ఏపీలో వైఎస్సార్ మత్స్యకార భరోసా ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం’ ప్రారంభమైంది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 2019, నవంబర్ 21న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కొమానపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మత్స్యకార భరోసా పథకం పథకం ద్వారా 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించింది.
ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
ఏమిటి : వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభం
ఎప్పుడు : 2019, నవంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కొమానపల్లి, ముమ్మిడివరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- మత్స్యకారులకు ఇచ్చే వేట నిషేధ పరిహారంను రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నాం. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం ఉంటుంది.
- మత్స్యకారుల కోసం.. లీటరు డీజిల్‌కు ఇస్తున్న సబ్సిడీని ఈ రోజు నుంచి రూ.6 నుంచి రూ.9కి పెంచుతున్నాం.
- సముద్ర తీరంలో అవసరమైన చోటల్లా రాబోయే కాలంలో జెట్టీలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
- సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. (ఇప్పటి దాకా రూ.5 లక్షలు మాత్రమే)
- 2012లో సముద్రంలో చమురు, సహజ వాయువుల నిక్షేపాల అన్వేషణకు జరిపిన తవ్వకాల్లో ముమ్మిడివరం ప్రాంతంలో జీవన భృతి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రూ.78.24 కోట్ల పరిహారం (జీఎస్‌పీసీ బకాయిలు) రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది. తర్వాత ఆ డబ్బు కేంద్రం నుంచి ఎలా తెచ్చుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. దీని ద్వారా 16,559 మత్స్యకార కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి.
ఏమిటి : వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభం
ఎప్పుడు : 2019, నవంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కొమానపల్లి, ముమ్మిడివరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 22 Nov 2019 05:44PM