Skip to main content

గ్రూప్‌ 1 - మెయిన్స్‌ 2011 - పేపర్‌ 5 - Mental Ability (తెలుగు మీడియం)Question Paper

2011
PAPER V (తెలుగు అనువాదము)
Time : 3 Hours Max. Marks: 150
 
సూచనలు:
 1. అభ్యర్థి 15 ప్రశ్నలకు సమాధానము వ్రాయాలి ఒక్కొక్క విభాగం నుండి 5 ప్రశ్నలు వ్రాయాలి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు.
 2. ప్రతి ప్రశ్నలోను గణన విధానమును విశదీకరింపుము.
 3. ప్రొగ్రాము చేయ్యలేని గణనయంత్రములను (క్యాలకూలేటర్‌) పరీక్షలో అనుమతించెదరు.

  భాగము - I
  1. 6 సంఖ్యల అంకమధ్యమం 20. ఒక వేళ మనం ఈ సంఖ్యల నుంచి ఒక సంఖ్యను తీసివేస్తే వాటి అంకమధ్యమం 15. తీసివేసిన సంఖ్య ఏది?
   OR
  2. ఒక క్రికెటర్‌ తానాడిన కొన్ని ఇన్నింగ్‌‌సల సరాసరి స్కోరు 15. ఒక ఇన్నింగ్‌‌సలో సున్నాకే అవుటవడంతో అతడి సరాసరి 13.5 కు తగ్గింది. ఈ ఇన్నింగ్‌‌సతో కలుపుకొని అతను మొత్తం ఎన్ని ఇన్నింగ్‌‌స ఆడి ఉంటాడు?
  1. ఎ, బి, సి అనే ముగ్గురు విద్యార్థుల సగటు మార్కులు 48. డి అనే మరో విద్యార్థి చేరికతో వారి మొత్తం సగటు 44 అయింది. డి కన్నా 3 మార్కులు అధికంగా ఉన్న ఇ అనే మరో విద్యార్థి చేరికతో బి, సి, డి, ఇ విద్యార్థుల సగటు 43 అయింది. పరీక్షలో విద్యార్థి ఎ కు వచ్చిన మార్కులు ఎన్ని?
   OR
  2. ఒక లారీలో 5 కంటెయినర్‌లో ఉన్నాయి. మొదటి కంటెయినర్‌ బరువు 150 కి.గ్రా., మొదటి కంటెయినర్‌ బరువు కంటే 20% తక్కువ బరువున్న మూడో కంటెయినర్‌ బరువు కన్నా రెండో కంటెయినర్‌ బరువు 30% ఎక్కువ. మొదటి, మూడో కంటెయినర్‌ సరాసరి బరువుకు సమానంగా నాలుగో కంటెయినర్‌ బరువు ఉంది. 5వ కంటెయినర్‌ బరువు 2వ, 4వ కంటెయినర్‌ల సరాసరి బరువుకు సమానం 4 తక్కువ బరువులో ఉన్న, 4 ఎక్కువ బరువులో ఉన్న కంటెయినర్‌ సగటు కనుక్కోండి.
  1. ప్రతి సంఖ్య మిగిలిన రెండు సంఖ్యల సగటుకు కలిపినప్పుడు ఫలితం 65, 69, 76 వచ్చే విధంగా మూడు వివిధ సంఖ్యలను ఎందుకొన్నారు. అయితే ఆ మూడు అసలు సంఖ్యలు సగటు ఎంత?
   OR
  2. దేవేందర్‌ 28 బాస్కెట్‌బాల్‌ గేమ్‌లలో 252 పాయింట్లు సాధించాడు. దేవేందర్‌ కంటే 10 గేములు తక్కువ ఆడిన రామన్‌ స్కోరింగ్‌ సగ టు దేవేందర్‌ స్కోరింగ్‌ సగటు కంటే 0.5 పాయింట్లు తక్కువ. మొత్తం రామన్‌ చేసిన పాయింట్ల స్కోరు ఎంత?
