Skip to main content

People Research on India's Consumer Economy Survey: ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో మధ్యతరగతి పెరుగుతోంది. దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ వర్గానికి చెందినవారే. ప్రస్తుతం మొత్తం జనాభాలో మిడిల్‌క్లాస్‌ 31 శాతం ఉన్నారు.
One out of every three Indians 'middle class
One out of every three Indians 'middle class

2004–05లో 14 శాతమున్నది కాస్తా 2021 నాటికి రెండింతలకు పైగా 31శాతానికి పెరిగింది. మరో పాతికేళ్లకు 63 శాతానికి చేరనున్నట్టు ఆర్థిక పరిశోధన సంస్థ పీపుల్స్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇండియాస్‌ కన్జ్యూమర్‌ ఎకానమీ (ప్రైస్‌) ‘ద రైజ్‌ ఆఫ్‌ ఇండియాస్‌ మిడిల్‌ క్లాస్‌’ పేరిట నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ఒక అంచనా ప్రకారం ఏడాదికి రూ.5లక్షల నుంచి 30 లక్షల లోపు ఆదాయమున్న వారిని మనదేశంలో మధ్యతరగతిగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అమలవుతోన్న ఆర్థిక, రాజకీయ సంస్కరణలకు అనుగుణంగా ఆశించిన ప్రయోజనాలను సాధిస్తే.. అల్పాదాయ వర్గాల సంఖ్య గణనీయంగా తగ్గిపో­తుందని ప్రైస్‌ నివేదిక అంచనా వేస్తోంది. మధ్యతరగతితోపాటు  సంపన్నుల శాతం కూడా భారీగా పెరుగుతోందని ప్రైస్‌ ఎండీ, సీఈవో రాజేశ్‌ శుక్లా తెలిపారు.  

Also read: Godwit Bird Record : 11 రోజుల్లో నాన్‌–స్టాప్‌గా 13,558 కిలోమీటర్ల ప్రయాణం

మహారాష్ట్ర టాప్‌... 
దేశంలో మహారాష్ట్ర సంపన్న రాష్ట్రంగా అవతరించింది. 2021లో ఏడాదికి రూ.2 కోట్లకు పైగా ఆర్జిస్తున్న కుటుంబాలు అక్కడ 6.4 లక్షలున్నాయి. 1.81 లక్షల సంపన్న కుటుంబాలతో ఢిల్లీ రెండోస్థానాన్ని ఆక్రమించింది. గుజరాత్‌ 1.41 లక్షల కుటుంబాలతో మూడోస్థానంలో, తమిళనాడు 1.37 లక్షల కుటుంబాలతో నాలుగోస్థానంలో, పంజాబ్‌ 1.01 లక్షల కుటుబాలతో ఐదో స్థానంలో నిలిచింది. దేశంలో అత్యంత సంపన్నులుగా పరిగణించే ‘సూపర్‌రిచ్‌’ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్టు ఈ సర్వేతెలిపింది. 1994–­95­లో 98వేల కుటుంబాలు మాత్రమే సూపర్‌­రిచ్‌ ఉండగా, 2020–21 నాటికి ఈ కు­టుంబాల సంఖ్య 18 లక్షలకు చేరుకుంది. సూర­త్, నాగ్‌పూర్‌లలో ఈ అత్యధిక ఆదాయ వర్గాల వృద్ధి ఎక్కువగా ఉండడం విశేషం.  

Also read: Quiz of The Day (November 03, 2022): భారతదేశంలో పొగాకును ప్రవేశపెట్టింది?

మిడిల్‌క్లాస్‌ విశ్లేషణ సంక్షిష్టమే... 
మనదేశంలో మధ్యతరగతి వర్గీకరణ, విశ్లేషణ కొంత సంక్లిష్టమైనదే. ఈ కేటగిరిలో ఎవరిని, ఏ ప్రాతిపదికన చేర్చాలనే దానిపైనా భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదికి రూ.1.25 లక్షల లోపు ఆదాయమున్న వారిని అల్పాదాయవర్గంగా, ఏడాదికి రూ.5లక్షల నుంచి 30 లక్షల మధ్య సంపాదించే వారిని మధ్యతరగతిగా, ఏడాదికి రూ.2 కోట్లకు పైగా ఆర్జించే వారిగా సంపన్నులుగా అంచనా వేసినట్టు రాజేశ్‌ శుక్లా తెలిపారు. కొనుగోలు శక్తిని బట్టి ఈ వర్గీకరణ చేశారు. అల్పాదాయ వర్గాల కుటుంబాలు కార్లు కొనుగోలు చేయకపోవడం, అల్పాదాయ–మధ్యతరగతిల మధ్య­నున్న ‘అస్పైరర్‌’ వర్గం కొంతశాతం ఏదో ఒక వాహనాన్ని కొనుగోలు చేశాయి. మధ్యతరగతిలోనే రూ.5లక్షల నుంచి 15 లక్షల మధ్యనున్న ‘సీకర్స్‌’ కేటగిరిలోని ప్రతి పది కుటుంబాల్లో, 3 కుటుంబాలకు కార్లున్నాయి. ‘కరోడ్‌పతి’ కేటగిరీలో ఉన్న కుటుంబాల్లో అన్నింటికి... మూడు కార్లున్నాయి. అదే తరహాలో అల్పాదాయ కుటుంబాలకు ఏసీలు లేకపోగా, ‘అస్పైరర్‌’లో వందలో రెండు శాతానికి, సూపర్‌రిచ్‌ కుటుంబాలకు ఏసీలు కలిగి ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. 

Also read: Mangarh Dham : ఇక జాతీయ స్మారక చిహ్నం

ప్రైస్‌ సర్వే గణాంకాలు 

కేటగిరీ కుటుంబాలు జనాభా ఆదాయం ఖర్చు ఆదా
సంపన్నులు 3 % 4% 23% 17% 43%
మధ్యతరగతి 30 31 50 48 56
అసై్పరర్స్‌ 52 52 25 32 01
అల్పాదాయవర్గం 15 13 02 03 00

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 03 Nov 2022 03:12PM

Photo Stories