించే జంతువులు?
ట్రోగ్లోబైట్స్ - ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారు?
ఆక్సైలోఫైట్స్ - ఉత్తర యురేసియాలో ఆర్కిటిక్‌కు దక్షిణాన ఉన్న విశాల వృక్షరహిత ఆవరణ వ్యవస్థ?
టండ్రా - ఒక విశాల భౌగోళిక ప్రాంతంలోని భిన్న జీవసమాజాల సముదాయం?
బయోమ్/జీవ మండలం - అటకామా ఎడారి ఏ ఖండంలో ఉంది?
దక్షిణ అమెరికా - ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు?
ఎ.జి.టాన్స్‌లే - కొలను లేదా సరస్సులో లోతైన చీకటి ప్రాంతాన్ని ఏమంటారు?
ప్రొఫండల్ జోన్ (అగాథ మండలం) - అత్యంత లోతైన సముద్ర భాగం
హ్యాడల్ మండలం(ఉదాహరణ-మారియానా ట్రెంచ్) - ఏ ప్రొటీన్ ఆక్సీకరణ ద్వారా మిణుగురు పురుగు నుంచి కాంతి విడుదలవుతుంది?
ల్యూసిఫెరిన్ - ఒక పరిధిలో ప్రతి పది డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల ద్వారా జీవక్రియ ద్విగుణీకృతం అవుతుందని చెప్పే సూత్రం?
వ్యాంట్‌హాఫ్ సూత్రం - భూమిపైకి చేరే సౌర వికిరణాన్ని ఏమంటారు?
సౌరపుటం - హంగేరి దేశపు గడ్డినేలలను ఏమంటారు?
పుస్జా - దేశాల మధ్య హానికర వ్యర్థాల అక్రమ రవాణాను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం ఏది?
బేసల్ కన్వెన్షన్ - ప్రపంచ చిత్తడి నేలల దినం?
ఫిబ్రవరి 2 - ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్య దశాబ్దం?
2011-2020 - చిత్తడి నేలల సంరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం?
రామ్సార్ కన్వెన్షన్ - అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం?
సెప్టెంబర్ 16 - జీవ వైవిధ్య హాట్‌స్పాట్‌ల భావనను ప్రతిపాదించింది ఎవరు?
నార్మన్ మెయర్స్ - భారతదేశం ఏ హాట్‌స్పాట్‌లలో భాగంగా ఉంది?
పశ్చిమ కనుమలు-శ్రీలంక; హిమాలయాలు, ఇండోబర్మా, సుందాల్యాండ్ - దిబ్రూ సాయికోవ బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
అసోం - ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆరు పులుల ఉపజాతుల్లో పెద్దది ఏది?
అముర్/సైబీరియన్ పులి - అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
కేరళ - వరల్డ్ ఎర్త్ డే (ధరిత్రీ దినోత్సవం)
ఏప్రిల్ 22 - యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌ఈపీ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
నైరోబీ (కెన్యా) - ఇడుక్కి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
కేరళ - వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది?
డెహ్రాడూన్ - నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చైర్మన్ ఎవరు?
ప్రధానమంత్రి - ఏటా అంతరించే ప్రమాదమున్న జీవజాతుల జాబితా.. రెడ్‌లిస్ట్‌ను ప్రకటించే సంస్థ ఏది?
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (ఐయూసీఎన్) - దేశంలో జీవవైవిధ్య సంరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
2002 - దేశంలో ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్‌లు ఉన్నాయి?
32 - గంగానది డాల్ఫిన్ శాస్త్రీయ నామం -
ప్లాటానిస్టా గాంగెటికా - ఎడారిలో మొదలయ్యే జీవావరణ అనుక్రమం -
Xerarch - మేసే ఆహార గొలుసు ఏ జీవులతో ప్రారంభమవుతుంది?
మొక్కలు (స్వయం పోషకాలు) - డెట్రిటస్ ఆహార గొలుసు వేటితో మొదలవుతుంది?
జంతు, వృక్ష కళేబరాలు - ఆహార గొలుసు, ఆహార వల భావనలను ప్రవేశపెట్టింది ఎవరు?
చార్లెస్ ఎల్టన్ - నోక్రెక్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
మేఘాలయ - ఏ జాతీయ పార్కును ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని పిలుస్తారు?
కేబుల్ లామ్జావు జాతీయ పార్కు - వాతావరణంలో 2.5 మైక్రాన్ల లోపు పదార్థ రేణువులు ఎంత మోతాదుకు మించకూడదు?
