Skip to main content

అంతర్జాతీయ కూటములు - సదస్సులు

అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకోవడంతో పాటు ఆర్థికం, వాణిజ్యం, వ్యవసాయం, పరిపాలన, సాంకేతికత వంటి అంశాల్లో పరస్పర సహకారం కోసం చాలా దేశాలు కూటములుగా ఏర్పడ్డాయి.
ఈ దేశాలు ప్రతి సంవత్సరం సదస్సులు నిర్వహించుకుంటూ పెట్టుబడులు, ఎగుమతులు, దిగుమతులు, వీసాల జారీ, వాణిజ్యం వంటి అనేకాంశాలపై సమీక్ష నిర్వహిస్తుంటాయి. ఈ కూటములు, సదస్సులకు సంబంధించిన సమాచారంపై చాలా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి ముఖ్యమైన అంతర్జాతీయ సదస్సుల గురించి చర్చిద్దాం.

  1. బ్రిక్స్
    బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) అనేది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. ఈ దేశాలు 2009 నుంచి ఏటా సమావేశమవుతూ ఆర్థికం, వాణిజ్యం వంటి అనేకాంశాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి. మొదట బ్రిక్ (BRIC) గా ఏర్పడిన ఈ కూటమిలో 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో BRIC-S గా మారింది. గోల్డ్‌మన్ శాక్స్ సంస్థకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ 2001లో తొలిసారిగా బ్రిక్ అనే పదాన్ని వాడారు.బిక్స్ కూటమి ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా, వాణిజ్యపరంగా ఏంతో ప్రాధాన్యం కలిగి ఉంది.

    బ్రిక్స్ సమావేశాలు

    సమావేశం

    సంవత్సరం

    ప్రదేశం

    1

    16 జూన్, 2009

    ఎకటెరిన్‌బర్గ్ , రష్యా

    2

    15 ఏప్రిల్, 2010

    బ్రెసిలియా, బ్రెజిల్

    3

    14 ఏప్రిల్, 2011

    సాన్యా, చైనా

    4

    29 మార్చి, 2012

    న్యూఢిల్లీ, ఇండియా

    5

    26-27 మార్చి, 2013

    డర్బన్, దక్షిణాఫ్రికా

    6

    14-17 జులై, 2014

    ఫోర్తలేజా-బ్రెసిలియా, బ్రెజిల్

    7

    8-9 జులై, 2015

    ఉఫా, రష్యా

    8

    15-16 అక్టోబర్, 2016

    బెనాలియమ్, గోవా, ఇండియా

    9

    3-5 సెప్టెంబర్, 2017

    గ్జియామెన్, చైనా

    10

    27 - 27, జులై, 2018

    దక్షిణాఫ్రికా (జరగవలసి ఉంది)

    11

    2019

    బ్రెజిల్ (జరగవలసి ఉంది)

    12

    2020

    రష్యా (జరగవలసి ఉంది)


  2. జీ-7/జీ- 8
    Bavitha పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాల సమూహమే జీ-8 (అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా). విదేశీ వ్యవహారాలు, ఆర్థికాంశాలు, భద్రత, వాణిజ్యం, వాతావరణం, వ్యవసాయం, కార్మిక సమస్యల వంటివి జీ-8 సదస్సుల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటాయి. 1975లో మొదటి జీ-6 సమావేశం జరిగింది. 1976లో కెనడా, 1977లో రష్యా చేరికతో ఇది జీ-8గా మారింది. అయితే 2014లో క్రిమియా సంక్షోభం కారణంగా రష్యాను ఈ కూటమి నుంచి సస్పెండ్ చేయడంతో ఈ గ్రూప్‌ను జీ-7 గా పిలుస్తున్నారు. యూరోపియన్ యూనియన్ ఇందులో సభ్యదేశం కానప్పటికీ సమావేశాలకు హాజరవుతుంది.

