Skip to main content

TSPSC Group 2 Exams Problems : తెలంగాణ‌లో జ‌న‌వ‌రిలో గ్రూప్‌-2 ప‌రీక్ష‌ జ‌రుగుతుందా..? లేదా..? మ‌ళ్లీ రీ నోటిఫికేష‌న్ ఇస్తారా..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : గ‌త బీఆర్ఎస్‌ ప్ర‌భుత్వంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ 1, 2, 3, 4 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చి.. ఒక ఉద్యోగం కూడా భ‌ర్తీ చేయ‌లేదు. అయితే గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన గ్రూప్స్ ఉద్యోగాల‌ భ‌ర్తీ ప్ర‌క్రియ కొన‌సాగుతుందా.. లేదా..? కొత్త‌గా మ‌ళ్లీ నోటిఫికేష‌న్ ఇస్తారా.. అనే అయోమ‌యంలో అభ్య‌ర్థులు ఉన్నారు.
tspsc group 2 jobs news telugu

గ్రూప్స్ 1, 2, 3, 4 ప్రస్తుతం వివిధ దశలలో ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ప్రభుత్వం మారిపోవడంతో వీటి పరిస్థితి ఎలా ఉంటుందో అభ్య‌ర్థుల‌కు అర్ధం కావ‌డం లేదు. ఈ విష‌యంపై అభ్య‌ర్థుల‌కు త్వ‌ర‌లోనే ఒక స్ప‌ష్ట‌మైన క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం గ్రూప్‌-2 ప‌రీక్ష జరుగుతుందా? లేదా ..?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-2 రాతపరీక్ష షెడ్యూలు ప్రకారం జరుగుతుందా? లేదా మరోసారి వాయిదా వేస్తారెమో.. అనే విషయమై నిరుద్యోగుల్లో అనుమానం నెలకొంది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన 5.51 లక్షల మంది కమిషన్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. 

చ‌ద‌వండి: TSPSC Group 2&3 Preparation Tips: లక్షల సంఖ్యలో దరఖాస్తులు ... రెండు పరీక్షలకు ఉమ్మడి వ్యూహంతోనే సక్సెస్‌

ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్‌-2 పరీక్షను 2024-జనవరిలో నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాచరణ మొదలుపెట్టింది. గ్రూప్‌-2లో 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 

2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్‌..
తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్‌ షెడ్యూలు జారీ చేసింది. వరుసగా గ్రూప్‌-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది. అయితే నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్‌ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది. 

TS New Government Jobs Notifications 2024 : తెలంగాణ కొత్త ప్ర‌భుత్వంలో కొత్త ఉద్యోగాలు నోటిఫికేష‌న్ల తేదీలు ఇవే.. మ‌రి పాత నోటిఫికేష‌న్ల సంగ‌తి ఏమిటి..?

గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణపై..
ప్రస్తుతం కమిషన్‌ గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించేందుకు పరిపాలన పరమైన ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రాలు గుర్తించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2తో పాటు ఇతర నియామక పరీక్షల తాజా పరిస్థితిపై ఇప్పటికే వివరాలు తీసుకున్న ప్రభుత్వం త్వరలో సమీక్ష నిర్వహించనుంది. ఈ సమీక్షలో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

తెలంగాణ‌లో 2024 ఫిబ్రవరి 1వ‌ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు.. అలాగే ఏప్రిల్ 1వ తేదీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు.. జూన్ 1వ‌ తేదీన గ్రూప్ 3& 4 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుద‌ల చేస్తామ‌ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలిపిన విష‌యం తెల్సిందే. అలాగే మొద‌టి సంవ‌త్స‌రంలోనే 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా నియామకాలు ఉంటాయని మేనిఫెస్టోలో వెల్ల‌డిచింది. ఇంకా పోలీసు, మెడిక‌ల్‌, ఇంజ‌నీరింగ్‌, ఉపాధ్యాయ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని తెలిపింది.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 11 Dec 2023 09:06PM

Photo Stories