LAW
కెరీర్‌లో న్యాయవాదిగా రాణించాలనుకుంటున్నాను.. నాకు అందుబాటులో ఉన్న కోర్సులు, ఉద్యోగ అవకాశాల గురించి తెలపండి?
+
కాని ఇప్పుడు కార్పొరేట్ రంగంలో సైతం లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ ప్రపంచం విస్తరించాక ఈ కెరీర్‌కు మరింత ప్రాధాన్యం పెరిగింది. ప్రపంచీకరణ, బహుళజాతి కంపెనీల విస్తరణే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు దేశంలో ముఖ్యమైన కేసులు వాదించేందుకు గంటల లెక్కన భారీ ఫీజులు తీసుకునే అడ్వకేట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చట్టాలపై పట్టు, వాదనాlపటిమ, చురుకుదనం ఉన్నవారికి లా చక్కటి కెరీర్.
ఇంటర్మీడియెట్/10+2తోనే దేశవ్యాప్తంగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ప్రధానంగా బీఏ ఎల్‌ఎల్‌బీ/బీకామ్ ఎల్‌ఎల్‌బీ/ బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ/బీబీఏ ఎల్‌ఎల్‌బీలో చేరొచ్చు. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ‘కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో ప్రతిభ చూపాలి. క్లాట్‌తోపాటు దేశంలో న్యాయవిద్యకు సంబంధించి ఆలిండియా లా ఎంట్రన్స్ టెస్ట్, లా స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్– ఇండియా(ఎల్‌శాట్–ఇండియా); టీఎస్‌లాసెట్/ఏపీలాసెట్ (తెలుగు రాష్ట్రాల్లో) వంటి ప్రవేశ పరీక్షలకు హాజరుకావచ్చు.
అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత పొస్టు గ్రాడ్యుయేషన్‌లో.. సివిల్/క్రిమినల్/ కార్పొరేట్/ఎన్విరాన్‌మెంటల్/కాన్‌స్టిట్యూషనల్/సైబర్/ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా/రియల్ ఎస్టేట్ లా/మీడియా లా/ఇంటర్నేషనల్/బిజినెస్ లా/ట్యాక్స్‌లా.. ఇలా పలు స్పెషలైజేషన్స్ చేయవచ్చు.