    జీ-7 సమావేశాలు

    సమావేశం

    సంవత్సరం

    ప్రదేశం

    1

    15-17 నవంబర్, 1975

    రాంబోయిలట్, ఫ్రాన్స్

    2

    27-28 జూన్,1976

    డొరాడొ, యూఎస్

    3

    7-8 మే, 1977

    లండన్, యూకే

    4

    16-17 జులై,1978

    బోన్న్, పశ్చిమ జర్మనీ

    5

    28-29 జూన్, 1979

    టోక్యో, జపాన్

    6

    22-23 జూన్, 1980

    వెనీస్, ఇటలీ

    7

    20-21 జులై, 1981

    క్యుబెక్, కెనడా

    8

    4-6 జూన్, 1982

    వర్సెయిల్స్, ఫ్రాన్స్

    9

    28-30 మే, 1983

    వర్జీనియా, యూఎస్

    10

    7-9 జూన్, 1984

    లండన్, యూకే

    11

    2-4 మే, 1985

    బోన్న్, పశ్చిమ జర్మనీ

    12

    4-6 మే, 1986

    టోక్యో, జపాన్

    13

    8-10 జూన్, 1987

    వెనీస్, ఇటలీ

    14

    19-21 జూన్, 1988

    టొరాంటో, కెనడా

    15

    14-16 జులై, 1989

    ప్యారీస్, ఫ్రాన్స్

    16

    9-11 జులై,1990

    టెక్సాస్, యూఎస్

    17

    15-17 జులై, 1991

    లండన్, యూకే

    18

    6-8 జులై, 1992

    బవేరియా, జర్మనీ

    19

    7-9 జులై, 1993

    టోక్యో, జపాన్

    20

    8-10 జులై, 1994

    నప్లెస్, ఇటలీ

    21

    15-17 జూన్, 1995

    నోవాస్కాటియా, కెనడా

    22

    27-29 జూన్, 1996

    లియాన్, ఫ్రాన్స్

    23

    20-22 జూన్,1997

    డెన్వర్, యూఎస్

    24

    15-17 మే, 1998

    ఇంగ్లాండ్, యూకే

    25

    18-20 జూన్, 1999

    కొలోన్, జర్మనీ

    26

    21-23 జులై, 2000

    ఒకినవా, జపాన్

    27

    20-22 జులై, 2001

    జెనోవా, ఇటలీ

    28

    26-27 జూన్, 2002

    అల్బెర్తా, కెనడా

    29

    2-3 జూన్, 2003

    ఎవియన్-లెస్-బెయిన్, ఫ్రాన్స్

    30

    8-10 జూన్, 2004

    సీ ఐలాండ్, యూఎస్

    31

    6-8 జులై, 2005

    స్కాట్లాండ్, యూకే

    32

    15-17 జులై, 2006

    సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా

    33

    6-8 జూన్, 2007

    హైలెజెండమ్, జర్మనీ

    34

    7-9 జులై, 2008

    టొయాకో, జపాన్

    35

    8-10 జులై, 2009

    అబ్రుజో, ఇటలీ

    36

    25-26 జూన్, 2010

    ఒంటారియో, కెనడా

    37

    26-27 మే, 2011

    డేవిల్, ఫ్రాన్స్

    38

    18-19 మే, 2012

    క్యాంప్ డేవిడ్, యూఎస్

    39

    17-18 జూన్, 2013

    నార్తన్ ఐలాండ్, యూకే

    40

    మార్చి, 2014

    యూరోపియన్ యూనియన్

    41

    4-5 జూన్, 2015

    షోస్ ఎల్మా, జర్మనీ

    42

    26-27 మే, 2016

    షీమా, జపాన్

    43

    26-27 మే, 2017

    సిసిలీ, ఇటలీ

    44

    8-9, జూన్ 2018

    లా మాల్బే, కెనడా

    45

    2019

    ఫ్ర్రాన్స్(జరగవలసి ఉంది)

    46

    2020

    యూఎస్(జరగవలసి ఉంది)

    47

    2021

    యూకే (జరగవలసి ఉంది)


  3. జీ-20
    Bavitha ప్రపంచంలో ఇరవై అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు చెందిన ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల కూటమిగా 1999లో జీ-20 ఏర్పడింది. ఇందులో 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ సభ్యులు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న తీవ్రమైన సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా ఈ కూటమి పనిచేస్తుంది. 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత ఇది దేశాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది.