  1. X, Y స్టేషన్ల మధ్య దూరాన్ని పాసింజర్‌ ట్రెయిన్‌, గూడ్సు ట్రెయిన్‌ కంటే 50 నిమిషాలు ముందుగా అధిగమిస్తుంది. పాసింజర్‌ ట్రెయిను సగటు వేగం 60 కి.మీ./గం., గూడ్సు ట్రెయిను వేగం 20 కి.మి./గం. అయినట్లయితే రెండు స్టేషన్ల మధ్య దూరం కనుక్కోండి
   OR
  2. జిమ్‌ తన ప్రయాణంలో మొదటి మూడు గంటలు 60 మైళ్ళు/గం. చొప్పున, మిగిలిన 5 గంటలు 24 మైళ్ళు/గం. చొప్పున ప్రయాణించాడు అయితే జిమ్‌ ప్రయాణించిన సగటు వేగం గంటకు ఎన్ని మైళ్ళు?
  1. X, Y, Z మూడు గణితం తరగతులు ఆల్జిబ్రా పరీక్ష నిర్వహించాయి. తరగతి X సగటు స్కోరు 83, తరగతి Y సగటు స్కోరు 76, Zసగటు 85. X, Y, తరగతి విద్యార్థులు కలిపి మొత్తం సగటు స్కోరు 79. Y, Z తరగతుల మొత్తం సగటు 81. కాగా అన్ని తరగతుల సగటు స్కోరు ఎంత?
   OR
  2. ఒక కార్మికుడికి వరసగా 15 రోజుల పనికి సగటు కూలి రోజుకు రూ.90 లు. మొదటి 7 రోజుల సగటు కూలి రోజుకు రూ. 87 లుగా, చివరి 7 రోజుల సగటు కూలి రోజుకు రూ. 92 లుగా ఉంది. అతడి 8వ దిన రోజు కూలి ఎంత?

  భాగము - II
  1. A + B అంటే A, B యొక్క తల్లి; A - B అంటే A, B; యొక్క సోదరుడు; A ÷ B అంటే A, B యొక్క తండ్రి, A × B అంటే A, B యొక్క సోదరి. Q యొక్క మేన మామ P అని ఎలా కోడ్‌గా నిర్ణయించవచ్చు?
   OR
  2. B5D అంటే D యొక్క తండ్రి B
   B9D అంటే D యొక్క సోదరి B
   B4D అంటే D యొక్క సోదరుడు B
   B3D అంటే D యొక్క భార్య B
   ‘K యొక్క తల్లి F‘ ను ఎలా వ్యక్తీకరించవచ్చు ?
  1. క్రింద ఇచ్చన రేఖాపటాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి:
   కొన్ని సంవత్సరాలుగా మూడు కంపెనీల ఎగుమతిలు (రూ. కోట్లలో)

   1. క్రింద ఇచ్చిన ఏ సంవత్సరాల జంటలకు మొత్తం మూడు కంపెనీల ఎగుమతులు సమానం?
   2. Y కంపెనీకి ఇచ్చిన కాలంలో సగటు వార్షిక ఎగుమతులు సుమారుగా Z కంపెనీ వార్షిక సగటు ఎగుమతులకు ఎంత శాతం?
   3. X, Y కంపెనీల సగటు వార్షిక ఎగుమతుల్లో ఏ సంవత్సరములో కనిష్ఠం?
   4. 1993 సంవత్సరంలో మూడు కంపెనీల వార్షిక ఎగుమతులు, 1998 లోని వార్షిక సగటు ఎగుమతుల మధ్య తేడా ఎంత?
   5. ఇచ్చిన ఎన్ని సంవత్సరాల్లో కంపెనీ Z వార్షిక సగటు ఎగుమతులు, మూడు కంపెనీల వార్షిక సగటు ఎగుమతుల కంటే ఎక్కువ?
   OR
  2. క్రింద ఇచ్చిన రేఖా చిత్రం, ఒక కంపెనీ 1995 నుంచి 2001 వరకు ఒక కంపెనీ మొత్తం ఎగుమతులు, ఆ కంపెనీ మొత్తం దిగుమతుల మధ్య నిష్పత్తిని తెలుపుతుంది.
   కొన్ని సంవత్సరాల్లో ఒక కంపెనీ మొత్తం ఎగుమతులు, ఆ కంపెనీ మొత్తం దిగుమతుల మధ్య నిష్పత్తి

   1. 1998లో దిగుమతులు Rs. 250 కోట్లు, 1998, 1999 లో కలిపి మొత్తం ఎగుమతులు Rs. 500 కోట్లు అయితే, 1999 లో దిగుమతులు?
