కేంద్ర బడ్జెట్ 2020-21
Sakshi Education
ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తిని పెంచడమే లక్ష్యంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్ 2020-21ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.వరుసగా రెండో ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా... దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగానే ఉన్నాయని ఉద్ఘాటించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలోనే ఉంచుతున్నామన్నారు. మొత్తంగా రూ. 30,42,230 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా.. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు చేశారు.
కేంద్ర బడ్జెట్ 2020-21ను మూడు ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకొని రూపొందించినట్లు మంత్రి నిర్మలా తెలిపారు.
మూడు ప్రధాన అంశాలు, అవి దృష్టి సారించే అంశాలు ఇవే..
1. ఆకాంక్షిత(ఆస్పిరేషనల్) భారత్ :
- వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
- ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
- విద్య, నైపుణ్యాలు
- పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు
- మౌలిక వసతులు
- నూతన ఆర్థిక వ్యవస్థ
- మహిళలు, చిన్నారులు, సామాజిక సంక్షేమం
- సంస్కృతి, పర్యాటకం
- పర్యావరణం, వాతవరణ మార్పులు
బడ్జెట్ స్వరూపం..(రూ.కోట్లలో)
మెత్తం బడ్జెట్ | 30,42,230 |
రెవెన్యూ వసూళ్లు | 20,20,926 |
మూలధన వసూళ్లు | 10,21,304 |
మొత్తం వసూళ్లు | 30,42,230 |
రెవెన్యూ ఖాతా | 26,30,145 |
మూలధన ఖాతా | 4,12,085 |
మొత్తం వ్యయం | 30,42,230 |
రెవెన్యూ లోటు | 6,09,219 |
ద్రవ్య లోటు | 7,96,337 |
ప్రాథమిక లోటు | 88,134 |
రూపాయి రాక (అంకెలు పైసల్లో)
రుణేతర మూలధన వసూళ్లు | 6 |
ఇతర అప్పులు | 20 |
పన్నేతర ఆదాయం | 10 |
కస్టమ్స్ | 4 |
జీఎస్టీ | 18 |
కార్పొరేషన్ ట్యాక్స్ | 18 |
కేంద్ర ఎకై ్సజ్ సుంకాలు | 7 |
ఆదాయపు పన్ను | 17 |
రూపాయి పోక (అంకెలు పైసల్లో)
కేంద్ర ప్రాయోజిత పథకాలు | 9 |
సబ్సిడీలు | 6 |
రక్షణ రంగం | 8 |
వడ్డీ చెల్లింపులు | 18 |
పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా | 20 |
ఫైనాన్‌స కమిషన్, బదిలీలు | 10 |
కేంద్ర ప్రభుత్వ రంగ స్కీంలు | 13 |
ఇతర ఖర్చులు | 10 |
పింఛన్లు | 6 |
ఇదీ బడ్జెట్ సమగ్ర స్వరూపం (అంకెలు రూ.కోట్లలో)
2018-2019 వాస్తవ కేటాయింపులు | 2019-2020 బడ్జెట్ అంచనాలు | 2019-2020 సవరించిన అంచనాలు | 2020-2021 బడ్జెట్ అంచనాలు | |
1. రెవెన్యూ వసూళ్లు(2+3) | 15,52,916 | 19,62,761 | 18,50,101 | 20,20,926 |
2. పన్ను ఆదాయం | 13,17,211 | 16,49,582 | 15,04,587 | 16,35,909 |
3. పన్నేతర ఆదాయం | 2,35,705 | 3,13,179 | 3,45,514 | 3,85,017 |
4. మూలధన వసూళ్లు (5+6+7) | 7,62,197 | 8,23,588 | 8,48,451 | 10,21,304 |
5. రుణాల రికవరీ | 18,052 | 14,828 | 16,605 | 14,967 |
6. ఇతర వసూళ్లు | 94,727 | 1,05,000 | 65,000 | 2,10,000 |
7. అప్పులు, ఇతరత్రా వసూళ్లు | 6,49,418 | 7,03,760 | 7,66,846 | 7,96,337 |
8. మొత్తం వసూళ్లు (1+4) | 23,15,113 | 27,86,349 | 26,98,552 | 30,42,230 |
9. పథకాలుకాక ఇతర వ్యయం (10+13) | 23,15,113 | 27,86,349 | 26,98,552 | 30,42,230 |
10. రెవెన్యూ ఖాతా | 20,07,399 | 24,47,780 | 23,49,645 | 26,30,145 |
11. వడ్డీ చెల్లింపులు | 5,82,648 | 6,60,471 | 6,25,105 | 7,08,203 |
12. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు | 1,91,781 | 2,07,333 | 1,91,737 | 2,06,500 |
13. మూలధన ఖాతా | 3,07,714 | 3,38,569 | 3,48,907 | 4,12,085 |
14. రెవెన్యూ లోటు (10-1) | 4,54,483 | 4,85,019 | 4,99,544 | 6,09,219 |
15. నికర రెవెన్యూలోటు (14-12) | 2,62,702 | 2,77,686 | 3,07,807 | 4,02,719 |
16. ద్రవ్య లోటు {9&(1+5+6)} | 6,49,418 | 7,03,760 | 7,66,846 | 7,96,337 |
17. ప్రాథమిక లోటు (16-11) | 66,770 | 43,289 | 1,41,741 | 88,134 |
ధరలు పెరిగేవి..
- సిగరెట్లు, హుక్కా, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులు
- విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెలు, ఫ్యాన్లు, టేబుళ్లు, ఫుట్‌వేర్, ఎలక్ట్రిక్ వాహనాలు, టేబుల్‌వేర్, కిచెన్‌వేర్, బొమ్మలు, ఫర్నిచర్ తదితర ఇంపోర్టెడ్ వస్తువులు
- దిగుమతి చేసుకునే బటర్ నెయ్యి, పీనట్ బటర్, చ్యూయింగ్ గమ్, షెల్‌తో ఉన్న వాల్‌నట్స్, సోయా ప్రొటీన్
- దిగుమతయ్యే ఫుట్‌వేర్, షేవర్స్, వాటర్ ఫిల్టర్, గ్లాస్‌వేర్, పింగాణీ పాత్రలు, జెమ్ స్టోన్‌స, వాటర్ హీటర్లు, హెరుుర్ డయ్యర్స్, ఎలక్ట్రిక్ ఐరన్‌స, ఒవెన్‌స, కుకర్స్, గ్రైండర్స్, కాఫీ, టీ మేకర్స్
- దిగుమతి చేసుకునే పీసీబీలు, మొబైల్ ఫోన్లు, డిస్‌ప్లే ప్యానళ్లు, మొబైల్స్‌లో వినియోగించే ఫింగర్‌ప్రింట్ రీడర్లు, ల్యాంపులు, లైటింగ్ ఫిట్టింగ్‌స, స్టేషనరీ వస్తువులు
ధరలు తగ్గేవి..
బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో దిగుమతి చేసుకునే న్యూస్‌ప్రింట్, క్రీడా పరికరాలు, మైక్రోఫోన్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు చౌక కానున్నాయి.