    జీ-20 సభ్యదేశాలు

    అర్జెంటీనా

    ఆస్ట్రేలియా

    బ్రెజిల్

    కెనడా

    చైనా

    ఫ్ర్రాన్స్

    జర్మనీ

    ఇండియా

    ఇండోనేషియా

    ఇటలీ

    జపాన్

    మెక్సికో

    రష్యా

    సౌదీ అరేబియా

    దక్షిణాఫ్రికా

    దక్షిణ కొరియా

    టర్కీ

    యూకే

    యూఎస్‌ఏ

    ఈయూ


    జీ-20 సమావేశాలు

    సమావేశం

    సంవత్సరం

    ప్రదేశం

    1

    14-15 నవంబర్,2008

    వాషింగ్టన్ డీసీ, యూఎస్

    2

    2 ఏప్రిల్, 2009

    లండన్, యూకే

    3

    24-25 సెప్టెంబర్, 2009

    పిట్స్‌బర్గ్, యూఎస్

    4

    26-27 జూన్, 2010

    టొరొంటో, కెనడా

    5

    11-12 నవంబర్, 2010

    సియోల్, సౌత్ కొరియా

    6

    3-4 నవంబర్, 2011

    కేన్స్, ఫ్రాన్స్

    7

    18-19 జూన్, 2012

    లాస్ కాబోస్, మెక్సికో

    8

    5-6 సెప్టెంబర్, 2013

    సెయింట్ పీటర్స్ బర్గ్, రష్యా

    9

    15-16 నవంబర్, 2014

    బ్రిస్‌బేన్, ఆస్ట్రేలియా

    10

    15-16 నవంబర్, 2015

    అంటాల్యా, టర్కీ

    11

    4-5 సెప్టెంబర్, 2016

    హాంగ్జూ, చైనా

    12

    7-8 జులై, 2017

    హాంబర్గ్, జర్మనీ

    13

    30 నవంబర్-1 డిసెంబర్, 2018

    అర్జెంటీనా (జరగవలసి ఉంది)

    14

    2019

    జపాన్ (జరగవలసి ఉంది)

    15

    2020

    సౌదీ అరేబియా (జరగవలసి ఉంది)


  4. సార్క్ - దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య
    Bavitha సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్-సార్క్, 1985 డిసెంబర్ 8న ఏర్పాటైంది. మొత్తం 8 దేశాలు (భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్థాన్) దీనిలో సభ్యులుగా ఉన్నాయి. త్వరలో మయన్మార్ తొమ్మిదో సభ్యదేశంగా చేరనుంది. దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌లో ఉంది. దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారానికి, సామాజిక ప్రగతి, సాంస్కృతికాభివృద్ధి, ఆర్థిక వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ కూటమి పనిచేస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన అంజాద్ హుస్సేన్ బి. సయల్ సార్క్ జనరల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు.

    సార్క్ సమావేశాలు

    సమావేశం

    సంవత్సరం

    ప్రదేశం

    1

    6-8 డిసెంబర్, 1985

    ఢాకా, బంగ్లాదేశ్

    2

    16-17 నవంబర్, 1986

    బెంగళూరు, ఇండియా

    3

    2-4 నవంబర్, 1987

    ఖాట్మాండ్, నేపాల్

    4

    29-31 డిసెంబర్, 1988

    ఇస్లామాబాద్, పాకిస్థాన్

    5

    21-23 నవంబర్, 1990

    మాలె, మాల్దీవులు

    6

    21 డిసెంబర్, 1991

    కొలంబో, శ్రీలంక

    7

    10-11 ఏప్రిల్, 1993

    ఢాకా, బంగ్లాదేశ్

    8

    2-4 మే, 1995

    న్యూఢిల్లీ, ఇండియా

    9

    12-14 మే, 1997

    మాలె, మాల్దీవులు

    10

    29-31 జులై, 1998

    కొలంబో, శ్రీలంక

    11

    4-6 జనవరి, 2002

    ఖాట్మాండ్, నేపాల్

    12

    4-6 జనవరి, 2004

    ఇస్లామాబాద్, పాకిస్థాన్

    13

    12-13 నవంబర్, 2005

    ఢాకా, బంగ్లాదేశ్

    14

    3-4 ఏప్రిల్, 2007

    న్యూఢిల్లీ, ఇండియా

    15

    1-3 ఆగస్ట్, 2008

    కొలంబో, శ్రీలంక

    16

    28-29 ఏప్రిల్, 2010

    థింపు భూటాన్

    17

    10-11 నవంబర్, 2011

    అడ్డూసిటీ, మాల్దీవులు

    18

    26-27 నవంబర్, 2014

    ఖాట్మాండ్, నేపాల్

    19

    9-10 నవంబర్, 2016

    ఇస్లామాబాద్, పాకిస్థాన్


    2016లో జమ్మూకాశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరగడంతో ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు భారత్ ప్రకటించింది. దీంతో మిగిలిన సభ్యదేశాలు కూడా హాజరుకాబోమని ప్రకటించడంతో 19వ సదస్సు రద్దయింది. 2018లో జరగాల్సిన 20వ సదస్సుకు ఆతిథ్యమిచ్చే దేశాన్ని ఎంపిక చేయలేదు.