60 మైక్రోగ్రాములు - జాతీయ వాయు కాలుష్య సూచికను ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
2015 ఏప్రిల్ 6 - జాతీయ వాయు కాలుష్య సూచిక ఏ కాలుష్య కారకాల పరిస్థితిని అంచనా వేస్తుంది?
నైట్రోజన్ డై ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, పీఎం 10, పీఎం 2.5, సల్ఫర్ డై ఆక్సైడ్, అమోనియా, సీసం - ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరం?
న్యూఢిల్లీ - కేన్సర్‌కు కారణమయ్యే భారలోహం -
ఆర్సినిక్ - ఏ భారలోహం ప్రభావం ద్వారా ఇటాయి-ఇటాయి వ్యాధి వస్తుంది?
కాడ్మియం - హీమోగ్లోబిన్ నిర్మాణాన్ని అడ్డుకునే భారలోహం -
సీసం - సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్కడ ఉంది?
న్యూఢిల్లీ - పత్తి ధూళి కాలుష్యం ద్వారా సంభవించే ఊపిరితిత్తుల వ్యాధి -
బైస్సినోసిస్ (Byssinosis) - ఇనుము ధూళి కాలుష్యం వల్ల సంభవించే ఊపిరితిత్తుల వ్యాధి -
సిడరోసిస్ - భారత్‌లో ఎలక్ట్రానిక్ వ్యర్థం అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న నగరం -
ముంబయి - నాక్-నీ (Knock-knee) సిండ్రోమ్ అని ఏ వ్యాధిని పిలుస్తారు?
ఫ్లోరోసిస్ - కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్‌ల వ్యర్థంలోని హానికర భారలోహం -
పాదరసం - 2015, డిసెంబరులో ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు (కాప్-21) ఎక్కడ జరిగింది?
పారిస్ - ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ చైర్మన్ ఎవరు?
హోసంగ్ లీ (దక్షిణ కొరియా) - ప్రపంచ గ్రీన్‌హౌస్ ఉద్గారాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం -
చైనా - శబ్ద కాలుష్యం ద్వారా చెవిలో జనించే రింగులు తిరిగే శబ్దం -
టిన్నిటస్ - ఓజోన్ పొర పరిరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం -
మాంట్రియల్ ప్రొటోకాల్ - 2015 లెక్కల ప్రకారం భారత్‌లో సింహాల సంఖ్య -
523 - ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం?
భారత్ - ఆహార పదార్థాల ప్యాకేజింగ్ మెటీరియల్స్‌లోని హానికర రసాయనం బీపీఏ అంటే?
బిస్ ఫినాల్ ఎ - శిలలపై జీవావరణ అనుక్రమాన్ని ప్రారంభించే జీవులు -
లెకైన్స్ - ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది?
అమెరికా - ప్రపంచ జీవ వైవిధ్య దినం -
మే 22 - పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
మధ్యప్రదేశ్ - సమశీతోష్ణ మండల జంతువుల కంటే ఉష్ణమండల జంతువుల చర్మ వర్ణం గాఢంగా ఉంటుందని చెప్పే సూత్రం -
గ్లాగర్ సూత్రం - ఉష్ణ మండల జంతువుల చెవులు, తోకలు, చలనాంగాలు సమశీతోష్ణ మండల జంతువుల కంటే పొడుగ్గా, పెద్దగా ఉంటాయని చెప్పే సూత్రం -
ఆలెన్స్ సూత్రం - నీటిలో వేగంగా ఈదే జంతువులను ఏమంటారు?
నెక్టాన్‌లు - ఒక జనాభాలోని విభిన్న జన్యువుల సముదాయం?
జీన్‌పూల్ - అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశం?
ఆస్ట్రేలియా - ప్రపంచంలోని అతిపెద్ద ప్రవాళ అవరోధం/భిత్తిక (కోరల్ రీఫ్) -
ఆస్ట్రేలియా ఈశాన్య తీరంలోని గ్రేట్ బేరియర్ రీఫ్ - ఆమ్ల వర్షాల ద్వారా పాలరాయి క్షీణించే ప్రక్రియ -
రాతి కుష్టు - చమురు వ్యర్థ పదార్థాలను తేలిగ్గా నిర్వీర్యం చేయగల బ్యాక్టీరియా -
సూడోమొనాస్ పుటిడ - నీటి నుంచి ఫ్లోరిన్‌ను తొలగించే (డీఫ్లోరినేషన్) నల్లగొండ టెక్నిక్‌ను అభివృద్ధి చేసిన సంస్థ -
నాగపూర్‌లోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. - నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తయారీలో పాల్గొన్న ఐఐటీ ఏది?
ఐఐటీ-కాన్పూర్
Published date : 03 Mar 2016 06:51PM