నిర్మలా బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- భారత్‌లో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి
- దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి
- ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ కీలకమైనది
- జీఎస్టీతో పన్ను వ్యవస్థలోకి కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు
- 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ప్రభుత్వ లక్ష్యం
- రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
- 100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
- 26 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు
- 16 లక్షలమంది రైతులకు గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్
- రైతుల సౌకర్యార్థం రిఫ్రిజిలేటర్‌తో కూడిన కిసాన్ రైలు ఏర్పాటు
- సివిల్ ఏవియేషన్ ద్వారా కూరగాయల సరఫరాకు కృషి ఉదాన్ పథకం
- జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్‌కు చేయూత
- ఆన్‌లైన్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయం
- గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన పథకం
- కొత్తగా ఇండస్టియ్రల్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ ఏర్పాటు
- మొబైల్ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం
- విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి
- ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు
- నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ యూనివర్సిటీలు ఏర్పాటు
- ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్ కాలేజీ
- మహిళలకు సరైన పెళ్లి వయస్సును సూచించేందుకు వీలుగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
- బేటీ బచావో బేటీ పఢావో గొప్ప విజయం సాధించింది
- కరెంటు బిల్లుల స్థానంలో త్వరలో స్మార్ట్ ప్రీపెరుుడ్ మీటర్లు
- చిన్న ఎగుమతిదారుల కోసం కొత్తగా నిర్విక్ పథకం
- ప్రైవేటు రంగంలో డేటా సెంటర్ పార్క్‌లు ఏర్పాటు
- ఐదు చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధి
- రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ.. పీపీపీ పద్ధతిలో 150 రైళ్లు
- వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు
- 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే పూర్తి
- ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు
- పెద్దసంఖ్యలో తేజాస్ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్ రైళ్లు
- కార్పొరేట్ ట్యాక్స్ 15శాతం తగ్గింపు
- ఆదాయపన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంపు
- బ్యాంకులు దివాలాతీస్తే డిపాజిట్లపై బీమా కవరేజీ ఇప్పుడున్న రూ.1 లక్ష - రూ.5 లక్షల వరకూ పెంపు
- ఆధార్ ప్రాతిపదికన పాన్ నంబరు కేటాయింపు
- పబ్లిక్ ఇష్యూతో ఎల్‌ఐసీలో వాటా విక్రయం
- డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా 2020-21లో నిధుల సమీకరణ లక్ష్యం రూ.1.2 లక్షల కోట్లు
- ప్రస్తుత ద్రవ్యలోటును గత అంచనా 3.3%-3.8 శాతానికి సవరణ. వచ్చే ఏడాదికి 3.5 శాతానికి పెంపు
- త్వరలో కొత్తగా జాతీయ విద్యా విధానానికి రూపకల్పన.
- భారత్ ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
- 2006-16 మధ్య దాదాపు 271 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు
- ఉపాధి హామీ పథకాన్ని పశుగ్రాస భూముల అభివద్ధికి ఉపయోగం
- ఎల్‌ఐసీలో వాటాల విక్రయం
- వివాద్ సే విశ్వాస్ పథకం కింద వివిధ సంస్థలకు ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులు దరఖాస్తు చేసుకొనే అవకాశం
- కంపెనీలపై డివిడెండ్ డిస్టిబ్య్రూషన్ పన్ను తొలగింపు
రంగం/శాఖ/పథకం | కేటాయింపులు(రూ. కోట్లలో) |
వ్యవసాయం, సంబంధిత రంగాలు | 1.6 లక్షలు |
గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ | 1.23 లక్షలు |
విద్యా రంగం | 99,312 |
నైపుణ్యాభివృద్ధి | 3000 |
ఆరోగ్య రంగం | 67,484 |
స్త్రీ, శిశు సంక్షేమం | 30,007.10 |
పౌష్టికాహార కార్యక్రమాలు | 35,600 |
షెడ్యూల్ కులాలు, ఓబీసీల సంక్షేమం | 85,000 |
షెడ్యూల్ తెగల సంక్షేమం | 53,700 |
వయో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం | 9,500 |
రక్షణ రంగం | 3.23,053 |
విదేశాంగ శాఖ | 17,347 |
స్వచ్చభారత్ | 12, 300 |
జల్ జీవన్ మిషన్ | 11,500 |
ప్రధాని జన ఆరోగ్య యోజన | 6, 429 |
పరిశ్రమలు, వాణిజ్యం | 27, 300 |
పవర్, పునరుత్పాదక ఇంధన రంగం | 22000 |
రవాణా రంగంలో మౌలిక సదుపాయాలు | 1.7 లక్షలు |
భారత్ నెట్ | 6000 |
మౌలిక వసతుల ప్రాజెక్టులు | 1.03 లక్షలు |
పర్యాటక శాఖ | 2,500 |
సాంస్కృతిక శాఖ | 3,150 |
జౌళిరంగం | 1,480 |
పర్యావరణ మంత్రిత్వ శాఖ | 4,400 |
పీఎం కిసాన్ పథకం | 75,000 |
ఉపాధి హామీ(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) | 61,500 |
సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ | 10,103.57 |
మెనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ | 5,000 |
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ | 2,827 |
వ్యవసాయ రంగం
2020-21 బడ్డెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1.6 లక్షల కోట్లు కేటాయించారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి నిర్మలా స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం 16 అంశాలతో కూడిన ప్రణాళికలను సిద్ధం చేశామమన్నారు. 2020-21 ఆర్థిక ఏడాదికి గాను వ్యవసాయం కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా రూ.15 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.
పీఎం-కిసాన్ యోజన
రైతులకు ఏటా మూడు దశలుగా మొత్తం రూ.6 వేలు చెల్లించేందుకు ఉద్దేశించిన పీఎం కిసాన్ పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఈ పథకం కోసం దాదాపు రూ.75 వేల కోట్లు కేటాయించారు. అయితే ఈ పథకం అమల్లో కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో రూ.54,300 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే కేటాయింపులు తగ్గినా రానున్న ఆర్థిక సంవత్సరపు అంచనాలను మాత్రం రూ.75 వేల కోట్లుగానే ఉంచారు.
మత్స్య ఉత్పత్తులపైనా ప్రత్యేక శ్రద్ధ..
2020 - 23 మధ్యకాలంలో మత్స్య ఉత్పత్తులను 200 లక్షల టన్నులకు పెంచేందుకు, 2024-25 నాటికి రూ.లక్ష కోట్ల విలువైన మత్స్య సంపదను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నిర్మలా తెలిపారు. దేశవ్యాప్తంగా 3,477 సాగర్ మిత్రలు, 500 ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లను ఏర్పాటు చేస్తామని, తద్వారా సముద్ర, జల ఉత్పత్తుల సమర్థ మార్కెటింగ్, గ్రామీణ యువతకు ఉపాధికల్పన సాధ్యమవుతుందని వివరించారు.
పీఎం కుసుమ్ ద్వారా సోలార్ పంపు సెట్లు
ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) కార్యక్రమం కింద 20 లక్షల మంది రైతులు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకునేందుకు సాయం అందిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. మరో 15 లక్షల మంది రైతులు ఏర్పాటు చేసుకునే సోలార్ పంపుసెట్ల నుంచి నెట్‌మీటరింగ్ పద్ధతి ద్వారా జాతీయ గ్రిడ్‌కు విద్యుత్తు సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. తద్వారా రైతులు కొంత అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా సాగునీటి లభ్యతపై ఒత్తిడి ఉన్న వంద జిల్లాలను గుర్తించి సమస్య పరిష్కారానికి సమగ్రమైన ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు.
