AP Govt Schemes: జగనన్న విద్యా కానుక పథకం– వివరాలు
ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఎనిమిది రకాల వస్తువులతో ప్రత్యేక స్కూల్ కిట్ ను ప్రభుత్వం అందిస్తుంది. పాఠశాలల్లోడ్రాప్ ఔట్లను తగ్గించి, పాఠశాలల్లో విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలను సాధించాలనే ధ్యేయంతో ఈ వినూత్న పథకాన్ని రూపొందించారు.
జగనన్న విద్యా కానుక కిట్‌లో ఏమేముంటాయంటే..
- సూల్ బ్యాగ్ (వేరువేరు రంగుల్లో)– 1
- స్కూల్ యూనీఫాం క్లాత్– 3 జతలకు
- బూట్లు– ఒక జత
- సాక్సులు– 2 జతలు
- బెల్ట్– 1
- నోట్ బుక్స్– ఒక సెట్
- మిర్రర్ ఇమేజ్ (బై లింగ్వల్) పాఠ్యపుస్తకాలు– ఒక సెట్
- ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ– 1
నోట్: యూనీఫాం కుట్టు కూలీ మూడు జతలకు రూ.120 చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది.
సిలబస్‌లో మార్పులు..
1 నుంచి 6 తరగతి వరకు ఆయా సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులు చేయడంతోపాటు, మూడో తరగతి నుంచే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌ను బోధించడం, తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించడం, ఇంగ్లీష్ మీడియం పాఠాల సిలబస్ రూపకల్పనలో భాగంగా మిర్రర్ ఇమేజ్ పాఠ్యపుస్తకాలు (పాఠ్యపుస్తకంలో పేజీకి ఒకవైపు ఇంగ్లీష్, మరో వైపు తెలుగు రెండు మాధ్యమాలు కనిపించేలా) సిద్ధం చేసి విద్యార్థులకు పంపిణీ చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా వర్క్‌బుక్‌ల పంపిణీ వంటి మార్పులు పాఠశాల విద్యలో చోటుచేసున్నాయి.
కిట్ల పంపిణీ ఇలా..
విద్యార్థులు చదివే పాఠశాలల్లో, వారి తల్లుల బయోమెట్రిక్, ఐరిష్ ద్వారా హాజరు నమోదు చేసి ఉపాధ్యయులు ఈ కిట్లను పంపిణీ చేస్తారు.
టోల్ ఫ్రీ నెంబర్
విద్యా కానుక కిట్ల పంపిణీలో ఏదైనా సమస్య తలెత్తినా, సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నెంబర్ 9121296051, 9121296052లను అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించవచ్చు.
కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా నిలబడేలా ప్రభుత్వ స్కూళ్లలో సకల సౌకర్యాలను సమకూర్చడమే కాకుండా విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచేలా.. జగనన్న విద్యా కానుక పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.