పద్మ పురస్కారాలు-2021
వీరిలో ఏడుగురిని పద్మ విభూషణ్, 10 మందిని పద్మ భూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. రాష్ట్రపతి భవన్‌లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు.
29 మంది మహిళలు...
2021 ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. అలాగే విదేశీ/ప్రవాస భారతీయ కేటగిరీలో 10 మంది, ఒక ట్రాన్స్జెండర్ కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యారు. ఎస్పీ బాలు సహా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారం లభించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి...
2021 ఏడాది పద్మ అవార్డులకు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు ఏపీకి చెందినవారు.
ఆశావాది ప్రకాశరావు(ఏపీ): రాయలసీమలోని అనంతపురం జిల్లాలో జన్మించిన ఆశావాది ప్రకాశరావుకు సాహిత్యం, విద్య రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. శింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన ఆశావాది... పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. వివిధ రాష్ట్రాల్లో 170కి పైగా అవధానాలు చేశారు. 57 రచనలు చేశారు.
అన్నవరపు రామస్వామి(ఏపీ): విజయవాడకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు(వయోలిన్) అన్నవరపు రామస్వామికి కళలు విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం వరించింది. గత 8 దశాబ్దాలుగా అనేక దేశాల్లో కచేరీలు చేశారు. ఆయన వందన, శ్రీదుర్గా అనే కొత్త రాగాలను, త్రినేత్రాది, వేదాది అనే తాళాలను కనుగొన్నారు.
నిడుమోలు సుమతి(ఏపీ): భారతీయ సంగీత వాయిద్యరంగంలో మృదంగవాద్యాన్ని వృత్తిగా స్వీకరించిన మొట్టమొదటి మహిళా కళాకారిణి నిడుమోలు సుమతి(దండమూడి సుమతీ రామమోహనరావు)ని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. విజయవాడకు చెందిన సుమతి పదో ఏటనే తొలి కచేరి ఇచ్చారు.
కనకరాజు(తెలంగాణ): కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన కళాకారుడు కనకరాజును పద్మశ్రీ వరించింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును గుస్సాడీ రాజుగా పిలుస్తారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిర ముందు, అనంతరం దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న 60 ఏళ్ల రాజు.. ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్నారు.
పద్మ పురస్కారాలు-2021
పద్మ విభూషణ్ విజేతలు (7)
సంఖ్య | పేరు | రంగం | రాష్ట్రం/దేశం/యూటీ |
