Skip to main content

ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సులు

2017 నవంబర్ 13, 14 తేదీల్లో ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్) సదస్సు; నవంబర్ 14న ఆసియాన్-భారత్ సదస్సు; తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్) జరిగాయి. ఈ మూడు శిఖరాగ్ర సదస్సులకు ఫిలిప్పీన్‌‌స రాజధాని మనీలా ఆతిథ్యం ఇచ్చింది. అత్యంత ప్రాధాన్యం గల ఈ సదస్సులపై ఫోకస్..
ఆసియాన్
ఆగ్నేయాసియాలోని పది దేశాల కూటమే ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్‌‌స). 1967 ఆగస్టు 8న ఆసియాన్‌ను ఏర్పాటుచేసినప్పుడు ఇందులో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్‌‌స, సింగపూర్, థాయిలాండ్ సభ్య దేశాలుగా ఉన్నాయి. అనంతరం బ్రూనై, కాంబోడియా, లావోస్, మయన్మార్(బర్మా), వియత్నాం సభ్య దేశాలుగా చేరాయి. ప్రస్తుతం ఆసియాన్‌లో పది సభ్యదేశాలు ఉన్నాయి. పపువా న్యూగినియా, తిమోర్-లెస్టెలకు పరిశీలక హోదా ఉంది.

ఆసియాన్ ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది. ఆసియాన్ కూటమి ఈ ఏడాది స్వర్ణోత్సవాలు (50 ఏళ్లు) జరుపుకుంటోంది. సభ్య దేశాల్లో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధిని పెంపొందించడమే ఆసియాన్ ప్రధాన లక్ష్యం.

ఆసియాన్ దేశాలు ప్రపంచ భూభాగంలో 3 శాతం, ప్రపంచ జనాభాలో 8.8 శాతాన్ని ఆక్రమిస్తున్నాయి. ఈ దేశాల్లో 640 మిలియన్ల మంది నివసిస్తున్నారు. 2015లో ఆసియాన్ దేశాల ఉమ్మడి జీడీపీ 2.8 ట్రిలియన్ డాలర్లు. ఆసియాన్ కూటమిని ఒక ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తే అమెరికా, చైనా, జపాన్, ఫ్రాన్‌‌స, జర్మనీల తర్వాత ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది.

తొలి ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం 1976లో ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. అయితే 2001 నుంచిమాత్రమే సదస్సులను క్రమంతప్పకుండా నిర్వహిస్తున్నారు. 2001 నుంచి2007 వరకు వార్షిక సదస్సులు జరిగాయి. 2009 నుంచిఏటా రెండు ఆసియాన్ సదస్సులు నిర్వహిస్తున్నారు.

31వ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సును 2017 నవంబర్ 13, 14 తేదీల్లో ఫిలిప్పీన్‌‌స రాజధాని మనీలాలో నిర్వహించారు. ఈ సదస్సుకు ఫిలిప్పీన్‌‌స దేశాధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్‌‌ట చైర్మన్‌గా వ్యవహరించారు. ఆసియాన్ సదస్సులో సభ్య దేశాలు, ఆసియాన్ చర్చల భాగస్వామ్య దేశాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆసియాన్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ప్రధానిగా మోదీకి ఫిలిప్పీన్‌‌సలో ఇది తొలి అధికారిక పర్యటన కావడం గమనార్హం. ఆసియాన్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని వివిధ దేశాల ప్రముఖుల గౌరవార్థం ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్‌‌ట ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. భారత ప్రధానితోపాటు ఇతర దేశాధినేతలు ఫిలిప్పీన్‌‌స జాతీయ దుస్తులైన తెల్లని ఎంబ్రాయిడరీ చొక్కాలు (బరోంగ్ తగలోగ్) ధరించి విందులో పాల్గొన్నారు.

పాల్గొన్న నాయకులు
ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు - రొడ్రిగో డ్యుటెర్‌‌ట
బ్రూనై సుల్తాన్ - హసనల్ బొల్కియా
కాంబోడియా ప్రధాని - హున్ సెన్
ఇండోనేషియా అధ్యక్షుడు - జోకో విడోడో
లావోస్ ప్రధాని - థోంగ్లోన్ సిసోలిథ్
మలేషియా ప్రధాని - నజీబ్ రజాక్
మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ - ఆంగ్‌సాన్ సూచీ
సింగపూర్ ప్రధాని - లీ సియాన్ లూంగ్
థాయిలాండ్ ప్రధాని - ప్రయూత్ చాన్ ఓచా
వియత్నాం ప్రధాని - నుయెన్ జువాన్
ఆస్ట్రేలియా ప్రధాని - మాల్కమ్ టర్‌‌నబుల్
కెనడా ప్రధాని - జస్టిన్ ట్రుడో
చైనా ప్రీమియర్ - లీ కెకియాంగ్
జపాన్ ప్రధాని - షింజో అబే
దక్షిణ కొరియా అధ్యక్షుడు - మూన్ జే ఇన్
భారత్ ప్రధాని - నరేంద్రమోదీ
న్యూజిలాండ్ ప్రధాని - జసిందా అర్డెర్‌‌న
రష్యా ప్రధాని - దిమిత్రి మెద్వెదేవ్
అమెరికా అధ్యక్షుడు - డొనాల్డ్ ట్రంప్
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు - డొనాల్డ్ టస్క్
ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి - ఆంటోనియో గుటెరస్