మహిళా సంఘాలకు ‘ధాన్యలక్ష్మి’
గ్రామీణ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాల నిల్వకు మహిళా స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పిస్తామని, తద్వారా మహిళలను ధనలక్ష్ములుగా మాత్రమే కాకుండా ధాన్యలక్ష్ములుగానూ గుర్తిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పంట ఉత్పత్తులను దూర ప్రాంతాలకు చేరవేసేందుకు ‘కృషి ఉడాన్’పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో శీతలీకరణ వ్యవస్థలున్న ‘కిసాన్ రైళ్ల’ను నిర్మించి తొందరగా పాడైపోయే ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు. ఉద్యానవన పంటల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకూ ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం రాష్ట్రాల్లో ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’అన్న భావనను పెంపొందించేందుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
గ్రామీణ సంక్షేమ పథకాలు
ఉపాధి హామీ పథకం
2020-21 కేటాయింపు: రూ.61,500 కోట్లు
2019-20 కేటాయింపు: రూ. 60,000 కోట్లు (సవరించిన అంచనా రూ.71,001 కోట్లు)
1. ఉపాధి హామీకి గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈసారి స్వల్పంగా 2.5 శాతం పెరిగింది. సవరించిన అంచనాలతో పోలిస్తే భారీగా తగ్గింది.
2. చాలా రాష్ట్రాల్లో లక్ష్యాలను మించి ఉపాధి పనులను కల్పించడంతో అధికమొత్తంలో కేంద్రం నిధులను అందించాల్సి వచ్చింది.
3. ఏడాదిలో వందరోజుల పాటు కనీస ఉపాధి హామీని ఇవ్వడమే ఈ పథకం ప్రధానోద్దేశం.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన
2020-21 కేటాయింపు: రూ.4,500 కోట్లు
2019-20 కేటాయింపు: రూ.4,066 కోట్లు
- వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక ఫీడర్లు, డిస్కమ్‌లను అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ సబ్-ట్రాన్‌సమిషన్, పంపిణీ మౌలిక సదుపాయాల పెంపు... గ్రామీణ విద్యుదీకరణ కోసం ఈ పథకాన్ని రూపొందించారు.
- 2017లో సౌభాగ్య పథకం కింద 2.5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్‌ను అందించారు.
- ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్‌కు కేటాయింపులు రూ. 3970 కోట్ల నుంచి రూ. 5280 కోట్లకు పెంచారు.
- ఉజాల స్కీమ్ కింద పేద, మధ్యతరహా కుటుంబాలకు ఉచితంగా 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను ఇచ్చారు.
- ఎల్‌ఈడీ బల్బులతో ఏటా రూ.18,341 కోట్ల మేర విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయి.
2020-21 కేటాయింపు: రూ.12,300 కోట్లు
2019-20 కేటాయింపు(సవరించిన అంచనా): రూ. 9,638 కోట్లు.
- 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున మొదలైన ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 9.6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు.
- బహిరంగ మలవిసర్జన(ఓడీఎఫ్) అలవాటు దాదాపు కనుమరుగైంది. ఓడీఎఫ్ రహిత గ్రామాల సంఖ్య 5.6 లక్షలకు చేరింది.
- గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98 శాతం శానిటేషన్ కవరేజ్ కల్పన.
- పట్టణాల్లో 95 శాతం ఓడీఎఫ్ రహితంగా మారినట్లు అంచనా. ఇప్పుడు 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- దేశవ్యాప్తంగా 1,700 నగరాలు, పట్టణాల్లో 45,000 ప్రజా, కమ్యూనిటీ మరుగుదొడ్లను గుర్తించేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్‌కు అనుసంధానించారు.
- పూర్తిగా ఓడీఎఫ్ రహితంగా మారిన గ్రామాలు, పట్టణాల్లో దీన్ని కచ్చితంగా అమలయ్యేవిధంగా చూడటం కూడా ఈ పథకంలో భాగమే.
- ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల(చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా ఈ స్వచ్ఛ భారత్ పథకం కిందకు తీసుకొచ్చారు.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన
2020-21 కేటాయింపు: రూ.19,500 కోట్లు
2019-20 కేటాయింపు: రూ. 19,000 కోట్లు (సవరించిన అంచనా రూ.14,071 కోట్లు)
- దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,67,152 ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించారు.
- పీఎంజీఎస్‌వై రెండో దశలో రోడ్లను మెరుగుపరడం, మావోరుుస్టుల ప్రభావిత జిల్లాల్లో కల్వర్టులు, ఇతర సదుపాయాలు కల్పిస్తారు.
- 2019 డిసెంబర్ 31 నాటికి మొత్తం రెండు దశలకింద 6,08,899 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం, అప్‌గ్రేడేషన్‌ను పూర్తి చేశారు.
- వచ్చే ఐదేళ్లలో 1,25,000 కిలోమీటర్ల రోడ్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీనికి రూ.80,250 కోట్లు వెచ్చించనున్నారు. 2019-20లో ఇందుకు 13 రాష్ట్రాలను ఎంపిక చేశారు.
గ్రామీణ టెలిఫోనీ
2020-21 కేటాయింపు: రూ.6,000 కోట్లు
2019-20 కేటాయింపు (సవరించిన అంచనా): రూ. 2,000 కోట్లు
- భారత్ నెట్ ఫేజ్1 కింద 1,21,652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ కనెక్టివిటీ పూర్తి. 1.16లక్షల పంచాయతీల్లో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
- దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్ లభించింది. దీన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని(పీపీపీ) జోడించనున్నారు.
- ఐదు కోట్లమంది గ్రామీణులకు లబ్ధి చేకూరేలా 5 లక్షల వైఫై స్పాట్స్ ఏర్పాటు లక్ష్యం.
- 2020-21 ఆర్థిక సంవత్సరంలో మరో 1,00,000 గ్రామ పంచాయతీలకు ఫైబర్ ఆఫ్టిక్ నెట్‌వర్క్‌ను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్‌లో ప్రకటించారు.
జల్ జీవన్ మిషన్
2020-21 కేటాయింపులు: రూ.11,500 కోట్లు
2019-20 కేటాయింపులు: రూ. 10,001 కోట్లు
- దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని(హ్యాండ్ పంపులు, పైపులు ఇతరత్రా మార్గాల్లో) అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం.
- గతేడాది బడ్జెట్‌లో జల్ జీవన్ మిషన్‌ను ప్రకటించారు. దీనిలో భాగంగా రూ.3.6 లక్షల కోట్ల నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీతారామన్ బడ్జెట్‌లో తెలిపారు. ఈ ఏడాది రూ.11,500 కోట్లను కేటాయించినట్లు వివరించారు.
- స్థానిక స్థారుులో సమీకృత డిమాండ్, సరఫరా నిర్వహణ యంత్రాంగం; వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తగిన మౌలిక వసతుల కల్పన, భూగర్భజలాల పెంపు, సముద్రపునీటిని మంచినీరుగా మార్చడం(డీశాలినేషన్) కూడా జల్‌జీవన్ మిషన్‌లో భాగమే.
