నూతన రాష్ట్రాల ఏర్పాటు.. రాజ్యాంగ ప్రక్రియ
Sakshi Education
బి.కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్.
ప్రస్తుతం వున రాష్ట్రంలో.. రాష్ట్ర విభజనకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు శాసనసభకు వస్తుందనే విషయుంలో విస్తృత స్థారుులో చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో నూతన రాష్ట్రాల ఏర్పాటు విషయుంలో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలు, పార్లమెంట్ బాధ్యత, ఈ విషయుంలో రాష్ట్రపతి భూమిక, ఆ రాష్ట్ర శాసనసభ పాత్ర తదితర అంశాలపై విశ్లేషణ..
భారత రాజ్యాంగ, రాజకీయ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు పరిపాలనలో నిర్మాణాత్మకమైన, కీలక పాత్రను పోషిస్తున్నాయి. మన దేశంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల మాదిరిగా పరిపూర్ణమైన సమాఖ్య వ్యవస్థగానీ, బ్రిటన్ వలె సంపూర్ణ ఏకకేంద్ర రాజకీయ వ్యవస్థగా పని చేయటం లేదు. ఇందుకు భిన్నంగా భారత స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఒక విశిష్ట సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ క్రవుంలో కొన్ని పరిమితులకు లోబడి కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి గుర్తింపునిచ్చారు. అలాంటి అంశాల్లో రాష్ట్రాల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రధానంగా పేర్కొనవచ్చు.
రాష్ట్రాల ఏర్పాటు - రాజ్యాంగం:
రాజ్యాంగ ఒకటో భాగం, ప్రకరణ ఒకటి నుంచి నాలుగు వరకు కొత్త రాష్ట్రాల చేరిక, ఏర్పాటు మొదలైన అంశాలను సవివరంగా ప్రస్తావించారు. ప్రకరణ ఒకటిలో భారతదేశాన్ని ‘రాష్ట్రాల యూనియన్ (యూనియన్ ఆఫ్ స్టేట్స్- Union of States)’గా వర్ణించారు. సమాఖ్య అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రయోగించలేదు. ఎందుకంటే భారత యూనియన్ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పాటు కాలేదు. కాబట్టి రాష్ట్రాలు కేంద్రం నుంచి వీడిపోలేవు. ఈ పద్ధతి సాంప్రదాయ సమాఖ్య పద్ధతికి భిన్నమైంది. ఇది రాష్ట్రాలను పట్టి ఉంచే (హోల్డింగ్ టుగేదర్) పద్ధతిలో ఏర్పాటైంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల విషయూనికొస్తే.. అక్కడ ఆయూ రాష్ట్రాలను ఒప్పందం ద్వారా ఒక చోటకు చేరతాం (కమింగ్ టుగేదర్) అనే పద్ధతిలో సమాఖ్య వ్యవస్థగా ఏర్పాటు చేశారు.
ప్రకరణ రెండు ప్రకారం:
పార్లమెంట్ ఒక చట్టం ద్వారా దేశంలో అంతర్గత భూభాగాల విషయంలో మార్పులు చేయడంతోపాటు భారత భూభాగాలను ఇతర దేశాలకు బదిలీ చేయడం, ఇతరుల భూభాగాలను భారత్‌లో విలీనం చేసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో పార్లమెంట్‌దే అంతిమ అధికారం.
ప్రకరణ మూడు ప్రకారం:
పార్లమెంట్ ఒక చట్టం ద్వారా
ఎ) కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇది రెండు రాష్ట్రాల కలయికతో కావచ్చు (ఉదాహరణకు- ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం కలసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది) లేదా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం (ప్రస్తుతం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ). గతంలో ఈ విధానంలోనే అత్యధిక రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
బి) రాష్ట్రాల సరిహద్దులను పెంచవచ్చు
సి) రాష్ట్రాల సరిహద్దులను కుదించవచ్చు
డి) సరిహద్దులను మార్చొచ్చు
ఇ) రాష్ట్రాల పేర్లను మార్చొచ్చు
ప్రక్రియ:
నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లుకు శాసనసభలో మెజారిటీ అభిప్రాయం వ్యతిరేకంగా ఉంటే రాష్ట్రపతి ఏమి చేయాలో రాజ్యాంగంలో ఎక్కడా వివరించలేదు. కాబట్టి ఈ అంశం రాష్ట్రపతి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతికి కొన్ని సంశయాలు ఉంటే రాజ్యాంగంలోని ప్రకరణ 143 (1) కింద సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రపతి వ్యవహరిస్తాడు.