  5. ఆసియాన్ - ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య
    Bavitha అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ - ఆసియాన్, 1967 ఆగస్టు 8న ‘‘వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ’’ అనే నినాదంతో ఏర్పడింది. పరస్పర సహకారంతో ప్రాంతీయంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి సాధించడమే సమాఖ్య ముఖ్య ఉద్దేశం. ఇందులో పది సభ్యదేశాలున్నాయి. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ దేశాలు వ్యవస్థాపక సభ్యదేశాలు కాగా 1984లో బ్రూనై, 1995లో వియత్నాం, 1997లో లావోస్, మయన్మార్, 1999లో కాంబోడియా దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. ఆసియాన్ ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది. ప్రస్తుతం లిమ్ జాక్ హోయ్ ఆసియాన్ సెక్రెటరీ జనరల్ గా వ్యవహరిస్తున్నారు.

    ఆసియాన్ సదస్సులు

    సమావేశం

    సంవత్సరం

    ప్రదేశం

    1

    23-24 ఫిబ్రవరి, 1976

    బాలి, ఇండోనేషియా

    2

    4-5 ఆగస్టు, 1977

    కౌలాలంపూర్, మలేషియా

    3

    14-15 డిసెంబర్, 1987

    మనీలా, ఫిలిప్పీన్స్

    4

    27-29 జనవరి, 1992

    సింగపూర్

    5

    14-15 డిసెంబర్, 1995

    బ్యాంకాక్, థాయ్‌లాండ్

    6

    15-16 డిసెంబర్, 1998

    హనోయ్, వియత్నాం

    7

    5-6 నవంబర్, 2001

    బందర్ సెరీ బెగవాన్, బ్రూనై

    8

    7-8 నవంబర్, 2002

    నోమ్‌ఫెన్, కాంబోడియా

    9

    7-8 అక్టోబర్, 2003

    బాలి, ఇండోనేషియా

    10

    29-30 నవంబర్, 2004

    విన్‌షాన్, లావోస్

    11

    12-14 డిసెంబర్, 2005

    కౌలాలంపూర్, మలేషియా

    12

    11-14 జనవరి, 2007

    మండా, ఫిలిప్పీన్స్

    13

    18-22 నవంబర్, 2007

    సింగపూర్

    14

    27 ఫిబ్రవరి- 1 మార్చి, 2009

    థాయిలాండ్

    15

    23-25 అక్టోబర్, 2009

    థాయిలాండ్

    16

    8-9 ఏప్రిల్, 2010

    హనాయ్, వియత్నాం

    17

    28-31 అక్టోబర్, 2010

    హనాయ్, వియత్నాం

    18

    7-8 మే, 2011

    జకార్తా, ఇండోనేషియా

    19

    14-19 నవంబర్, 2011

    బాలి, ఇండోనేషియా

    20

    3-4 ఏప్రిల్, 2012

    నోమ్ పెన్, కాంబోడియా

    21

    17-20 నవంబర్, 2012

    నోమ్ పెన్, కాంబోడియా

    22

    24-25 ఏప్రిల్, 2013

    బందర్ సెరీ బెగవాన్, బ్రూనై

    23

    9-10 అక్టోబర్, 2013

    బందర్ సెరీ బెగవాన్, బ్రూనై

    24

    10-11 మే, 2014

    మయన్మార్

    25

    10-12 నవంబర్, 2014

    మయన్మార్

    26

    26-27 ఏప్రిల్, 2015

    కౌలాలంపూర్, మలేషియా

    27

    18-22 నవంబర్, 2015

    కౌలాలంపూర్, మలేషియా

    28

    6-8 సెప్టెంబర్, 2016

    విన్‌షాన్, లావోస్

    29

    6-8 సెప్టెంబర్, 2016

    విన్‌షాన్, లావోస్

    30

    28-29 ఏప్రిల్, 2017

    పాసే, ఫిలిప్పీన్స్

    31

    10-14 నవంబర్, 2017

    పాసే, ఫిలిప్పీన్స్

    32

    25-28 ఏప్రిల్, 2018

    సింగపూర్

    33

    11-15 నవంబర్, 2018

    సింగపూర్ (జరగవలసి ఉంది)

    34

    ఏప్రిల్/ మే, 2019

    థాయ్‌లాండ్ (జరగవలసి ఉంది)

    35

    అక్టోబర్/ నవంబర్, 2019

    థాయ్‌లాండ్ (జరగవలసి ఉంది)


  6. అపెక్ - ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్
    Bavitha ఆసియా- పసిఫిక్ తీరప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం పెంపొందడానికి 1989 నవంబర్ 7న అపెక్ ఏర్పడింది. మొత్తం 21 దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది.


