Skip to main content

APPSC Group 1 Prelims Question Paper With Final Key 2023 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫైన‌ల్ 'కీ' ఇదే.. తొల‌గించిన ప్ర‌శ్న‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల‌తో పాటు.. ఫైన‌ల్ 'కీ' ని కూడా విడుద‌ల చేసింది. జనవరి 8వ తేదీన 111 పోస్టులకు గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెల్సిందే.
APPSC Group 1 Prelims Question Paper With  Final Key 2023 PDF Download
APPSC Group 1 Prelims 2023 Question Paper With Final Key

ప్రిలిమ్స్ పరీక్షలకు 87,718 మంది (82.38 శాతం) హాజరు కాగా, 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది ఏపీపీఎస్సీ. దాంతో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్షలో 6,455 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్షలో పేపర్‌–1లో ఒక ప్రశ్నను, పేపర్‌–2లో ఇంకో ప్రశ్నను ఏపీపీఎస్సీ తొలగించింది. దీంతో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావివ్వకుండా తప్పుగా ఉన్న రెండు ప్రశ్నలను ఏపీపీఎస్సీ తొలగించేసింది.

చ‌ద‌వండి: APPSC Group 1, 2 Preparation Tips : గ్రూప్‌–1, 2 పోస్టుల పూర్తి వివరాలు ఇవే.. గ్రూప్స్ కొట్టాలంటే.. ఇలా చ‌ద‌వాల్సిందే.. 

తొల‌గించిన ప్ర‌శ్న‌లు ఇవే..
పేపర్‌–1లో.... ఈ క్రింది వానిలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లక్షణము కానిది ఏది.?
పేపర్‌–2లో.... 2009 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ ఏ సంవత్సరానికి ఒకే విధంగా ఉంటుంది.?

APPSC Group 1 Prelims Paper-1 & 2  Question Paper With Final Key 2022 PDF :

Published date : 28 Jan 2023 05:51PM
PDF

Photo Stories