Skip to main content

మానవ హక్కుల దినోత్సవం

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 10న ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమీషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ... దేశవ్యాప్తంగా మహిళలపై పెరిగిపోతున్న నేర ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సమానహక్కులు అన్న సార్వత్రిక లక్ష్యం సఫలతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ‘ప్రపంచమంతా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆత్మశోధన చేసుకోవాలి’అని ఆయన అన్నారు. యూడీహెచ్‌ఆర్‌ను సమీక్షించి మానవ హక్కులను పునః నిర్వచించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, భారత్‌లో ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కో ఆర్డినేటర్ రెనెటా లోక్ డెస్సాలియన్ హాజరయ్యారు.
 
ప్రారంభం
ఐక్యరాజ్యసమితి 1948లో యూనివర్సల్‌ డిక్లరేషన్ ఆఫ్‌ హ్యూమన్ రైట్స్‌ (యూడీహెచ్‌ఆర్‌)ను ఆమోదించగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్‌ 10వ తేదీని మానవ హక్కుల దినంగా పాటిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంకోసం కోర్టులతోపాటు మానవ హక్కుల కమిషన్ లు ఏర్పాటుచేయబడ్డాయి.
కార్యక్రమాలు
  • 2008 డిసెంబరు 10న యూనివర్సల్‌ డిక్లరేషన్ ఆఫ్‌ హ్యూమన్ రైట్స్‌ 60వ వార్షికోత్సవం జరిగింది. యునైటెడ్‌ నేష‌న్స్ సెక్రటరీ జనరల్‌ ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్‌.ఆర్‌ రూపొందించిన డాక్యుమెంట్‌ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది.
  • 1998లో మాల్దావా ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ ది యూనివర్సల్‌ డిక్లరేషన్ ఆఫ్‌ హ్యూమన్ రైట్స్‌ అంటూ ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. తైవాన్ లో షియా మింగ్‌–టెహ్‌ 1979లో హ్యూమన్ రైట్స్‌ ప్రదర్శనలు నిర్వహించింది.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం
 ఎప్పుడు : డిసెంబర్ 10
 ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
 ఎక్కడ : న్యూఢిల్లీ

Published date : 12 Dec 2019 12:05PM

Photo Stories