55వ జ్ఞానపిఠ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
Sakshi Education
జ్ఞానపిఠ్ అవార్డు 55వ ఎడిషన్‌ను ప్రఖ్యాత మలయాళ కవి అక్కితం అచ్యుతన్ నంబూతిరికి ఇచ్చారు.
ముఖ్య విషయాలు..
- ఇది దేశంలోని అత్యున్నత సాహిత్య పురస్కారంగా గుర్తింపు పొందింది.
- ఇతర భారతీయ భాషలతో పాటు ఇంగ్లీషును అవార్డుకు పరిగణిస్తారు.
- ఏటా ఈ అవార్డును కేవలం భారతీయ పౌరులకు మాత్రమే ఇస్తారు.
- అవార్డు పొందిన వారికి బహుమతిగా రూ.11 లక్షలు, ప్రశంసాపత్రంతోపాటు వాగ్దేవి (సరస్వతి) మాత కాంస్య విగ్రహం ఇస్తారు.
- దీన్ని భారతీయ జ్ఞానపిఠ్ అనే సాంస్కృతిక సంస్థ స్పాన్సర్ చేస్తుంది.
- 2018లో రచయిత అమితావ్ ఘోష్‌ను 54వ జ్ఞానపీఠ్ అవార్డుతో సత్కరించారు. ఆయన జ్ఞానపీఠ్ పొందిన తొలి ఆంగ్ల భాషా రచయిత.
Published date : 19 Oct 2020 01:09PM