Skip to main content

జాతీయ చలన చిత్ర పురస్కారాలు–2019

 2021, మార్చి 22న ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా 4 పురస్కారాలను దక్కించుకుంది. బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌గా మహర్షి ఎంపిక కాగా, ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ అవార్డు గెలిచింది. రాజు సుందరం(మహర్షి) ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, నవీన్‌ నూలి(జెర్సీ) ఉత్తమ ఎడిటర్‌గా అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్‌ (చిత్రం ‘అసురన్‌’) – హిందీ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (‘భోన్‌స్లే’)లకు సంయుక్తంగా ప్రకటించారు.

మలయాళ సినిమాకు 11 అవార్డులు...
2019 జాతీయ సినిమా అవార్డుల్లో మలయాళ సినిమాకు మొత్తం 11 పురస్కారాలు దక్కాయి. ఫీచర్‌ఫిల్మ్‌ విభాగంలో ఉత్తమ చిత్రం, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, గీతరచన, మేకప్, సినిమాటోగ్రఫీ సహా 9 అవార్డులు, నాన్‌–ఫీచర్‌ఫిల్మ్‌ విభాగంలో 2 అవార్డులు – మొత్తం 11 అవార్డులను మలయాళ సినిమా గెలుచుకుంది.

ఒకటికి రెండు...
67వ చలన చిత్ర అవార్డుల్లో మలయాళ ‘మరక్కర్‌...’కు 3, మలయాళ ‘హెలెన్‌’కు 2, తమిళ ‘అసురన్‌’, ‘ఒత్త సెరుప్పు సైజ్‌ 7’కు చెరి రెండేసి, హిందీ ‘తాష్కెంట్‌ ఫైల్స్‌’కు 2, తెలుగు చిత్రాలు ‘మహర్షి’, ‘జెర్సీ’ లకు చెరి రెండేసి అవార్డులు, మరాఠీ ‘ఆనందీ గోపాల్‌’కు 2, బెంగాలీ చిత్రం ‘జ్యేష్ఠ పుత్రో’కు 2 అవార్డులు వచ్చాయి. వాస్తవానికి, 2020 ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన – ప్రదానం ఆలస్యమైంది.

అవార్డులు–విజేతలు...
ఉత్తమ చిత్రం: ‘మరక్కర్‌: ది అరేబియన్‌ కడలింటె సింహం’ (మలయాళం)
ఉత్తమ నటుడు: ధనుష్‌ (‘అసురన్‌’), మనోజ్‌ బాజ్‌పాయ్‌ (‘భోన్‌స్లే’),
ఉత్తమ నటి: కంగనా రనౌత్‌ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్‌ ఝాన్సీ, పంగా)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి (తమిళ ‘సూపర్‌ డీలక్స్‌’)
ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (హిందీ ‘తాష్కెంట్‌ ఫైల్స్‌’)
ఉత్తమ బాల నటుడు: నాగ విశాల్‌ (తమిళ చిత్రం – ‘కె.డి’)
ఉత్తమ దర్శకుడు: సంజయ్‌ పూరణ్‌ సింగ్‌ చౌహాన్‌ (హిందీ ‘బహత్తర్‌ హూరేన్‌’)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: ‘మహర్షి’
ఉత్తమ తెలుగు చిత్రం: ‘జెర్సీ’
ఉత్తమ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి (జెర్సీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజుసుందరం (మహర్షి)
ఉత్తమ సంగీత దర్శకుడు: డి. ఇమాన్‌ (తమిళ చిత్రం ‘విశ్వాసం’)
ఉత్తమ గాయకుడు: బి. ప్రాక్‌ (హిందీ ‘కేసరి’)
ఉత్తమ గాయని: సావనీ రవీంద్ర (మరాఠీ ‘బర్దో’)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: గిరీశ్‌ గంగాధరన్‌ (మలయాళ చిత్రం – ‘జల్లికట్టు’)
ఉత్తమ యాక్షన్డైరెక్షన్‌: విక్రమ్‌ మోర్‌ (కన్నడ ‘అవనే శ్రీమన్నారాయణ’)
ఉత్తమ స్పెషల్ఎఫెక్ట్స్‌: సిద్ధార్థ్‌ ప్రియదర్శన్‌ (మలయాళ ‘మరక్కర్‌: ది అరేబియన్‌’)
ఉత్తమ కాస్ట్యూమ్స్‌: సుజిత్‌ సుధాకరన్, వి. సాయి (‘మరక్కర్‌...’)
ఉత్తమ తమిళ చిత్రం: ‘అసురన్‌’
ఉత్తమ మలయాళ చిత్రం: ‘కల్ల నోట్టమ్‌’
ఉత్తమ కన్నడ చిత్రం: ‘అక్షి’
ఉత్తమ హిందీ చిత్రం: ‘ఛిఛోరే’
ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం: ‘తాజ్‌మహల్‌’ (మరాఠీ)
స్పెషల్జ్యూరీ అవార్డు: ‘ఒత్త సెరుప్పు సైజ్‌ 7’ (తమిళం)

Published date : 24 Mar 2021 06:27PM

Photo Stories