ప్రాక్ చరిత్ర -1
1. ’’మానవ జాతి పరిణామక్రమాన్ని ఒక గంట సినిమాగా తీస్తే, దానిలో 59 నిముషాలు ఆదిమ దశ నుంచి పైకి పెరగడానికే సరిపోతుందని’’ సోషల్ థికింగ్ గ్రంధంలో తెలిపినవారు?
1) బ్రూస్‌ఫుట్
2) ఏ.ఈ. సంకాలియా
3) హైమైన్ లెవీ
4) కాకాబర్న్
- View Answer
- సమాధానం: 3
2. ’’ప్రాక్ చరిత్ర’’ కు సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది?
i) లిపిలేని దశ
ii) లిపి తెలిసిన దశ
iii) 1851లో ప్రాక్ చరిత్ర అనే పదాన్ని డేనియల్ విల్సన్ వాడాడు.
iv) సర్ జాన్ లబ్బక్ ఈ పదానికి ప్రాచుర్యం కల్పించాడు
1) i
2) ii, iv
3) i, iii
4) ii
- View Answer
- సమాధానం: 4
3. జతపరచండి.
శాస్త్రవేత్త
a) డేనియల్ విల్సన్
b) సర్ జాన్ లబ్బక్
c) H.D. సంకాలియా
d) V.V. కృష్ణ శాస్త్రి
గ్రంధాలు
i) ప్రి హిస్టరీ అండ్ ప్రోటో హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్థాన్
ii) ది ప్రోటో అండ్ ఎర్లీ హిస్టరీ కల్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
iii) ప్రిహిస్టారిక్ టైమ్స్
iv) ది ఆర్కియాలజీ అండ్ ప్రి హిస్టారిక్ ఆనల్స్ ఆఫ్ స్కాట్లాండ్
1) a-i, b- ii, c-iii, d-iv
2) a-ii, b-i, c-iii, d-iv
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-iv, b-iii, c-ii, d-i
- View Answer
- సమాధానం: 3
4. కింద తెల్పిన ఏఏ ప్రాంతాలల్లో దొరికిన శిలాజాల మీద ఆధారపడి మానవ పరిణామ క్రమ చట్రం నిర్మించడానికి దోహదం కలిగింది?
i) ఆఫ్రికా
ii) యూరఫ్
iii) నైరుతి ఆసియా
iv) ఆగ్నేయాసియా
1) i,iv
2) i,ii,iii
3) i, iii, iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
5. లక్షా యాబైవేల సంవత్సరాల క్రితం నాటి మంచుయుగంలో తొలి మానవుడు ’’స్త్రీ’’ఆఫ్రికా ఖండంలో జన్మించిందన్నవారు?
1) రాబర్ట్ బ్రూస్‌పుట్
2) హైమన్ లెవి
3) డాక్టర్ స్టీవెన్ ఓసన్ హీమర్
4) ఏ.ఈ సంకాలియ
- View Answer
- సమాధానం: 3
6. మానవ పరిణామ క్రమాన్ని ఆరోహణ క్రమంలో అమర్చండి?
i) ఆస్ట్రలోపిథికస్
ii) హోమోసేపియన్
iii) నియండర్తాల్
iv)హోమో ఎరక్టస్
1) i,ii,iii,iv
2) i,iv,iii,ii
3) iv,i,ii,iii
4) iii,ii,i,iv
- View Answer
- సమాధానం: 2
7. భారత జియోలాజికల్ సర్వేకి చెందిన అరుణ్ సోనాకియా 1984లో శిలాజ కపాలాన్ని ఎక్కడ కనుగొన్నారు?
1) హతనోరా
2) నాగార్జున కొండ
3) కడప
4) కాశ్మీర్ లోయ
- View Answer
- సమాధానం: 1
8. ఏ కాలంలో భారతదేశంలో మానవుడు ఉద్భవించినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు?
1) ప్లీస్టోసీన్
2) హోలోసీన్
3) హోలోసీన్ చివరి భాగంలో
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 1
9. ఆంధ్రలోని ఏ ప్రాంతంలో మొట్టమొదటి మానవుడు ఉద్భవించాడు?
