మలేరియా వ్యాధి ఏ అవయవంపై ప్రభావాన్ని చూపుతుంది?
మానవునికి సంక్రమించే అనేక వ్యాధులకు కారణం సూక్ష్మజీవులు బాక్టీరియా, వైరస్‌లతో పా టు ప్రోటోజోవా, హెల్మింథ్ వర్గానికి చెందిన కొన్ని జీవులు, శిలీంధ్రాలు మానవునిలో వ్యాధులు కలుగజేస్తాయి. బాక్టీరియా, వైరస్‌ల వ్యాధులను నిరోధించడానికి వ్యాక్సిన్లు ఉన్నప్పటికి, ప్రోటోజోవా పరాన్నజీవుల వల్ల కలిగే భయంకరమైన వ్యాధులను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌లు అందుబాటులో లేవు.
ప్రోటోజోవా వ్యాధులు(Protozoan diseases) :
అమీబియాసిస్ (Amoebiasis):
- ‘ఎంటమీబా హిస్టాలైటికా’ అనే ప్రోటోజోవన్ పరాన్నజీవి వల్ల ఈ వ్యాధి కలుగుతుంది.
- కలుషితమైన నీరు, ఆహారం గుండా ఈ పరాన్నజీవి దశలు (సిస్ట్‌లు) మానవునిలోకి ప్రవేశించి అవి పగిలి పిల్ల జీవులు ఏర్పడి పేగు కుహరాన్ని చేరి, పేగు గోడలపై దాడిచేసి పుండ్లను ఏర్పరుస్తాయి.
- పేగుగోడల నాశనం వల్ల రక్తం, జిగట పదార్థాలతో కూడిన విరోచనాలు కలుగుతాయి. మలం దుర్వాసనను సంతరించుకుంటుంది. ఈ వ్యాధినే ‘అమీబిక్ డిసెంటరీ’ (Amoebic dysentry) అని లేదా ‘అమీబియాసిస్’ అని కూడా అంటారు.
- కడుపు నొప్పి, రక్తహీనత, ఇస్నోఫీలియా, శ్లేష్మం, రక్తంతో కూడిన విరేచనాలు. పేగు కుడ్యములో పుళ్ళు మొదలగు లక్షణాలు సంభవిస్తాయి.
- ఒక్కొక్కసారి రక్త ప్రవాహం ద్వారా ఈ పరాన్నజీవులు మెదడు వంటి అవయవాలను చేరి హానిని కలిగిస్తాయి.
- అమీబియాసిస్ నిర్మూలనకు ‘ఎమిటీన్’, ‘ఎరిత్రోమైసిన్’, ‘టిమిడజోల్’ వంటి మందులు వాడుతారు.
- దీనిని చలి జ్వరం అని కూడా అంటారు. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవన్ పరాన్న జీవి వల్ల కలుగుతుంది.
- ఈ పరాన్నజీవిని తొలిసారిగా 1880లో ‘ఛార్లెస్ లావెరెన్’ అను వైద్యుడు మలేరియా వ్యాధిగ్రస్తుని శరీరంలో కనుగొనడం జరిగింది.
- ప్లాస్మోడియం దోమ కాటు ద్వారా మానవునికి సంక్రమిస్తుంది.
- మానవునిలో నాలుగు ప్లాస్మోడియం ప్రజాతులు మలేరియా వ్యాధిని కలుగజేస్తాయి. అవి వరుసగా
(a) ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్
(b) ప్లాస్మోడియం మలేరియే
(c) ప్లాస్మోడియం వైవాక్స్
(d) ప్లాస్మోడియం ఓవేల్ - ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్, ప్లాస్మోడియం వైవాక్స్‌లు ఎక్కువ మంది ప్రజలకు సోకుతాయి. ఫాల్సిపేరమ్ అన్నిటి కంటే ప్రాణాంతకమైంది.
- ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టినపుడు దాని శరీరంలోని ప్లాస్మోడియం జీవులు మానవ శరీరంలోకి ప్రవేశించి రక్తం ద్వారా కాలేయా న్ని చేరుతాయి. అక్కడ వాటి సంఖ్యను వృద్ధి చేసుకుంటాయి.
- దోమ కాటుకు గురైన వారం నుంచి 18 రోజుల వ్యవధిలో మలేరియా లక్షణాలు బయటపడతాయి.
- వ్యాధిగ్రస్తులు ఒక్కసారిగా దాదాపు 30 నిమిషాలు చలితో బాధపడతారు. దీనిని ‘చలిదశ’ అంటారు. తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరిగి అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, నీరసం, వాంతులు, విరోచనాలు కలుగుతాయి.
- మలేరియాకు గురైనపుడు ఒక్కొక్కసారి రక్తహీనత జరిగి ప్రాణాపాయం కూడా కలగవచ్చు.
