Uranus Planet: ఈ గ్రహంపై ఒక సంవత్సరం భూమిపై 84 సంవత్సరాలకు సమానం
ఎందుకంటే ఇక్కడ మట్టి, రాయికి బదులుగా గ్యాస్ అధికంగా ఉంటుంది. ఈ గ్రహం పరిమాణంలో చాలా పెద్దది. ఇటువంటి విచిత్ర వాతావరణం కలిగిన గ్రహంలో మనిషి కనీసం ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమి జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.
Diamond Planet: ఆకాశంలో డైమండ్ గ్రహం
సౌర వ్యవస్థలో టెలిస్కోప్ సాయంతో కనుగొన్న మొదటి గ్రహం యురేనస్. ఇది సౌర వ్యవస్థలోని ఎనిమిది గ్రహాలలో సూర్యుని నుండి దూరం పరంగా చూస్తే ఏడవ సుదూర గ్రహం. యురేనస్ తన అక్షం మీద ఒక పరిభ్రమణాన్ని దాదాపు 17 గంటల్లో పూర్తి చేస్తుంది. అంటే యురేనస్‌పై ఒక రోజుకు 17 గంటలు మాత్రమే ఉంటుందని అర్థం. అంటే ఇక్కడ ఒక సంవత్సరం భూమిపై 84 సంవత్సరాలకు సమానం.
యురేనస్‌పై రాత్రి 42 సంవత్సరాలు, పగలు 42 సంవత్సరాలు అని తెలిస్తే ఎవరైరా ఆశ్చర్యపోవాల్సిందే. యురేనస్‌పై రెండు ధృవాలలో ఒకటి సూర్యునికి అభిముఖంగా ఉండడం, మరొకటి 42 ఏళ్లు చీకటిలో ఉండడమే ఇందుకు కారణం. యురేనస్.. సూర్యుని నుండి సుమారు మూడు బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహం చాలా చల్లగా ఉండటానికి కారణం కూడా ఇదే.
Jio Space Fiber: జియో ఉపగ్రహ ఆధారిత గిగాబిట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్
ఇక్కడ సగటు ఉష్ణోగ్రత -197 డిగ్రీల సెల్సియస్. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం, యురేనస్‌పై కనిష్ట ఉష్ణోగ్రత -224 డిగ్రీల సెల్సియస్. ఇక భూమికి ఒకే చంద్రుడు ఉండగా, యురేనస్‌కు మొత్తం 27 సహజ ఉపగ్రహాలు అంటే చంద్రులు ఉన్నారు. అయితే ఈ చంద్రులు చాలా చిన్నవిగా, అసమతుల్యంగా ఉంటాయి. వాటి బరువు చాలా తక్కువ. యురేనస్ దాని అక్షం మీద 98 డిగ్రీలు వంగి ఉంటుంది. అందుకే ఇక్కడి వాతావరణం అసాధారణంగా ఉంటుంది.
ఇక్కడ ఎప్పుడూ తుఫాను లాంటి వాతావరణం ఉంటుంది. గాలులు చాలా వేగంగా వీస్తాయి. ఇవి గరిష్టంగా గంటకు 900 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటాయి. యురేనస్ గ్రహంపై మేఘాల అనేక పొరలతో కూడి ఉంటాయి. పైభాగంలో మీథేన్ వాయువు ఉంటుంది. యురేనస్ గ్రహంపై మీథేన్ వాయువు, ఉష్ణోగ్రత, గాలి సమృద్ధిగా ఉండటం వల్ల ఇక్కడ వజ్రాల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యకిరణాలు ఈ గ్రహాన్ని చేరుకోవడానికి రెండు గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. యురేనస్ భూమి కంటే దాదాపు 20 రెట్లు పెద్దది. మరి ఈ గ్రహం గురించి ఇన్ని వివరాలు తెలుసుకున్నాక.. మనిషి ఈ గ్రహంపై ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమవుతుందనేది ఇప్పటికే మీకు సమగ్రంగా అర్థమై ఉండాలి.
16 Psyche asteroid: టన్నుల కొద్దీ బంగారం ఉన్న గ్రహశకలంలో ఏంటో తెలుసా!