పార్లమెంట్ అధికారాలు - సుప్రీంకోర్టు -
రాష్ట్ర శాసనసభ పాత్ర:
రాష్ట్ర విభజన ప్రక్రియు రాజ్యాంగ బద్ధంగా జరిగిందా లేదా అనే సందేహంపై అంతిమంగా వ్యాఖ్యానించే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. రాజ్యాంగంలోని మూడో ప్రకరణపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ పాత్రను ఎలా నిర్వచించింది, అసెంబ్లీ అభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఉంది, అసెంబ్లీకి పంపించిన ముసాయిదా బిల్లుకు ఆ తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు మధ్య తేడా మొదలైన అంశాలపై 1959లో బాబూలాల్ వర్సెస్ బొంబాయి స్టేట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలి.
విభజన-సుప్రీం తీర్పులు
ఒక రాష్ట్ర విషయాన్ని ఆ రాష్ట్ర శాసనసభ సమ్మతి లేకుండా పార్లమెంట్ స్వయంగా (suo-moto) శాసనం చేసే అధికారం రాజ్యాంగంలో ఏ ప్రకరణ కింద పార్లమెంట్‌కు ప్రకటించిందో అనే విషయంలో స్పష్టత లేదు. ప్రకరణ మూడు పార్లమెంట్‌కు కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో చట్టం చేసే అధికారం ఉందని మాత్రమే పేర్కొంటుంది. 1956 నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల శాసనసభల సమ్మతితో జరిగినందున ఏ సమస్య ఉత్పన్నం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సుప్రీం కోర్టు గతంలో చెప్పిన తీర్పులు యథాతథంగా ఇక్కడ వర్తింపజేయడానికి వీలుకాకపోవచ్చు.
రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ప్రకరణ రెండు, మూడు ప్రకారం పార్లమెంట్‌కు సంక్రమించిన అధికారాలను ప్రజాస్వామిక ప్రక్రియలో వినియోగించాలని 1967లో ‘మంగల్ సింగ్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ప్రకరణలు రెండు, మూడు, నాలుగు ప్రకారం విభజనకు, కొత్త రాష్ట్రాల ఏర్పాటును బూట్ మెజార్టీతో పాలక పక్షాలు సాధ్యం చేసుకోవడానికి కూడా హద్దులున్నాయని సుప్రీం కోర్టు ‘పౌద్వాల్ కేసు’లో 1993లో తీర్పునిచ్చింది. పరిపాలన సౌలభ్యం, భౌగోళిక సజాతీయత, ఆర్థిక సౌష్టం వంటి అంశాలను పరిశీలించాకే రాష్ట్రాల విభజన, ఏర్పాటు ప్రక్రియ చేయాలని ‘స్టేట్స్ వర్సెస్ యూనియన్’ వివాదంలో అభిప్రాయపడింది. అయితే వీటి వినియోగం, ఇతర ఒప్పందం విషయాల్లో పార్లమెంట్ చట్టాలను ప్రశ్నించడానికి వీల్లేదని ‘ముల్లపెరియార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006’లో తీర్పునిచ్చింది.
బిల్లుపై సంబంధిత అసెంబ్లీ:
రాష్ట్రపతి నిర్దేశించిన గడువులోగా అసెంబ్లీ తన అభిప్రాయాన్ని చెప్పాలి. నిర్దిష్ట గడువు ముగిసిన తర్వాత కూడా అసెంబ్లీ తన అభిప్రాయాన్ని చెప్పకపోయినా.. చెప్పినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ఇచ్చిన అవకాశాన్ని అసెంబ్లీ వినియోగించుకోకపోవడమనేది..పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అడ్డంకి కారాదన్నదే దీని ఉద్దేశం. బిల్లులో తొలుత చేసిన ప్రతిపాదనను కేంద్రం సవరిస్తే, ఆ బిల్లును మరోసారి రాష్ట్ర అసెంబ్లీకి పంపి, అభిప్రాయాలు తీసుకోవాలని కూడా లేదు. ముసాయిదాలో చేసే ప్రతి సవరణపైన అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి వస్తే ఇదో అంతులేని ప్రక్రియగా మారుతుంది.
