Skip to main content

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో భారతదేశం ర్యాంక్ ఏమిటి?

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020ను ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO) విడుదల చేసింది. టాప్ 50 వినూత్న దేశాల జాబితాలో భారత్ 48వ స్థానంలో ఉంది.

2019లో భార‌త్ 52వ స్థానంలో ఉంది. 

ప్రధానాంశాలు:

  1.     స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్ఎ, యుకె, నెదర్లాండ్స్ మొదటి ఐదు దేశాలు.
  2.     ఆసియా ఆర్థిక వ్యవస్థల సమూహం ర్యాంకింగ్స్‌ను పెంచుకోవడంతో, ఇండెక్స్ "ఆవిష్కరణల ప్రదేశంలో క్రమంగా తూర్పు వైపు మార్పు" జరుగుతోందని సూచిస్తుంది.
  3.     ఆసియాలోని చైనా, ఇండియా, ఫిలిప్పీన్స్, వియత్నాం ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ఇటీవ‌ల కాలంలో ఎంతో పురోగ‌తి సాధించి, ఇండెక్స్‌లో ముందుకు వెళ్లాయి. ఈ నాలుగు దేశాలు ఇప్పుడు టాప్ 50 లో ఉన్నారు.
  4.     మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతంలో భారతదేశం ఎన్నో ఆవిష్కరణలు చేసిన వాటిలో ఒకటి. గ‌త 5 సంవత్సరాలుగా ఈ ర్యాంకింగ్‌లో స్థిరమైన పెరుగుద‌ల క‌నిపిస్తోంది.
  5.     సాధార‌ణ ఆర్థిక వ్యవ‌స్థ ఉన్న దేశాల్లో చైనా ఈ ఇండెక్స్లో 14వ స్థానం సాధించింది.
Published date : 30 Sep 2020 05:05PM

Photo Stories