1) తుంగభద్ర లోయ
2) కృష్ణ- గోదావరి లోయ
3) కృష్ణ- పెన్నా లోయ
4) వంశధార లోయ
- View Answer
- సమాధానం: 2
10. కింది వాటిలో సరైనది?
i) 1839లో ఫ్రాన్స్‌లోని సోయ్ నదీలోయలో ’’బూషెర్ దపెర్తిస్’’ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఒక రాతి గొడ్డలిని కనుగొన్నాడు.
ii) 1842లో మెడోస్ టేలర్ మొట్ట మొదటిసారిగా భారతదేశంలో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో లింగ్షుగర్ వద్ద తొలిమానవుడి రాతిగొడ్డలిని కనుగొన్నాడు.
iii) 1863లో రాబర్ట్ బ్రూస్‌ఫుట్ మద్రాస్‌లోని పల్లవరంలో పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన పరికరాలను కనుగొన్నాడు.
iv) బ్రూస్‌ఫుట్ తన కుమారుడు హెన్రీతో 1892లో ఆంధ్రాలో పరిశోధనలు చేశాడు.
1) i,iv
2) i,ii,iv
3) i,ii,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
11. ఐరోపా ఖండ ప్రాక్ చరిత్ర పితామహుడిగా పేరుగాంచిన సీ.జే. థామ్సన్ తెల్పిన యుగత్రయ వ్యవస్థలో లేనిది?
1) శిలాయుగం
2) కంచుయుగం
3) ఇనుపయుగం
4) రాగి-రాతి యుగం
- View Answer
- సమాధానం: 4
12.దక్షిణ భారతదేశంలో కనిపించని నాగరికతగా రాబర్ట్ బ్రూస్‌పుట్ పేర్కొనది?
1) ఇనుప నాగరికత
2) రాగి నాగరికత
3) శిలాయుగ నాగరికత
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
13. ప్రాక్ చరిత్ర విభజన వేటి ఆధారంగా జరిగింది?
i) ధరించిన దుస్తులు, ఆభరణాలు
ii) వాడిన పనిముట్లు
iii) శిల్పాలు, కట్టడాలు
iv) చిత్రలేఖనాలు
1) i,iv
2) i,ii,iv
3) ii
4) iv
- View Answer
- సమాధానం: 3
14. జతపరచండి.
ప్రాక్ చరిత్ర పదాలు
a) ఎస్సెంబ్లేజ్ (assemblaze)
b) ఆర్టిఫేక్ట్స్ (artefacts)
c) ఇండస్ట్రీ (industry)
d) టెక్నో కాంప్లెక్స్ (techno complex)
నిర్వచనాలు
i) ఒకపరిశ్రమలోని వస్తుసమూహాలు ప్రదర్శించే సాంకేతిక సంప్రదాయలు
ii) ప్రకృతిలో దొరికే తీరులో గాక, మనిషి తన అవసరాలకు తగ్గట్టుగా వస్తువుని మలచుకోవడం
iii) మానవుడు తయారుచేసిన వస్తువులకు సంబంధించినవి
iv) ఒకే భూగర్భశాస్త్ర యుగానికి చెందినవి, ఒకే భౌగోళిక ప్రాంతంలో విస్తరించుకుని ఉన్నవి
1) a-i,b-iii,c-iv,d-ii
2) a-ii,b-i,c-iv,d-iii
3) a-iii,b-ii,c-iv,d-i
4) a-iii,b-ii,c-i,d-iv
- View Answer
- సమాధానం: 3
15. కింది వాటిలో సరైనది?
i) దక్షిణ భారతదేశ చరిత్ర పూర్వయుగాన్ని పాతశిలాయగం (palaeolithic), కొత్త శిలాయుగం (neolithic), ఇనుస యుగం (iron age) కొందరు పురాతత్వవేత్తలు విభజించారు.
ii) ఏ.ఈ. సంకాలియా, బి. సుబ్బారావులు దక్షిణ భారతదేశ చరిత్ర పూర్వయుగాన్ని ఆద్యశిలాయుగం, మధ్య శిలాయుగం, ఉత్తర శిలాయుగం, నూతన శిలాయుగమని అన్నారు
iii) భారతదేశ ప్రాక్ చరిత్ర పితామహుడు బ్రూస్‌ఫుట్
1) i
2) ii
3) i,ii సరికానివి
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 4
16. జతపరచండి.
a) ప్రాచీన శిలాయుగం
b) మధ్య శిలాయుగం
c) నవీన శిలాయుగం
d) లోహ శిలాయుగం
i) 2,800&1200 B.C
ii) 8500&4000 B.C
iii) 3 లక్షలు-1,25,000 B.C
iv) 7000&1000 B.C
1) a-i,b-ii,c-iii,d-iv
2) a-ii,b-i,c-iii,d-iv
3) a-iii,b-ii,c-iv,d-i
4) a-iii,b-ii,c-i,d-iv
- View Answer
- సమాధానం: 3
17. సరికాని జత.
