Skip to main content

జ్ఞాన్ పీఠ్ అవార్డు

జ్ఞాన్‌పీఠ్ అవార్డును ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారంగా పరిగణిస్తారు. ఈ అవార్డును 'టైమ్స్ ఆఫ్ ఇండియా' దినపత్రిక ప్రచురణకర్తలైన సాహూజైన్ కుటుంబం వారి 'భారతీయ జ్ఞాన్‌పీఠ్' ట్రస్టు నిర్వహిస్తోంది. మొదటి అవార్డును 1965లో మళయాళ రచయత జి.శంకర్ కురుప్‌కు ప్రదానం చేశారు. ఈ బహుమతి కింద రూ.7 లక్షల నగదు, ప్రశంసా పత్రం, సరస్వతీ దేవి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. గుర్తింపు పొందిన భారతీయ భాషలో రచనలు చేసినవారుఈ పురస్కారానికి అర్హులు. తొలుత ఈ పురస్కారాన్ని ఓ పుస్తకానికి గుర్తింపుగా ఇచ్చేవారు. 1982 తర్వాత సాహిత్యంలో జీవిత కాల సాఫల్య పురస్కారంగా ఇస్తున్నారు. సంస్కృతంలో తొలిసారిగా 2006లో సత్యవత్ శాస్త్రికి ఈ పురస్కారం అందజేశారు.

అవార్డు గ్రహీతలు
సంవత్సరం రచయిత రచన భాష
1965 జి.శంకర కురుప్ ఉడక్కుళై మలయాళం
1966 తారా శంకర్ బంద్యోపాధ్యాయ జ్ఞానదేవత బెంగాలీ
1967 డాక్టర్ కె.వి.పుట్టప్ప శ్రీ రామాయణ దర్శనం కన్నడం
1967 ఉమాశంకర్ జోషి నిషిత గుజరాతీ
1968 సుమిత్రానంద్ పంత్ చిదంబర హిందీ
1969 ఫిరాక్ గోరఖ్‌పురి గుల్ - ఎ - నాగ్మా ఉర్దూ
1970 డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం తెలుగు
1971 బిష్ణు డే స్మృతి సత్తా భవిష్యత్ బెంగాలీ
1972 డాక్టర్ రాంధారి సింగ్ దినకర్ ఊర్వశి హిందీ
1973 దత్తాత్రేయ రామచంద్ర బింద్రే నకుతంతి కన్నడం
1973 గోపీనాథ్ మొహంతి మతిమాతల్ ఒడియా
1974 విష్ణు శాఖరం ఖండేకర్ యయాతి మరాఠీ
1975 పి.వి. అఖిలన్ చిత్రప్పవై తమిళం
1976 ఆశాపూర్ణా దేవి ప్రథమ్ ప్రతిసృతి బెంగాలీ
1977 కె.శివరామ్ కారంత్ మూకజ్జియ కనసుగళు కన్నడం
1978 ఎస్.హెచ్. వాత్సాయన్ కిత్నీ నావోం మే కిత్ని బార్ హిందీ
1979 బీరేంద్ర కుమార్ భట్టాచార్య మృత్యుంజయ అస్సామీ
1980 ఎస్.కె.పొట్టిక్కాట్ ఒరు దేశాదిందే కథ మలయాళం
1981 అమృతా ప్రీతం కాగజ్ తే కాన్వాస్ పంజాబీ
1982 మహాదేవి వర్మ యమ హిందీ
1983 మస్తి వెంకటేశ అయ్యంగార్ చిక్కవీర రాజేంద్ర కన్నడం
1984 టి.శివశంకర పిళ్లయ్ కాయర్ మలయాళం
1985 పన్నాలాల్ పటేల్ మానవి నీ భావీ గుజరాతీ
1986 సచ్చితానంద్ రౌత్రాయ్ ఒరియా
1987 వి.వి. షిర్వాద్కర్ మరాఠీ
1988 డాక్టర్ సి.నారాయణ రెడ్డి విశ్వంభర తెలుగు
1989 ఖుర్రాతులియన్ హైదర్ అఖిరే షాబ్‌కీ హమ్‌సఫర్ ఉర్దూ
1990 వి. కె. గోఖక్ భారత సింధు రష్మీ కన్నడం
1991 సుభాష్ ముఖోపాధ్యాయ్ పదాతిక్ బెంగాలీ
1992 నరేష్ మెహతా హిందీ
1993 సీతాకాంత్ మహాపాత్ర ఒడియా
1994 యు.ఆర్ అనంతమూర్తి కన్నడం
1995 ఎం.టి.వాసుదేవన్ నాయర్ రండమూళం మలయాళం
1996 మహాశ్వేతా దేవి హజర్ చురాషిర్ మా బెంగాలీ
1997 అలీ సర్దార్ జాఫ్రీ ఉర్దూ
1998 గిరీష్ కర్నాడ్ కన్నడం
1999 నిర్మల్ వర్మ హిందీ
1999 గురుదయాల్ సింగ్ పంజాబీ
2000 ఇందిరా గోస్వామి దతల్ హతిర్ ఉన్యే కువా హౌదా అస్సామీ
2001 రాజేంద్ర కేశవలాల్ షా ధ్వని గుజరాతీ
2002 డి.జయకాంతన్ తమిళం
2003 వింద కరందీకర్ మరాఠీ
2004 ర హ్మాన్ రాహి కాశ్మీరీ
2005 కున్వర్ నారాయణ్ హిందీ
2006 సత్యవ్రత్ శాస్త్రి సంస్కృతం
2006 రవీంద్ర కెలేకర్ కొంకణీ
2007 ఒ.ఎన్.వి. కురూప్ మలయాళం
2008 అక్లక్ మహ్మద్ ఖాన్ ఉర్దూ
2009 అమర్‌కాంత్, శ్రీలాల్ శుక్లా హిందీ
2010 చంద్రశేఖర్ కంబార కన్నడం
2011 ప్రతిభా రే యజ్ఞసేని ఒడియా
2012 డా. రావూరి భరద్వాజ పాకుడురాళ్లు తెలుగు
2013 కేదార్‌నాథ్ సింగ్ అకల్ మే సరస్ హిందీ
2014 బాలచంద్ర నెమాడే హిందూ: జగన్యాచి సమృద్ధ అడ్గల్ మరాఠీ
2015 ర‌ఘువీర్ చౌధ‌రి అమృత (న‌వ‌ల‌) గుజ‌రాతీ
2016 శంఖా ఘోష్  - బెంగాలీ
2017

కృష్ణా సోబతి

జిందారుఖ్‌ (నవల)

హిందీ
Published date : 07 Jul 2012 12:52PM

Photo Stories