Skip to main content

గ్రూప్‌ 1 - మెయిన్స్‌ 2011- పేపర్‌ 4 - సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (తెలుగు మీడియం)Question Paper

2011
PAPER IV (తెలుగు అనువాదము)
Time : 3 Hours Max. Marks: 150
 
సూచనలు:
అభ్యర్థి 15 ప్రశ్నలకు సమాధానము వ్రాయాలి. ఒక్కొక్క విభాగం నుండి 5 ప్రశ్నలు వ్రాయాలి.
ప్రతి ప్రశ్నకు 10 మార్కులు.
    భాగము - I
      1. 5 సైన్స్‌ టెక్నాలజీ పై మన జాతీయ విధానాన్ని వివరించుము.
      2. 5 ఒక సరైన ఉదాహరణతో భారత దేశంలో సాంకేతిక మిషన్‌ పాత్ర చర్చించండి?
      OR
    1. క్రింది వాటిని గురించి వ్రాయుము
      1. 5 మేథోసంపత్తి హక్కులు
      2. 5 సాంకేతిక మిషన్‌ పై జాతీయ విధానము.
      1. 5 చంద్రయాన కార్యక్రమము గురించి వ్రాయండి
      2. 5 IRS-5 ఉపగ్రహ రెండు ప్రధాన లక్షణాలు వర్ణించండి.
      OR
    1. ఈ క్రింది వాటిలో ప్రణాళికలపైన భారత దేశ అంతరిక్ష కార్యక్రమము పాత్ర.
      1. 6 గ్రామీణ భారతదేశం
      2. 4 సహజ వనరులు
    1. 10 భారత ఆర్థిక వృద్ధిలో కంప్యూటర్‌ పరిశ్రమ వృద్ధి ఎలా దోహదపడుతుంది? వ్రాయండి
      OR
    2. క్రింది వాటి గురించి వ్రాయండి
      1. 5 కమ్యూనికేషన్స్‌, రిమోట్‌ సెన్సింగ్‌.
      2. 5 భారత గ్రామీణ ప్రాంతాలపై భారత సమాచార సాంకేతిక ప్రభావం.
      1. 6 బొగ్గు ఆధారిత విద్యుత్పత్తి కేంద్రాలను స్థాపించడానికి గల ప్రజా ప్రతిఘటన పై మీ అభిప్రాయాలను వివరించండి.
      2. 4 భారతదేశంలో పునరుత్పాదక వనరులను తక్కువ ఉపయోగించడము పై గల కారణాలను వివరించండి.
      OR
    1. ఈ క్రింది వాటిలో పై చర్చించండి
      1. 4 భారత దేశ పవన శక్తి
      2. 3 భారత దేశ బయోమాస్‌ నిర్వహణ
      3. 3 సముద్ర శక్తి
    1. క్రింది వాటి గురించి వ్రాయండి
      1. 5 భారత దేశ విపత్తు నిర్వహణ కార్యక్రమము
      2. 5 గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావాన్ని తగ్గించుటకు తీసుకోవలసిన చర్యలు.
      OR
    2. 10పట్టణీకరణతో కలిగే సమస్యలను, వాటిని అరికట్టే మార్గాలను, విధానాల గురించి వ్రాయండి.