1 | షింజో అబే | ప్రజా వ్యవహారాలు | జపాన్ |
2 | ఎస్.పి.బాలసుబ్రమణ్యం | కళలు | తమిళనాడు |
3 | డా. బెల్లె మొనప్ప హెగ్డే | వైద్యం | కర్ణాటక |
4 | నరీందర్ సింగ్ కపానీ | సైన్స్, ఇంజనీరింగ్ | యూఎస్ |
5 | మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ | ఆధ్యాత్మికత | ఢిల్లీ |
6 | బి.బి.లాల్ | ఆర్కియాలజీ | ఢిల్లీ |
7 | సుదర్శన్ సాహూ | కళలు | ఒడిషా |
పద్మ భూషణ్ విజేతలు (10) | |||
సంఖ్య | పేరు | రంగం | రాష్ట్రం/దేశం/యూటీ |
1 | కె.ఎస్.చిత్ర | కళలు | కేరళ |
2 | తరుణ్ గొగోయ్ | ప్రజా వ్యవహారాలు | అసోం |
3 | చంద్రశేఖర్ కంబర | సాహిత్యం | కర్ణాటక |
4 | సుమిత్ర మహాజన్ | ప్రజా వ్యవహారాలు | మధ్యప్రదేశ్ |
5 | నృపేంద్ర మిశ్రా | సివిల్ సర్వీస్ | ఉత్తర ప్రదేశ్ |
6 | రామ్ విలాస్ పాశ్వాన్ | ప్రజా వ్యవహారాలు | బిహార్ |
7 | కేశుభాయ్ పటేల్ | ప్రజా వ్యవహారాలు | గుజరాత్ |
8 | కల్బే సాదిక్ | ఆధ్యాత్మికత | ఉత్తర ప్రదేశ్ |
9 | రజనీకాంత్ దేవిదాస్ షరాఫ్ | వాణిజ్యం, పరిశ్రమలు | మహారాష్ట్ర |
10 | తార్‌లోచన్ సింగ్ | ప్రజా వ్యవహారాలు | హరియాణా |
పద్మ శ్రీ విజేతలు (102) | |||
సంఖ్య | పేరు | రంగం | రాష్ట్రం/దేశం/యూటీ |
1 | గల్ఫామ్ అహ్మద్ | కళలు | ఉత్తర ప్రదేశ్ |
2 | పి. అనితా | క్రీడలు | తమిళనాడు |
3 | రామ స్వామి అన్నవరాపు | కళలు | ఆంధ్రప్రదేశ్ |
4 | సుబ్బూ అరుముగం | కళలు | తమిళనాడు |
5 | ఆశావాది ప్రకాశరావు | సాహిత్యం, విద్య | ఆంధ్రప్రదేశ్ |
6 | భూరి బాయి | కళలు | మధ్యప్రదేశ్ |
7 | రాధే శ్యామ్ బార్లే | కళలు | ఛత్తీస్‌గఢ్ |
8 | ధర్మ నారాయణ బార్మా | సాహిత్యం, విద్య | పశ్చిమ బెంగాల్ |
9 | లఖిమి బారువా | సామాజిక సేవ | అస్సాం |
10 | బిరెన్ కుమార్ బసక్ | కళలు | పశ్చిమ బెంగాల్ |
11 | రజనీ బెక్టర్ | వాణిజ్యం, పరిశ్రమలు | పంజాబ్ |
12 | పీటర్ బ్రూక్ | కళలు | యునెటైడ్ కింగ్‌డమ్ |
13 | సంఘుమి బ్యూల్చువాక్ | సామాజిక సేవ | మిజోరాం |
14 | గోపిరామ్ బార్గైన్ బురభాకట్ | కళలు | అస్సాం |
15 | బిజోయ చక్రవర్తి | ప్రజా వ్యవహారాలు | అస్సాం |
16 | సుజిత్ చటోపాధ్యాయ | సాహిత్యం, విద్య | పశ్చిమ బెంగాల్ |
17 | జగదీష్ చౌదరి(మరణానంతరం) | సామాజిక సేవ | ఉత్తర ప్రదేశ్ |
18 | సుల్టిమ్ర్ చోంజోర్ | సామాజిక సేవ | లద్దాఖ్ |
19 | మౌమా దాస్ | క్రీడలు | పశ్చిమ బెంగాల్ |
20 | శ్రీకాంత్ డాటర్ | సాహిత్యం, విద్య | అమెరికా |
21 | నారాయణ్ దేబ్నాథ్ | కళలు | పశ్చిమ బెంగాల్ |
22 | చుట్ని దేవి | సామాజిక సేవ | జార్ఖండ్ |
