Skip to main content

ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అవార్డులు

ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అవార్డులు
చలన చిత్ర రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి, విశేష కృషిచేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులతో పాటు ఇతర అవార్డులను కూడా ప్రదానం చేస్తుంది. వాటిలో రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్.టి.ఆర్. జాతీయ చలనచిత్ర అవార్డు, బి.ఎన్.రెడ్డి అవార్డు, అక్కినేని నాగేశ్వరావు జాతీయ అవార్డులు ముఖ్యమైనవి. జాతీయ స్థాయిలో, అన్ని ప్రాంతీయ భాషల్లో చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి అందిస్తారు.

ఎన్.టి.ఆర్. జాతీయ చలనచిత్ర అవార్డు: జాతీయ చలనచిత్ర రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. చలనచిత్ర రంగంలో అసాధారణ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు మీదుగా రాష్ర్ట ప్రభుత్వం 1996లో నెలకొల్పింది. ఈ అవార్డు కింద 5 లక్షల రూపాయలు బహుకరిస్తారు. ప్రథమ గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు. నంది అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగానే దీనిని అందచేస్తారు.

అవార్డు గ్రహీతలు:

సంవత్సరం

గ్రహీత

1996 అక్కినేని నాగేశ్వర రావు
1997 దిలిప్ కుమార్
1998 శివాజీ గణేషన్
1999 లతా మంగేష్కర్
2000 భానుమతి రామకృష్ణ
2001 రిషికేష్ ముఖర్జీ
2002 డా.రాజ్‌కుమార్
2003 ఘట్టమనేని కృష్ణ
2004 ఇళయరాజా
2005 నూతన్ ప్రసాద్, అంబరీష్
2006 వహీదా రెహ్మాన్
2007 దాసరి నారాయణ రావు
2008 జమున
2009 బి. సరోజాదేవి
2010 శారద
2011 అమితాబ్ బచ్చన్
2012 ద్వారకిష్, మాలశ్రీ
2013 మనోజ్ దాస్
2014 కమల్‌ హాసన్
2015 కె. రాఘవేంద్రరావు
2016 రజనీకాంత్

రఘుపతి వెంకయ్య అవార్డు: తెలుగు చలనచిత్ర రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. చిత్ర పరిశ్రమలో మార్గదర్శకుడు రఘుపతి వెంకయ్య నాయుడు పేరు మీదుగా రాష్ర్ట ప్రభుత్వం 1980లో ఈ అవార్డును ప్రవేశపెట్టింది. అవార్డు కింద ఒక బంగారు నంది, బంగారు పతకం రూ. 50,000 నగదును బహుకరిస్తారు. దీనిని కూడా నంది అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగానే అందచేస్తారు. మొదటి అవార్డు గ్రహీత ఎల్.వి. ప్రసాద్.

అవార్డు గ్రహీతలు:
సంవత్సరం గ్రహీత
1980 ఎల్.వి. ప్రసాద్
1981 పి.పుల్లయ్య(దర్శకుడు, నిర్మాత)
1982 బి.ఎ.సుబ్బారావు(నిర్మాత)
1983 ఎం.ఎ.రహమాన్
1984 కొసరాజు రాఘవయ్య చౌదరి
1985 భానుమతి(నటి, నిర్మాత, గాయకురాలు, సంగీత దర్శకురాలు, రచయిత)
1986 బాపు - రమణ
1987 బి.నాగిరెడ్డి(నిర్మాత)
1988 డి.వి.ఎస్. రాజు
1989 అక్కినేని నాగేశ్వర రావు
1990 దాసరి నారాయణ రావు(నటుడు, నిర్మాత, దర్శకుడు)
1991 కె.విశ్వనాథ్(దర్శకుడు, నటుడు)
1992 ఎస్.రాజేశ్వర రావు
1993 దుక్కిపాటి మధుసూదన రావు(నిర్మాత)
1994 అంజలీ దేవి(నటి)
1995 కె.ఎస్.ప్రకాశరావు
1996 ఇంతూరి వెంకటేశ్వర రావు
1997 బి.మధుసూదనరావు
1998 గుమ్మడి
1999 శాంతకుమారి
2000 టి.ఎల్.కాంతారావు
2001 అల్లు రామలింగయ్య
2002 పి.సుశీల(నేపథ్య గాయని)
2003 వి.బి.రాజేంద్ర ప్రసాద్
2004 కృష్ణవేణి
2005 ఎం.ఎస్.రెడ్డి(నిర్మాత, దర్శకుడు, రచయిత)
2006 డి.రామనాయుడు
2007 తమ్మారెడ్డి కృష్ణమూర్తి
2008 విజయనిర్మల(నటి, నిర్మాత, దర్శకురాలు)
2009 కె.రాఘవ(నిర్మాత)
2010 ఎం.బాలయ్య(నటుడు, నిర్మాత, దర్శకుడు)
2011 కైకాల సత్యనారాయణ
2012 కోడి రామకృష్ణ (దర్శకుడు)
2013 వాణిశ్రీ (నటి)
2014 కృష్ణం రాజు (నటుడు)
2015 ఈశ్వర (రచయిత)
2016 చిరంజీవి (నటుడు)

అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డు: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీదుగా రాష్ర్ట ప్రభుత్వం ఈ అవార్డును నెలకొల్పింది. జాతీయ చలనచిత్ర రంగానికి విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు బహుకరిస్తారు. తాజాగా 2011 సంవత్సరానికి బాలీవుడ్ నటి హేమమాలినికి ఈ అవార్డు బహుకరించారు.

అవార్డు గ్రహీతలు:
సంవత్సరం గ్రహీత
2005 దేవానంద్(హిందీ నటుడు)
2006 షబానా అజ్మీ(నటి, సామాజికి కార్యకర్త)
2007 అంజలీ దేవి(నటి, నిర్మాత)
2008 వైజయంతిమాల(నటి, నృత్యకారిణి)
2009 లతా మంగేష్కర్(గాయని)
2010 కె. బాలచందర్(రచయిత, దర్శకుడు, నిర్మాత)
2011 హేమమాలిని(నటి, నిర్మాత, దర్శకురాలు, నృత్యకారిణి)
2012 శ్యామ్ బెనగల్ (బాలీవుడ్ దర్శకుడు, రచయిత)
2013 శ్రీదేవి (నటి)
2014 అమితాబ్ బచ్చన్ (బాలీవుడ్ నటుడు)
2015 ఘట్టమనేని కృష్ణ (నటుడు)
2017 ఎస్‌. ఎస్‌. రాజమౌళి (దర్శకుడు)
Published date : 18 Jun 2013 06:08PM

Photo Stories