    అపెక్ సభ్యదేశాలు
  7. >

    ఆస్ట్రేలియా

    కెనడా

    బ్రూనై

    చిలీ

    చైనా

    తైవాన్

    హాంకాంగ్

    ఇండోనేషియా

    జపాన్

    దక్షిణ కొరియా

    మలేషియా

    మెక్సికో

    న్యూజిలాండ్

    పెరూ

    ఫిలిప్పీన్స్

    సింగపూర్

    థాయ్‌లాండ్

    యూఎస్

    పాపువా న్యూ గినియా

    రష్యా

    వియత్నాం

     

     



    అపెక్ సమావేశాలు

    సమావేశం

    సంవత్సరం

    ప్రదేశం

    1

    6-7 నవంబర్, 1989

    కాన్‌బెర్రా, ఆస్ట్రేలియా

    2

    29-31 జులై, 1990

    సింగపూర్

    3

    12-14 నవంబర్, 1991

    సియోల్, దక్షిణ కొరియా

    4

    10-11 సెప్టెంబర్, 1992

    బ్యాంకాక్, థాయ్‌లాండ్

    5

    19-20 నవంబర్, 1993

    బ్లేక్ ఐలాండ్, యూఎస్

    6

    15-16 నవంబర్, 1994

    బాగర్, ఇండోనేషియా

    7

    18-19 నవంబర్, 1995

    ఒకాసా, జపాన్

    8

    24-25 నవంబర్, 1996

    సుబిక్, ఫిలిప్పీన్స్

    9

    24-25 నవంబర్, 1997

    వాన్‌కోవర్, కెనడా

    10

    17-18 నవంబర్, 1998

    కౌలాలంపూర్, మలేషియా

    11

    12-13 సెప్టెంబర్, 1999

    ఆక్‌లాండ్, న్యూజిలాండ్

    12

    15-16 నవంబర్, 2000

    బందర్ సెరీ బెగవాన్, బ్రూనై

    13

    20-21 అక్టోబర్, 2001

    షాంగై, చైనా

    14

    26-27 అక్టోబర్, 2002

    లాస్ కాబస్, మెక్సికో

    15

    20-21 అక్టోబర్, 2003

    బ్యాంకాక్, థాయ్‌లాండ్

    16

    20-21 నవంబర్, 2004

    శాంటియగో, చిలీ

    17

    18-19 నవంబర్, 2005

    బూసాన్, దక్షిణ కొరియా

    18

    18-19 నవంబర్, 2006

    హనాయ్, వియత్నాం

    19

    8-9 సెప్టెంబర్, 2007

    సిడ్నీ, ఆస్ట్రేలియా

    20

    22-23 నవంబర్, 2008

    లిమా, పెరూ

    21

    14-15 నవంబర్, 2009

    సింగపూర్

    22

    13-14 సెప్టెంబర్, 2010

    యోకొహామా, జపాన్

    23

    12-13 నవంబర్, 2011

    హానొలులు, యూఎస్

    24

    9-10 సెప్టెంబర్, 2012

    వ్లాడివోస్టోక్, రష్యా

    25

    5-7 అక్టోబర్, 2013

    బాలి, ఇండోనేషియా

    26

    10-11 నవంబర్, 2014

    బీజింగ్, చైనా

    27

    18-19 నవంబర్, 2015

    మనీలా, ఫిలిప్పీన్స్

    28

    19-20 నవంబర్, 2016

    లిమా, పెరూ

    29

    10-11 నవంబర్, 2017

    డనాంగ్, వియత్నాం

    30

    18 నవంబర్, 2018

    పాపువా న్యూ గినియా (జరగవలసి ఉంది)

    31

    2019

    చిలీ (జరగవలసి ఉంది)

    32

    2020

    మలేషియా (జరగవలసి ఉంది)

    33

    2021

    న్యూజిలాండ్(జరగవలసి ఉంది)

