Skip to main content

తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్)

ఆసియాన్ వార్షిక సమావేశాల తర్వాత తొమ్మిదో తూర్పు ఆసియా సదస్సు (ఈస్ట్ ఏసియా సమ్మిట్) నవంబర్ 13న మయన్మార్ రాజధాని నేపిటాలో జరిగింది. 2005, డిసెంబర్‌లో నిర్వహించిన మొదటి సదస్సుకు మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఆతిథ్యమిచ్చింది. ఈ సదస్సులో 18 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. పది ఆసియాన్ దేశాలతోపాటు.. వాటి ఇరుగుపొరుగు దేశాలైన భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్‌ఏ, రష్యాలు కూడా సభ్యులుగా చేరాయి.

తొమ్మిదో తూర్పు ఆసియా సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ భారత్ గతంలో అనుసరించిన లుక్ ఈస్ట్ విధానాన్ని యాక్ట్ ఈస్ట్ విధానంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. లుక్ ఈస్ట్ విధానాన్ని మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ప్రవేశపెట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమని మోడీ పేర్కొన్నారు. మతం ముసుగులో ఉగ్రవాదానికి పాల్పడడాన్ని వ్యతిరేకించాలని ఆయన ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. తూర్పు ఆసియా సదస్సు ఇస్లామిక్ స్టేట్ అనే ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా ప్రకటన చేసింది.

తూర్పు ఆసియా సదస్సులోపాల్గొన్న దేశాధినేతలు/ప్రభుత్వాధినేతలు

బూనై సుల్తాన్

హసనల్ బోల్‌కియా

మయన్మార్ అధ్యక్షుడు

థేన్‌సేన్

కంబోడియా ప్రధాని

హున్‌సేన్

ఇండోనేషియా అధ్యక్షుడు

జోకో విడోడో

లావోస్ ప్రధాని

థాంగ్‌షింగ్ థమ్మవాంగ్

మలేషియా ప్రధాని

నజీబ్ రజాక్

ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు

బెనిగ్నో అక్వినో

సింగపూర్ ప్రధాని

లీ సీన్ లూంగ్

థాయ్‌లాండ్ ప్రధాని

ప్రయుత్ చాన్ వో చా

వియత్నాం ప్రధాని

గుయెన్ టాన్ డంగ్

ఆస్ట్రేలియా ప్రధాని

టోనీ అబాట్

న్యూజిలాండ్ ప్రధాని

జాన్ కీ

చైనా ప్రీమియర్

లీ కెకియాంగ్

జపాన్ ప్రధాని

షింజో అబే

దక్షిణ కొరియా అధ్యక్షురాలు

పార్‌‌క గేన్ హై

భారత్ ప్రధాని

నరేంద్ర మోడీ

రష్యా ప్రధాని

దిమిత్రి మెద్వదేవ్

అమెరికా అధ్యక్షుడు

బరాక్ ఒబామా

Published date : 22 Nov 2014 02:52PM

Photo Stories