   2. ఏ సంవత్సరంలో కంపెనీ దిగుమతులు, ఎగుమతులతో పోల్చినప్పుడు కనిష్ఠంగా ఉన్నాయి?
   3. 1997 నుంచి 1998 వరకు దిగుమతుల పెరుగుదల శాతం ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇచ్చిన దత్తాంశం సరిపోతుందా? లేకపోతే ఎందుకు?
   4. 1996 లో కంపెనీ దిగుమతులు Rs. 272 కోట్లు అయితే, అదే సంత్సరంలో కంపెనీ ఎగుమతులు?
   5. ఇచ్చిన ఎన్ని సంవత్సరాల్లో దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువ?
  1. క్రింది పట్టికను అధ్యయనం చేసి, దాని ఆధారంగా ఇచ్చన ప్రశ్నలకు సమాధానాలు రాయండి:
   కొన్ని సంవత్సరాల్లో ఒక కంపెనీ వార్షిక వ్యమాలు (Rs. లక్షల్లో)

   సంవత్సరం వ్యయం అంశం పన్నులు
   జీతాలు ఇంధనం, రవాణా బోనస్ ఋణాలపై వడ్డీ
   1998 288 98 3 23.4 83
   1999 342 112 2.52 32.5 108
   2000 324 101 3.84 41.6 74
   2001 336 133 3.68 36.4 88
   2002 420 142 3.96 49.4 98

   1. ఈ కాలంలో కంపెనీ చెల్లించ వలసిన సగటు వార్షిక రజ్జే ఎంత?
   2. ఇచ్చిన కాలంలో ఓ కంపెనీ చెల్చించిన మొత్తం బోనస్‌, ఈ కాలంలో చెల్లించిన జీతాల మొత్తంలో ఎంత శాతం?
   3. ఈ అన్ని అంశాలపై 1998 లో చేసిన వ్యయం, 2002లో చేసిన మొత్తం వ్యయంలో ఎంత శాతం?
   4. 2000 లో ఈ అంశాలపై కంపెనీ చేసిన మొత్తం వ్యయం ఎంత?
   5. పన్నులపై చేసిన మొత్తం వ్యయం, ఇంధనం రవణాకు అన్ని సంవత్సరాల్లో చేసిన మొత్తం వ్యయం మధ్య నిష్పత్తి?
   .
   OR
  2. క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి:
   కొన్ని సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల నుంచి పోటి పరీక్షకు హాజరైన, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య

   రాజ్యం వ్యయం అంశం
   1997 1998 1999 2000 2001
   హాజరు అర్హులు హాజరు అర్హులు హాజరు అర్హులు హాజరు అర్హులు హాజరు అర్హులు
   M 5200 720 8500 980 7400 850 6800 775 9500 1125
   N 7500 840 9200 1050 8450 920 9200 980 8800 1020
   P 6400 780 8800 1020 7800 890 8750 1010 9750 1250
   Q 8100 980 9500 1240 8700 980 9700 1200 8950 995
   R 7800 870 7600 940 9800 1350 7600 945 7990 885

   1. 1997 లో అన్ని రాష్ట్రాల నుంచి అర్హత సాధించిన మొత్తం అభ్యర్థులు సుమారుగా, 1998 లో అన్ని రాష్ట్రాల నుంచి అర్హత సాధించిన మొత్తం అభ్యర్థుల్లో ఎంత శాతం?
   2. ఈ సంవత్సరాలలో Q రాష్ర్టం నుంచి హాజరైన అభ్యర్థుల సగటు ఎంత?
   3. ఇచ్చన ఏ సంవత్సరంలో P రాష్ర్టం నుంచి హాజరైన అభ్యర్థుల శాతం గరిష్ఠం?
   4. N రాష్ర్టం నుంచి అన్ని సంవత్సరాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మొత్తం, హాజరైన మొత్తం అభ్యర్థుల్లో ఎంత శాతం?
   5. 1999 లో అన్ని 5 రాష్ట్రాల నుంచి మొత్తం హాజరైన వారిలో మొత్తం అర్హత సాధించిన వారి శాతం?
