యునైటెడ్ నేషన్ ఇంటరాజెన్సీ టాస్క్ ఫోర్స్ (UNIATF) అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది?
Sakshi Education
నాన్-కమ్యూనికేట్ వ్యాధుల సంబంధిత సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కేరళ యునైటెడ్ నేషన్ ఇంటరాజెన్సీ టాస్క్ ఫోర్స్ అవార్డును గెలుచుకుంది.
ఎన్‌సీడీల నివారణ, నియంత్రణ, మానసిక ఆరోగ్యం, విస్తృత ఎన్‌సీడీ సంబంధిత స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ)సాధించేందుకు 2019లో తీసుకున్న చర్యలకు ఈ అవార్డు వరించింది.
అదనంగా అత్యాధునిక ఊపిరితిత్తుల వ్యాధి నియంత్రణ కార్యక్రమం, క్యాన్సర్ చికిత్స కార్యక్రమం, పక్షవాతం నియంత్రణ కార్యక్రమాన్ని కూడా ఈ అవార్డు ఇవ్వడానికి పరిగణలోకి తీసుకున్నారు.
సాధారణంగా వచ్చే వ్యాధుల చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ప్రజారోగ్య కేంద్రాల నుంచి అన్ని స్థాయిలలోని ఆసుపత్రులకు సౌకర్యాలు ఏర్పాటు చేసింది.
ఈ వార్షిక పురస్కారానికి రాష్ట్రాన్ని ఐరాస పరిగణలోకి తీసుకోవడం ఇదే మొదటిసారి.
సంక్రమించని వ్యాధుల నివారణ, నియంత్రణపై ఈ సంవత్సరం యూఎన్ ఇంటరాజెన్సీ టాస్క్ ఫోర్స్ (UNIATF) అవార్డును ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రేయేసస్ ప్రకటించారు.

ఈ అవార్డులను నాలుగు విభాగాల్లో ఇస్తారు:
1.ప్రజల ఆర్యోగం గురించి పనిచేసే ప్రభుత్వ ఆరోగ్య సంస్థల మంత్రిత్వ శాఖలకు
2.ఆరోగ్యం గురించి కాకుండా ఇతర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు
3.యూఎన్‌లో ఉన్న దేశాలకు
4.ప్రభుత్వేతర సంస్థలు, విద్యా సంస్థలు, ఫౌండేషన్స్‌కి.
Published date : 23 Oct 2020 04:01PM