నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)
Sakshi Education
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO).. 1949, ఏప్రిల్ 4న ఏర్పడింది. ఇది ఒక అంతర ప్రభుత్వ సైనిక కూటమి. ఉత్తర అట్లాంటిక్ ఒప్పందంపై ఏప్రిల్ 4, 1949లో సంతకాలు జరగడంతో ఈ సైనిక కూటమి తెరపైకి వచ్చింది.
ప్రధాన కార్యాలయం: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్
ప్రధాన ఉద్దేశం: సభ్యదేశాల భద్రత కోసం ఉమ్మడి రక్షణ వ్యవస్థ ఏర్పాటు
ప్రధాన కార్యదర్శి: జెన్స్ స్టోలెన్‌బర్గ్
స్థాపనకు కారణాలు
రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐరోపాలో శాంతికి సోవియట్ రష్యా ముప్పుగా మారింది. 1948 నాటి బెర్లిన్ దిగ్బంధం(పశ్చిమ హోదా దేశాల నుంచి బెర్లిన్‌కు రైలు రోడ్డు రవాణాను రష్యా అడ్డుకుంది. ఆ సమయంలో బెర్లిన్ పశ్చిమ ప్రాంతాలు రష్యా నియంత్రణలో ఉండేవి.), కొరియా యుద్ధం- 1950, తూర్పు ఐరోపా దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాల ఏర్పాటు తదితర ఘటనల నేపథ్యంలో... రష్యా బలవంతంగా పశ్చిమ ఐరోపాను కూడా తన అధీనంలోకి తెచ్చుకుంటుందనే ఆందోళన పశ్చిమ దేశాల్లో మొదలైంది. దాంతో రష్యాను దీటుగా ఎదుర్కొనేందుకు నాటోను ఏర్పాటుచేశారు.
సభ్యదేశాలు
నాటోలో మొత్తం 28 సభ్య దేశాలు ఉన్నాయి. బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్‌లాండ్, నార్వే, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, అమెరికా, ఇటలీ, యూకే (స్థాపక దేశాలు) జర్మనీ, టర్కీ, స్పెయిన్, గ్రీస్, పోలెండ్, హంగేరీ, చెక్ రిపబ్లిక్, లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియా, బల్గేరియా, రొమేనియా, స్లొవేకియా, అల్బేనియా, స్లొవేనియా, క్రోయేషియా

Published date : 24 Jun 2015 02:47PM