- 10 లక్షల జనాభా దాటిన నగరాలన్నింటినీ దీని అమలుకు ప్రోత్సహించనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.
ఇంటికి ఇంకాస్త ఆసరా...
2020-21 కేటాయింపులు: రూ.19,500 కోట్లు
2019-20 కేటాయింపులు(సవరించిన అంచనా): రూ. 18,475 కోట్లు
2020-21 కేటాయింపులు: రూ.19,500 కోట్లు
2019-20 కేటాయింపులు(సవరించిన అంచనా): రూ. 18,475 కోట్లు
- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో భాగంగా 2022 కల్లా దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని బలహీనవర్గాలందరికీ పక్కా ఇళ్లను కట్టివ్వాలనేది కేంద్ర ప్రభుత్వ తాజా లక్ష్యం.
- పీఎంఏవై తొలి దశను 2016-17 నుంచి 2018-19 వరకూ మూడేళ్లపాటు అమలుచేశారు. గడిచిన ఐదేళ్లలో 1.54 కోట్ల ఇళ్లను నిర్మించారు.
- ఇప్పుడు రెండో దశ కింద 2019-20 నుంచి 2021-22 మధ్య 1.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.1,56,634 కోట్లను వెచ్చించనున్నారు.
- అంతేకాదు ఈ ఇళ్లకు మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు కూడా ఉచితంగా కల్పించనున్నారు.
ఆరోగ్య రంగం
పౌరుల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలోని ప్రతీ జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని వెల్లడించారు. 2020-21 ఏడాదికి ఆరోగ్య రంగానికి రూ. 67,484 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. గత బడ్జెట్‌తో పోల్చి చూస్తే ఆరోగ్య రంగ నిధుల్ని 8శాతం పెంచారు.
వైద్య రంగం - ముఖ్యాంశాలు..
- మిషన్ ఇంద్ర ధనుష్ (ప్రభుత్వ వాక్సినేషన్ కార్యక్రమం) కింద అయిదు వైరస్‌లు సహా 12 కొత్త తరహా వ్యాధుల్ని తీసుకువచ్చారు.
- ఆయుష్మాన్ భారత్ కిందకి వచ్చే ఆసుపత్రుల సంఖ్యను టైర్ 2, టైర్ 3 నగరాల్లో పెంచాలని నిర్ణయం. ప్రస్తుతం ఈ పథకం కింద 20 వేలకుపైగా ఆసుపత్రులు ఉన్నారుు. మరో వెరుు్య ఆస్పత్రులు పెంచడానికి చర్యలు
- ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా స్థాయిలో మెడికల్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడం.
- ప్రజలకు అందుబాటు ధరల్లో మందులు దొరికేలా అన్ని జిల్లాల్లో జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు. జనరిక్ మెడిసిన్‌సని విక్రయించే ఈ దుకాణాలను నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు.
- వైద్య పరికరాల దిగుమతులు, విక్రయం ద్వారా వచ్చే పన్నుల్ని ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగం. కొన్ని నిర్దిష్ట వైద్య పరికరాల దిగుమతులపై 5శాతం ఆరోగ్య సెస్ విధింపు. ప్రస్తుతం భారత వైద్య పరికరాల రంగం 80 నుంచి 90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడింది.
- క్షయ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అన్న నినాదంతో ట్యూబర్ కొలాసిస్ (టీబీ)పై పోరుబాట. 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం అడుగులు.
తాజ బడ్జెట్‌లో ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై)కు రూ.6,400 కోట్లు కేటాయించారు. ఈ పథకాన్ని విస్తరించడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు (పీపీపీ) భాగస్వామ్యంతో ఆయుష్మాన్ భారత్ పథకం కింద మరిన్ని ఆస్పత్రులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ఆస్పత్రుల ఏర్పాటు ప్రైవేటు వ్యక్తులకి లాభదాయం కాకపోతే వయబిలిటీ గ్యాప్ కింద ప్రభుత్వమే నిధుల్ని సమకూరుస్తుంది. దీని కోసం దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ఎంపిక చేస్తారు.
2018లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. భారత్ జనాభాలో దాదాపుగా 40శాతం మందికి లబ్ధి చేకూరేలా, నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్‌స కవరేజీ ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. 10.74 కోట్ల కుటుంబాలకు చెందిన దాదాపుగా 50 కోట్ల మంది ఈ పథకం లబ్ధి దారులుగా ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019, నవంబర్ 25 నాటికి ఆయుష్మాన్ భారత్ కింద 11.4 కోట్ల మందికి ఇ-కార్డుల్ని జారీ చేశారు.
విద్యారంగం
త్వరలో నూతన విద్యా విధానం తీసుకురాబోతున్నామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇందుకోసం 2020-21 బడ్జెట్‌లో రూ.99,312 కోట్లు విద్యారంగానికి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేకంగా మరో రూ.3000 కోట్లు నైపుణ్యాభివృద్ధికి వెచ్చిస్తామన్నారు. కేంద్ర ఆరోగ్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఎంట్రప్రెన్యూర్ షిప్ శాఖల సహకారంతో స్కిల్ ఇండియా మిషన్ కార్యక్రమం చేపడతామన్నారు.
విద్యారంగం-ముఖ్యాంశాలు
- ఉన్నత విద్య అందుబాటులో లేని బలహీన, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలో టాప్ 100 విద్యాసంస్థల ద్వారా ఈ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీతారామన్ ప్రకటించారు.
- ఉన్నత విద్యాభ్యాసానికి భారత్ కేంద్రంగా మారాలన్న తలంపుతో ‘స్టడీ ఇన్ ఇండియా’ ను రూపొందించారు. ఇందులో భాగంగా ఐఎన్‌డీ- ఎస్‌ఏటీ పరీక్షను నిర్వహిస్తారు. ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రతిభ గలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తారు.
- ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు.
- ఆర్థికంగా వెనకబడి, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందించేందుకు డిగ్రీ స్థారుులో పూర్తిస్థారుు ఆన్‌లైన్ విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.
- విద్య అనంతరం ఉద్యోగ అవకాశాలు పెరగాలంటూ డిమాండ్లు పెరుగుతున్న దరిమిలా.. 2021 మార్చి నెలనాటికి 150 ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అప్రెంటిష్ షిప్‌తో కూడిన డిగ్రీ, డిప్లొమా కోర్సులను కూడా ప్రవేశపెట్టబోతున్నారని ప్రకటించారు.
- జాతీయ పోలీసు యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నారు. పబ్లిక్‌ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టే ఈ కార్యక్రమంలో ఈ యూనివర్శిటీలను జిల్లా మెడికల్ కాలేజీలతో అనసంధానిస్తామని, దీనివల్ల మెరుగైన వైద్యసేవలు లభిస్తాయి.