    34

    2022

    థాయ్‌లాండ్ (జరగవలసి ఉంది)

    35

    2023

    మెక్సికో (జరగవలసి ఉంది)

    36

    2024

    బ్రూనై (జరగవలసి ఉంది)

    37

    2025

    దక్షిణ కొరియా (జరగవలసి ఉంది)


  8. తూర్పు ఆసియా సదస్సు - ఈఏఎస్
    Bavitha ఏటాఆసియాన్ శిఖరాగ్ర సదస్సు జరిగిన తర్వాత అదే నగరంలో 2005 నుంచి తూర్పు ఆసియా సదస్సు కూడా జరుగుతుంది. ప్రాంతీయంగా శాంతి, భద్రత మరియు పురోగతి సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో మొత్తం 18 దేశాలు (బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, లావోస్, వియత్నాం, సింగపూర్, మయన్మార్, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్, రష్యా) సభ్వత్వం కలిగి ఉన్నాయి.

    ఈఏఎస్ సమావేశాలు

    సమావేశం

    సంవత్సరం

    ప్రదేశం

    1

    14 డిసెంబర్, 2005

    కౌలాలంపూర్, మలేషియా

    2

    15 జనవరి, 2007

    మాండా, ఫిలిప్పీన్స్

    3

    21 నవంబర్, 2007

    సింగపూర్

    4

    25 అక్టోబర్, 2009

    చా-యామ్& హువా హిన్, థాయ్‌లాండ్

    5

    30 అక్టోబర్, 2010

    హనోయ్, వియత్నాం

    6

    18-19 నవంబర్, 2011

    బాలీ, ఇండోనేషియా

    7

    19-20 నవంబర్, 2012

    నోమ్‌ఫెన్, కాంబోడియా

    8

    9-10 అక్టోబర్, 2013

    బందర్‌సెరీ బెగవాన్, బ్రూనై

    9

    12-13 నవంబర్, 2014

    నైఫీడా, మయన్మార్

    10

    21-22 నవంబర్, 2015

    కౌలాలంపూర్, మలేషియా

    11

    6-8 సెప్టెంబర్, 2016

    విన్‌షాన్, లావోస్

    12

    13-14 నవంబర్, 2017

    మనీలా, ఫిలిప్పీన్స్

    13

    2018

    సింగపూర్ (జరగవలసి ఉంది)

    14

    2019

    థాయ్‌లాండ్ (జరగవలసి ఉంది)

    15

    2020

    వియత్నాం (జరగవలసి ఉంది)


  9. ఐబీఎస్‌ఏ - ఇబ్సా
    Bavitha అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సహకారం కోసం మూడు ఖండాల్లోని అతిపెద్ద ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థలు కలిగిన భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు కలిసి 2003, జూన్ 6న ఇబ్సా కూటమిగా ఏర్పడ్డాయి. ఇవి వ్యవసాయం, వాణిజ్యం, సంస్కృతి, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం అందించుకుంటాయి.


    ఇబ్సా సమావేశాలు

    సమావేశం

    సంవత్సరం

    ప్రదేశం

    1

    సెప్టెంబర్, 2006

    బ్రెసిలియా, బ్రెజిల్

    2

    అక్టోబర్, 2007

    ప్రిటోరియా, దక్షిణాఫ్రికా

    3

    అక్టోబర్, 2008

    న్యూఢిల్లీ, ఇండియా

    4

    15 ఏప్రిల్, 2010

    బ్రెసిలియా, బ్రెజిల్

    5

    18 అక్టోబర్, 2011

    ప్రిటోరియా, దక్షిణాఫ్రికా

    6

    16 మే, 2013

    న్యూఢిల్లీ, ఇండియా(రద్దయింది)

    7

    2015

    న్యూఢిల్లీ, ఇండియా


  10. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ - నాటో
    Bavitha ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలను కలుపుకొని బలపడిన సోవియట్ యూనియన్‌ను అడ్డుకునేందుకు ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ - నాటోను 1949 ఏప్రిల్ 4న ఏర్పాటు చేశాయి. నాటో తన సభ్యదేశాలకు సైనిక రక్షణ అందిస్తుంది. మొత్తం 29 సభ్యదేశాలు తమ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం రక్షణకు కేటాయిస్తున్నాయి. దీని ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఉంది. ప్రస్తుతం జెన్స్ స్టోలెన్‌బర్గ్ నాటో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