పైగా ఈ విషయం వేర్వేరు రాష్ట్రాలతో ముడిపడినదైతే ఎవరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే అంశం సంక్లిష్టంగా మారుతుంది. పార్లమెంట్ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల మార్పులపై పూర్తి అధికారం పార్లమెంట్‌కే ఉంది. శాసనసభలకు తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ విభజన - అధికరణ 371:
రాష్ట్రంలో 1969 తెలంగాణ, 1972 జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో, ఇరుప్రాంతాల ప్రజల ఆకాంక్షల మేరకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం కోసం భారత రాజ్యాంగంలో 21వ భాగంలో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371డి, 371ఇ అధికరణలను ప్రత్యేక మెజార్టీతో చేర్చారు. 371 డి ప్రకారం భారత రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని, వివిధ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో సమాన అవకాశాలు, వసతులను కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
జీవోఎం పాత్ర:
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించటానికి కమిషన్లు లేదా మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటు చేయవ చ్చు. ప్రకరణ మూడు ప్రకారం రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల ఫలితంగా అవసరమైన నిబంధనలను కూడా రాష్ట్ర విభజన బిల్లులో చేర్చవచ్చు. పంపకాల విషయంలో మంత్రుల బృందం వివిధ ఫిర్యాదులను, సలహాలను స్వీకరించి తగిన సిఫార్సులు చేస్తుంది.
రాజ్యాంగ సవరణ:
ప్రకరణ రెండు, మూడు ప్రకారం ఏదైనా చట్టం చేసినప్పుడు..షెడ్యూల్ ఒకటి, షెడ్యూల్ నాలుగులోని సంబంధిత అంశాలను తప్పనిసరిగా సవరణ చేయాల్సిన అవసరం ఉందని ప్రకరణ 4 (1) స్పష్టం చేస్తుంది. షెడ్యూల్ ఒకటిలో రాష్ట్రాల పేర్లు, షెడ్యూల్ నాలుగులో రాష్ట్రాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం గురించి వివరణ ఉంది. కాబట్టి ఈషెడ్యూల్లోని సంబంధిత అంశాలు ఆటోమాటిక్‌గా సవరించబడతాయి. అయితే ప్రకరణ 4 (2) ప్రకారం అలాంటి చట్టాలను ప్రకరణ 368లో ప్రస్తావించినట్లుగా రాజ్యాంగ సవరణగా పరిగణించరు. ఎందుకంటే ప్రకరణ 368లో సాధారణ మెజార్టీ గురించి ప్రస్తావన లేదు.
సమన్యాయం - ప్రాథమిక హక్కు:
రాష్ట్రాల ఏర్పాటు అధికారం రాజ్యాంగపరంగా పార్లమెంటుకే ఉన్నప్పటికీ.. ఈ ప్రక్రియలో రాష్ట్రాల పాత్ర కూడా కీలకమవుతుంది. అభిప్రాయం, మెజార్టీ తదితర అంశాలను సాంకేతికంగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల ఏర్పాటుకు సహేతుక కారణం కూడా చూపాలి. విభజన అనివార్యం అయితే ఏప్రాంత ప్రజలు నష్టపోరాదు. అన్ని సందర్భాల్లో వంద శాతం న్యాయం జరగకపోవచ్చు. ఆదే సందర్భంలో గరిష్ట న్యాయం చేయడం కూడా అసాధ్యం కాదు. సమన్యాయం అంటే భాగస్వామ్యంలో ఇచ్చిపుచ్చుకొని సమానంగా ప్రయోజనాన్ని పొందడమే. ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుకు ఈ సూత్రమే పునాది.
రాష్ట్రాల ఏర్పాటుకు అనుసరించిన ప్రక్రియ

- పైన పేర్కొన్న అంశాలకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో..ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
- బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి.
- రాష్ట్రపతి ప్రతిపాదిత బిల్లును ఆ రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి నివేదిస్తాడు. రాష్ట్రపతి సూచించిన గడువులోగా శాసనసభ తన అభిప్రాయాన్ని తెలియజేయాలి. గడవు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.
- రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా విస్మరించవచ్చు.
- పార్లమెంట్ ఉభయసభలు బిల్లును సాధారణ మెజారిటీతో వేర్వేరుగా ఆమోదించాలి. ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. బిల్లు వీగిపోతుంది.
- చివరగా బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం పొందితే ప్రక్రియ పూర్తి అవుతుంది. కేంద్రం ప్రకటించిన రోజు నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది.
నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లుకు శాసనసభలో మెజారిటీ అభిప్రాయం వ్యతిరేకంగా ఉంటే రాష్ట్రపతి ఏమి చేయాలో రాజ్యాంగంలో ఎక్కడా వివరించలేదు. కాబట్టి ఈ అంశం రాష్ట్రపతి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతికి కొన్ని సంశయాలు ఉంటే రాజ్యాంగంలోని ప్రకరణ 143 (1) కింద సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రపతి వ్యవహరిస్తాడు.
