Skip to main content

APPSC Group 1 Mains Results 2023 Link : ఏపీపీఎస్సీ గ్రూపు-1 ఫలితాలు విడుదల.. మొత్తం ఎంత మంది పాస్ అయ్య‌రంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (APPSC) నిర్వ‌హించిన‌ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుద‌ల చేశారు.
APPSC Group 1 Mains Results 2023 News Telugu
APPSC Group 1 Mains Results 2023

మొత్తం 111 గ్రూపు-1 ఉద్యోగాల‌కుగాను 259 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్ కోటా నుంచి ఎంపికయ్యారు. APPSC గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్ష జరిగిన కేవలం 34 రోజులలోనే ఫలితాలు విడుదల చేసింది. జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు మొత్తం 5035 మంది హాజరు కాగా.. వీరిలో 259 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు.

గ్రూప్-1 ఇంటర్వ్యూ తేదీలు ఇవే..
ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఏపీపీఎస్సీ  ప్రతిష్టాత్మంకంగా నిర్వహించిన గ్రూపు-1 పరీక్షలు ఎటువంటి అక్రమాలకు, అవినీతికి తావివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తూ  నిర్వహించారు. మూల్యాంకన స్క్రూటినీ కార్యక్రమాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరిగింది. ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూలను నిర్వహించి సెప్టెంబర్‌ నాటికి అభ్యర్థుల నియామకాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది కమిషన్‌. ముందుగా నిర్ణయించినట్టుగానే క్యాలెండర్ ప్రకారం సకాలంలోనే నియామకాలు జరుగుతాయని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

Published date : 14 Jul 2023 03:46PM

Photo Stories