Skip to main content

భారతీయ జ్ఞాన్‌పీఠ్ పురస్కారం 2017

మనదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారం.. జ్ఞాన్‌పీఠ్. దీన్ని ఏటా భారతీయ జ్ఞాన్‌పీఠ్ సంస్థ ప్రదానం చేస్తోంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషలకు సంబంధించిన సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును అందిస్తారు.
మొదటి అవార్డును 1965లో ప్రదానం చేశారు. 1965 నుంచి 1981 వరకు ఒక పుస్తకానికి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం ఇచ్చేవారు. 1982 నుంచి ఒక పుస్తకానికి కాకుండా సాహితీ రంగంలో చేసిన సేవకు ఇవ్వడం ప్రారంభించారు. అవార్డు గ్రహీతలకు రూ.11 లక్షల నగదు, సరస్వతీ దేవి కాంస్య విగ్రహం ప్రదానం చేస్తారు.
  • తొలి జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత మలయాళ రచయిత జి.శంకర కురుప్ (1965). ‘ఒదక్కుజల్’ అనే పుస్తకానికి ఈ అవార్డు లభించింది.
  • జ్ఞాన్‌పీఠ్ అవార్డును అందుకున్న తొలి మహిళ బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి (1976). ఆమె రాసిన ‘ప్రథమ్ ప్రతిశ్రుతి’ అనే నవలకు ఈ అవార్డు లభించింది. ఇప్పటి వరకు ఎనిమిది మంది మహిళలకు జ్ఞాన్‌పీఠ్ అవార్డును బహూకరించారు.

తెలుగు రచయితలు
ఇప్పటి వరకు ముగ్గురు తెలుగు రచయితలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారు..
విశ్వనాథ సత్యనారాయణ (1970)
సి.నారాయణరెడ్డి (1988)
రావూరి భరద్వాజ (2012)

2016లో శంఖ ఘోష్‌కు అవార్డు
2016లో బెంగాలీ కవి శంఖ ఘోష్‌ను జ్ఞాన్‌పీఠ్ అవార్డు లభించింది. 52వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలపై శంఖఘోష్ విస్తృత పరిశోధనలు చేశారు. ఈయనతో కలిపి ఇప్పటి వరకు ఆరుగురు బెంగాలీ రచయితలకు జ్ఞాన్‌పీఠ్ లభించింది. ఘోష్ కంటే ముందు ఈ పురస్కారాన్ని 1996లో బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి అందుకున్నారు. శంఖఘోష్‌కు గతంలో సాహిత్య అకాడమీ అవార్డు (1999), పద్మభూషణ్ (2011) పురస్కారాలు కూడా లభించాయి.

కృష్ణ సోబతీకి ‘2017 జ్ఞాన్‌పీఠ్ అవార్డు’
2017కు గాను జ్ఞాన్‌పీఠ్ అవార్డును ప్రముఖ హిందీ రచయిత్రి కృష్ణ సోబతీకి ప్రకటించారు. 2017, నవంబర్ 3న జ్ఞాన్‌పీఠ్ సెలక్షన్ బోర్డు ఈ అవార్డును ప్రకటించింది. ఆమెకు 53వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. జ్ఞాన్‌పీఠ్‌కు ఎంపికైన 11వ హిందీ రచయిత/రచయిత్రి కృష్ణ సోబతీ. మహాదేవి వర్మ తర్వాత హిందీలో జ్ఞాన్‌పీఠ్‌ను పొందిన రెండో మహిళా రచయిత్రి కృష్ణ సోబతీ కావడం విశేషం.

కృష్ణ సోబతీ 1925, ఫిబ్రవరి 18న ప్రస్తుత పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జన్మించారు. ఆమె వయసు 92 ఏళ్లు. దేశ విభజన, స్త్రీ పురుష సంబంధాలు, మారుతున్న భారతీయ సమాజ స్థితిగతులు, క్షీణిస్తున్న మానవ విలువలు వంటివి ఆమె కథాంశాలు. ఆమె పలు రచనలు భారతీయ భాషలతో పాటు స్వీడిష్, రష్యన్, ఆంగ్లంలోకి కూడా అనువాదమయ్యాయి.
Current Affairs
కృష్ణ సోబతీకి 1980లో ‘జిందగీనామా’ అనే నవలకు సాహిత్య అకాడమీ అవార్డు, 1996లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ లభించాయి. 2010లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ ప్రకటించినప్పటికీ ఆమె తిరస్కరించారు.