పార్లమెంట్ అధికారాలు - సుప్రీంకోర్టు -
రాష్ట్ర శాసనసభ పాత్ర:
రాష్ట్ర విభజన ప్రక్రియు రాజ్యాంగ బద్ధంగా జరిగిందా లేదా అనే సందేహంపై అంతిమంగా వ్యాఖ్యానించే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. రాజ్యాంగంలోని మూడో ప్రకరణపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ పాత్రను ఎలా నిర్వచించింది, అసెంబ్లీ అభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఉంది, అసెంబ్లీకి పంపించిన ముసాయిదా బిల్లుకు ఆ తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు మధ్య తేడా మొదలైన అంశాలపై 1959లో బాబూలాల్ వర్సెస్ బొంబాయి స్టేట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలి.
విభజన-సుప్రీం తీర్పులు
ఒక రాష్ట్ర విషయాన్ని ఆ రాష్ట్ర శాసనసభ సమ్మతి లేకుండా పార్లమెంట్ స్వయంగా (suo-moto) శాసనం చేసే అధికారం రాజ్యాంగంలో ఏ ప్రకరణ కింద పార్లమెంట్‌కు ప్రకటించిందో అనే విషయంలో స్పష్టత లేదు. ప్రకరణ మూడు పార్లమెంట్‌కు కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో చట్టం చేసే అధికారం ఉందని మాత్రమే పేర్కొంటుంది. 1956 నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల శాసనసభల సమ్మతితో జరిగినందున ఏ సమస్య ఉత్పన్నం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సుప్రీం కోర్టు గతంలో చెప్పిన తీర్పులు యథాతథంగా ఇక్కడ వర్తింపజేయడానికి వీలుకాకపోవచ్చు.
రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ప్రకరణ రెండు, మూడు ప్రకారం పార్లమెంట్‌కు సంక్రమించిన అధికారాలను ప్రజాస్వామిక ప్రక్రియలో వినియోగించాలని 1967లో ‘మంగల్ సింగ్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ప్రకరణలు రెండు, మూడు, నాలుగు ప్రకారం విభజనకు, కొత్త రాష్ట్రాల ఏర్పాటును బూట్ మెజార్టీతో పాలక పక్షాలు సాధ్యం చేసుకోవడానికి కూడా హద్దులున్నాయని సుప్రీం కోర్టు ‘పౌద్వాల్ కేసు’లో 1993లో తీర్పునిచ్చింది. పరిపాలన సౌలభ్యం, భౌగోళిక సజాతీయత, ఆర్థిక సౌష్టం వంటి అంశాలను పరిశీలించాకే రాష్ట్రాల విభజన, ఏర్పాటు ప్రక్రియ చేయాలని ‘స్టేట్స్ వర్సెస్ యూనియన్’ వివాదంలో అభిప్రాయపడింది. అయితే వీటి వినియోగం, ఇతర ఒప్పందం విషయాల్లో పార్లమెంట్ చట్టాలను ప్రశ్నించడానికి వీల్లేదని ‘ముల్లపెరియార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006’లో తీర్పునిచ్చింది.
బిల్లుపై సంబంధిత అసెంబ్లీ:
రాష్ట్రపతి నిర్దేశించిన గడువులోగా అసెంబ్లీ తన అభిప్రాయాన్ని చెప్పాలి. నిర్దిష్ట గడువు ముగిసిన తర్వాత కూడా అసెంబ్లీ తన అభిప్రాయాన్ని చెప్పకపోయినా.. చెప్పినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ఇచ్చిన అవకాశాన్ని అసెంబ్లీ వినియోగించుకోకపోవడమనేది..పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అడ్డంకి కారాదన్నదే దీని ఉద్దేశం. బిల్లులో తొలుత చేసిన ప్రతిపాదనను కేంద్రం సవరిస్తే, ఆ బిల్లును మరోసారి రాష్ట్ర అసెంబ్లీకి పంపి, అభిప్రాయాలు తీసుకోవాలని కూడా లేదు. ముసాయిదాలో చేసే ప్రతి సవరణపైన అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి వస్తే ఇదో అంతులేని ప్రక్రియగా మారుతుంది.