నేను త్వరలో లా కోర్సు పూర్తిచేసుకొని న్యాయవాద కెరీర్ ప్రారంభించాలను కుంటున్నాను. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో లాయర్‌గా రాణించేందుకు నేను ఎలాంటి సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకుంటే మంచిదో వివరించండి?
+
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం లాయర్‌కు కంప్యూటర్, టెక్నాలజీపై అవగాహన ఉండటం తప్పనిసరిగా మారింది. సొంతంగా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించినా.. లేదా ఏదైనా పెద్ద లా సంస్థలో పనిచేస్తున్నా... బ్రౌజింగ్ దగ్గర నుంచి ఫైల్ షేరింగ్ వరకూ... న్యాయవాద వృత్తిలో ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ లతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకోవడం కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లాయర్‌కు ఫైల్/డాక్యుమెంట్ తయారీకి ‘ఎంఎస్ ఆఫీస్’ను ఉపయోగించుకోవాలి. ఫైల్ షేరింగ్ కోసం ఒన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్; కేస్‌మేనేజ్‌మెంట్ కోసం కాస్మోలెక్స్, ప్రాక్టీస్ పాంథర్, ఎవర్‌నోట్; వెస్ట్‌లా వంటి రీసెర్చ్ డేటాబేసెస్ వంటివి తెలుసుండటం వృత్తి పరంగా ఎంతో మేలు చేస్తుంది.
క్లాట్ పరీక్ష, యూనివర్సిటీల వివరాలు తెలపండి?
+
క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్).. ఇది దేశంలోని 17 ప్రఖ్యాతి పొందిన న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఎల్‌ఎల్‌బీ లేదా ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష.
అర్హత:
పరీక్ష విధానం:
- బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ.
వెబ్‌సైట్: www.nls.ac.in
- హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆఫ్ లా (నల్సార్).
వెబ్‌సైట్: www.nalsar.ac.in
- భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ.
వెబ్‌సైట్: www.nliu.ac.in
- కోల్‌కతాలోని వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సెన్సైస్.
వెబ్‌సైట్: www.nujs.edu
- జోధ్‌పూర్‌లోని నేషనల్ లా యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.nlujodhpur.ac.in
- రాయ్‌పూర్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ.
వెబ్‌సైట్: www.hnlu.ac.in
- గాంధీనగర్‌లోని గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ.
వెబ్‌సైట్: www.gnlu.ac.in
- లక్నోలోని డాక్టర్ రాం మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ.
వెబ్‌సైట్: www.rmlnlu.ac.in
- పంజాబ్‌లోని రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా.
వెబ్‌సైట్: www.rgnul.ac.in
- పాట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ.
వెబ్‌సైట్: www.cnlu.ac.in
- కోచిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్.
వెబ్‌సైట్: www.nuals.ac.in
- కటక్‌లోని నేషనల్ లా యూనివర్సిటీ ఒడిశా.
వెబ్‌సైట్: www.nluo.ac.in
- రాంచీలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా.
వెబ్‌సైట్: www.nusrlranchi.ac.in
- అసోంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్ అకాడమీ.
వెబ్‌సైట్: www.nluassam.ac.in
- విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ.
వెబ్‌సైట్: www.dsnlu.ac.in
- తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా స్కూల్.
వెబ్‌సైట్: www.tnnls.in
- ముంబైలోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ.
వెబ్‌సైట్: www.nlumumbai.edu.in
- క్లాట్-2016కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 2016, మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 2016, మే 8న పరీక్ష ఉంటుంది.
అర్హత:
- యూజీ ప్రోగ్రామ్స్: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/10+2 (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం).
- పీజీ ప్రోగ్రామ్స్: కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమానం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం).
పరీక్ష విధానం:
- యూజీ ప్రోగ్రామ్స్: రెండు గంటల వ్యవధిలో 200 మార్కులకు సమాధానాలు గుర్తించాలి. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెండ్ అఫైర్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, లీగల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.
- పీజీ ప్రోగ్రామ్స్: రెండు గంటల వ్యవధిలో 150 మార్కులకు సమాధానాలు గుర్తించాలి. కాన్‌స్టిట్యూషనల్ లా, జ్యూరిస్ప్రుడెన్స్, లా ఆఫ్ కాంట్రాక్ట్స్, లా ఆఫ్ టార్ట్స్, క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా, ఫ్యామిలీ లా, ప్రాపర్టీ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా తదితర విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- ప్రవేశం: క్లాట్-2016 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
`లా`లో మాస్టర్స్ డిగ్రీని చేసేందుకు అర్హతలు, ప్రవేశవిధానం, ఈ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
- హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ.. కార్పొరేట్ అండ్ కమర్షియల్ లాస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్, లీగల్ పెడగాజి అండ్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ లా, పర్సనల్ లాస్, జనరల్ స్పెషలైజేషన్లతో ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తోంది.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/బీఎల్.
ప్రవేశం: కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.nalsar.ac.in
- హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లా కాలేజీలో కానిస్టిట్యూషనల్ లా, కార్పొరేట్ లాస్, లేబర్ లా స్పెషలైజేషన్లతో ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తోంది.
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ.
ప్రవేశం: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీసీహెచ్‌ఈ) నిర్వహించే పీజీఎల్‌సీఈటీ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.osmania.ac.in/lawcollege/
- గుంటూరులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని పీజీ డిపార్ట్‌మెంట్ ఫర్ లీగల్ స్టడీస్.. లేబర్ లాస్, కానిస్టిట్యూషనల్ లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, టార్ట్స్ అండ్ క్రైమ్స్, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లా స్పెషలైజేషన్లతో ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తోంది.
అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
`పేటెంట్` లో డిప్లొమా స్థాయి కోర్సులు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలోని నల్సార్ ప్రాక్సిమిటీ ఎడ్యుకేషన్.. పేటెంట్ లాలో ఒకేడాది వెబ్ ఆధారిత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: www.nalsarpro.org
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: www.nalsarpro.org
ముంబైలోని ఎస్‌కేవీఎమ్స్ ఎన్‌ఎమ్‌ఐఎమ్‌ఎస్.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్.. పేటెంట్ లా అండ్ ప్రాక్టీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ
ప్రవేశం: ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
వెబ్‌సైట్: www.iips.nmims.edu
అర్హత: ఏదైనా డిగ్రీ
ప్రవేశం: ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
వెబ్‌సైట్: www.iips.nmims.edu
ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో బ్యాచిలర్ ఆఫ్ లా(ఆనర్స్) కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
- ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా.. ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సును అందిస్తోంది. ఈ ప్రోగ్రాంను బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా గుర్తించింది.
ప్రవేశం: ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్/ ఎల్‌ఎస్‌ఏటీ ఇండియా/ఎల్‌ఎస్‌ఏటీ గ్లోబల్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
వెబ్‌సైట్: www.rgsoipl.iitkgp.ernet.in
- హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలోని నల్సార్ ప్రాక్సిమేట్ ఎడ్యుకేషన్.. పేటెంట్ లాస్‌లో ఒకేడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది. ఇది వెబ్ అనుబంధ ప్రోగ్రాం.
అర్హత: డిగ్రీ.
వెబ్‌సైట్: www.nalsarpro.org
- ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ స్టడీస్.. పేటెంట్ లా అండ్ ప్రాక్టీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాంను అందిస్తోంది.
అర్హత: డిగ్రీ.
ప్రవేశం: ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.iips.nmims.edu
- ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ ఐపీఆర్ అండ్ పేటెంట్ లాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత: సైన్స్‌లోని ఏ విభాగంలోనైనా డిగ్రీ/పీజీ/ పీహెచ్‌డీలు చేసినవారు అర్హులు.
వెబ్‌సైట్: www.nludelhi.ac.in
- బెంగళూరులోని నాగర్భవిలోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా.. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌లో దూరవిద్య ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
వెబ్‌సైట్: www.nls.ac.in
క్లాట్ పరీక్ష వివరాలను తెలపండి?
+
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) పరీక్ష ద్వారా 14 నేషనల్ లా యూనివర్సిటీల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
ఎల్‌ఎల్‌బీ:
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో 10+2/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
రాత పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో 200 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఇందులో మొత్తం ఐదు విభాగాలు ఉంటాయి. అవి.. ఇంగ్లిష్ (40 మార్కులు); జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్(50 మార్కులు); ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (న్యూమరికల్ ఎబిలిటీ-20 మార్కులు); లీగల్ ఆప్ట్టిట్యూడ్ (50 మార్కులు); లాజికల్ రీజనింగ్ (40 మార్కులు).
ఎల్‌ఎల్‌ఎం:
అర్హత: 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ/తత్సమానం.
రాత పరీక్ష విధానం: పరీక్ష డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్‌ల కలయికగా ఉంటుంది. డిస్క్రిప్టివ్ విభాగంలో నాలుగు ఎస్సే ప్రశ్నలు ఉంటాయి. వీటికి 25 చొప్పున కేటాయించిన 100 మార్కులు. ఆబ్జెక్టివ్ విభాగంలో 50 ప్రశ్నలు ఉంటాయి. దీనికి కేటాయించిన మార్కులు 50. సమయం: 2 గంటలు.
వివరాలకు: www.clat.ac.in