స్త్రీ, శిశు సంక్షేమం
మహిళల అభ్యున్నతి, శిశువుల వికాసానికి 2020-21 బడ్జెట్‌లో కేంద్రం నిధుల కేటాయింపులను పెంచింది. గత ఏడాది కంటే ఈ పెంపు ఏకంగా 14 శాతం అధికం. 2019-20లో కేటాయింపులు రూ.26,184.50 కోట్లు కాగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.30,007.10 కోట్లు కేటారుుంచినట్లు మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఇందులో రూ.20,532.38 కోట్లను అంగన్‌వాడీ సేవలకే వినియోగించనున్నారు.
స్త్రీ, శిశు సంక్షేమం-ప్రధానాంశాలు
మహిళల అభ్యున్నతి, శిశువుల వికాసానికి 2020-21 బడ్జెట్‌లో కేంద్రం నిధుల కేటాయింపులను పెంచింది. గత ఏడాది కంటే ఈ పెంపు ఏకంగా 14 శాతం అధికం. 2019-20లో కేటాయింపులు రూ.26,184.50 కోట్లు కాగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.30,007.10 కోట్లు కేటారుుంచినట్లు మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఇందులో రూ.20,532.38 కోట్లను అంగన్‌వాడీ సేవలకే వినియోగించనున్నారు.
స్త్రీ, శిశు సంక్షేమం-ప్రధానాంశాలు
- నేషనల్ న్యూట్రిషన్ మిషన్‌కు(పోషణ్ అభియాన్) కేటాయింపులను రూ.3,400 కోట్ల నుంచి రూ.3,700 కోట్లకు పెంచారు. పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా.. ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న ఆరేళ్ల లోపు చిన్నారుల సంఖ్యను 2022 నాటికి 38.4 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
- లైంగిక వేధింపులు, హింస బారినపడే బాధిత మహిళలకు వైద్య సహాయం, న్యాయ, పోలీసు సహాయం, కౌన్సెలింగ్ అందించేందుకు ఉద్దేశించిన ‘వన్ స్టాప్ సెంటర్’కు కేటాయింపులను రూ.204 కోట్ల నుంచి రూ.385 కోట్లకు పెంచారు.
- ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై) పథకానికి 2019-20లో రూ.2,300 కోట్లు కేటాయించగా, 2020-21లో రూ.2,500 కోట్లు కేటారుుంచారు. ఈ పథకం కింద గర్భిణికి/పాలిచ్చే తల్లికి రూ.6,000 అందజేస్తారు.
- సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో(ఐసీడీఎస్) భాగంగా శిశువుల రక్షణకు నిధుల కేటాయింపులను రూ.1,350 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచారు.
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘బేటీ బచావో.. బేటీ పడావో’కార్యక్రమానికి రూ.220 కోట్లు కేటాయించారు.
- మహిళా శక్తి కేంద్రాలకు రూ.100 కోట్లు ఇచ్చారు. గత ఏడాది ఇచ్చింది రూ.50 కోట్లే. అంటే కేటాయింపులను ఈసారి రెట్టింపు చేశారు.
- వర్కింగ్ ఉమెన్‌స హాస్టళ్ల పథకానికి నిధుల కేటారుుంపులను రూ.45 కోట్ల నుంచి ఏకంగా రూ.150 కోట్లకు పెంచేశారు.
- మహిళల అక్రమ రవాణా నియంత్రణ, సహాయ పునరావాసానికి ఉద్దేశించిన ఉజ్వల పథకానికి కేటాయింపులను రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పెంచారు.
- మహిహిళ రక్షణ, సాధికారత మిషన్‌కు గత ఏడాది రూ.961 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,163 కోట్లు కేటాయించారు.
- నేషనల్ క్రెష్ స్కీమ్‌కు కేటాయింపులను రూ.50 కోట్ల నుంచి రూ.75 కోట్లకు పెంచారు. ఈ పథకం కింద.. ఉద్యోగులైన మహిళలు పని వేళల్లో తమ పిల్లలను శిశు సంరక్షణ కేంద్రాల్లో చేర్పించవచ్చు.
- బేటీ బచావో- బేటీ పడావో పథకం బాగా విజయవంతమైందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పారు. ప్రస్తుతం పాఠశాలల్లో స్థూల బాలికల నమోదు గణాంకాలు(94.32 శాతం) బాలుర గణాంకాల(89. 28 శాతం)కన్నా మెరుగయ్యాయని చెప్పారు.
- పౌష్టికాహార కార్యక్రమాల కోసం రూ. 35,600 కోట్లు, స్త్రీ సంక్షేమ పథకాలకు రూ. 28,600 కోట్లు కేటాయించారు.
- షెడ్యూల్ కులాల సంక్షే మం, ఓబీసీల సంక్షేమానికి రూ. 85 వేల కోట్లను, షెడ్యూల్ తెగల కోసం రూ. 53700 కోట్లను కేటాయించారు.
- దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ. 9,500 కోట్లు అందించనున్నారు.
- సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు రూ. 10,103.57 కోట్లను కేటారుుంచారు. గత బడ్జెట్లో ఈ మొత్తం రూ. 8,885 కోట్లు.
- మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు.
- బాలల కోసం కేటాయింపులు గత బడ్జెట్‌తో పోలిస్తే 0.13 శాతం తగ్గారుు.
దేశ ఆర్థిక అభివృద్ధికి చోదకశక్తి లాంటి మౌలిక వసతుల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే రూ.103 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులను ప్రారంభించిందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. తాజా బడ్జెట్‌లో రవాణా రంగంలో మౌలిక వసతులు, హైవేలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌లో రూ.1.70 లక్షల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ మౌలిక వసతుల పైప్‌లైన్ (ఎన్‌ఐపీ) కోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించామన్నారు.
ప్రధానాంశాలు
- 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేతోపాటు మరో రెండు ప్యాకేజీలు పూర్తవుతాయి.
- చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రహదారి పనులు ప్రారంభిస్తాం.
- 27,000 కి.మీ మేర విద్యుదీకరణను పూర్తి చేసే దిశగా రైల్వేలు కృష్టి చేస్తున్నాయి.
- 2015-16లో రోజుకు 17 కి.మీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరగగా 2018-19 నాటికి ఇది 29.7 కి.మీ.కి పెరిగింది
- పర్యాటక ప్రాంతాలను అనుసంధానించేలా మరిన్ని తేజాస్ రైళ్లు.
- ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైళ్లపై చురుగ్గా పరిశీలన.
- ‘ఉడాన్’పథకం ద్వారా 2024 నాటికి మరో వంద విమానాశ్రయాల అభివృద్ధి.
- ఇంధనం, పునరుత్పాదక వనరులకు బడ్జెట్‌లో రూ.22,000 కోట్లు
- 9,000 కి.మీ మేర ఆర్థిక కారిడార్
- 2,000 కి.మీ మేర తీర ప్రాంత రహదారులు, హైవేల అభివృద్ధి.
రైల్వేలకు రూ.70,000 కోట్లు
ప్రైవేటు రైళ్లు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని రైళ్లు, వేగంగా పాడయ్యే పదార్థాల రవాణా.. ఇవీ రైల్వేల కోసం 2020-21 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ముఖ్యమైన ప్రతిపాదనలు. రూ.70,000 కోట్ల బడ్జెట్‌తో వీటిని అమలు చేస్తారు. గత ఏడాది సవరించిన బడ్జెట్ రూ.69,967 కోట్లు. ఇక రైల్వే విస్తరణ ప్రణాళికలను కొనసాగించేందుకు మూలధన వ్యయాన్ని ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 1.61 లక్షల కోట్లకు పెంచారు.
