మెగసెసె అవార్డు
Sakshi Education
ఈ అవార్డును ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరున ఏర్పాటు చేశారు. 'ఆసియన్ నోబెల్ ప్రైజ్'గా పేరు పొందిన మెగసెసె అవార్డును 1957 ఏప్రిల్‌లో రాక్‌ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ (న్యూయార్క్), ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సంయుక్తంగా నెలకొల్పాయి. ఈ అవార్డుకు ఏటా వివిధ రంగాలలో విశేష ప్రతిభ/కృషి కనపరచిన ఆసియాకు చెందిన వ్యక్తులను, సంస్థలను ఎంపిక చేస్తారు. మొత్తం ఆరు విభాగాల్లో ఈ అవార్డులు ప్రకటిస్తారు. అవి 1. గవర్నమెంట్ సర్వీసు 2. పబ్లిక్ సర్వీసు 3. కమ్యూనిటీ లీడర్‌షిప్ 4. జర్నలిజం, లిటరేచర్, క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్ 5. పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్‌స్టాడింగ్ 6. ఎమర్జంట్ లీడర్‌షిప్. 'ఎమర్జంట్ లీడర్‌షిప్' అవార్డును మాత్రం ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో 2001 నుంచి అందజేస్తున్నారు.
మెగసెసె అవార్డులు అందుకున్న భారతీయులు
మెగసెసె అవార్డులు అందుకున్న భారతీయులు
- గవర్నమెంట్ సర్వీసెస్
సంవత్సరం గ్రహీత 1959 చింతామన్ దేశ్‌ముఖ్ 1994 కిరణ్ బేడి 1996 టి.ఎన్.శేషన్ 2003 జేమ్స్ మైఖేల్ లింగ్డో
- పబ్లిక్ సర్వీసు
సంవత్సరం గ్రహీత 1965 జయప్రకాష్ నారాయణ్ 1974 ఎం.ఎస్ సుబ్బులక్ష్మి 1982 మణిభాయ్ దేశాయ్ 1985 మురళీధర్ ఆమ్టే 1989 లక్ష్మీ చాంద్ జైన్ 1993 భాను జహంగీర్ కోయాజీ 1997 మహేశ్ చందర్ మెహతా 2005 వి.శాంతా
- కమ్యూనిటీ లీడర్‌షిప్
సంవత్సరం గ్రహీత 1958 వినోబా భావే 1963 దారా ఖురోడి 1963 వర్గీస్ కురియన్ 1963 త్రిభువన్‌దాస్ పటేల్ 1966 కమలాదేవి ఛటోపాధ్యాయ 1971 ఎం.ఎస్.స్వామినాథన్ 1977 ఇలా రమేష్ భట్ 1979 మాబెల్లి అరోల్ 1979 రజనీకాంత్ అరోల్ 1981 ప్రమోద్ కరణ్‌సేథీ 1982 చాంది ప్రసాద్ భట్ 1996 పాండురంగ్ అతావలె 2000 అరుణ రాయ్ 2001 రాజేంద్ర సింగ్ 2003 శాంతా సిన్హా 2008 డాక్టర్ ప్రకాష్ ఆమ్టే, డాక్టర్ మందాకిని ఆమ్టే
- జర్నలిజం, లిటరేచర్, క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్
సంవత్సరం గ్రహీత 1961 అమితాబ్ చౌదరి 1967 సత్యజిత్ రే 1975 బూబ్లి జార్జి వ ర్గీస్ 1976 సొంబు మిత్రా 1981 గౌర్ కిషోర్ ఘోష్ 1982 అరుణ్ శౌరి 1984 ఆర్కే లక్ష్మణ్ 1991 కె.వి. సుబ్బన్న 1992 రవి శంకర్ 1997 మహాశ్వేతా దేవి 2007 పాలగుమ్మి సాయినాథ్
- పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్‌స్టాడింగ్
సంవత్సరం గ్రహీత 1962 మదర్ థెరెసా 1964 వెల్దీ ఫిషర్ 1976 హెన్నింగ్ హాక్ లార్సన్ 2000 జాకిన్ అర్పుతం 2004 లక్ష్మీ నారాయణ్ రాందాస్
- ఎమర్జంట్ లీడర్‌షిప్
సంవత్సరం గ్రహీత 2002 సందీప్ పాండే 2006 అరవింద్ కేజ్రీవాల్ 2011 నీలిమా మిశ్రా 2015 సందీప్ చతుర్వేది 2016 టి.ఎం. కృష్ణ
- అన్‌కేటగిరైజ్డ్
సంవత్సరం గ్రహీత 2011 హరీష్ హాండి 2009 దీప్ జోషి 2012 కులండీ ఫ్రాన్సిస్ 2015 అన్షూ గుప్తా 2016 బెజవాడ విల్సన్
Published date : 07 Jul 2012 12:52PM