- డాక్టర్లు రక్తపరీక్ష ద్వారా మలేరియాను నిర్ధారిస్తారు. ఈ పరీక్షను ‘గీంసా బ్లడ్ స్మియర్’ (Giemsa blood smear) అని అంటారు.
- ‘ఇమ్యునో ఫ్లోరెసెంట్’ పరీక్ష, ప్రత్యేక ‘మలేరియా కిట్’ల ద్వారా కూడా మలేరియాను నిర్ధారిస్తారు.
- ఒకప్పుడు మలేరియా చికిత్సకు ‘క్లోరో క్వినైన్’ వాడేవారు. ఇప్పుడు క్వినైన్ మరియు దాని ప్రత్యామ్నాయాలైన ‘క్వినైనాక్రిన్’, క్లోరోక్విన్, ప్రైమాక్విన్, అటెబ్రిన్, కామోక్విన్, రిసోచిన్‌లను జౌషధాలుగా వాడుతున్నారు.
- మలేరియా నిర్మూలనకు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 2015లో Mosquirix అనే ట్రేడ్ నేమ్ (Trade name) పేరుతో RTS, S అను వ్యాక్సిన్ రావడం జరిగింది. అయితే ఈ వ్యాక్సిన్ కేవలం చిన్న పిల్లలలో పాక్షికంగా మలేరియా వ్యాధి రాకుండా కాపాడుతుంది. అత్యంత భయంకరమైన మలేరియా పరాన్నజీవి అయిన ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ నిర్మూలనకు ఉద్దేశించబడింది.
- 2030 సంవత్సరం నాటికి దేశంలో ‘మలేరియా వ్యాధిని’ పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్దేశ్యంతో ‘నేషనల్ ఫ్రేంవర్‌క ఫర్ మలేరియా ఎలిమినేషన్ ఇన్ ఇండియా, 2016-2030’ను రూపొందించడం జరిగింది.
ట్రిపనోసోమియాసిస్ (Trypanosomiasis):
- దీనినే ‘అతినిద్ర వ్యాధి’ (sleeping sickness) అంటారు.
- ఆఫ్రికా దేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండడం వల్ల దీనిని ‘ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్‌నెస్’ అంటారు.
- ట్రిపనోసోమా గాంబియన్సీ (Trypanosoma gambiense) అనే ప్రోటోజోవన్ పరాన్నజీవి దీనికి కారణం.
- ఈ వ్యాధి సీసీ ఈగ కుట్టడం వల్ల సంభవిస్తుంది. శాస్త్రీయంగా ఈ ఈగను ‘గ్లోసినా పల్పాలిస్’ (Glossina palpalis) అంటారు.
- సీసీ ఈగ మానవుని కుట్టినపుడు ఈ వాహకజీవిలోని పరాన్నజీవులు మానవుని రక్తంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి.
- తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు కలుగుతాయి. ఆ తర్వాత మెల్లగా నాడీవ్యవస్థ భాగాలైన మెదడు, కశేరు నాడీ దండము మొదలగు అవయవాలు పరాన్నజీవి ప్రభావానికి గురవుతాయి.
- ఈ మార్పుల మూలంగా వ్యక్తిగతమైన అవలక్షణాలు, నిద్రలో మార్పులు రావడం, బద్ధకం కలగడం వంటి లక్షణాలు కలిగి, ఒక్కొక్కసారి అధిక నిద్ర మూలంగా కోమాలోకి వెళ్లడం జరుగుతుంది.
- దీనిని ‘అమెరికన్ ట్రిపనోసోమియాసిస్’ అని కూడా అంటారు.
- ‘ట్రిపనోసోమా క్రూజై’ (Trypanosoma cruzi) అనే ప్రోటోజోవన్ పరాన్నజీవి కారణం.
- రక్తాన్ని శోషించే నల్లుల ద్వారా ఈ వ్యాధి మానవునికి సోకుతుంది.
- ‘టీకామందు’ ఉపయోగించి ఈ వ్యాధిని నివారించవచ్చు.
- దీనిని ‘నల్ల నీళ్ళ జ్వరం’ (Black fever) అని కూడా అంటారు.
- ‘లీష్మానియా డోనోవాని’ (Leishmania donovani) అనే ప్రోటోజోవన్ పరాన్నజీవి కారణం.
- సాండ్‌ఫ్లై అనే ‘ఫ్లిబటోమస్’ (phlebatomous) ఈగ ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది.
- లీష్మానియా మానవుని ‘రెటిక్యులో ఎండోథీలియల్ వ్యవస్థను’ దెబ్బతీస్తుంది. దీని మూలంగా ప్లీహం, కాలేయం, ఎముక మూలుగ దెబ్బతింటాయి.