రిఫ్రిజిరేటర్ కోచ్‌లతో కిసాన్ రైలు
రైతుల కోసం తెచ్చే ‘కిసాన్ రైల్‌లో రిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పదార్థాలను తరలించడానికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. పాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి దేశ వ్యాప్తంగా ఆటంకాలు లేని జాతీయ సప్లయ్ చెయిన్ నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు, గూడ్‌స రైళ్లకు కూడా రిఫ్రిజిరేటర్ కోచ్‌లను అనుసంధానిస్తారు.
కొత్త లైన్లకు రూ.12 వేల కోట్లు
మౌలిక సదుపాయాల అభివృద్ధి కోణంలో కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 12,000 కోట్లను బడ్జెట్‌లో కేటారుుంచారు. గేజ్ మార్పునకు రూ. 2,250 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 5,786.97 కోట్లు, సిగ్నలింగ్, టెలికం వ్యవస్థకు రూ. 1,650 కోట్లు కేటారుుంచారు. ప్రయాణికుల సదుపాయాల కల్పనకు రూ. 2,725.63 కోట్లు కేటాయించారు. సరుకు రవాణా 1,265 మెట్రిక్ టన్నులు ఉండవచ్చు. ప్రయాణికులు, సరుకు రవాణా ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని రూ. 2.25 లక్షల కోట్లుగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల నుంచి రూ. 61 వేల కోట్లు, సరుకు రవాణా నుంచి రూ. 1.47 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
రక్షణ రంగం
బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో దేశ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ. 3,23,053 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరం రక్షణ రంగానికి రూ.3.16 లక్షల కోట్లు కేటాయించారు. తాజా బడ్జెట్‌లో కొత్త ఆయుధాల కొనుగోలు, యుద్ధ విమానాలూ, యుద్ధనౌకలు, ఇతర సైనిక పరికరాలు కొనుగోలు చేయడానికి మూలధన వ్యయం కోసం రూ. 1.13 లక్షల కోట్లు కేటాయించారు. రక్షణ రంగ ఉద్యోగులకు పెన్షన్లకు కేటాయించిన రూ.1.33 కోట్లు కలుపుకుంటే రక్షణ రంగానికి మొత్తం కేటాయింపులు 4.71 లక్షల కోట్ల రూపాయలకు చేరతాయి.
గత పదేళ్ళలో రక్షణ రంగానికి కేటాయింపులు (రూ.కోట్లలో)
రిఫ్రిజిరేటర్ కోచ్‌లతో కిసాన్ రైలు
రైతుల కోసం తెచ్చే ‘కిసాన్ రైల్‌లో రిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పదార్థాలను తరలించడానికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. పాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి దేశ వ్యాప్తంగా ఆటంకాలు లేని జాతీయ సప్లయ్ చెయిన్ నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు, గూడ్‌స రైళ్లకు కూడా రిఫ్రిజిరేటర్ కోచ్‌లను అనుసంధానిస్తారు.
కొత్త లైన్లకు రూ.12 వేల కోట్లు
మౌలిక సదుపాయాల అభివృద్ధి కోణంలో కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 12,000 కోట్లను బడ్జెట్‌లో కేటారుుంచారు. గేజ్ మార్పునకు రూ. 2,250 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 5,786.97 కోట్లు, సిగ్నలింగ్, టెలికం వ్యవస్థకు రూ. 1,650 కోట్లు కేటారుుంచారు. ప్రయాణికుల సదుపాయాల కల్పనకు రూ. 2,725.63 కోట్లు కేటాయించారు. సరుకు రవాణా 1,265 మెట్రిక్ టన్నులు ఉండవచ్చు. ప్రయాణికులు, సరుకు రవాణా ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని రూ. 2.25 లక్షల కోట్లుగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల నుంచి రూ. 61 వేల కోట్లు, సరుకు రవాణా నుంచి రూ. 1.47 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
రక్షణ రంగం
బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో దేశ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ. 3,23,053 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరం రక్షణ రంగానికి రూ.3.16 లక్షల కోట్లు కేటాయించారు. తాజా బడ్జెట్‌లో కొత్త ఆయుధాల కొనుగోలు, యుద్ధ విమానాలూ, యుద్ధనౌకలు, ఇతర సైనిక పరికరాలు కొనుగోలు చేయడానికి మూలధన వ్యయం కోసం రూ. 1.13 లక్షల కోట్లు కేటాయించారు. రక్షణ రంగ ఉద్యోగులకు పెన్షన్లకు కేటాయించిన రూ.1.33 కోట్లు కలుపుకుంటే రక్షణ రంగానికి మొత్తం కేటాయింపులు 4.71 లక్షల కోట్ల రూపాయలకు చేరతాయి.
గత పదేళ్ళలో రక్షణ రంగానికి కేటాయింపులు (రూ.కోట్లలో)
ఏడాది | రక్షణ రంగ కేటాయింపులు | క్యాపిటల్ వ్యయం | శాతంలో |
2009-10 | 1,80,018 | 51,112 | 28 శాతం |
2010-11 | 1,94,606 | 62,056 | 32 శాతం |
2011-12 | 2,13,673 | 67,092 | 32 శాతం |
2012-13 | 2,30,642 | 70,499 | 31 శాతం |
2013-14 | 2,54,133 | 79.125 | 31 శాతం |
2014-15 | 2,85,005 | 73,401 | 26 శాతం |
2015-16 | 2,93,920 | 71,675 | 24 శాతం |
2016-17 | 3,51,550 | 86,375 | 25 శాతం |
2017-18 | 3,79,704 | 90,438 | 24 శాతం |
2018-19 | 4,05,199 | 93,982 | 23 శాతం |
2019-20 | 4,31,011 | 1,03,394 | 24 శాతం |
విదేశాంగ శాఖ
విదేశాంగ శాఖకు 2020-21 బడ్జెట్‌లో రూ.17,346.71 కోట్లు కేటాయించారు. రూ.100 కోట్లను ఇరాన్‌లో నిర్మిస్తున్న ఛాబహర్ పోర్టు ప్రాజెక్టు కోసం ఖర్చు చేయనున్నారు. ఇతర దేశాలకు అందజేసే ఆర్థిక సాయం కింద రూ.6,907 కోట్లు కేటాయించారు. నేపాల్‌కు 2019-20లో రూ.1,200 కోట్లు ఇవ్వగా, 2020-21లో రూ.8,00 కోట్లు ఇవ్వనున్నారు. మయన్మార్‌కు సాయాన్ని రూ.170 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచారు. భూటాన్‌కు 2020-21లో రూ.2,884.65 కోట్లు ఇవ్వనున్నారు. మాల్దీవులకు సైతం సాయాన్ని రూ.75 కోట్ల నుంచి ఏకంగా రూ.1,025 కోట్లకు పెంచేశారు. ఎరుురిండియా ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణకు 2019-20లో రూ.188 కోట్లు వెచ్చించారు. 2020-21 బడ్జెట్‌లో ఇందుకోసం రూ.150 కోట్లు కేటాయిచారు.