    సభ్యదేశాలు

    అల్బేనియా

    బెల్జియం

    బల్గేరియా

    కెనడా

    క్రోయేషియా

    చెక్ రిపబ్లిక్

    డెన్మార్క్

    ఎస్టోనియా

    ఫ్రాన్స్

    జర్మనీ

    గ్రీస్

    హంగేరీ

    ఐస్‌లాండ్

    ఇటలీ

    లాత్వియా

    లిథువేనియా

    లక్సెంబర్గ్

    మాంటెనీగ్రొ

    నెదర్లాండ్స్

    నార్వే

    పోలెండ్

    పోర్చుగల్

    రొమేనియా

    స్లొవేకియా

    స్లొవేనియా

    స్పెయిన్

    టర్కీ

    యూకే

    అమెరికా

     

     


    నాటో సదస్సులు

    సదస్సు

    సంవత్సరం

    ప్రదేశం

    1

    16-19 డిసెంబర్, 1957

    ప్యారిస్, ఫ్రాన్స్

    2

    26 జూన్, 1974

    బ్రస్సెల్స్, బెల్జియం

    3

    29-30 మే, 1975

    బ్రస్సెల్స్, బెల్జియం

    4

    10-11 మే, 1977

    లండన్, యూకే

    5

    30-31 మే, 1978

    వాషింగ్టన్ డి.సి, యూఎస్

    6

    10 జూన్, 1982

    బోన్న్, పశ్చిమ జర్మనీ

    7

    21 నవంబర్, 1985

    బ్రస్సెల్స్, బెల్జియం

    8

    2-3 మే, 1988

    బ్రస్సెల్స్, బెల్జియం

    9

    29-30 మే, 1989

    బ్రస్సెల్స్, బెల్జియం

    10

    4 డిసెంబర్, 1989

    బ్రస్సెల్స్, బెల్జియం

    11

    5-6 జులై, 1990

    లండన్, యూకే

    12

    7-8 నవంబర్, 1991

    రోమ్, ఇటలీ

    13

    10-11 జనవరి, 1994

    బ్రస్సెల్స్, బెల్జియం

    14

    27 మే,1997

    ప్యారిస్, ఫ్రాన్స్

    15

    8-9 జులై, 1997

    మ్యాడ్రిడ్, స్పెయిన్

    16

    23-25 ఏప్రిల్, 1999

    వాషింగ్టన్ డి.సి, యూఎస్

    17

    13 జూన్, 2001

    బ్రస్సెల్స్, బెల్జియం

    18

    28 మే, 2002

    రోమ్, ఇటలీ

    19

    21-22 నవంబర్, 2002

    ప్రాగ్, చెక్ రిపబ్లిక్

    20

    28-29 జూన్, 2004

    ఇస్తాంబుల్, టర్కీ

    21

    25 ఫిబ్రవరి, 2005

    బ్రస్సెల్స్, బెల్జియం

    22

    28-29 నవంబర్, 2006

    రిగా, లాత్వియా

    23

    2-4 ఏప్రిల్, 2008

    బుకరెస్ట్, రొమేనియా

    24

    2-3 ఏప్రిల్, 2009

    ఫ్ర్రాన్స్

    25

    19-20 నవంబర్, 2010

    లిస్బాన్, పోర్బుగల్

    26

    20-21 మే, 2012

    చికాగో, యూఎస్

    27

    4-5 సెప్టెంబర్, 2014

    న్యూపోర్ట్, యూకే

    28

    8-9 జులై, 2016

    వార్సా, పోలాండ్

    29

    25 మే, 2017

    బ్రస్సెల్స్, బెల్జియం

    30

    11-12 జులై, 2018

    బ్రస్సెల్స్, బెల్జియం (జరగవలసి ఉంది)


  11. ఒపెక్ - ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ Bavitha
    ప్రపంచంలో పెట్రోలియంను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఇరాక్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనెజులా 1960లో ఇరాక్‌లో ఒపెక్ కూటమిగా ఏర్పడ్డాయి. పెట్రోలియం ఉత్పత్తి విధి విధానాలు, సరఫరా, ధరల నియంత్రణలో ఏకీకరణ సాధించడం ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. దీని ప్రధాన కార్యాలయంను మొదట స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఏర్పాటు చేశారు. ఐదేళ్ల తర్వాత ఆస్ట్రియా రాజధాని వియన్నాకు మార్చారు. ప్రస్తుతం ఈ కూటమి సభ్యదేశాల సంఖ్య 14. ప్రపంచంలోని మొత్తం చమురు ఉత్పత్తిలో 1/3 వ వంతు ఈ దేశాల్లోనే జరుగుతుంది. ప్రస్తుతం మహ్మద్ సనుసి బర్కిండో దీని ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