1) దిగువ ప్రాచీన శిలాయుగం - క్రీ.పూ. 1, 25,000
2) మధ్య ప్రాచీన శిలాయుగం - క్రీ.పూ. 40,000
3) ఎగువ ప్రాచీన శిలాయుగం - క్రీ.పూ. 10000
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
18. భారత స్వాతంత్య్రానికి ముందు ఆంధ్ర ప్రాంతంలోని ప్రాచీన స్థలాలను కనుగొన్నది?
1) భూగర్భ శాస్త్రవేత్తలు
2) ప్రభుత్వ అధికారులు
3) స్వచ్ఛంద సేవా సంస్థలు
4) 1,2,3
- View Answer
- సమాధానం: 4
19. ఆంధ్రప్రాంతంలో 1947కి ముందు ప్రాక్ చరిత్ర స్థలాలు కనుగొన్నవారు ?
i) న్యూబోల్డ్ ii) బ్రూస్‌ఫుట్ iii) హెన్రీఫుట్, w.కింగ్ iv) ఓల్డ్హామ్, అయ్యప్పన్
1) i,iv
2) ii,iii,iv
3) i,ii,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
20. ఆంధ్ర ప్రాంతంలో 1947 తర్వాత ప్రాక్ చారిత్రక స్థలాలను కనుగొన్నవారిలో ముఖ్యులు ?
i) B.R. సుబ్రమణ్యం
ii) H.D.సంకాలియా
iii) ఐజాక్, తిమ్మారెడ్డి
iv) జాకబ్ జయరాజ్
1) i,iii
2) ii,iv
3) i,ii,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
21. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖకి సంబంధించి ఈ కింది వాటిలో సరైనది?
i) 1914 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ ఏర్పాటైంది.
ii) 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌లో పురావస్తు శాఖ ఉండేది.
iii) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 277 రక్షిత కట్టడాలున్నాయి.
1) iii
2) ii
3) i,iii
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 4
22. కింది వాటిలో ఎవరి పరిశోధనల ఫలితంగా పాతరాతి యుగ మానవుడు ఆంధ్రదేశంలో భిన్న ప్రాంతాలలో నివసించాడని తెలుస్తుంది?
i) బ్రూస్‌ఫుట్ ii) కమియోడ్ iii) టేలర్ iv) కన్నింగ్‌హాం
1) i,iv
2) i,ii
3) iii,iv
4) ii,iii
- View Answer
- సమాధానం: 2
23. పాత రాతి యుగం మానవుని లక్షణం కానిది?
i) నదీ తీరాలలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలలో నివసించేవాడు.
ii) ఆహార అన్వేషకులు
iii) రాళ్ళను చీల్చి చిన్న, అతి సూక్ష్మ పరికరాలు తయారు చేయడం.
iv) ఆహారాన్ని వండటం, నిల్వ ఉంచడం తెలియదు.
1) i
2) ii
3) iii
4) ii,iii
- View Answer
- సమాధానం: 3
24. నిశ్చిత వాక్యం (A): దక్కన్ పీఠభూమి రాతియుగపు మానవుడికి అత్యంత అనుకూలమైన ప్రదేశం.
హేతువు (R):ప్రాచీన కాలంలో దక్కన్ పీఠభూమి చాలా వేడిగా ఉండేది. విపరీతమైన వర్షాలు, ఎండలు ఉండేవి. లాటరైట్ రాయి లభించడంతో పరికరాలకు అనుకూలంగా ఉండేది.
1) (A)(R) లు సరైనవి. (R)(A)కి సరైన వివరణ
2) (A) సరైనది. (R) సరైనది కాదు
3) (A) సరికానిది. (R) సరైనది
4) (A)(R) సరైనవి. (R)(A)కి సరైన వివరణ కాదు
- View Answer
- సమాధానం: 1
25. పాత రాతి పనిముట్ల పరిశ్రమకు కేంద్రమేది?