    భాగము - II
    1. భారత దేశంలో గల వ్యవసాయ పరిశోధన, దాని సంబంధ ప్రయోజనాల గురించి చర్చించండి. వ్యవసాయ శాఖ పశుపాలన, మత్స్య పాలన (చేపల పెంపక) పరిశ్రమలలో శోధ కార్యాలు, విద్యా కార్యకలాపాలను వర్ణించండి.
      OR
    2. ఇన్సులిన్‌ ఉత్పత్తి విధానమును ఉదాహరణగా తీసుకొని త క్కువ పరిమాణం ఎక్కువ విలువ కల్గిన ఉత్పత్తుల విధానమును విశదీకరించండి.
    1. వివిధ రంగాలలో మొక్కల ఉపయోగములను ఉదాహరణతో చర్చించండి.
      OR
      1. అడవి జంతువులు, మచ్చిక చేసుకున్న జంతువుల మధ్య తేడాలను వివరించండి.
      2. వైద్య శాస్త్ర పరిశోధనల్లో జంతువులను స్వార్థానికి ఉపయోగించడం గురించి వివరించండి.
    1. జన్యు మార్పిడి పంటల గురించి సంక్షిప్తంగా వ్రాయండి. జన్యుమార్పిడి పంటల విడుదలకు సంబంధించిన నిబంధనలు, ఆందోళనకర విషయాలను గురించి వ్రాయండి.
      OR
    2. జీవ ఎరువులు (బయోఫెర్‌టిలైజర్స్‌) అనగానేమి?ఈ ఎరువుల ఉత్పత్తిలో గల సాంకేతిక విధానము వాటి ఉపయోగముల గురించి వ్రాయుము.
    1. హెచ్‌ .ఐ.వి. (Human Immunodeficiency Virus) వైరస్‌ వలన కలుగు వ్యాధి లక్షణాలు, వ్యాధి సోకకుండా ఉండుటకు నివారణ చర్యలు, రోగ నిర్ధారణ పరీక్షల గురించి వ్రాయుము.
      OR
    2. మలేరియా(చలిజ్వరం) దేని వలన కలుగును? మలేరియా వ్యాధికారక సూక్ష్మ క్రిమి జీవిత చక్రం, దోమలలోను, మనుషులలోను ఎలా అభివృద్ధి చెందుతుంది. మలేరియా నివారణకు తీసుకొనవలసిన చర్యలను గురించి వ్రాయండి.
    1. రోగ నిరోధక శక్తి అనగానేమి? టీకా మందుల వాడకం వలన రోగ నిరోధ క శక్తి పెంపొందిం చుకునే భావన గురించి చర్చించండి(Concept of vaccination). ఒ.పి.టి. టీకా ఎలా తయారు చేస్తారు?
      OR
    2. టీకా అనగా నేమి? సాంప్రదాయక టీకాల తయారీ నుంచి మొదలుకొని ఆధునిక టీకాల (రికాంబినెంట్‌ వాక్సీన్‌లు) ఉత్పత్తి విధానాలలో చోటు చేసుకున్న మార్పులను వివరింపుము.
    భాగము - III
    1. భారతదేశంలో వాతావరణ పరిరక్షణ విషయంలో ప్రజలలో చైతన్య కలిగించి, వారిని విద్యావంతులను చేయటానికి తీసుకొనవలసిన చర్యలను మీ సొంత మాటలలో వివరించండి.
      OR
    2. నీటి చట్టము (Water Act), నీటి కలుషిత శుంకము చట్టము (Water Pollution Cess Act Act)ల లోని విశిష్ట అంశాలను గురించి వ్రాయండి.
    1. భారత దేశంలోని ఖనిజవనరులను గురించి వివరించండి. ఖనిజ వనరుల వినియోగం, త్రవ్వకాల ప్రభావం పర్యావరణపై ఎలాంటిదో వివరించండి.
      OR
    2. అనుసంధానిత నీటి సంపద వినియోగము, నిర్వహణా గురించి వ్రాయండి నీటి వినియోగదారుల సమాఖ్య మండలి ప్రభావాన్ని వివరించండి.
    1. ప్రకృతి పరిణామ ప్రక్రియపై సహజంగాను, మానవ ప్రేరితంగాను కలిగే వినాశనాలను వ్రాయండి. ఒక్కొక్కదానికి ఉదాహరణలివ్వండి.
      OR
    2. సహజ ఎంపిక (Natural Selection) అనే మాటకు అర్థము ఏమిటి? మీరు ప్రముఖ వినియోగదారుడుగా (consumer) కలిగియున్న ఆహార హారాన్ని గీయండి.
    1. పట్టణ పరిపాలన విధానాన్ని వివరించండి. పురపాలక మండలి నుండి వచ్చే ఘనవ్యర్థాలను వాటి విర్వహణలో ప్రజాసంఘాల పాత్రను పేర్కొనండి.
      OR
    2. సముద్ర జల వనరుల కలుషితములకు గల కారణములను, వాటి ప్రభావము, వాటి నివారణ పద్ధతులను గురించి చర్చించండి.
    1. ‘వాతావరణ మార్పు’పై జాతీయ ప్రణాళిక, దాని నిర్దేశిత సిఫార్సులను, దాని ఆచరణ సూచనలను గురించి చర్చించండి.
      OR
    2. బంజరు భూమి(waste land)ని పునరుద్ధకర/ ఉపయోగయోగ్యంగా మార్చడానికి అవలంభించవలసిన పద్దతులను, వ్యూహాలపై చర్చించండి.
Published date : 01 Oct 2011 08:01PM

Photo Stories