Skip to main content

TSPSC Group 3 Jobs 2023 : టీఎస్ గ్రూప్‌-3 పోస్టులు పెంపు.. మొత్తం ఎన్ని పోస్టులు పెరిగాయంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం గ్రూప్ 3 పోస్టుల సంఖ్య‌ను పెంచింది. ఈ మేర‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.
TSPSC Group 3 Jobs increased telugu
TSPSC Group 3 Jobs

ఈ అద‌న‌పు పోస్టుల‌ను పెంచ‌డంతో.. ఈ ఉద్యోగాల సంఖ్య 1,375కి చేరింది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు పెంచారు. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలోని 26 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను మంజూరు చేసినట్లు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

➤☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 3 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

దీంతో తాజాగా పెంచిన 12 పోస్టులతో కలిపి ఆ పోస్టులు 38కి చేరాయి. ఇప్పటికే విడుదలైన గ్రూప్‌ 3 నోటిఫికేషన్‌లో 1,363 లను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్‌ కమిషన్ (TSPSC) తెలిపింది. జనవరి 23న ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చింది. 

తప్పనిసరిగా..
డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు దారుల వయసు తప్పనిసరిగా జులై 1, 2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసుండాలి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు గడువు తేదీ వరకు వేచి ఉండకుండా త్వరపడి దరఖాస్తు చేసుకోవల్సిందిగా కమిషన్‌ ఈ సందర్భంగా తెలిపింది.

TSPSC గ్రూప్‌–2 పరీక్ష 600 మార్కులకు కుదింపు... పరీక్షా విధానం ఇదే!

ప‌రీక్షా విధానం :
మొత్తం 3 పేపర్లు ఉండగా పేపర్-1 లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్-2 లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్ మెంట్ ఉన్నాయి. ఈ మూడు పేపర్లకు 450 మార్కులు ఉండనున్నాయి. ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉండే ఈ పరీక్షను జులై లేదా ఆగస్టు నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అయితే, ఈ పరీక్ష కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహిస్తారా లేదా ఆఫ్‌లైన్‌లోనా అనేది అధికారులు స్పష్టం చేయలేదు.

పేపర్‌ సబ్జెక్ట్‌  ప్రశ్నలు సమయం (గంటలు) మార్కులు
1 జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌ 150 2 1/2 150
2 హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ                        
  1. సోషియో కల్చరల్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
  2. ఓవర్‌వ్యూ ఆఫ్‌ ది ఇండియన్‌ కానిస్టిట్యూషన్‌  అండ్‌ పాలిటిక్స్‌
  3. సోషల్‌ స్ట్రక్చర్‌. ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌
150 2 1/2 150
3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌                        
  1. ఇండియన్‌  ఎకానమీ ఇష్యూస్‌ అండ్‌ ఛాలెంజెస్‌
  2. ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ తెలంగాణ
  3. ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌
150 2 1/2 150

(ఈ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్, హిందీలో నిర్వహిస్తారు)

 

పేపర్-1 (మార్కులు 150)

జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ :
➤ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు
➤ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
➤ జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశ విజయాలు
➤ పర్యావర ణ సమస్యలు, విపత్తు నిర్వహణ - నివారణ, తీవత్రను తగ్గించే వ్యూహాలు
➤ ప్రపంచ భూగోళశాస్త్రం, భారతదేశ భూగోళశాస్త్రం, తెలంగాణ భూగోళ శాస్త్రం
➤ భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
➤ తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
➤ తెలంగాణ రాష్ట్ర విధానాలు
➤ సామాజిక వెనుకబాటు, హక్కులకు సంబంధించిన అంశాలు, సమీకృత విధానాలు
➤ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
➤ బేసిక్ ఇంగ్లిష్ (8వ తరగతి స్థాయి)

పేపర్-2 (మార్కులు 150) :
చరిత్ర, పాలిటీ, సమాజం : 