1) విశాశపట్నం
2) విజయవాడ
3) గిద్దలూరు
4) నరసన్నపేట
- View Answer
- సమాధానం: 3
26. ప్రాచీన శిలాయుగ మానవుని ఆర్థిక కార్యకలాపాలేవి ?
1) వేట
2) ఆహారసేకరణ
3) పంటలు పండించడం
4) 1,2
- View Answer
- సమాధానం: 4
27. కింది వాటిలో సరైనది ?
i) పాత శిలాయుగ పరికరాలలో అధిక భాగం స్ఫటికాల (క్వార్ట్జైట్)తో చేసినవి
ii) దక్షిణ భారతదేశంలో ఎక్కువగా దొరికేరాయి క్వార్ట్జైట్.
1) i
2) ii
3) i,ii
4) i,ii కావు
- View Answer
- సమాధానం: 3
28. భారతదేశంలో దిగువరాతి యుగ సంస్కృతి (Lower palaeolithic culture) కి సంబంధంలేని సంప్రదాయాలు ?
i) సోయానియన్
ii) అషూలియన్
iii) మాగ్ధలేనియన్
iv) కెయిర్న్ (cairns)
1) i,ii
2) iii,iv
3) i,iii,iv
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 2
29.దిగువ పాతరాతి యుగ పరిశ్రమలకు సంబంధించి సరైనది?
i) సోయానియన్- ఉప హిమాలయ మండలానికి ప్రత్యేకం
ii) అషూలియన్- భారత్ ద్వీపకల్పం అంతా విస్తారంగా వ్యాపించి ఉంది
iii) సోయానియన్ పనిముట్లు చోపర్, చోపింగ్ లాంటి గుండ్రమైన పనిముట్లు
iv) అషూలియన్ పనిముట్లు చేతిగొడ్డళ్ళు, గండ్ర గొడ్డళ్ళు
1) i,iii
2) i,ii,iii,iv
3) ii,iv
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 2
30. ఆంధ్రప్రదేశ్‌లోని దిగువ పాత రాతియుగం ఏ పరిశ్రమకి చెందింది ?
i) ఉత్తర భారతదేశానికి చెందిన గులకరాతి (pebble tool) పరిశ్రమ
ii) దక్షిణ భారతదేశానికి చెందిన చేతిగొడ్డళ్ళు (Hand axes) పరిశ్రమ
iii) దక్షిణ భారతదేశానికి చెందిన Blade- flake పరిశ్రమ
1) i,iii
2) ii,iii
3) i,ii
4) ii
- View Answer
- సమాధానం: 3
31. కింది వాటిలో దిగువ ప్రాచీన శిలాయుగ పనిముట్టు కానిది ?
i) గోకుడు రాళ్ళు (choppers)
ii) చేతి గొడ్డళ్ళు
iii) గండ్ర గొడ్డళ్ళు (cleavers)
iv) చక్రాలు (discoids)
1) i,ii
2) iv
3) పై వన్నీ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
32. జతపరచండి.
పూర్వ ప్రాచీన శిలాయుగ పనిముట్ల పద్ధతి
a) రాతి సుత్తి పద్ధతి (stone hammer)
b) స్థూపాకార సుత్తి పద్ధతి (cylinder hammer)
c) దాగలి పద్ధతి (anvil)
చేతి గొడ్డళ్ళ సముదాయం
i) మూడవ
ii) మొదటి
iii) రెండవ
1) a-iii,b-ii,c-i
2) a-iii,b-i,c-ii
3) a-i,b-iii,c-ii
4) a-i,b-ii,c-iii
- View Answer
- సమాధానం: 2
33. కడప బేసిన్‌లోని పూర్వప్రాచీన శిలా పరికరాలను కనుగొన్నవారిలో ముఖ్యుడు ?
1) వహీద్ ఖాన్
2) ఆర్. సుబ్రమణ్యం
3) బ్రూస్‌ఫుట్
4) మెడోస్ టైలర్
- View Answer
- సమాధానం: 3
34.కడప బేసిన్‌కు సంబంధించి ఈ కింది వాటిలో సరైనది?
i) తూర్పు కనుమల నైరుతి దిశలోని పాదపీఠాల నుంచి చెన్నైలోని కొర్టాలయర్ లోయ వరకు పూర్వప్రాచీన శిలాయుగ ఆవాసాలున్నాయి.
ii) తూర్పు కనుమల నైరుతి ప్రాంతాన్ని కడప బేసిన్ అంటారు.