  1. 2000, 2001 వరస సంలో ఒక ప్రచురణ కంపెనీకి సంబంధించిన 6 శాఖల ద్వారా జరిగిన అమ్మకాలు (వేలల్లో) క్రింది బార్‌ పటంలో చూడవచ్చుః
   ఒక ప్రచురణ కంపెనీ 2000, 2001 సంలో 6 శాఖల ద్వారా పుస్తకాల అమ్మకాలు (వేలల్లో) B1, B2, B3 B4, B5, B6   1. రెండు సంవత్సరాలకు B4 శాఖ మొత్తం అమ్మకాలు, B2 శాఖ మొత్తం అమ్మకాల నిష్పత్తి ఎంత?
   2. ఏ సంవ త్సరాల్లో B6 శాఖ మొత్తం అమ్మకాలు, B3 శాఖ మొత్తం అమ్మకాల్లో ఎంత శాతం?
   3. 2001 లో B1, B2, B3, శాఖల సగటు అమ్మకాల్లో, 2000 సంత్సరంలో B1, B3, B6, శాఖల సగటు అమ్మకాలు ఎంత శాతం?
   4. 2000 సంవత్సరానికి అన్ని శాఖల సగటు అమ్మకాలు (వేలల్లో) ఎంత?
   5. రెండు సంవత్సరాలకు కలిపి B1, B3, B5, శాఖల మొత్తం అమ్మకాలు (వేలల్లో)?
   OR
  2. కొన్ని సంవత్సరాలుగా X, Y, Z అనే కంపెనీల ద్వారా ఉత్పత్తి అయిన పేపరుకు సంబంధించిన దత్తాంశం (లక్షల టన్నుల్లో) క్రింది బార్‌ చిత్రంలో చూడవచ్చు:
   కొన్ని సంవత్సరాలుగా X, Y, Z అనే కంపెనీలు ఉత్పత్తి చేసిన పేపరు (లక్షల టన్నుల్లో)   1. Y కంపెనీకి క్రింద పేర్కొన్న సంవత్సరాల్లో ఏ సంవత్సరానికి, గత సంవత్సరం కంటే ఉత్పత్తిలో పెరుగుదల/తుగ్గదల శాతం గరిష్ఠంగా ఉంది?
   2. 1998 - 2000 కాలానికి కంపెనీ X సగటు ఉత్పత్తి, అదే కాలానికి కంపెనీ Y సగటు ఉత్పత్తుల నిష్పత్తి ఎంత?
   3. 5 సంవత్సరాల్లో ఏ కంపెనీకి సగటు ఉత్పత్తి గరిష్ఠంగా ఉంది?
   4. ఏ సంవత్సరంలో కంపెనీ Y ఉత్పత్తి శాతం, కంపెనీ Z ఉత్పత్తి శాతానికి గరిష్ఠం?
   5. 1996 నుంచి 1999 వరకు కంపెనీ Y ఉత్పత్తిలో పెరుగుదల శాతం ఎంత ?
  1. ఒక పుస్తకం ప్రచురణకు చేసిన వ్యయాల వివరాలు శాతాలు క్రింది పై-పటం (Pie-chart)తెలుపుతుంది పై-పటాన్ని అధ్యయనం చేసి దాని ఆధారంగా ప్రశ ్నలకు జవాబులు రాయండి:
   ఒక పుస్తకం ప్రచురణకు చేసిన వివిధ వ్యయాల (శాతాలలో)   1. కొంత పరిమాణంలో ఉన్న పుస్తకాలకు ముద్రాపకుడు Rs. 30,600 లు ముద్రణ ఖర్చుగా చెల్లించ వలసివస్తే. ఈ పుస్తకాలకు ఎంతమొత్తం రాయల్టీ చెల్లించవలసి ఉంటుంది.
   2. రాయల్టీపైన చేసిన ఖర్చుకు అనుగుణమైన పెక్టర్‌ కేంద్ర కోణం ఏమిటి?
   3. ఉత్పత్తి వ్యయం కంటే 20% పైన పుస్తకం ధరను నిర్ణయించారు. పుస్తకం నిర్ణయ ధర Rs. 180 లు అయినట్లయితే ఒక పుస్తకం ముద్రించడానికి అయిన పేపరు ఖర్చు ఎంత?