ద్రవ్యలోటు లక్ష్యం సడలింపు
2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 3.3 శాతంగా నిర్దేశించిన ప్రభుత్వం... ఇప్పుడు దీన్ని 3.8 శాతానికి సడలించింది. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21) ద్రవ్యలోటు లక్ష్యాన్ని కూడా గతంలో 3 శాతంగా అంచనావేయగా... దీన్ని ఇప్పుడు 3.5 శాతానికి పెంచేసింది. దీనివల్ల మార్కెట్ నుంచి 2020-21లో ఏకంగా రూ.5.36 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం నిర్ణయిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 -20) రుణ సమీకరణను కూడా రూ.4.99 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు.
ఆదాయపు పన్ను రేట్లు తగ్గింపు
పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం ఉన్న 4 శ్లాబులను 7 శ్లాబులుగా మారుస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో ప్రతిపాదించారు. కొత్తగా ప్రతిపాదించిన 7 శ్లాబుల విధానంలో పన్ను రేట్లు మునుపటికన్నా తగ్గుతాయి. కాకపోతే మునుపటి మాదిరి ట్యూషన్ ఫీజు, హెచ్‌ఆర్‌ఏ, గృహ రుణంపై వడ్డీ, స్టాండర్డ్ డిడక్షన్, బీమా పాలసీలకు చెల్లించే మొత్తం, పీఎఫ్ వంటి మినహాయింపులేవీ ఈ విధానంలో ఉండవు. మరోవైపు ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో ఉన్న లక్షలాది కేసులను పరిష్కరించడానికి ‘వివాద్ సే విశ్వాస్’ పేరుతో ప్రత్యేక ప్రథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.
ఐటీ శ్లాబులు ఇలా..
ఆదాయ పరిమితి | పాత రేట్లు | కొత్త రేట్లు |
0- 2.5 లక్షలు | లేదు | లేదు |
2.5- 5 లక్షలు | 5% | 5% |
5- 7.5 లక్షలు | 20% | 10% |
7.5- 10 లక్షలు | 20% | 15% |
10- 12.5 లక్షలు | 30% | 20% |
12.5- 15 లక్షలు | 30% | 25% |
15 లక్షలు దాటితే | 30% | 30% |
కేంద్ర సాంస్కృతిక శాఖకు రూ.3,150 కోట్లు
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్, కన్జర్వేషన్’ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ సంస్థకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించనున్నారు. 2020-21 బడ్జెట్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖకు రూ.3,150 కోట్లు, పర్యాటక శాఖకు రూ.2,500 కోట్లు కేటాయించారు. దేశంలో కొత్తగా 8 ప్రదర్శనశాలలు(మ్యూజియమ్స్) ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త మ్యూజియాలకు రూ.109 కోట్లు, ప్రస్తుతమున్నవాటి అభివృద్ధికి రూ.180 కోట్లు కేటాయించారు.
ప్రదర్శనశాలలుగా ఐదు చారిత్రక ప్రదేశాలు
దేశంలో వివిధ రాష్ట్రంలో ఉన్న ఐదు చారిత్రక ప్రదేశాలను ప్రదర్శనశాలలుగా(ఆన్‌సైట్ మ్యూజియమ్స్) అభివృద్ధి చేయనున్నారు. హరియాణాలోని రాఖీగార్హీ, ఉత్తరప్రదేశ్‌లోని హస్తినాపురం, అస్సాంలోని శివసాగర్, గుజరాత్‌లోని డోలావిరా, తమిళనాడులోని అడిచనళ్లూరును అత్యుత్తమ ప్రదర్శనశాలలుగా మారుస్తామని చెప్పారు. ప్రాచీన కాలంలో భారత ఉపఖండంలో మహోజ్వలంగా వెలుగొందిన హరప్పా నాగరికతకు చెందిన ఐదు గొప్ప నగరాల్లో రాఖీగార్హీ ఒకటి. మహాభారత కాలంలో హస్తినాపురం ఒక వెలుగు వెలిగింది. 1699 నుంచి 1788 వరకూ అహోమ్ సామ్రాజ్య రాజధాని శివసాగర్. హరప్పా నాగరికతలో డోలావిరాకు ప్రముఖ స్థానం ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రాచీన కాలంలో అచినళ్లూరులో గొప్ప నాగరికత విలసిల్లింది. ఇక్కడ నిర్వహించిన తవ్వకాల్లో ఇనుప ఆయుధాలు, బంగారం, ఇత్తడి నగలు, రాళ్లతో చేసిన పూసలు వెలుగు చూశారుు.
గాలిలో స్వచ్ఛత రూ. 4,400 కోట్లు
వాయు కాలుష్యాన్ని నివారించేందుకు, గాలిలో స్వచ్ఛతను కాపాడేందుకు బడ్జెట్‌లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు రూ. 4,400 కోట్లను కేంద్రం కేటాయించింది. దీనిలో భాగంగా పాతబడిన, కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండని థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లను మూసేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ ప్లాంట్ల భూమిని వేరే అవసరాలకు వాడనున్నారు. ‘10 లక్షలు దాటిన జనాభా ఉన్న పెద్ద పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి లభ్యత కష్టం. పెద్ద పట్టణాల్లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రణాళికలు రూపొందించే రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది.’ అని నిర్మల తెలిపారు.
ఇంధన రంగానికి రూ. 22,000 కోట్లు
పవర్, పునరుత్పాదక ఇంధన రంగానికి ఈ బడ్జెట్‌లో రూ. 22,000 కోట్లు కేటాయించారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు రూపంలో ప్రోత్సాహకాన్ని సమకూర్చుతామన్నారు.
జమ్మూకశ్మీర్ రూ. 30,757 కోట్లు
కేంద్ర బడ్జెట్‌లో జమ్మూకశ్మీర్, లదాఖ్‌లకు కేంద్రం భారీగా నిధులను కేటాయించింది. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి రూ. 30,757 కోట్లను, లదాఖ్‌కు రూ. 5,958 కోట్లను కేంద్రం ప్రకటించింది. జమ్మూకశ్మీర్లో కేంద్రపాలిత ప్రాంతాల విపత్తు నిధి కోసం రూ.279 కోట్లు, ఆర్థిక అంతరాలను పూడ్చేందుకు రూ. 30,475 కోట్లను కేంద్రం వెచ్చించనుంది. లదాఖ్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 83.38 కోట్ల రూపాయలు, ఇతర ప్రజా ప్రయోజక కార్యక్రమాల కోసం రూ. 80.69 కోట్లు, విద్యుత్ అవసరాలకు రూ.54.07 కోట్లు, పౌరవిమానయానం కోసం రూ.52 కోట్లు, ర్యాటక రంగం అభివృద్ధికి రూ. 47.50 కోట్లు కేటాయించారు.
స్మార్ట్ విద్యుత్ మీటర్లు
సంప్రదాయ విద్యుత్ మీటర్లను ప్రీపెరుుడ్ స్మార్ట్ మీటర్లుగా వచ్చే మూడేళ్లలో మార్చాలని రాష్ట్రాలను నిర్మల కోరారు. దీనివల్ల తమకు నచ్చిన సరఫరాదారును, రేట్లను నిర్ణరుుంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు వస్తుందని ఆమె తెలిపారు.
