Skip to main content

2018 Group-1 Result: గ్రూప్‌-1 ఫలితాలు విడుద‌ల‌.. వచ్చే నెలలోనే గ్రూప్‌-2 నోటిఫికేషన్‌

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్(APPSC) 2018 గ్రూప్‌-1 ఫలితాలను ప్రకటించింది.
APPSC Group 1 Results
APPSC Group 1 Results

ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్ జూలై 5వ తేదీన (మంగళవారం) సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం లక్షా నలభై వేల మంది పరీక్షలు రాయగా. స్క్రీనింగ్‌ టెస్ట్‌కి యాభై వేల మందికి పైగా హాజరయ్యారు. 167 గ్రూప్‌-1 పోస్టులకు గాను 325 మంది ఇంటర్వ్యూలకి హాజరయ్యారు. కరోనాతో పాటు న్యాయపరమైన అంశాల వల్ల ఫలితాలు ప్రకటించడం ఆలస్యమైందని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

Success Story: ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా.. 

ఫస్ట్‌ ర్యాంక్ ఈమెకే.. :
ఈ గ్రూప్‌-1 ఫలితాల్లో.. పిఠాపురం ప్రాంతానికి చెందిన సుష్మితకు ఫస్ట్‌ ర్యాంక్‌ దక్కింది. వైఎస్సార్‌ జిల్లా కొత్తులగుట్టకు చెందిన శ్రీనివాసులుకు రెండో ర్యాంక్‌, హైదరాబాద్‌కు చెందిన సంజన సిన్హాకు మూడో ర్యాంక్‌ దక్కింది. మొదటి పది స్ధానాలలో ఏడుగురు మహిళలు ఉండడం గమనార్హం. 2018 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో 167 పోస్టులకుగానూ..  30 పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డిఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు జూలై 12వ తేదీలోపు బోర్డు ముందు హాజరై.. హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారాయన.

Inspirational Story: గ్రూప్‌–1 ఉద్యోగానికి సెలక్ట్ అయ్య‌నిలా..

త్వ‌ర‌లోనే 13 నోటిఫికేషన్లు..
వచ్చే నెలలోనే గ్రూప్‌-2 నోటిఫికేషన్లు ఉంటాయని, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు ఉంటాయని, మరో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

Published date : 05 Jul 2022 06:59PM
PDF

Photo Stories