   4. 5500 ప్రతులు ముద్రించ, రవాణాకు Rs. 82,500 ఖర్చు చేసినట్లయితే ముద్రాపకుడికి 25% లాభం వచ్చేవిధంగా అమ్మకం ధర ఎంత ఉండాలి?
   5. ముద్రణ ఖర్చు కంటే పుస్తంకం పై రాయల్టీ ఎంత తక్కువ?
   OR
  2. క్రింది పై-పటం (Pie-chart) ఒక పట్టణంలోని ఏడు వివిధ విద్యాలయాల్లో ఉన్న గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌-గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల వివరాలను తెలుపుతుంది.
   ఏడు వివిధ విద్యాలయాల్లో ఉన్న గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌-గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల వివరాలను తెలుపుతుంది.

   1. R విద్యా సంస్థలో మొత్తం గ్రాడ్యుయేట్‌, పోస్ట-గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల సంఖ్య ఎంత?
   2. S విద్యా సంస్థలో వరుసగా గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌-గ్రాడ్యుయేట్‌ స్థాయిలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య నిష్పత్తి ఎంత?
   3. M, S విద్యా సంస్థలో గ్రాడ్యుయేట్‌, స్థాయిలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత?
   4. Q విద్యా సంస్థలో చదువుతున్న గ్రాడ్యుయేట్‌ స్థాయి విద్యార్థుల సంఖ్యకు, S విద్యా సంస్థలో చదువుతున్న పోస్ట్‌-గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల సంఖ్య గల నిష్పత్తి ఎంత?
   5. N, P విద్యా సంస్థలో చదువుతున్న మొత్తం పోస్ట్‌-గ్రాడ్యుయేట్‌ స్థాయి విద్యార్థుల సంఖ్య ఎంత?
  భాగము - III
  1. ఈ శ్రేణిలో తరువాత వచ్చే సంఖ్య ఏది?
   2, 1, (1/2), (1/4),_______
  2. ఈ శ్రేణిలో తరువాత వచ్చే సంఖ్య ఏది?
   7, 10, 8, 11, 9, 12, ______
  3. ఈ శ్రేణిలో తరువాత వచ్చే సంఖ్యల జత ఏది?
   42, 40, 38, 35, 33, 31, 28, _______
  4. ఈ శ్రేణిలో ఉన్న ఖాళీని ఏ సంఖ్యతో పూరించవచ్చు?
   F2, ____, D8, C16, B32
  5. ఈ శ్రేణిని చూసి అందులోని ఖాళీలను ఏ సంఖ్యలతో పూరించవచ్చు?
   V, VIII, XI, XIV,_______ , XX.
  OR
  1. ఈ శ్రేణిలో తరువాత వచ్చే సంఖ్యల జత ఏది?
   8, 12, 9, 13,10, 14, 11,_____, ___
  2. ఈ శ్రేణిలో ఖాళీని పూరించండి:
   SCD, TEF, UGH,______, WKL
  3. ఓడోమిటర్‌ - మైలేజి : కంపాస్‌ - ?
  4. మారథాన్‌ - పరుగు పందెం: హైబర్‌నేషన్‌ - ?
  5. కిటికీ - కిటికీ అద్దం: పుస్తకం - ?
  1. KEDGY ని EKDYG గా కోడ్ చేస్తే LIGHT ని ఏ విధంగా కోడ్ చేయాలి ?
  2. RAVE ని SXWB గా కోడ్ చేస్తే SCAW ని ఏ విధంగా కోడ్ చేయాలి ?
  3. PURSER ని UPSRRE గా కోడ్ చేస్తే PERIODIC ని ఏ విధంగా కోడ్ చేయాలి ?
  4. STRAY ని TUSBZ గా కోడ్ చేస్తే MOURN ని ఏ విధంగా కోడ్ చేయాలి ?
  5. BINARY ని DHPZTK గా కోడ్ చేస్తే KIDNAP ని ఏ విధంగా కోడ్ చేయాలి ?
  OR
  1. RASCAL ని QZRBZK గా కోడ్ చేస్తే SOLDER ని ఏ విధంగా కోడ్ చేయాలి ?
  2. MAPLE ని VOKZN గా కోడ్ చేస్తే CAMEL ని ఏ విధంగా కోడ్ చేయాలి ?
  3. 126, 32, 81, 24, 18, 45, 69 దీనిలో భిన్న సంఖ్య ఏది ?