కృష్ణ సోబతీ ఇతర రచనలు: మిత్రో మర్‌జాని, దార్ సే బిచ్చుడీ, దిలో దానిష్, బాద్‌లోంకే ఘేరే, ఏ లడ్‌కీ, గుజరాత్ పాకిస్థాన్ సే గుజరాత్ హిందుస్థాన్.

‘జ్ఞాన్‌పీఠ్’ గ్రహీతలు

సంవత్సరం

గ్రహీత

భాష

1965

జి.శంకర కురుప్

మలయాళం

1966

తారాశంకర్ బందోపాధ్యాయ

బెంగాలీ

1967

ఉమాశంకర్ జోషి

గుజరాతీ

1967

కుప్పాలి వెంకటప్ప పుట్టప్ప (కువెంపు)

కన్నడ

1968

సుమిత్రానందన్ పంత్

హిందీ

1969

ఫిరాఖ్ గోరఖ్‌పురి

ఉర్దూ

1970

విశ్వనాథ సత్యనారాయణ

తెలుగు

1971

బిష్ణు డే

బెంగాలీ

1972

రాంధారి సింగ్ దిన్‌కర్

హిందీ

1973

డి.ఆర్.బెంద్రె

కన్నడ

1973

గోపీనాథ్ మొహంతి

ఒడియా

1974

విష్ణు సఖరాం ఖండేకర్

మరాఠీ

1975

అఖిలన్

తమిళ్

1976

ఆశాపూర్ణాదేవి

బెంగాలీ

1977

కె.శివరాం కారంత్

కన్నడ

1978

సచ్చిదానంద వాత్సాయన్

హిందీ

1979

బీరేంద్ర కుమార్ భట్టాచార్య

అస్సామీస్

1980

ఎస్.కె.పొట్టెక్కాట్

మలయాళం

1981

అమృతా ప్రీతమ్

పంజాబీ

1982

మహాదేవి వర్మ

హిందీ

1983

మాస్తి వెంకటేశ అయ్యంగార్

కన్నడ

1984

తక్కజి శివశంకర పిళ్లై

మలయాళం

1985

పన్నాలాల్ పటేల్

గుజరాతీ

1986

సచ్చిదానంద రౌత్రాయ్

ఒడియా

1987

విష్ణువామన్ శిర్వాద్కర్ (కుసుమాగ్రజ్)

మరాఠీ

1988

సి.నారాయణరెడ్డి

తెలుగు

1989

ఖుర్రత్‌లేన్ హైదర్

ఉర్దూ

1990

వినాయక కృష్ణ గోకాక్

కన్నడ

1991

సుభాష్ ముఖోపాధ్యాయ

బెంగాలీ

1992

నరేష్ మెహతా

హిందీ

1993

సీతాకాంత్ మహాపాత్ర

ఒడియా

1994

యు.ఆర్.అనంతమూర్తి

కన్నడ

1995

ఎం.టి.వాసుదేవన్ నాయర్

మలయాళం

1996

మహాశ్వేతాదేవి

బెంగాలీ

1997

అలీ సర్దార్ జాఫ్రి

ఉర్దూ

1998

గిరీష్ కర్నాడ్

కన్నడ

1999

నిర్మల్ వర్మ

హిందీ

1999

గురుదయాళ్ సింగ్

పంజాబీ

2000

ఇందిరా గోస్వామి

అస్సామీస్

2001

రాజేంద్ర షా

గుజరాతీ

2002

జయకాంతన్

తమిళ్

2003

విందా కరాందికర్

మరాఠీ

2004

రెహమాన్ రాహి

కశ్మీరీ

2005

కున్వర్ నారాయణ్

హిందీ

2006

రవీంద్ర కెలేకర్

కొంకణి

2006

సత్యవ్రత్ శాస్త్రి

సంస్కృతం

2007

ఒ.ఎన్.వి.కురుప్

మలయాళం

2008

అక్లాఖ్ మహమ్మద్ ఖాన్

ఉర్దూ

2009

అమర్ కాంత్

హిందీ

2009

శ్రీ‌లాల్ శుక్లా

హిందీ

2010

చంద్రశేఖర కంబర

కన్నడ

2011

ప్రతిభా రే

ఒడియా

2012

రావూరి భరద్వాజ

తెలుగు

2013

కేదార్‌నాథ్ సింగ్

హిందీ

2014

బాలచంద్ర నెమాడే

మరాఠీ

2015

రఘువీర్ చౌదరి

గుజరాతీ

2016

శంఖ ఘోష్

బెంగాలీ

2017

కృష్ణ సోబతీ

హిందీ

Published date : 20 Nov 2017 05:31PM

Photo Stories