- ఆకలి మందగించటం, ప్లీహం ఉబ్బడం, కాలేయం ఉబ్బడం, శరీర బరువు తగ్గడం, నీరసం కలగడం, అనీమియాకు లోను కావడం జరుగుతుంది.
- చర్మం పొడిబారడం, పొలుసులు ఏర్పడడం, రోమాలను కోల్పోవడం మరియు ముఖం, చేతులు, కాళ్ళు, ఉదర భాగంలో నూ చర్మం గోధుమ వర్ణంలోకి మారడం జరుగుతుంది. ఈ లక్ష ణాన్ని ‘కాలా అజార్’ లేదా ‘బ్లాక్ ఫీవర్’ అంటారు.
- హెల్మింథ్ పరాన్నజీవుల వల్ల కలిగే వ్యాధులను ‘క్రిముల వలన కలిగే వ్యాధులు’ (worm infections) అంటారు.
- ‘ఉకరేరియా బాంక్రాఫ్టి’ అను హెల్మింథ్ పరాన్నజీవి దీనికి కారణం.
- ఈ వ్యాధిని ‘ఫైలేరియాసిస్’ లేదా ‘ఏనుగు కాళ్ళ వ్యాధి’ అని కూడా అంటారు.
- ఆడ క్యూలెక్స్ దోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది.
- వ్యాధికారక క్రిములు లింఫ్, శోషరస గ్రంథు లను చేరి వాటిని ఇన్‌ఫెక్షన్‌కు గురిచేస్తాయి. లింఫ్ గ్రంథులు ఉబ్బడం వల్ల బోదకాలు వస్తుంది.
- ఈ వ్యాధి కాళ్ళకు మాత్రమే కాకుండా చేతులు, రొమ్ము, పురుషాంగాలకు, హై డ్రోసీల్, రొమ్ము భాగాలకు కూడా రావచ్చు.
- ఏడాదికొకసారి ఫైలేరియా నివారణ మందులు తీసుకుంటే కూడా ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు.
- వ్యాధికారక దోమలను అరికట్టడం ద్వారా కూడా దీని నుంచి కాపాడుకోవచ్చు.
- బోదకాలు వ్యాధికి విధిగా చికిత్స చేయించుకోవాలి.
- ‘డై ఇథైల్ కార్బమజీన్’ (DEC), ‘ఆల్బెండజోల్’ బిళ్ళలు 21 రోజులు పాటు కోర్సుగా వాడాలి.
- ‘ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్’ (Ascaris lumbricoides) నిమటోడ్ పరాన్నజీవి వల్ల ఈ వ్యాధి కలుగుతుంది.
- వీటిని ఏలిక పాములు లేదా నులి పురుగులు అంటారు.
- ఇవి పేగులో నివసిస్తూ, రోజుకు 2 లక్షల గుడ్లను పెడుతూ,పేగు భాగాలను ఇన్‌ఫెక్షన్‌కు గురిచేస్తుంది.
- పేగు నుంచి ఇతర భాగాలైన ఊపిరితిత్తులకు కూడా రక్తం ద్వారా ప్రవేశించి శ్వాసనాళ భాగాలను కూడా దెబ్బతీస్తుంది.
- యాంటీ హెల్మింథ్ మందులు ముఖ్యంగా ఆల్బెండజోల్, మెబెండజోల్, లీవామిసోల్ వంటివి వాడి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.
అథ్లెట్స్ ఫుట్ (Athelete's foot):
- దీనిని ‘ఫంగస్ పట్టిన పాదము’ అని వ్యవహరిస్తారు. వైద్య పరిభాషలో ‘టీనియా పెడిస్’ అని కూడా అంటారు.
- వ్యాధికి గురైన పాదము మీద దురద, ఎర్రని పగుళ్ళు ఏర్పడతాయి. కాలివేళ్ళ మధ్య కాని చేతి వేళ్ళకు, గోళ్ళకు కాని రావచ్చు.
- శిలీంధ్రాలకు చెందిన ‘ట్రైకోఫైటాన్’ ప్రజాతులు దీనికి కారణం.
- ఇది పాదాలకు సోకే శిలీంధ్ర వ్యాధి. ‘మైసిటోమా పెడిస్’ అనే శిలీంధ్రం దీనికి కారణం. ఈ వ్యాధి భారత్, ఆఫ్రికా, దక్షిణ మరియు మధ్య అమెరికాలలో ఎక్కువగా క నబడుతుంది.
- చర్మానికి, దాని సంబంధిత కణజాలాలకు సోకే దీర్ఘకాలిక వ్యాధి, చర్మం మీది పొరలలో బుడి పెలు ఏర్పడతాయి. కెటోకొనజోల్, ఓరికొనజోల్ మందులు ఉపయోగించి వ్యాధిని నివారించవచ్చు.