iii) జలవనరులుండటంతో ప్రాచీన మానవులు ఆవాసాలు ఏర్పరచుకున్నారు
1) i
2) ii,iii
3) i,ii
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 4
35. దిగువ ప్రాచీన యుగ పనిముట్లు దొరికిన ప్రదేశాలకి సంబంధించి సరైనది?
i) కర్నూల్- ద్రోణాచలం, బేతం చెర్ల
ii) సగిలేరు నదీలోయ- గిద్దలూరు
iii) కృష్ణా నదీలోయ- నాగార్జునకొండ, ఏలేశ్వరం, కారంపూడి
1) i
2) iii
3) ii,iii
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 4
36. కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపూరం, గుంటూర్ ప్రాంతాలలో లభ్యమైన దిగువ ప్రాచీన శిలాయుగపు పనిముట్లు?
i) చేతి గొడ్డళ్ళు ii) బొరిగెలు iii) బ్లేడ్లు iv) త్రిభుజాకృతి పరికరాలు
1) i,iv
2) i,ii
3) i,iii
4) పైవ న్నీ
- View Answer
- సమాధానం: 2
37. నిశ్చిత వాక్యం (A): ఆంధ్రప్రదేశ్‌లో ప్రధమ ప్రాచీన శిలాయుగం అషూలియన్ సాంకేతిక సంప్రదాయానికి చెందుతుంది.
హేతువు (R): దిగువ గోదావరి లోయలో అషూలియన్ చేతిగొడ్డళ్ళు ఆవాస స్థలాలు పెద్దపల్లి తాలూకాలో 300 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.
1) (A), (R)లు సరికానివి
2) (A), (R)లు సరైనవి
3) (A)సరైనది, (R) సరికానిది
4) (A) సరికానిది, (R) సరైనది
- View Answer
- సమాధానం: 2
38. కింది వ్యాఖ్యల్లో సరైనది?
i) దిగువ ప్రాచీన శిలాయుగ కాలానికి చెందిన పరికరాల లభ్యత ఆంధ్రలో అన్ని ప్రాంతాలలో సమంగా లేదు.
ii) గులక రాతి పనిముట్ల నుంచి చేతి గొడ్డళ్ళు వరకు ఎక్కువగా కర్నూలు, కడప ప్రాంతాలలో దొరకగా, మిగతాప్రాంతాలలో దొరకలేదు.
1) i
2) ii
3) i,ii
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 3
39.కింది వాటిలో ఏది అతి ప్రాచీన పాత రాతి యుగం తొలిదశ నుంచి చారిత్రక యుగం వరకు అవిచ్ఛనంగా వర్థిల్లింది ?
1) నాగార్జునకొండ
2) ఏలేశ్వరం
3) ధరణికోట
4) 1,2
- View Answer
- సమాధానం: 4
40. ఆర్కియాలాజికల్ డిపార్టుమెంట్ డెరైక్టర్ అబ్దుల్ వహీద్ ఖాన్ ఎక్కడ బయల్పడిన నాగరికతలు ప్రపంచస్థాయివని, అవి ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణాలని వ్యాఖ్యానించారు ?
1) వీరాపురం
2) నాగార్జునకొండ
3) ఏలేశ్వరం
4) 2,3
- View Answer
- సమాధానం: 4
41. ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ ప్రాదేశాలలో ప్రాచీన శిలాయుగం పనిముట్లను రాబర్ట్ బ్రూస్ ఫుట్ మొదట కనుగొన్నాడు ?
i) అనంతపురం ii) కడప iii) కర్నూలు iv) ప్రకాశం
1) i,iv
2) i,ii,iii
3) i,iii,iv
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
42. ఏ ప్రాంతంలో పాతరాతి యుగం నుంచి క్రీ.శ.2వ శతాబ్ధం వరకు వర్ధిల్లిన నాగరికత బయల్పడింది ?
