మిస్ యూనివర్స్-2020 కిరీటాన్ని గెలుచుకున్న యువతి?
Sakshi Education
2020 ఏడాదికి విశ్వసుందరి (మిస్ యూనివర్స్) కిరీటాన్ని మెక్సికో యువతి ఆండ్రియా మెజా గెలిచారు.
మిస్ యూనివర్స్ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు. అమెరికాలోని హాలీవుడ్‌లో ఉన్న సెమినోల్ హార్డ్‌రాక్ హోటల్,క్యాసినోలో మే 16న విశ్వ సుందరి పోటీలు జరిగాయి. పోటీల్లో విజేతగా నిలిచిన 26 ఏళ్ల మెజాకు 2019 విశ్వసుందరి జోజిబినీ టూన్జీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు. మెజా తర్వాత స్థానంలో ఫస్ట్ రన్నరప్‌గా(రెండో స్థానంలో) బ్రెజిల్ యువతి జూలియా గామా(28), సెకండ్ రన్నరప్‌గా(మూడో స్థానంలో) పెరూ యువతి జనిక్ మాసెటా(27), మూడో రన్నరప్‌గా(నాలుగో స్థానంలో) భారతీయ యువతి, మిస్ ఇండియా అడ్‌లైన్ కాస్టెలినో(22)నిలిచారు.
మూడో మెక్సికన్‌గా...
సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందిన ఆండ్రియా మెజా...విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న మూడో మెక్సికన్‌గా నిలిచారు. మనం ప్రవర్తించే విధానంలో కూడా అందం ఉంటుందని, మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దంటూ.. ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను మెప్పించింది.ఆండ్రియా లింగ సమానత కోసం కూడా కృషి చేస్తున్నారు. కరోనా కారణంగా విశ్వసుందరి పోటీలను గతేడాది నిర్వహించలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిస్ యూనివర్స్-2020 కిరీటాన్ని గెలుచుకున్న యువతి?
ఎప్పుడు : మే 16
ఎవరు :మెక్సికో యువతి ఆండ్రియా మెజా
ఎక్కడ :సెమినోల్ హార్డ్‌రాక్ హోటల్, హాలీవుడ్, అమెరికా

Published date : 18 May 2021 06:18PM