Skip to main content

APPSC Group-1 Mains Postponed : బ్రేకింగ్ న్యూస్‌.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా.. కార‌ణం ఇదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది.
appsc group 1 mains postponed telugu
appsc group 1 mains postponed

ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. 2022  సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను యూపీఎస్సీ సోమవారమే విడుదల చేసింది.

ఏపీపీఎస్సీ:  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

వీరి కోస‌మే.. వాయిదా..

upsc interivew news telugu


యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకి ఏపీ నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హాజరవుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూల కారణంగా గ్రూప్‌-1 మెయిన్స్‌ని జూన్‌లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకునే మెయిన్స్ వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ మెంబర్ సలాంబాబు పేర్కొన్నారు.

➤☛ APPSC Group 2 & 3 Jobs 2023 : ఇక‌పై గ్రూప్‌-2, 3 ఉద్యోగాల‌కు ఈ ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రిగా రాయాల్సిందే.. కొత్త నిబంధనలు ఇవే..

మెయిన్స్ ఇలా..

appsc group 1 mains details


➤☛ రెండో దశ మెయిన్‌ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఏడు పేపర్లలో నిర్వహిస్తారు. 
➤☛ ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం  3 గంటలు. 
➤☛ తెలుగు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్లను కేవలం అర్హత పేపర్లుగానే పరిగణిస్తారు. ➤☛ ఇందులో కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు 40 శాతం, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. అప్పుడే మెయిన్‌లోని మిగతా అయిదు పేపర్ల మూల్యాంకన చేస్తారు. 
➤☛ పేపర్‌-1లో జనరల్‌ ఎస్సే(ప్రాంతీయ,జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న సమకాలీన అంశాలు 150 మార్కులకు ఉంటుంది. 
➤☛ పేపర్‌-2 ఏపీ, భారత చరిత్ర, సంస్కృతి భౌగోళిక శాస్త్రంపై 150 మార్కులకు ఉంటుంది. 
➤☛ పేపర్‌-3 పాలిటీ, రాజ్యాంగం, పాలన, లా, ఎథిక్స్‌పై 150 మార్కులకు నిర్వహిస్తారు. 
➤☛ పేపర్‌-4 ఎకానమీ, భారత దేశ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి 150 మార్కులకు జరుగుతుంది. 
➤☛ పేపర్‌-5లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు 150 మార్కులకు ఉంటాయి. 
➤☛ ఇలా ఈ అయిదు పేపర్ల మొత్తం 750 మార్కులకు అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది దశ ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు.

Published date : 28 Mar 2023 04:16PM

Photo Stories