1) అమరావతి
2) వీరాపురం
3) గచ్చిబౌలి
4) మౌలాలి
- View Answer
- సమాధానం: 2
43. దిగువ ప్రాచీన శిలాయుగ మానవుడికి సంబంధించినది ?
i) కుండల తయారీ
ii) దేశ దిమ్మరి
iii) నిప్పు తెలుసు
iv) ఆహారం కోసం ప్రకృతి మీద ఆధారపడేవాడు
1) i,iv
2) ii,iii
3) ii,iv
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
44. నైవాసియన్ సంస్కృతికి సంబంధించి సరికానిది ?
i) ఇది మధ్య ప్రాచీన శిలాయుగ (Middle palaeolithic) సంస్కృతికి చెందింది
ii) 1954-55లో మహారాష్ట్రలోని నెవాసా గ్రామంలో H.D. సంకాలియా మధ్య ప్రాచీన శిలాయుగ పరికరాలు కనుగొన్నాడు.
iii) ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, కడప, చిత్తూరు, గిద్దలూరుల్లో మధ్యప్రాచీన శిలాయుగ పనిముట్లు లభ్యమయ్యాయి.
1) ii
2) i,ii
3) iii
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
45. మధ్యప్రాచీన శిలాయుగ కాలంలో రాయి మూలం నుంచి పెచ్చులను (flakes) వూడదీసి వాటితో ఏఏ పరికరాలు తయారుచేసేవారు ?
i) గోకుడు రాళ్ళు
ii) సూచికలు
iii) ఛిద్రకాలు
iv) చిన్న చేతి గొడ్డళ్ళు
1) i,iv
2) ii,iii
3) i,iii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
46.మధ్యప్రాచీన శిలాయుగ పరికరాలను తయారుచేయడానికి వాడిన ముడి రాళ్ళ రకాలు ఏవి ?
i) క్వార్ట్
ii) క్వార్ట్జైట్
iii) అగేట్
iv) జాస్పర్
1) i,iv
2) i,iii
3) i,ii,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
47. తూర్పుకనుమల్లోని లోతు స్థలాల్లోను, పీఠభూమి స్థలాల్లోను, గోదావరి లోయలో మధ్య ప్రాచీన శిలాయుగ పనిముట్లకు వాడిన ముడిపదార్థం ?
1) క్వార్ట్జైట్
2) చెర్ట్
3) జాస్పర్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
48. విశాఖపట్నం తీరంలోని మధ్యప్రాచీన శిలాయుగ పనిముట్లకి వాడని పదార్ధం ?
i) చెర్ట్ ii) జాస్పర్ iii) చాల్సెడొని iv) క్వార్ట్జైట్
1) i,iv
2) ii,iii,iv
3) పైవన్నీ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
49.అలుగులు (drils), ఆల్స్ (awls), బోరర్లు (borers), పెచ్చులు (flakes) లాంటి పరికరాలు కింది సంస్కృతికి చెందినవి ?
1) మధ్యశిలాయుగం
2) మధ్య ప్రాచీన శిలాయుగం
3) నవీన శిలాయుగం
4) రాగి- రాతి యుగం
- View Answer
- సమాధానం: 2
50. పెచ్చుల పరిశ్రమ అనే మాట కింది వాటిలో దేనికి వర్తిస్తుంది ?
i) పూర్వ ప్రాచీన శిలాయుగం
ii) మధ్య శిలాయుగం
iii) నవీన శిలాయుగం
iv) మధ్య ప్రాచీన శిలాయుగం
1) i,ii
2) iv
3) i,ii,iii
4)ii,iii
- View Answer
- సమాధానం: 2
51. జతపరచండి.
పురావస్తు శాస్త్రవేత్త
a) ఐజాక్
b) మూర్తి
c) రాజు
d) జాకబ్ జయరాజ్
మధ్యప్రాచీన శిలాయుగ ప్రాంతం పరిశోధన
i) తిరుపతి లోయ
ii) గుంజాన లోయ
iii) రేణిగుంట-రాళ్ళ కాలువ లోయ
iv) గుండ్లకమ్మ లోయ
1) a-i,b-ii,c-iii,d-iv
2) a-iv,b-iii,c-ii,d-i
3) a-iv,b-iii,c-i,d-ii
4) a-i,b-ii,c-iv,c-iii
- View Answer
- సమాధానం: 2
52.నిశ్చిత వాక్యం (A): ఆది మానవుడు ఎద్దులను మచ్చిక చేసుకోవడం లేక వేటాడేవాడు.
హేతువు (R): కృష్ణానది ఎడమ ఒడ్డున మహబూబ్ నగర్ (తెలంగాణ) జిల్లా యాపలదేవి పాడులో మొదటిసారిగా ఎద్దు అస్తిపంజర అవశేషాలు మధ్యప్రాచీన శిలాయుగం పనిముట్లతో దొరికాయి.