ఆసియాన్-భారత్ సదస్సు
ఏటా ఆసియాన్ దేశాల వార్షిక సదస్సు అనంతరం ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. తొలి ఆసియాన్-భారత్ సదస్సు 2002 నవంబర్‌లో కాంబోడియా రాజధాని నామ్ ఫెన్‌లో జరిగింది. అప్పటి నుంచి ఏటా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఆసియాన్ 2012 నుంచి భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. 2016-17 సంవత్సరంలో భారత్-ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్యం విలువ 71 బిలియన్ డాలర్లు. భారత్ ప్రపంచ దేశాలతో జరిపే మొత్తం వాణిజ్యంలో ఆసియాన్ వాటా 10.85 శాతం.

15వ ఆసియాన్-భారత్ సదస్సు 2017 నవంబర్ 14న ఫిలిప్పీన్‌‌సలోని మనీలాలో జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ఆసియాన్-భారత్ చర్చల భాగస్వామ్యానికి పాతికేళ్లు పూర్తయిన విషయాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం ఆసియాన్ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లని, వీటిని సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆసియాన్ దేశాలకు నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా వ్యవస్థ రూపకల్పనకు భారత్ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఇది ఆసియాన్ కూటమి ప్రయోజనాల పరిరక్షణ, శాంతియుత అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ‘యాక్ట్ ఈస్ట్ విధానం’లో భాగంగా ఆసియాన్ సభ్య దేశాలకు భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. భారత్-ఆసియాన్ ప్రత్యేక స్మారక సదస్సును 2018 జనవరి 25న న్యూఢిల్లీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత 69వ రిపబ్లిక్ దినోత్సవాలకు ఆసియాన్ దేశాల నాయకులను ముఖ్య అతిధులుగా స్వాగతించేందుకు 125 కోట్ల మంది భారతీయులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.

తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్)
తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా ప్రాంతాల్లోని దేశాలు వాటి పొరుగు దేశాలతో ఏటా తూర్పు ఆసియా సదస్సు (ఈస్ట్ ఏషియా సమ్మిట్) నిర్వహిస్తారు. తొలి తూర్పు ఆసియా సదస్సును 2005 డిసెంబర్‌లో మలేషియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహించారు. ఈ సదస్సులో 16 దేశాలు పాల్గొన్నాయి. అవి.. బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, లావోస్, వియత్నాం, సింగపూర్, మయన్మార్, థాయిలాండ్, ఫిలిప్పీన్‌‌స, చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. 2011లో జరిగిన 6వ తూర్పు ఆసియా సదస్సులో అమెరికా, రష్యా తొలిసారి పాల్గొన్నాయి. వీటితో కలిపి ప్రస్తుతం ఈఏఎస్‌లో 18 సభ్య దేశాలు ఉన్నాయి. ఏటా ఈ సదస్సును వార్షిక ఆసియాన్ సదస్సు ముగిసిన వెంటనే అదే నగరంలో నిర్వహిస్తారు.

12వ తూర్పు ఆసియా సదస్సు 2017 నవంబర్ 14న ఫిలిప్పీన్‌‌స రాజధాని మనీలాలో జరిగింది. సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ.. ఈ ప్రాంత రక్షణకు ఉమ్మడి చర్యలు అవసరమన్నారు. ఈఏఎస్‌కు భారత్ పూర్తి సహకారం అందిస్తుందని, కూటమి సభ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. 2018లో ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సులకు సింగపూర్ ఆతిథ్యం ఇవ్వనుంది.

తూర్పు ఆసియా సదస్సులు

క్ర.సం.

సంవత్సరం

నగరం

దేశం

1.

2005 డిసెంబర్

కౌలాలంపూర్

మలేషియా

2.

2007 జనవరి

సెబూ సిటీ

ఫిలిప్పీన్స్‌

3.

2007 నవంబర్

సింగపూర్

సింగపూర్

4.

2009 అక్టోబర్

చా అమ్ అండ్ హువాహిన్

థాయిలాండ్

5.

2010 అక్టోబర్

హనోయ్

వియత్నాం

6.

2011 నవంబర్

బాలి

ఇండోనేషియా

7.

2012 నవంబర్

నామ్ ఫెన్

కాంబోడియా

8.

2013 అక్టోబర్

బందర్ సెరి బెగవాన్

బ్రూనై

9.

2014 నవంబర్

నేపిడా

మయన్మార్

10.

2015 నవంబర్

కౌలాలంపూర్

మలేషియా

11.

2016 సెప్టెంబర్

వియంటియన్

లావోస్

12.

2017 నవంబర్

మనీలా

ఫిలిప్పీన్స్‌

Published date : 20 Nov 2017 05:16PM

Photo Stories