పైగా ఈ విషయం వేర్వేరు రాష్ట్రాలతో ముడిపడినదైతే ఎవరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే అంశం సంక్లిష్టంగా మారుతుంది. పార్లమెంట్ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల మార్పులపై పూర్తి అధికారం పార్లమెంట్‌కే ఉంది. శాసనసభలకు తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ విభజన - అధికరణ 371:
రాష్ట్రంలో 1969 తెలంగాణ, 1972 జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో, ఇరుప్రాంతాల ప్రజల ఆకాంక్షల మేరకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం కోసం భారత రాజ్యాంగంలో 21వ భాగంలో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371డి, 371ఇ అధికరణలను ప్రత్యేక మెజార్టీతో చేర్చారు. 371 డి ప్రకారం భారత రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని, వివిధ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో సమాన అవకాశాలు, వసతులను కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
జీవోఎం పాత్ర:
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించటానికి కమిషన్లు లేదా మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటు చేయవ చ్చు. ప్రకరణ మూడు ప్రకారం రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల ఫలితంగా అవసరమైన నిబంధనలను కూడా రాష్ట్ర విభజన బిల్లులో చేర్చవచ్చు. పంపకాల విషయంలో మంత్రుల బృందం వివిధ ఫిర్యాదులను, సలహాలను స్వీకరించి తగిన సిఫార్సులు చేస్తుంది.
రాజ్యాంగ సవరణ:
ప్రకరణ రెండు, మూడు ప్రకారం ఏదైనా చట్టం చేసినప్పుడు..షెడ్యూల్ ఒకటి, షెడ్యూల్ నాలుగులోని సంబంధిత అంశాలను తప్పనిసరిగా సవరణ చేయాల్సిన అవసరం ఉందని ప్రకరణ 4 (1) స్పష్టం చేస్తుంది. షెడ్యూల్ ఒకటిలో రాష్ట్రాల పేర్లు, షెడ్యూల్ నాలుగులో రాష్ట్రాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం గురించి వివరణ ఉంది. కాబట్టి ఈషెడ్యూల్లోని సంబంధిత అంశాలు ఆటోమాటిక్‌గా సవరించబడతాయి. అయితే ప్రకరణ 4 (2) ప్రకారం అలాంటి చట్టాలను ప్రకరణ 368లో ప్రస్తావించినట్లుగా రాజ్యాంగ సవరణగా పరిగణించరు. ఎందుకంటే ప్రకరణ 368లో సాధారణ మెజార్టీ గురించి ప్రస్తావన లేదు.
సమన్యాయం - ప్రాథమిక హక్కు:
రాష్ట్రాల ఏర్పాటు అధికారం రాజ్యాంగపరంగా పార్లమెంటుకే ఉన్నప్పటికీ.. ఈ ప్రక్రియలో రాష్ట్రాల పాత్ర కూడా కీలకమవుతుంది. అభిప్రాయం, మెజార్టీ తదితర అంశాలను సాంకేతికంగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల ఏర్పాటుకు సహేతుక కారణం కూడా చూపాలి. విభజన అనివార్యం అయితే ఏప్రాంత ప్రజలు నష్టపోరాదు. అన్ని సందర్భాల్లో వంద శాతం న్యాయం జరగకపోవచ్చు. ఆదే సందర్భంలో గరిష్ట న్యాయం చేయడం కూడా అసాధ్యం కాదు. సమన్యాయం అంటే భాగస్వామ్యంలో ఇచ్చిపుచ్చుకొని సమానంగా ప్రయోజనాన్ని పొందడమే. ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుకు ఈ సూత్రమే పునాది.
రాష్ట్రాల ఏర్పాటుకు అనుసరించిన ప్రక్రియ
- 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా దేశంలోని రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు. 1953లో నియమించిన ఫజల్ అలీ కమిషన్ సూచన ద్వారా ఈ వ్యవస్థీకరణ జరిగింది. పార్లమెంట్‌లో 2/3 వంతు మెజార్టీతో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.
- బొంబాయి రాష్ట్రాన్ని విభజిస్తు గుజరాతీ భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా సౌరాష్ట్ర ప్రాంతాన్ని కలుపుతూ గుజరాత్‌ను దేశంలో 15వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బొంబాయి రాష్ట్రాన్ని మహారాష్ట్రగా పేరు మార్చారు.
- ‘షా’ కమిషన్ నివేదిక మేరకు హిందీ మాట్లాడే ప్రజలకు ప్రత్యేకంగా హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, పంజాబీ భాష మాట్లాడే వారికోసం పంజాబ్ రాష్ట్రాన్ని కొనసాగించారు.
- మధ్యప్రదేశ్ నుంచి గిరిజన ప్రాంతాన్ని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంగా 2000, నవంబర్ 1న ఏర్పాటు చేశారు. అలాగే అదే ఏడాది ఉత్తరప్రదేశ్ నుంచి నవంబర్ 9న ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని, బీహార్ నుంచి నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
Published date : 02 Dec 2013 10:09AM