  4. 46080, 3840, 384, 48, 24, 2, 1 దీనిలో భిన్న సంఖ్య ఏది ?
  5. 5, 16, 6, 16, 7, 16, 9 దీనిలో భిన్న సంఖ్య ఏది ?
  1. 1957వ సంవత్సరం మే 23వ తేదీన ఏ వారమో కనుకోండి.
  2. 1987వ సంవత్సరం డిసెంబర్‌ 22వ తేదీన ఏ వారమో కనుకోండి.
  3. ఖచ్చితమైన సమయాన్ని చూపించే గడియారం ఉదయం 8 గంటల సమయాన్ని చూపిస్తూ ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయం కావడానికి గంటల ముల్లు ఎన్ని డిగ్రీలు తిరగాలి.
  OR
  1. 10.25 సమయం వద్ద గడియారంలోని ముల్లుల మధ్య ఉన్న ప్రతిబింబ కోణం ఎంత?
  2. A, B, R, X, S, Z లు ఒక అడ్డు వరసలో కూర్చుని ఉన్నారు. S, Z లు మధ్యలో కూర్చుని ఉన్నారు. A, P, లు చివర్లలో ఉన్నరా. A కి ఎడమవైపు R ఖ ఉన్నాడు. P కి కుడి వైపు ఎవరు ఉన్నారు?
  3. A, B, C, D, E లు ఒక బల్ల మీద కూర్చుని ఉన్నారు. B ప్రక్కన A, D ప్రక్కన C లు కూర్చుని ఉన్నారు. ఎడమవైపు చివరికి E కూర్చొని ఉన్నాడు. E ప్రక్కన D కూర్చోలేదు. కుడి వైపు నుంచి రెండవ స్థానంలో C కూర్చొన్నాడు. B కి కుడివైపు A ఉన్నాడు. E, A, C లు పక్క పక్కన కుర్చున్నారు. A ఏ స్థానంలో కూర్చున్నాడు?
  1. ‘‘ఫలితాలు సాధించడం, పెంచిమార్కులను చేరడం, విజయాలను సాదించడమే వ్యాపారాలు, సంస్థల్లోని నాయకత్వపు నిజమైన ద్యేయం.’’ పై వ్యాఖ్యానం పట్లను అంగీకారం లేదా అనంగీకారం తెలుపుతూ చర్చించండి. మీ స్వంత అనుభవాలు విద్య పరిశీలన, అధ్యయనం ఆధారంగా మీ అభిప్రాయాలను బలపరుస్తూ ఊదాహరణలు ఇవ్వండి.
   OR
  2. కళలు, విజ్ఞానశాస్త్రం, రాజనీతి, వ్యాపారం వాటి ఏవైనా క్షేత్రాల్లో ఎవరైనా ఉన్నతస్థితిని చేరు కొంటే ఆ సాధించిన కార్యాలు అతడి వ్యక్తిగత జీవితంలోని పొరపాట్లు కంటే ప్రాధాన్యమైనవి. చర్చించండి.
