Skip to main content

జీ-20 / గ్రూప్ ఆఫ్ 20

అనేది ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. 1999లో ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్‌ల వేదికగా ఇది ఏర్పడింది. 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత ఇది దేశాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది. ఈ వేదికలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు. జీ-20 లో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు సభ్యత్వం ఉంది.జీ-20 దేశాలు ప్రపంచలో మూడింట రెండింతల జనాభా కలిగి ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం వాటా ఈ దేశాలదే.
జీ-20 సదస్సు 2016 ముఖ్యాంశాలు..
జీ-20 11వ సదస్సు 2016 సెప్టెంబర్ 4, 5 తేదీల్లో చైనాలోని హాంగ్‌జూ నగరంలో జరిగింది. జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిచ్చిన రెండో ఆసియా దేశం చైనా. 2010 నవంబర్‌లో నిర్వహించిన జీ-20 సదస్సుకు మరో ఆసియా దేశం దక్షిణ కొరియా ఆతిథ్యమిచ్చింది.

ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ‘ఒక దక్షిణాసియా దేశం ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోంది’ అని పాకిస్తాన్‌ను పరోక్షంగా విమర్శించారు. వాతావరణాన్ని కాపాడుకోవాలని, ప్రజారోగ్యం ముఖ్యమైన విషయమని, ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందానికి ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు.

హాంగ్‌జూ సదస్సులో సభ్యదేశాల నాయకులతోపాటు ఈజిప్ట్, కజకిస్తాన్, లావోస్, సెనెగల్, స్పెయిన్, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల నేతలు కూడా అతిథులుగా పాల్గొన్నారు.

జీ-20 శిఖరాగ్ర సదస్సులు

క్రమ సంఖ్య

సంవత్సరం

ఆతిథ్య నగరం

దేశం

1.

2008 నవంబర్

వాషింగ్టన్ డి.సి.

అమెరికా

2.

2009 ఏప్రిల్

లండన్

యూకే

3.

2009 సెప్టెంబర్

పిట్స్‌బర్‌‌గ

అమెరికా

4.

2010 జూన్

టొరంటో

కెనడా

5.

2010 నవంబర్

సియోల్

దక్షిణ కొరియా

6.

2011 నవంబర్

కేన్‌‌స

ఫ్రాన్స్‌

7.

2012 జూన్

లాస్ కబోస్

మెక్సికో

8.

2013 సెప్టెంబర్

సెయింట్ పీటర్‌‌సబర్‌‌గ

రష్యా

9.

2014 నవంబర్

బ్రిస్బేన్

ఆస్ట్రేలియా

10.

2015 నవంబర్

అంతాల్యా

టర్కీ

11.

2016 సెప్టెంబర్

హాంగ్‌జూ

చైనా

12వ జీ-20 శిఖరాగ్ర సదస్సు 2017 జూలైలో జర్మనీలోని హాంబర్‌‌గ నగరంలో జరగనుంది.

జీ-20 11వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న నాయకులు

దేశం

పాల్గొన వ్యక్తి హోదా

పేరు

అర్జెంటీనా

అధ్యక్షుడు

మారీసియో మాక్రి

ఆస్ట్రేలియా

ప్రధానమంత్రి

మల్కమ్ టర్‌‌నబుల్

బ్రెజిల్

అధ్యక్షుడు

మిచెల్ టెమెర్

కెనడా

ప్రధానమంత్రి

జస్టిన్ ట్రుడో

చైనా

అధ్యక్షుడు

జీ జిన్ పింగ్

ఫ్రాన్‌‌స

అధ్యక్షుడు

ఫ్రాంకోయిస్ హోలాండ్

జర్మనీ

చాన్‌‌సలర్

ఎంజెలా మెర్కెల్

భారత్

ప్రధానమంత్రి

నరేంద్ర మోదీ

ఇండోనేషియా

అధ్యక్షుడు

జోకో విడోడో

ఇటలీ

ప్రధానమంత్రి

మాతియో రెంజీ

జపాన్

ప్రధానమంత్రి

షింజో అబే

మెక్సికో

అధ్యక్షుడు

ఎన్రిక్ పెనా నియతో

రష్యా

అధ్యక్షుడు

వ్లాదిమిర్ పుతిన్

సౌదీ అరేబియా

డిప్యూటీ క్రౌన్

ప్రిన్స్‌ మొహ మ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్

దక్షిణ కొరియా

అధ్యక్షురాలు

పార్‌‌క గెన్ హై

దక్షిణాఫ్రికా

అధ్యక్షుడు

జాకబ్ జుమా

టర్కీ

అధ్యక్షుడు

రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్

యునెటైడ్ కింగ్‌డమ్

ప్రధానమంత్రి

థెరిసా మే

యునెటైడ్ స్టేట్స్

అధ్యక్షుడు

బరాక్ ఒబామా

యూరోపియన్ కౌన్సిల్

ప్రెసిడెంట్

డొనాల్డ్ టస్క్

Published date : 04 Oct 2016 11:40AM

Photo Stories