1) (A),(R)లు సరైనవి. (R)(A)కి సరైన వివరణ
2) (A)సరైనది. (R) సరికానిది
3) (A) సరికానిది. (R) సరైనది
4) (A),(R) సరైనవి. (R)(A)కి సరైన వివరణ కాదు
- View Answer
- సమాధానం: 1
53. మధ్య పాచీన శిలాయుగ సంస్కృతిలోని పనిముట్ల తయారీకి వాడిన పద్ధతులేవి?
i) రాతి సుత్తి పద్ధతి
ii) గోళాకార సుత్తి పద్ధతి
iii) లెవలోషియన్ (మౌస్టీరియన్) పద్ధతి
iv)దాగలి పద్ధతి
1) i,iv
2) i,ii,iii
3) i,iii,iv
4) ii,iii
- View Answer
- సమాధానం: 2
54. అమెరికన్ బాస్టిస్ట్ మిషన్ తాలూకు ఫ్రాంక్పి.మాన్లే పెన్నా నది పరీవాహ ప్రాంతంలో పాతశిలాయుగపు ఏఏ దశలకు చెందిన పనిముట్లను సేకరించారు ?
1) పాత శిలాయుగ ప్రధమ దశ
2) పాత శిలాయుగ తృతీయ దశ
3) పాత శిలాయుగ ద్వితీయ దశ
4) 1,3
- View Answer
- సమాధానం: 4
55. మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతి ఆవాసాలకు సంబంధించి సరైనది ?
i) ఎగువ ప్రాంత పీఠభూములు
ii) దిగువ ప్రాంత మైదానాలు
iii) తీరస్థ పర్యావరణ వ్యవస్థలు
1) i
2) ii
3) i,iii
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
56.మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతి ఆవాసాలు ఎక్కువగా ఎక్కడ కేంద్రీకృతమయ్యాయి?
1) దక్షిణ తూర్పు కనుమల పర్వత పాధ పీఠాలు
2) నదీ తీరాల పర్యావరణ వ్యవస్థ
3) ఉత్తరాంధ్ర తీరస్థ ప్రాంతాలు
4) 1,2
- View Answer
- సమాధానం: 4
57. జతపరచండి.
మధ్య ప్రాచీన శిలాయుగ స్థలం
a) జగ్గయ్యపేట b) జింకలమిట్ట c) లంకెలపాలెం d) ఆద్పూర్
నది
i) స్వర్ణముఖి లోయ
ii) కృష్ణాలోయ
iii) చెయ్యేరు నది
iv) శారద నది
1) a-i,b-ii,c-iii,d-iv
2) a-ii,b-i,c-iv,d-iii
3) a-iii,b-iv,c-i,d-ii
4) a-iv,b-iii,c-ii,d-i
- View Answer
- సమాధానం: 2
58. మధ్యప్రాచీన శిలాయుగ స్థలాలను గుర్తించండి?
i) భీముని కొలను- ఆత్మకూరు
ii) బ్రహ్మంగారి మఠం- కడప
iii) చిల్లాకూర్- కాళహస్తి
iv) తిరుమలగిరి- జగ్గయ్యపేట
1) i.ii
2) iii,iv
3) i,ii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
59. మధ్య ప్రాచీన రాతియుగానికి చెందిన గుఱ్ఱం, పంది, ఎద్దు, జింక, గేదె, తాబేళ్ళ శిలాజాలు కరీంనగర్ (తెలంగాణ)లోని కాజిపల్లిలో బయటపడ్డాయి. వీటివల్ల తెలిసేది ?
1) మధ్య పాత రాతియుగ కాలం నాటి పర్యావరణ పరిస్థితులు
2) ఆంధ్రరాష్ట్రానికి ఉత్తరాన మానవ ఉనికి
3) మానవ స్థిరీకృత జీవనం
4)1,2
- View Answer
- సమాధానం: 4
60. కింది వ్యాఖ్యలలో సరైనది ?
i) ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మధ్య పాతరాతి యుగ పనిముట్లకు వాడే ముడి పదార్థాలు ఒకే రకానికి చెందినవి.
ii) భారత్‌లోని మధ్య పాత రాతియుగ పనిముట్ల ముడి పదార్థంకు, ఆంధ్రలోని పనిముట్ల ముడిపదార్థాలకు తేడా ఉంది.
1) i
2) ii
3) i,ii
4) రెండూ సరైనవికావు
- View Answer
- సమాధానం: 2