- ఇది ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వల్ల కలిగే సాధారణ చర్మ వ్యాధి. వైద్యపరంగా దీనిని ‘టీనియా’ అని అంటారు.
- ‘మైక్రోస్పోరం’ అనే శిలీంధ్రం వల్ల కలిగే చర్మ వ్యాధి.
- తేమగా ఉండే చర్మ భాగాలైన కాలివేళ్ళు, గజ్జలు, పైచర్మం, చేతి వేళ్ళ మధ్య చర్మం ముడతలలో వ్యాపిస్తుంది.
- రింగ్ వర్‌మ అనేది వృత్తాకార వలయం లాంటి ‘దద్దురు’. ఒక ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తుంది. వలయం అంచులు ఎత్తుగా, ఎర్రటి రంగులో పొలుసులుగా ఉంటాయి. ఈ వ్యాధి సోకిన చోట తీవ్రమైన దురద కలుగుతుంది.
- యాంటీ ఫంగల్ మందులు ముఖ్యంగా ‘క్లోట్రిమాజోల్’, ‘మైకోనజోల్, కెటోకోనజో ల్’లను వంటి మందులను వాడి రో గం న యం చేసుకోవచ్చు. అల్లైలమైన్‌స వంటివి ముఖ్యంగా ‘టర్బినాఫైన్’ మందు అథ్లెట్ ఫుట్ నిర్మూలనకు బాగా ఉపయోగపడుతుంది.
1. మలేరియా నిర్మూలనా కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగించే చేప?
1) సిప్రినస్ కార్పియా
2) గాంబూసియా అఫినిస్
3) తైలాపియా మొసాంబికా
4) టింకా టింకా
- View Answer
- సమాధానం: 2
2. ‘మదురామైకాసిస్’ అనే వ్యాధిని కలుగజేసేది?
1) బాక్టీరియా
2) శిలీంధ్రం
3) వైరస్
4) ప్రోటోజోవా జీవి
- View Answer
- సమాధానం: 2
3. ‘బోదకాలు’ వ్యాధి కారకమైన ఫైలేరియా పురుగు శరీరంలోని ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది?
1) రక్తప్రసరణ వ్యవస్థ
2) నాడీ వ్యవస్థ
3) శ్వాస వ్యవస్థ
4) శోషరసనాళ వ్యవస్థ
- View Answer
- సమాధానం: 4
4.మలేరియా వ్యాధిని త్వరితగతిన తగ్గించడానికి కింది తెలిపిన ఏ చికిత్సను వాడడం జరుగుతుంది?
1) యాంటీబయాటిక్ థెరఫీ
2) ఆక్యుపంచర్ థెరపీ
3) ఆల్బెండజోల్ థెరపీ
4) ఆర్టీమిసినిన్ సంబంధిత కాంబినేషన్ థెరపీ
- View Answer
- సమాధానం: 4
5. ప్రపంచ ‘మలేరియా దినోత్సవం’ను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 22
2) ఏప్రిల్ 25
3) ఏప్రిల్ 24
4) ఏప్రిల్ 5
- View Answer
- సమాధానం: 2
6. Signal-KA అను కిట్‌ను ఏ వ్యాధి నిర్ధారణ కు వాడుతారు?
1) కాలా అజార్
2) అతి నిద్ర వ్యాధి
3) చాగాస్ వ్యాధి
4) బోద వ్యాధి
- View Answer
- సమాధానం: 1
7. ‘సింకోనా అఫిసినాలిస్’ అనే మొక్క బెరడు నుంచి తీసిన క్వినైన్ ఔషధం ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది?
1) మలేరియా
2) క్షయ
3) జలుబు
4) టైఫాయిడ్
- View Answer
- సమాధానం: 1
8. బోద వ్యాధికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధం?
1) ఆస్ప్రిన్, బ్రూఫెన్
2) అనాల్జిసిక్స్
3) కాంబిఫ్లామ్
4) డై ఇథైల్ కార్బమజైన్
- View Answer
- సమాధానం: 4
9. మలేరియా వ్యాధి కింది ఏ అవయవంపై ప్రభావాన్ని చూపుతుంది?
1) ఊపిరితిత్తులు
2) ప్లీహం
3) లింఫ్ గ్రంథి
4) మూత్ర పిండం
- View Answer
- సమాధానం: 2
10. మలేరియా కారక ప్లాస్మోడియం దోమ నుంచి మానవునికి సంక్రమించే దశ ఏది?
1) స్పోరోజోయిట్
2) గామిటోసైట్
3) మీరోజోయిట్
4) షైజాంట్
- View Answer
- సమాధానం: 1
11. National Centre for Disease Control (NCDC) ఎక్కడ ఉంది?
1) చెన్నై
2) న్యూఢిల్లీ
3) ముంబాయి
4) కోల్కత్తా
- View Answer
- సమాధానం: 2