Skip to main content

APPSC Group 1 Exam: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో నిర్వహించే ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ ఆదేశించారు.
Armed arrangements for APPSC Group 1 Exams

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 17న గ్రూప్‌–1 పరీక్షలకు ఎస్వీ సెట్‌, సీతమ్స్‌, పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మూడు కేంద్రాలలో 2,518 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవనున్నట్టు చెప్పారు. పేపర్‌ 1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, పేపర్‌ 2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదన్నారు. పరీక్షల నిర్వహణకు లైజన్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించామన్నారు. అభ్యర్థులకు ఏవైనా సమస్యలున్నట్‌లైతే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9491077356కు సంప్రదించాలని తెలిపారు.
 

Published date : 15 Mar 2024 03:04PM

Photo Stories