23 | దులారి దేవి | కళలు | బిహార్ |
24 | రాధే దేవి | కళలు | మణిపూర్ |
25 | శాంతి దేవి | సామాజిక సేవ | ఒడిశా |
26 | వయన్ డిబియా | కళలు | ఇండోనేషియా |
27 | దాదుదన్ గాధవి | సాహిత్యం, విద్య | గుజరాత్ |
28 | పరశురామ్ ఆత్మారామ్ గంగవనే | కళలు | మహారాష్ట్ర |
29 | జై భగవాన్ గోయల్ | సాహిత్యం, విద్య | హరియాణ |
30 | జగదీష్ చంద్ర హాల్డర్ | సాహిత్యం, విద్య | పశ్చిమ బెంగాల్ |
31 | మంగల్ సింగ్ హజోవరీ | సాహిత్యం, విద్య | అస్సాం |
32 | అన్షు జంసేన్పా | క్రీడలు | అరుణాచల్ ప్రదేశ్ |
33 | పూర్ణమాసి జానీ | కళలు | ఒడిశా |
34 | మాతా బి. మంజమ్మ | జోగతి కళలు | కర్ణాటక |
35 | దామోదరన్ కై తప్రమ్ | కళలు | కేరళ |
36 | నామ్‌డియో సి కాంబ్లే | సాహిత్యం, విద్య | మహారాష్ట్ర |
37 | మహేష్‌భాయ్ -నరేష్‌భాయ్ కనోడియా (ద్వయం)(మరణానంతరం) | కళలు | గుజరాత్ |
38 | రజత్ కుమార్ కర్ | సాహిత్యం, విద్య | ఒడిశా |
39 | రంగసామి లక్ష్మీనారాయణ కశ్యప్ సాహిత్యం, | విద్య | కర్ణాటక |
40 | ప్రకాష్ కౌర్ | సామాజిక సేవ | పంజాబ్ |
41 | నికోలస్ కజనాస్ | సాహిత్యం, విద్య | గ్రీస్ |
42 | కె కేశవసామి | కళలు | పుదుచ్చేరి |
43 | గులాం రసూల్ ఖాన్ | కళలు | జమ్మూ, కశ్మీర్ |
44 | లఖా ఖాన్ | కళలు | రాజస్థాన్ |
45 | సంజిదా ఖాతున్ | కళలు | బంగ్లాదేశ్ |
46 | వినాయక్ విష్ణు ఖేదేకర్ | కళలు | గోవా |
47 | నిరు కుమార్ | సామాజిక సేవ | ఢిల్లీ |
48 | లజవంతి | కళలు | పంజాబ్ |
49 | రత్తన్ లాల్ | సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | అమెరికా |
50 | అలీ మణిక్‌ఫాన్ | ఇతరులు-గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్ | లక్షద్వీప్ |
51 | రామచంద్ర మంజి | కళలు | బిహార్ |
52 | దులాల్ మంకి | కళలు | అస్సాం |
53 | నానాడ్రో బి మరక్ | ఇతరులు- వ్యవసాయం | మేఘాలయ |
54 | రెబెన్ మషంగ్వా | కళలు | మణిపూర్ |
55 | చంద్రకాంత్ మెహతా | సాహిత్యం, విద్య | గుజరాత్ |
56 | డాక్టర్ రట్టన్ లాల్ మిట్టల్ | వైద్యం | పంజాబ్ |
57 | మాధవన్ నంబియార్ | క్రీడలు | కేరళ |
58 | శ్యామ్ సుందర్ పాలివాల్ | సామాజిక సేవ | రాజస్థాన్ |
59 | డాక్టర్ చంద్రకాంత్ సంభాజీ పాండవ్ | వైద్యం | ఢిల్లీ |
60 | డాక్టర్ జె ఎన్ పాండే(మరణానంతరం) | వైద్యం | ఢిల్లీ |
61 | సోలమన్ పప్పయ్య సాహిత్యం, | విద్య- జర్నలిజం | తమిళనాడు |
62 | పప్పమ్మల్ | ఇతరులు- వ్యవసాయం | తమిళనాడు |
63 | డాక్టర్ కృష్ణ మోహన్ | పాతి వైద్యం | ఒడిశా |