స్టార్టప్‌లకు జోష్
స్టార్టప్‌లకు ఊతమిచ్చే దిశగా.. ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఎసాప్స్)పై అరుుదేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. ఎసాప్స్‌కి సంబంధించి ఉద్యోగులపై తక్షణ పన్ను భారం పడకుండా అరుుదేళ్ల పాటు లేదా వారు సంస్థ నుంచి తప్పుకునే దాకా లేదా విక్రరుుంచే దాకా (ఏది ముందైతే అది) ట్యాక్స్ హాలిడే వర్తిస్తుంది అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, లాభాలపై పన్ను మినహారుుంపులను పొందేందుకు సంబంధించి కంపెనీల టర్నోవరు పరిమితిని రూ. 25 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెంచారు.
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 1.2 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2020-21) డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.2 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.పస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సమీకరించనున్న రూ. 65,000 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.
మరికొన్ని ముఖ్యాంశాలు
- భారత్ ఇప్పుడు ప్రపంచంలో అయిదో ఆర్థిక వ్యవస్థగా(దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్లు) ఎదిగింది.
- పూర్తిగా నిర్మితమై (సీబీయూ) దేశంలోకి దిగుమతి అయ్యే వాణిజ్య విద్యుత్ వాహనాలపై 2020 ఏప్రిల్ 1 నుంచి కస్టమ్స్ డ్యూటీ ప్రస్తుతమున్న 25 శాతం స్థానంలో 40 శాతం అమలవుతుంది.
- విదేశాల్లోనే కొంత వరకు నిర్మాణం పూర్తి చేసుకుని (ఎస్‌కేడీ) దిగుమతి అయ్యే ప్యాసింజర్ విద్యుత్ వాహనాలపై సుంకం 15 నుంచి 30 శాతానికి పెరుగుంది.
- వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ రంగంలోని పలు విభాగాల్లో 2.62 లక్షల ఉద్యోగాలు కొత్తగా సృష్టిస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు.
- ఈ-కామర్స్ లావాదేవీలపై కొత్తగా 1 శాతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) విధింపు.
- స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లెసైన్సు ఫీజు బకాయిల రూపంలో టెలికం రంగం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 1.33 లక్షల కోట్ల మేర రాగలవని కేంద్రం అంచనా వేస్తోంది.
- దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల నిర్మాణానికి తగిన విధానాన్ని సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నిర్మలా తెలిపారు.
- 2020-21 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రపతి కార్యాలయ నిర్వహణ, ఉద్యోగులు, అలవెన్సుల కోసం రూ. 80.98 కోట్లను కేటాయించారు.
- ప్రధాని నరేంద్ర మోదీకి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) బడ్జెట్ రూ.600 కోట్లకు చేరుకుంది. 2020-21లో ఈ మేరకు కేటాయింపులు జరిపారు.
- బ్యూరోక్రాట్ల దేశీ, విదేశీ శిక్షణ, కోసం దాదాపు రూ. 238 కోట్లను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది.
- సంపద సృష్టికర్తలకు దేశంలో కచ్చితంగా సముచిత గౌరవం దక్కుతుందని, ఈ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని సీతారామన్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు తప్పని నిరాశ
కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంకు నిధులు కేటాయించలేదు. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీ కోత పడింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42 శాతం ఇవ్వాలని ఉండగా ఆ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.34,833.18 కోట్లు కేటాయించింది. కానీ, ఇప్పుడు సవరించిన అంచనా మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కేవలం 28,242.39 కోట్లేనని కేంద్రం పేర్కొంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి వస్తాయనుకున్న నిధుల్లో రూ.6,590.79 కోట్ల మేర కోత పడింది.
తెలంగాణ ఆశలు అడియాశలు
కేంద్ర బడ్జెట్ మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి నిరాశే మిగిల్చింది. కేంద్ర ప్రశంసలు అందుకున్న పథకాలకు నిధులు ఇస్తుందని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వ ఆశలు అడియాశలయ్యాయి. పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బకారుులు, ఐజీఎస్టీ చెల్లింపులు, పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.35 వేల కోట్ల వరకు అదనపు నిధులు కేటాయిస్తారని ప్రభుత్వం ఆశించింది. కానీ తెలంగాణకు రూ.16 వేల కోట్ల పన్నుల వాటానే కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీంతో ప్రస్తుత సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు వచ్చే ఏడాది నిధుల కటకట తప్పదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
పన్నుల వాటాలో కోత..
పన్నుల వాటాలోనూ కేంద్రం తెలంగాణకు కోత పెట్టింది. మొత్తం పన్ను వాటాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.437 శాతం ఇవ్వగా, దాన్ని 2.133 శాతానికి కుదించింది. 2019-20లో రూ.17 వేల కోట్లకు పైగా పన్నుల వాటా అంచనాలను పెట్టిన కేంద్రం ఇప్పుడు మరో రూ.వెయ్యి కోట్లు తగ్గించి రూ.16 వేల కోట్ల పైచిలుకు చూపెట్టింది
కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంకు నిధులు కేటాయించలేదు. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీ కోత పడింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42 శాతం ఇవ్వాలని ఉండగా ఆ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.34,833.18 కోట్లు కేటాయించింది. కానీ, ఇప్పుడు సవరించిన అంచనా మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కేవలం 28,242.39 కోట్లేనని కేంద్రం పేర్కొంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి వస్తాయనుకున్న నిధుల్లో రూ.6,590.79 కోట్ల మేర కోత పడింది.
తెలంగాణ ఆశలు అడియాశలు
కేంద్ర బడ్జెట్ మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి నిరాశే మిగిల్చింది. కేంద్ర ప్రశంసలు అందుకున్న పథకాలకు నిధులు ఇస్తుందని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వ ఆశలు అడియాశలయ్యాయి. పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బకారుులు, ఐజీఎస్టీ చెల్లింపులు, పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.35 వేల కోట్ల వరకు అదనపు నిధులు కేటాయిస్తారని ప్రభుత్వం ఆశించింది. కానీ తెలంగాణకు రూ.16 వేల కోట్ల పన్నుల వాటానే కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీంతో ప్రస్తుత సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు వచ్చే ఏడాది నిధుల కటకట తప్పదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
పన్నుల వాటాలో కోత..
పన్నుల వాటాలోనూ కేంద్రం తెలంగాణకు కోత పెట్టింది. మొత్తం పన్ను వాటాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.437 శాతం ఇవ్వగా, దాన్ని 2.133 శాతానికి కుదించింది. 2019-20లో రూ.17 వేల కోట్లకు పైగా పన్నుల వాటా అంచనాలను పెట్టిన కేంద్రం ఇప్పుడు మరో రూ.వెయ్యి కోట్లు తగ్గించి రూ.16 వేల కోట్ల పైచిలుకు చూపెట్టింది
ఏడాది | తెలంగాణకు కేంద్ర పన్నుల్లో వాటా |
2018-19 | రూ. 17,960.01 (వాస్తవిక) |
2019-20 | రూ. 17,422.17 (సవరించిన అంచనాలు) |
2020-21 | రూ.16,726.58 కోట్లు (అంచనాలు) |
Published date : 04 Feb 2020 04:01PM