Skip to main content

గూర్ఖా సైనికుల కోసం మూడు దేశాల మ‌ధ్య 1947 త్రైపాక్షిక ఒప్పందం

ఇటీవల, నేపాల్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ  "భారతదేశం, నేపాల్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య 1947 త్రైపాక్షిక ఒప్పందం (నేపాల్ గూర్ఖా సైనికుల సైనిక సేవల గురించి) పునరావృతమైందనిష అన్నారు. భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్‌తో ద్వైపాక్షికంగా మంచి సంబంధాలు నేర‌ప‌డానికి నేపాల్ ఇష్టపడుతుందని ఆయన తెలిపారు.

ప్రధానాంశాలు

త్రైపాక్షిక ఒప్పందం:

  • 1947 లో భారతదేశం స్వాతంత్య్ర‌మొచ్చిన త‌ర్వాత‌ గూర్ఖా రెజిమెంట్లను బ్రిటిష్, భారత సైన్యాల మధ్య విభజించాలని నిర్ణయించారు.
  • 19వ శతాబ్దం మొదటి త్రైమాసికం నుంచి, గూర్ఖాలు బ్రిటిష్ వారి క్రింద, మొదట ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో, తరువాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు.
  • గూర్ఖా యుద్ధం అని కూడా పిలువబడే ఆంగ్లో-నేపాలీ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట గూర్ఖాలను నియమించింది. 1816లో సుగౌలీ ఒప్పందంపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది.
  • బ్రిటీష్, భారతీయ ఆర్మీలో ప‌నిచేసే గూర్ఖాలకు సైతం బ్రిటీష్, భారతీయ పౌరుల మాదిరిగానే అన్ని సేవ‌లు, సౌక‌ర్యాలు అందుతాయ‌ని ఈ ఒప్పందం చెబుతోంది.
  • సేవల్లో అన్ని ప్రోత్సాహకాలు, వేతనం, సౌకర్యాలు, పెన్షన్ పథకాలు మొదలైనవి ఉన్నాయి.
  • గోర్ఖా నియామకం వ‌ల్ల నేపాలీ యువతకు విదేశాలకు వెళ్లడానికి త‌లుపు తెరుచుకున్నాయి.

పాల్గొన్న సమస్యలు:

  • భారత మిలటరీలో పనిచేస్తున్న గూర్ఖాలకు సంబంధించి నేపాల్ నుంచి వచ్చిన అభ్యంతరం, పిథోరగర్ జిల్లాలోని కలపాణి ప్రాంతంత త‌మ సొంత‌మ‌ని నేపాల్ చెప్పుకోవ‌డం వ‌ల్ల నేపాల్-ఇండియా మ‌ధ్య వివాదం మొద‌లైంది.
  • కలపాణి ప్రాంతంలోని వివాదాస్పద భూభాగాలను చేర్చిన కొత్త పటాన్ని విడుద‌ల చేయ‌డంపై నేపాల్ స్పందించింది.
  • లింపియాడోరా-కలపాణి-లిపులేఖ్ ప్రాంతంలో భారత రహదారి నిర్మాణానికి వ్యతిరేకంగా నేపాల్ నిర‌స‌న వ్యక్తం చేయ‌డంలో మ‌రో దేశం(చైనా) హ‌స్తం ఉంద‌ని భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
  •     ఈ విష‌య‌మై నేపాల్ సైన్యంలో గౌర‌వ‌ జనరల్ పదవిని పొందిన భారత ఆర్మీ చీఫ్, భారతదేశాన్ని రక్షించడానికి ప్రాణాలు అర్పించిన నేపాలీ గూర్ఖా ఆర్మీ సిబ్బంది మనోభావాలను దెబ్బతీశారని నేపాల్ ప్రజలు భావిస్తున్నారు.
  •     అలాగే, యునైటెడ్ కింగ్‌డమ్ వేతనం, పెన్షన్, ఇతర సౌకర్యాల విషయంలో తమపై వివక్ష చూపుతోందని గూర్ఖాగా ప‌ని చేసిన రిటైర్ అయిన‌వారు ఆరోపిస్తున్నారు.
  •     బ్రిటిష్ ప్రభుత్వం 2007 నుంచి గూర్ఖాలకు సమాన వేతనం, పెన్షన్ ఇస్తోంది.
Published date : 26 Aug 2020 04:09PM

Photo Stories