History


☛ తెలంగాణ సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు
☛ శాతవాహనులు; ఇక్ష్వాకులు; విష్ణుకుండినులు; ముదిగొండ, వేములవాడ చాళుక్యులు, వారి సాంస్కృతిక సేవ; సాంఘిక వ్యవస్థ; మత పరిస్థితులు; పురాతన తెలంగాణలో బుద్ధిజం, జైనిజం; భాషా, సాహిత్యాభివృద్ధి, కళలు, వాస్తు విజ్ఞానం,కాకతీయ రాజ్య స్థాపన, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి వారి సేవ; కాకతీయుల పాలనా కాలంలో తెలుగు భాషా, సాహిత్యాభివృద్ధి, కళలు, వాస్తు విజ్ఞానం, సృజనాత్మక కళలు; రాచకొండ, దేవరకొండ వెలమలు - సాంఘిక, మత పరిస్థితులు; తెలుగు భాషా, సాహిత్యాభివృద్ధి, కాకతీయులకు వ్యతిరేకంగా నిరసనోద్యమాలు: సమ్మక్క-సారక్క నిరసన; కుతుబ్‌షాహీల సామాజిక, సాంస్కృతిక సేవ, భాష, సాహిత్యం, వాస్తుశాస్త్రం, పండగలు, నాట్యం, సంగీతం, కళల అభివృద్ధి; మిశ్రమ సంస్కృతి ఆవిర్భావం.
☛ అసఫ్‌జాహీ రాజవంశం; నిజాం-బ్రిటిష్ సంబంధాలు: సాలార్‌జంగ్ సంస్కరణలు, వాటి ప్రభావం; నిజాంల పాలనాకాలంలో సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులు: విద్యా సంస్కరణలు, ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన, ఉన్నత విద్య; ఉపాధి వృద్ధి, మధ్య తరగతి వృద్ధి.
☛ తెలంగాణ - సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పునర్జీవనం; ఆర్య సమాజ్, ఆంధ్ర మహాసభల పాత్ర; ఆంధ్రసారస్వత పరిషత్, అక్షరాస్యత, గ్రంథాలయ ఉద్యమాలు, ఆది-హిందూ ఉద్యమం, ఆంధ్ర మహిళా సభ, మహిళా ఉద్యమ ప్రగతి; గిరిజనోద్యమాలు, రామ్‌జీ గోండ్, కొమురం భీమ్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం; కారణాలు, పరిణామాలు.
☛ ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందం; ముల్కీ ఉద్యమం (1952 -56); ప్రత్యేక రక్షణల ఉల్లంఘన, ప్రాంతీయ అసమానత, తెలంగాణ ఉనికి ప్రకటన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళన (1969-70)-వివక్షకు వ్యతిరేకంగా బలపడిన నిరసన, తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ఉద్యమాలు (1971- 2014).

భారత రాజ్యాంగం, రాజకీయాలు - పరిశీలన : 

indian constitution


✦ భారత రాజ్యాంగం - పరిణామ క్రమం, స్వభావం, ఉన్నత లక్షణాలు, ప్రవేశిక
✦ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు
భారత సమాఖ్య వ్యవస్థ ప్రధాన లక్షణాలు, కేంద్రం, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలనాపరమైన అధికారాల విభజన.
✦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు - రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి - అధికారాలు, విధులు.
✦ 73వ, 74వ రాజ్యాంగ సవరణలు - గ్రామీణ, పట్టణ పరిపాలన
✦ ఎన్నికల విధానం: స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు, అక్రమాలు, ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీలు.
✦ భారత దేశంలో న్యాయ వ్యవస్థ - న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
✦ ఎ) షెడ్యూల్డ్ కులాలు, తరగతులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలకు ప్రత్యేక రక్షణలు
బి) సంక్షేమం అమలు విధానం - షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్,    ✦షెడ్యూల్డ్ తరగతుల జాతీయ కమిషన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్.

భారత రాజ్యాంగం: నూతన సవాళ్లు : 
➤ సామాజిక నిర్మాణం, సమస్యలు, ప్రభుత్వ విధానాలు
భారత దేశ సామాజిక నిర్మాణం: భారతీయ సమాజం ప్రధాన లక్షణాలు: కులం, కుటుంబం, పెళ్లి, బంధుత్వం, మతం, తెగ, మహిళ, మధ్య తరగతి; తెలంగాణ సమాజం సామాజిక, సాంస్కృతిక లక్షణాలు.
➤ సామాజిక సమస్యలు: అసమానత్వం, బహిష్కరణ: కులతత్వం, కమ్యూనలిజం, ప్రాంతీయతత్వం, మహిళలపై హింసాత్మకత, బాలకార్మిక వ్యవస్థ, మనుషుల అక్రమ రవాణా, వైకల్యం, వృద్ధాప్యం.
➤ సామాజిక ఉద్యమాలు: రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళితుల ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు.
➤ తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక సమస్యలు: వెట్టి, జోగినీ, దేవదాసి వ్యవస్థలు, బాలకార్మిక వ్యవస్థ, బాలికా సమస్యలు (గర్ల్ చైల్డ్), ఫ్లోరోసిస్, వలసలు, రైతులు, నేత కార్మికుల బాధలు.
➤ సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు: ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, వికలాంగులు, పిల్లలకు సంబంధించి ప్రత్యేక విధానాలు; సంక్షేమ కార్యక్రమాలు: ఉపాధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు; గ్రామీణ, పట్టణ, మహిళా, పిల్లల సంక్షేమం, గిరిజన సంక్షేమం.