  1. ప్రకృతి లాతానం (మేలుకట్లు)/ప్రకృతి ఆచ్ఛాదనం:
   గత ఆదివారం నాన్న మేమందరం ఏదయినా క్యాంపుకు వెళ్దామని నిర్ణయించారు. క్యాంపింగ్‌ పైన ఆదివారము పత్రికలో నాన్న ఒక వ్యాసం చదివారు, అది ఎలా కుటుంబాలను ఒకే కప్పుకిందకు తెస్తుందనే విషయం ఆ ‘ప్రకృతి వితానం’ అనే వ్యాసంలో ఉంది. అంటే ‘‘అతిశయోక్తి’’, నేనన్నాను. టి.వి. కానోపీ లేదా రెస్టరెంట్‌ భోజన ం కానోపి సంగతేంటే? ‘‘ఇది చాలా మంచిది’’ నాన్న అన్నారు. కాఫీ టేబుల్‌ దగ్గర ఒక మేగజైన పేజీలు తిప్పడమే. ‘‘వచ్చేవారం చివరలో మన వెళ్దాం’’ నేను మా చిన్న తమ్ముడుపాల్‌ వైపు తీక్షణంగా చూసాను. వాడు కనుబొమ్మలు ఎగరేస్తు నావైపు చూశాడు, దానర ్థం ‘‘ఇదిమనం అనుకొన్నట్టుగా పూర్తిగా బయటికి వెళ్ళడం కాదేమో బహుశ. నేను చిరుమందహాసంతో ఇలా అన్నాను. కాని ఇది తప్పకుండా ఫన్‌ ఉండేది.’’ నాన్న నిర్ణయించిన తరవాత ఆలోచించడం ప్రారంభించాను. మనం చిన్న చోటు నడపడ ం నేర్చుకోవాలి మేం రెండు చిన్న చోట్లను అరువుతెచ్చుకొని వ్యాన్‌పైన వేసుకొని వర్జీనియాలో ఉన్న బరలేద్‌ ద గ్గరకు 3 గంటలు ప్రయాణించి చేరుకొన్నాం. అక్కడికి వెళ్ళిన తరవాత బోటునడిపే తెడ్లు మరిచిపోయామని తెలుసుకొన్నాం. నేను పాత్‌ ఒక బోటులో అమ్మ, నాన్న, ఇద్దరు చిన్న చెళ్ళెల్లు మరోకానోలో ఎక్కాం. గంటల తరబడి ఆ చెరువులో పనిలేకుండా తిరిగాం. లైఫ్‌ జాకెట్‌లు వేసుకొని అందరం నీటిలో దూకాం. కానోలను తిరిగి ఒడ్డును చేర్చాం. అది అద్భుతమైన ట్రిప్పు, నాన్న అన్నారు. - మనందరం ఎలా స్కేయింగ్‌ చేయాలో నేర్చుకోవాలి. అందరం చలిని ఇష్టపడం కాబట్టి ఆ వారాంతాన్ని చలి మంట వేసుకొని, వేడి కోకోవా తాగుతూ స్కైలాడి ్జలో బోర్‌‌డగేములు ఆడుకుంటూ గడిపాం. ఇది చాలా గొప్పగా ఉంది. చాలా త్రిల్లింగా ఉంది. నేను పగటి కలకంటూ ఉండగా అమ్మ అంది, ‘‘స్వీట్‌ హార్‌‌ట! మనకు టెంటు లేదు.’’ ‘‘మనకు అవసరం కూడాలేదు ! నాన్న సంతోషంగా అన్నరు.’’ మన అంది సీట్లు వ్యాన్‌ బయట గాలి పరుపులో వేసుకొందాం ! ఈ విహార యాత్ర ప్రాముఖ్యం తెలియదుకాని, అమ్మ, నాన్న, మేం నలుగురు పిల్లలం, ఒక నేషనల్‌ పార్కుకు వెళ్ళాం, మాకు సమయం చాలా బాగా గడిచింది.
   1. కథా సంగ్రహకుడు విహారయాత్రలో పంచలైన్‌ ఉందని ఎందుకు అని ఉండవచ్చు?
   2. ‘‘తరువాత లైఫ్‌ జాకెట్‌లు వేసుకొని అందరం నీటిలో దూకాం. బోట్లను ఒడ్డుకు తిరిగి నెట్టాం.’’ ఈ రెండు వాక్యాలను కలిపి వేరే విధంగా రాయండి.
   3. ‘‘పగటి కలలు’’ గురించి సాహిత్యంలో ఏ పదం బాగా వివరిస్తుంది.
   4. ఈ ప్యాసేజికి సరిపడే మరో మంచి పేరు సూచించండి.
   5. కథా సంగ్రహకుడి కుటుంబం దీని ద్వారా ఏం పాఠం నేర్చుకొందని తెలుస్తుంది?
