జాతీయ క్రీడా పురస్కారాలు-2018
సాధార ణంగా ప్రతి సంవత్సరం దివంగత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న అవార్డులను అందజేస్తారు. అయితే ఈ సారి సమయంలో ఆసియా క్రీడలు జరగడంతో వేడుక తేదీని సెప్టెంబర్ 25కి మార్చారు.
రాజీవ్ ఖేల్ రత్న అవార్డు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రపంచ చాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కు క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన‘రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న లభించింది. దీంతో ‘ఖేల్ రత్న’ అందుకున్న మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్ (1997-98), ధోని (2007)లు ఈ అవార్డు అందుకున్నారు. రాజీవ్ ఖేల్ రత్న విజేతకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ. 7.5 లక్షలు బహుమానంగా అందిస్తారు.
సంఖ్య | పేరు | క్రీడాంశం |
1 | విరాట్‌కోహ్లీ | క్రికెట్ |
2 | మీరాబాయి చాను | వెయిట్‌లిఫ్టింగ్ |
అర్జున అవార్డు
2018 సంవత్సరానికిగాను 20 మందికి అర్జున అవార్డు లభించింది. అర్జున అవార్డు గ్రహీతలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షలు నగదు పురస్కారం అందిస్తారు.
సంఖ్య | పేరు | క్రీడాంశం |
1 | సిక్కి రెడ్డి | బ్యాడ్మింటన్ |
2 | నీరజ్ చోప్రా | అథ్లెటిక్స్ |
3 | జిన్సన్ జాన్సన్ | అథ్లెటిక్స్ |
4 | హిమ దాస్ | అథ్లెటిక్స్ |
5 | సతీశ్ | బాక్సింగ్ |
6 | స్మృతి మంధాన | క్రికెట్ |
7 | శుభాంకర్ శర్మ | గోల్ఫ్ |
8 | మన్‌ప్రీత్ సింగ్ | హాకీ |
9 | సవిత పూనియా | హాకీ |
10 | రవి రాథోడ్ | పోలో |
11 | రాహీ సర్నోబత్ | షూటింగ్ |
12 | అంకుర్ మిట్టల్ | షూటింగ్ |
13 | శ్రేయసి సింగ్ | షూటింగ్ |
14 | మనిక బత్రా | టేబుల్ టెన్నిస్ |
15 | సత్యన్ | టేబుల్ టెన్నిస్ |
16 | రోహన్ బోపన్న | టెన్నిస్ |
17 | సుమిత్ | రెజ్లింగ్ |
18 | పూజ కడియాన్ | వుషు |
19 | అంకుర్ ధామ | పారా అథ్లెటిక్స్ |
20 | మనోజ్ సర్కార్ | పారా బ్యాడ్మింటన్ |
ద్రోణాచార్య అవార్డు
ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డును ఎనిమిది మందికి అందజేశారు.
సంఖ్య | పేరు | క్రీడాంశం |
1 | సి.ఎ.కుట్టప్ప | బాక్సింగ్ |
2 | విజయ్ శర్మ | వెయిట్‌లిఫ్టింగ్ |
3 | ఆచంట శ్రీనివాస రావు | టేబుల్ టెన్నిస్ |
4 | క్లారెన్స్ లోబో | హాకీ |
5 | సుఖ్‌దేవ్ సింగ్ పన్ను | అథ్లెటిక్స్ |
6 | తారక్ సిన్హా | క్రికెట్ |
7 | జీవన్ కూమార్ | జూడో |
8 | వి.ఆర్.బీడు | అథ్లెటిక్స్ |
ద్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం
నలుగురు మాజీ క్రీడాకారులకి ద్యాన్‌చంద్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
సంఖ్య | పేరు | క్రీడాంశం |
1 | సత్యదేవ్ ప్రసాద్ | ఆర్చరీ |
2 | భరత్ కుమార్ చెత్రీ | హాకీ |
3 | బాబీ అలోసియస్ | అథ్లెటిక్స్ |
4 | దత్తాత్రేయ చౌగలే | రెజ్లింగ్ |
టెన్సింగ్ నార్కే అవార్డు
జాతీయ అడ్వెంచర్ పురస్కారాల్లో భాగంగా టెన్సింగ్ నార్కే అవార్డును ఈసారి ఆరుగురు అమ్మాయిలకు అందజేశారు. భారత నావిక దళానికి చెందిన బొడ్డపాటి ఐశ్వర్య, పాతర్లపల్లి స్వాతి, పాయల్ గుప్తా, వర్తిక జోషి, విజయా దేవి, ప్రతిభ జమ్వాల్ ఈ అవార్డులు అందుకున్నారు. వీరు లెఫ్టినెంట్ కమాండర్ వర్తిక జోషి నేతృత్వంలో ఐఎన్‌ఎస్‌వీ తరిణి నావలో 254 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి వచ్చారు.