Skip to main content

బ్రిక్స్-2020 సమావేశాలు

12వ బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ కొరియా) శిఖరాగ్ర సమావేశాలు 2020, నవంబర్ 17న వర్చువల్ విధానంలో జరిగాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సొనారొ, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమాఫొసా పాల్గొన్నారు. బ్రిక్స్ నూతన ఉగ్రవాద వ్యతిరేక వ్యూహం’ను ఈ సదస్సులో సభ్య దేశాలు ఆమోదించాయి. అన్ని విధాలైన ఉగ్రవాద కార్యక్రమాలను బ్రిక్స్ గట్టిగా ఖండిస్తుందని, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలు ఒక సమగ్ర, సమతుల కార్యాచరణను రూపొందించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.

బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగం...

  • ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఉగ్రవాదం.
  • తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్న భారత్... ఉగ్రవాదంపై పోరును మరింత ముందుకు తీసుకువెళ్తుంది.
  • ఐక్యరాజ్య సమితి భద్రత మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ), ఐఎంఎఫ్, డబ్ల్యూహెచ్‌ఓ తదితర అంతర్జాతీయ సంస్థల్లో సత్వరమే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
  • కరోనా విజృంభణ సమయంలో దాదాపు 150 దేశాలకు అత్యవసర ఔషధాలను భారత్ పంపించింది.
  • స్వయం సమృద్ధ భారత్ లక్ష్యంగా ఒక సమగ్ర సంస్కరణల విధానాన్ని భారత్‌లో ప్రారంభించాం.


జిన్ పింగ్ ప్రసంగం...
కరోనా వైరస్‌కు టీకాలను తయారు చేయడంలో భారత్ సహా బ్రిక్స్ దేశాలకు సహకరిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేర్కొన్నారు. కోవిడ్-19 చికిత్స, నివారణల్లో బ్రిక్స్ దేశాల్లోని సంప్రదాయ వైద్యం ప్రాధాన్యాన్ని వివరించేలా ఒక సదస్సును ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా వైరస్‌కు టీకాను తయారు చేసే ప్రక్రియలో బ్రిక్స్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు.

బ్రిక్స్ గురించి...
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) అనేది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి.

  • బ్రిక్స్ దేశాలు 2009 నుంచి ఏటా సమావేశమవుతూ ఆర్థికం, వాణిజ్యం వంటి అనేకాంశాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి.
  • మొదట బ్రిక్ (BRIC) గా ఏర్పడిన ఈ కూటమిలో 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో BRICS గా మారింది.
  • గోల్డ్‌మన్ శాక్స్ సంస్థకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ 2001లో తొలిసారిగా బ్రిక్ అనే పదాన్ని వాడారు.
  • బిక్స్ కూటమి ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా, వాణిజ్యపరంగా ఏంతో ప్రాధాన్యం కలిగి ఉంది.
  • 360 కోట్ల జనాభాకు బ్రిక్స్ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ జనాభాలో ఇది దాదాపు సగం. ఈ ఐదు దేశాల మొత్తం జీడీపీ 16.6 లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 12వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు
ఎప్పుడు : 2020, నవంబర్ 17
ఎవరు :నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్‌పింగ్, జాయిర్ బొల్సొనారొ, సిరిల్ రమాఫొసా
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : ఆర్థికం, వాణిజ్యం వంటి అనేకాంశాల్లో చర్చలు జరిపేందుకు
Published date : 18 Nov 2020 05:46PM

Photo Stories