   OR
  2. ఎలిజబెత్‌ తనగదిలో ఆలోచిస్తూకూర్చుంది. గతవారం సేగ్రూవ్‌ ఆకాడమిలో తనగురించి అబద్దపు ప్రచారం జరుగుతున్నప్పటి నుంచీ తను అక్కడే గదిలోనే ఉంటోంది. ఎలిజబెత్‌ సమాజంలో తిరిగేదికాదని కాదు. కాని తనమిత్రుల సిగ్గు మూలాన కథనాల మూలంగా తను ప్రత్యేకంగా ఉండాలనుకోంటోంది. అర్థరాత్రి పార్టీలు, అబ్బాయిలతో స్నేహం, తనకు నచ్చదు. ఆరోపణలు వచ్చినప్పటినుంచే తను సాధారణ పరిస్థితుల్లో కంటే కలిసిమెలిసి ఉంటుంది. విద్యా స్కాలర్‌షిప్‌, పరమైన సమగ్రత, వాగ్ధానాలకు గుర్తింపు తెచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బ్లూవెల్డ్‌ అవార్డు గెలుచుకొనే ఉద్దేశంలో, ఒక అనామక విద్యార్థి ఎలిజబెత్‌ ఈ సంవత ్సరం జరిగిన అనేక పరీక్షల్లో మోసంచేసిందని హెడ్‌ మాస్టరుకు ఫిర్యాదు చేశాడు. ఎలజబెత్‌ చాలా కాలంగా నేగ్రూవ్‌లో స్టెల్లోర్‌ విద్యార్థిని. ఆమెకు ప్రకృతి జ్ఞానం తక్కువ. ఇది నిజం కాని, తన తెలివితేటలు, పట్టుదల/దీక్షతో ఈ లోటును పూడ్చుకోగలిగింది. అయినప్పటికీ ఈ ఆరోపణలను కమిటికీ సిఫార్సు చేశారు. శుక్రవారం రోజు ఎలజబెత్‌ను బెల్లంగ్‌‌స గ్రాండ్‌ కార్యాలయానికి పిలిపించారు, ఈ మధ్య జరిగిన పరీక్షలకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. ఈ అనుభవం చాలా బాధాకరం. సేగ్రూవ్‌ ప్రతిష్ఠాకరమైన స్కూలు దీన్లో చేరే అధికశాతం విద్యార్థులు గొప్ప నేపథ్యం ఉన్నవారే. కాని ఎలిజబెత్‌ విషయంలో ఇది లేదు. ఆమె కుటుంబం పేదది. పూర్తి పురస్కారం (స్కాలర్‌షిప్‌)తో ఆమె సేగ్రూవ్‌లో చేరింది. బ్యూవెల్ట్‌ అవార్డు తన కాలేజి ఫీజు కట్టడంలో కుటుంబానికి ఎంతో సహాయపడింది. ఈ ఉద్దేశంలోనే ఎలిజబెత్‌ తన తెలివితేటలను స్టడీస్‌కు అనువర్తించింది. ఎలిజబెత్‌ తన మీదపడ్డ అపనిందను సరిదిద్దుకొనే ప్రయత్నంలో ఆరోపించినవాడి విషయం తేల్చాలనుకొంది మంచంమీద కూర్చొని, స్కూలు డెరైక్టరీని తెరిచి పేర్లను చూడసాగింది. సేగ్రూవ్‌ ఒక చిన్న రక్షిత ప్రాంతం. తన గ్రాడుయేట్‌ క్లాసులో 21 మంది విద్యార్థులు ఉన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తి త్వరలోనే బయటకొస్తాడనే విషయం తప్పదని ఎలజబెత్‌కు తెలుసు. అతి కొద్ది సమయంలో తేలిపోతుంది.
   1. ‘‘అయినప్పటికే, ఈ లోటును తన తెలివి తేటలు, పట్టుదలతో చాలా మటుకు పూడ్చగలిగింది.’’ ఈ వాక్యాన్ని వివరించండి?
   2. లారెల్టె అవార్డు ఆశించకపోయినప్పటికీ ఎలిజబెత్‌ పై మోసపూరితమైన ఆరోపణలు ఎందుకొచ్చాయి?
   3. చాలామంది సహచరుల కంటే ఎలిజబెత్‌ ఎలా భిన్నంగా ఉంటుంది?
   4. సేగ్రూవ్‌ అకాడమి ఎలాంటిదని పాఠకుడు అర్థం చేసుకొంటాడు?
   5. ఎలజబెత్‌ను మోసం చేసిందని ఆరోపించిన విద్యార్థి విషయంలో మీరు ఏమి తెలుసుకొన్నారు?
Published date : 05 Oct 2011 05:07PM

Photo Stories