64 | జస్వంతిబెన్ జామ్నాదాస్ పోపాట్ వాణిజ్యం, | పరిశ్రమలు | మహారాష్ట్ర |
65 | గిరీష్ ప్రభుణ్ | సామాజిక సేవ | మహారాష్ట్ర |
66 | నందా ప్రస్టీ | సాహిత్యం, విద్య | ఒడిశా |
67 | కె కె రామచంద్ర పులవర్ | కళలు | కేరళ |
68 | బాలన్ పుతేరి | సాహిత్యం, విద్య | కేరళ |
69 | బీరుబాలా రభా | సామాజిక సేవ | అస్సాం |
70 | కనక రాజు | కళలు | తెలంగాణ |
71 | బొంబాయి జయశ్రీ రామ్‌నాథ్ | కళలు | తమిళనాడు |
72 | సత్యారామ్ రీయాంగ్ | కళలు | త్రిపుర |
73 | డాక్టర్ ధనంజయ్ దివాకర్ సాగ్డియో | వైద్యం | కేరళ |
74 | అశోక్ కుమార్ సాహు | వైద్యం | ఉత్తర ప్రదేశ్ |
75 | డాక్టర్ భూపేంద్ర కుమార్ సింగ్ సంజయ్ | వైద్యం | ఉత్తరాఖండ్ |
76 | సింధుటై సప్కల్ | సామాజిక సేవ | మహారాష్ట్ర |
77 | చమన్ లాల్ సప్రూ(మరణానంతరం) | సాహిత్యం, విద్య | జమ్మూ, కశ్మీర్ |
78 | రోమన్ శర్మ | సాహిత్యం,విద్య- జర్నలిజం | అస్సాం |
79 | ఇమ్రాన్ షా | సాహిత్యం, విద్య | అస్సాం |
80 | ప్రేమ్ చంద్ శర్మ | ఇతరులు- వ్యవసాయం | ఉత్తరాఖండ్ |
81 | అర్జున్ సింగ్ షేఖావత్ | సాహిత్యం, విద్య | రాజస్థాన్ |
82 | రామ్ యత్న శుక్లా | సాహిత్యం, విద్య | ఉత్తర ప్రదేశ్ |
83 | జితేందర్ సింగ్ షంటీ | సామాజిక సేవ | ఢిల్లీ |
84 | కర్తార్ పరాస్ రామ్ సింగ్ | కళలు | హిమాచల్ ప్రదేశ్ |
85 | కర్తార్ సింగ్ | కళలు | పంజాబ్ |
86 | డాక్టర్ దిలీప్ కుమార్ సింగ్ | వైద్యం | బీహార్ |
87 | చంద్ర శేఖర్ సింగ్ | ఇతరులు-వ్యవసాయం | ఉత్తర ప్రదేశ్ |
88 | సుధా హరి నారాయణ్ సింగ్ | క్రీడలు | ఉత్తర ప్రదేశ్ |
89 | వీరేందర్ సింగ్ | క్రీడలు | హరియాణ |
90 | మృదుల సిన్హా(మరణానంతరం) | సాహిత్యం, విద్య | బిహార్ |
91 | కె సి శివశంకర్(మరణానంతరం) | కళలు | తమిళనాడు |
92 | గురు మా కమలి సోరెన్ | సామాజిక సేవ | పశ్చిమ బెంగాల్ |
93 | మరాచీ సుబ్బూరామన్ | సామాజిక సేవ | తమిళనాడు |
94 | పి సుబ్రమణియన్(మరణానంతరం) | వాణిజ్యం, పరిశ్రమలు | తమిళనాడు |
95 | నిడుమోలు సుమతి | కళలు | ఆంధ్రప్రదేశ్ |
96 | కపిల్ తివారీ | సాహిత్యం, విద్య | మధ్యప్రదేశ్ |
97 | ఫాదర్ వల్లస్(మరణానంతరం) | సాహిత్యం, విద్య | స్పెయిన్ |
98 | డాక్టర్ తిరువెంగడం వీరరాఘవన్(మరణానంతరం) | వైద్యం | తమిళనాడు |
99 | శ్రీధర్ వెంబు | వాణిజ్యం, పరిశ్రమలు | తమిళనాడు |
100 | కె వై వెంకటేష్ | క్రీడలు | కర్ణాటక |
101 | ఉషా యాదవ్ | సాహిత్యం, విద్య | ఉత్తర ప్రదేశ్ |
102 | కల్ క్వాజీ సజ్జాద్ అలీ జహీర్ | ప్రజా వ్యవహారాలు | బంగ్లాదేశ్ |