Skip to main content

ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీని అభివృద్ధి చేసిన సంస్థ ఏది?

కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) -సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎమ్ఈఆర్‌ఐ) పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీని అభివృద్ధి చేసింది.

ఆ సోలార్ ట్రీ సామర్థ్యం 11.5 కిలోవాట్ల పీక్ (kWp)కి పైగా ఉంది. ఇది సంవ‌త్సరానికి 12,000-14,000 యూనిట్ల క్లీన్ అండ్ గ్రీన్ పవర్‌ని ఉత్పత్తి చేయ‌గ‌లుగుతుంది.

సోలార్ ట్రీ:

  • ప్రతి సోలార్ ఫోటో-వోల్టాయిక్ (పీవీ) ప్యానెల్‌కి సూర్యరశ్మి బాగా త‌గిలేలా ఈ సోలార్ ట్రీని ఏర్పాటు చేశారు. దీన్ని వ‌ల్ల కింద చాలా త‌క్కువ ప్రాంతం మాత్రయే నీడ ఏర్పడుతుంది.
  • ప్రతి ట్రీలో 330 డబ్ల్యుపీ సామర్థ్యం ఉన్న మొత్తం 35 సోలార్ పీవీ ప్యానెల్స్ ఉన్నాయి.
  • వీటిలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే సౌర పీవీ ప్యానెల్స్‌ను కలిగి ఉన్న హ్యాండ్స్‌ను అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేయవచ్చు. ఇంటిపై క‌ప్పుకు ఏర్పాటు చేసే సౌర ప‌ల‌క‌ల్లో ఈ సౌక‌ర్యం అందుబాటులో లేదు.
  • ఉత్పత్తి చేసిన ఏన‌ర్జీని, డేటాను రియ‌ల్ టైమ్‌లో లేదా రోజువారీగా పర్యవేక్షిస్తారు.
  • సోలార్ ట్రీ వ‌ల్ల హై కెపాసిటీ పంపులు, ఈ-ట్రాక్టర్లు, ఈ-పవర్ టిల్లర్స్ వంటి వాటిని వ్యవసాయ కార్యకలాపాలలో విస్తృతంగా వాడటానికి వీలు కలుగుతుంది.
  • శిలాజ ఇంధన-శక్తితో పోల్చినప్పుడు వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులుగా పిలిచే CO2 ఉద్గారాలు 10-12 టన్నుల వ‌ర‌కు సోలార్ ట్రీ విధానంలో త‌గ్గుతాయి. అందువ‌ల్ల వీటిని అస్థిర శిలాజ ఇంధనాలను ప్రత్యామ్నాయంగా వ్య‌వ‌సాయంలో ఉప‌యోగించొచ్చు.
  • ప్రతి సోలార్ ట్రీకి  రూ.7.5 లక్షలు ఖర్చవుతుంది. అలాగే ఆసక్తిగల ఎంఎస్‌ఎంఈలు రైతుల కోసం , పునరుత్పాదక ఇంధన ఆధారిత ఎనర్జీ గ్రిడ్ అభివృద్ధి కోసం తమ బిజినెస్ మోడల్‌ను ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సూరక్షైవేమ్ ఉత్తన్ మహాబియాన్ (పీఎం కుసుమ్) పథకంతో అనుంసంధానం చేసుకోవ‌చ్చు.
Published date : 19 Sep 2020 05:29PM

Photo Stories