    సభ్యదేశాలు

    అల్జీరియా

    అంగోలా

    ఈక్వెడార్

    ఈక్వటోరియల్ గినియా గబాన్

    ఇరాన్

    ఇరాక్

    కువైట్

    లిబియా

    నైజీరియా

    ఖతార్

    సౌదీ అరేబియా

    యూఏఈ

    వెనిజులా


    ఒపెక్ సమావేశాలు

    సమావేశం

    సంవత్సరం

    ప్రదేశం

    1

    సెప్టెంబర్, 2001

    వియన్నా, ఆస్ట్రియా

    2

    సెప్టెంబర్, 2004

    వియన్నా, ఆస్ట్రియా

    3

    12-13 సెప్టెంబర్, 2006

    వియన్నా, ఆస్ట్రియా

    4

    18-19 మార్చి, 2009

    వియన్నా, ఆస్ట్రియా

    5

    13-14 జూన్, 2012

    వియన్నా, ఆస్ట్రియా

    6

    3-4 జూన్, 2015

    వియన్నా, ఆస్ట్రియా

    7

    20-27 జూన్, 2018

    వియన్నా, ఆస్ట్రియా (జరగవలసి ఉంది)


  12. నామ్ - అలీనోద్యమ కూటమి
    Bavitha రెండో ప్రపంచ యుద్ధానంతరం కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాలు తమ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, సమానత్వం ను కాపాడుకోవడానికి 1961లో అలీనోద్యమ కూటమిగా ఏర్పడ్డాయి. అమెరికా, సోవియట్ యూనియన్ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న కాలంలో తటస్థంగా ఉన్న దేశాలు ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. దీనిలో మొత్తం 122 దేశాలు (అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా మూడో ప్రపంచ దేశాలు) సభ్యత్వం కలిగి ఉన్నాయి. 17 పరిశీలక దేశాలు ఉన్నాయి. ప్రతి మూడేళ్లకొకసారి ఇది సమావేశమవుతుంది. దీని ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. ప్రస్తుతం నికోలస్ మడురో ఈ కూటమి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

    సదస్సు

    సంవత్సరం

    ప్రదేశం

    1

    1-6 సెప్టెంబర్, 1961

    యుగోస్లోవియా (బెల్‌గ్రేడ్)

    2

    5-10 అక్టోబర్, 1964

    యునెటైడ్ అరబ్ రిపబ్లిక్ (కైరో)

    3

    8-10 సెప్టెంబర్, 1970

    జాంబియా (లుసాకా)

    4

    5-9 సెప్టెంబర్, 1973

    అల్జీరియా (అల్జీర్స్)

    5

    16-19 ఆగస్ట్, 1976

    శ్రీ‌లంక (కొలంబో)

    6

    3-9 సెప్టెంబర్, 1979

    క్యూబా (హవానా)

    7

    7-12 మార్చి, 1983

    ఇండియా (న్యూ ఢిల్లీ)

    8

    1-6 సెప్టెంబర్, 1986

    జింబాంబ్వే (హరారె)

    9

    4-7 సెప్టెంబర్, 1989

    యుగోస్లోవియా (బెల్‌గ్రేడ్)

    10

    1-6 సెప్టెంబర్, 1992

    ఇండోనేషియా (జకార్తా)

    11

    18-20 అక్టోబర్, 1995

    కొలంబియా (కార్టజీనా)

    12

    2-3 సెప్టెంబర్, 1998

    దక్షిణాఫ్రికా (డర్బన్)

    13

    20-25 ఫిబ్రవరి, 2003

    మలేషియా (కౌలాలంపూర్)

    14

    15-16 సెప్టెంబర్, 2006

    క్యూబా (హవానా)

    15

    11-16 జులై, 2009

    ఈజిప్ట్ (షార్మ్ ఎల్-షేక్)

    16

    26-31 సెప్టెంబర్, 2012

    ఇరాన్ (టెహ్రాన్)

    17

    17-18 సెప్టెంబర్, 2016

    వెనెజులా(పోర్లమార్)

    18

    2019

    అజర్‌బైజాన్ (జరగవలసి ఉంది)

Published date : 07 Jun 2018 04:32PM

Photo Stories