పేపర్-3 (మార్కులు 150) :

ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి :

 భారత ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, సవాళ్లు : 

indian financial growth


▶ ప్రగతి, అభివృద్ధి: భావనలు, పరస్పర సంబంధం.
▶ ఆర్థికాభివృద్ధి గణన: జాతీయాదాయం, నిర్వచనం, జాతీయాదాయ గణనకు సంబంధించిన భావనలు, పద్ధతులు, నామమాత్ర, వాస్తవ ఆదాయం.
▶ పేదరికం, నిరుద్యోగం: పేదరికం భావనలు - ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయ రహిత పేదరికం, పేదరికాన్ని గణించే విధానం, నిరుద్యోగం- నిర్వచనం, నిరుద్యోగం రకాలు.
▶ భారత ఆర్థిక ప్రణాళిక: పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, ప్రాధాన్యాలు, వ్యూహాలు, విజయాలు, 12వ పంచవర్ష ప్రణాళిక; సమ్మిళిత వృద్ధి, నీతి ఆయోగ్.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1954-2014)లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, దుర్వినియోగం ▶ నీళ్లు (బచావత్ కమిటీ), నిధులు (లలిత్, భార్గవ, వాంచూ కమిటీలు), ఉపాధి కల్పన (జై భారత్ కమిటీ, గిర్‌గ్లాన్ కమిటీ).
▶ తెలంగాణలో భూ సంస్కరణలు: మధ్యవర్తిత్వ విధానాల నిర్మూలన - జమీందారీ, జాగిర్దారీ, ఇనాందారీ, టెనాన్సీ విధానాలు, భూ పరిమితి, షెడ్యూల్డ్ ఏరియాల్లో ల్యాండ్ ఎలియేషన్.
▶ వ్యవసాయం, సంబంధిత రంగాలు: జీఎస్‌డీపీలో వ్యవసాయం, సంబంధిత రంగాల పాత్ర, భూ పంపిణీ, వ్యవసాయంపై ఆధారం, నీటి పారుదల, జల వనరులు, మెట్ట భూముల్లో సాగు ఇబ్బందులు.
▶ పారిశ్రామిక, సేవా రంగాలు: పారిశ్రామిక అభివృద్ధి; పారిశ్రామిక ప్రగతి, నిర్మాణం - చిన్న, సూక్ష్మ తరహా, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ); పారిశ్రామిక అవస్థాపనా సౌకర్యాలు; తెలంగాణ పారిశ్రామిక విధానం, సేవా రంగం నిర్మాణం, ప్రగతి.

అభివృద్ధికి సంబంధించిన సవాళ్లు, పరిణామాలు : 
☛ అభివృద్ధిలో గతిశీలత: భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు, సాంఘిక అసమానతలు - కులం, తెగ, లింగ, మత ప్రాతిపదిక అసమానతలు; వలసలు, పట్టణీకరణ.
☛ అభివృద్ధి, స్థానచలనం: భూసేకరణ విధానం; పునరుద్ధరణ, పునరావాసం
☛ ఆర్థిక సంస్కరణలు: ప్రగతి, పేదరికం, అసమానతలు-సాంఘిక అభివృద్ధి (విద్య, ఆరోగ్యం), సామాజిక రూపాంతరత, సాంఘిక భద్రత.
☛ సుస్థిర అభివృద్ధి: భావనలు, గణన, లక్ష్యాలు.

☛ TSPSC Group 3 Jobs : 1375 గ్రూప్ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే .. సిల‌బ‌స్ ఇదే.. జీతం ఎంతంటే..?

Published date : 20 Feb 2023 05:49PM

Photo Stories