మానుషి ఛిల్లర్‌కు మిస్ వరల్డ్ - 2017 టైటిల్
Sakshi Education
హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను సాధించింది. చైనాలోని సాన్యా నగరంలో నవంబర్ 18న నిర్వహించిన 67వ మిస్ వర్డల్‌పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది.
ప్రపంచంలో ఏ వృత్తికి అధిక వేతనం ఇవ్వడం సముచితం అన్న ప్రశ్నకు ‘తల్లి ఉద్యోగం’ అని చెప్పి ఆమె న్యాయ నిర్ణేతల మనసుల్ని గెలుచుకుంది. యియి 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్నాక మరో భారతీయురాలు ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఛిల్లర్ హరియాణాలోని సోనెపట్‌లో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది.
బ్యూటీ విత్ పర్పస్ విభాగంలోనూ..
మిస్ వర్డల్ - 2017 పోటీల్లో టాప్ మోడల్, పీపుల్స్ చాయిస్, మల్టీమీడియా విభాగాల్లో ఛిల్లర్ సెమిఫైనల్‌కు చేరారు. అలాగే ‘బ్యూటీ విత్ పర్పస్’ విభాగంలో మరొకరితో కలిసి సంయుక్త విజేతగా నిలిచారు. బ్యూటీ విత్ పర్పస్ కోసం ఛిల్లర్ ఎంచుకున్న ప్రాజెక్టు ‘శక్తి’. రుతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5 వేల మంది మహిళలకు చికిత్స అందించారు.
రీటా ఫారియా నుంచి ఛిల్లర్ వరకూ...
మానుషి ఛిల్లర్ సాధించిన కిరీటంతో భారత్ ఖాతాలో ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ చేరాయి. మొదటిసారి 1966లో రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నారు. 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంకా చోప్రాలు ప్రపంచ సుందరులుగా నిలిచారు.
భారత్‌కు రెండు సార్లు ‘మిస్ యూనివర్స్’ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తాలు మిస్ యూనివర్స్‌లుగా నిలిచారు. ప్రపంచంలో భారత్, వెనెజులాలు మాత్రమే ఆరేసి మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ వరల్డ్ - 2017 టైటిల్
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : మానుషి ఛిల్లర్ (భారత్)
ఎక్కడ : సాన్యా నగరం, చైనా

Published date : 20 Nov 2017 05:25PM