లా కోర్సులను ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
+
‘లా’ కు సంబంధించి ఐదేళ్ల, మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఐదేళ్ల లా కోర్సును ఆఫర్ చేస్తోన్న యూనివర్సిటీలు: నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్. అర్హత: 50 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమానం. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: http://nalsarlawuniv.ac.in
యూనివర్సిటీ ఆఫ్ మైసూర్-స్కూల్ ఆఫ్ జస్టిస్
అర్హత: 45 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమానం. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.unimysore.ac.in
అంబేద్కర్ లా యూనివర్సిటీ-తమిళనాడు.
అర్హత:45 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమానం. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.tndalu.org
మూడేళ్ల లా కోర్సును అందిస్తున్న యూనివ ర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్. లాసెట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఐఎల్‌ఎస్ లా కాలేజీ, పుణే. అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్.
వెబ్‌సైట్: www.isllaw.edu
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ.
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్.
రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వెబ్‌సైట్: www.du.ac.in

దక్షిణ భారతదేశంలో ఎల్‌ఎల్‌ఎం (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ)ని ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?
+
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ స్పెషలైజేషన్‌గా ఎల్‌ఎల్‌ఎంను అందిస్తోంది. రెండేళ్ల ఈ కోర్సుకు 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/ బీఎల్ చేసినవారు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది.
వెబ్‌సైట్: www.nalsarlawuniv.ac.in
ఉస్మానియా యూనివర్సిటీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ స్పెషలైజేషన్‌గా ఎల్‌ఎల్‌ఎంను ఆఫర్ చేస్తుంది. 45 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. వెబ్‌సైట్: www.osmania.ac.in
స్కూల్ ఆఫ్ ఇండియన్ లీగల్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌ఎం(ఇంటలెక్చు వల్ ప్రాపర్టీ రైట్స్)ను అందిస్తోంది.
వెబ్‌సైట్: www.mguniversity.edu
తమిళనాడులోని అంబేద్కర్ లా యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ లా (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్)ను ఆఫర్ చేస్తుంది.

లా కోర్సులను డిస్టెన్స్‌లో అందిస్తున్న సంస్థలేవి?
+
మన రాష్ట్రంలో లా కోర్సులను డిస్టెన్స్ విధానంలో ఆఫర్ చేస్తున్న విశ్వవిద్యాలయాలు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, లేబర్ లా, కాన్‌స్టిట్యూషనల్ లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, కార్పొ రేట్ అండ్ సెక్యూరిటీ లా స్పెషలైజేషన్లుగా ఎల్‌ఎల్‌ఎంను అందిస్తోంది.
అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్.
వెబ్‌సైట్: www.anucde.com
కాకతీయ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్ మెంటల్ లా ఆప్షన్‌గా ఎల్‌ఎల్‌ఎం, బీజీఎల్‌ను ఆఫర్ చేస్తోంది. వెబ్‌సైట్: www.sdlceku.ac.in
వీటితోపాటు మదురై కామరాజ్ యూనివర్సిటీ, డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ‘బ్యాచిలర్ ఆఫ్ జనరల్ లా’ ను అందిస్తోంది. అర్హత: ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.mkudde.org
అన్నామలై యూనివర్సిటీ, డెరైక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఆఫ్ అకడెమిక్ లా, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ లా, బ్యాచిలర్ ఆఫ్ జనరల్ లాను అందిస్తోంది.
వెబ్‌సైట్: http://annamalaiuniversity.ac.in/distance_edu.htm

ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంబంధిత కోర్సుల వివరాలను తెలపండి?
+
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ స్పెషలైజేషన్‌గా ఎల్‌ఎల్‌ఎంను అందిస్తోంది. వ్యవధి: రెండేళ్లు. 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/బీఎల్ చేసిన వారు దీనికి అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వెబ్‌సైట్: www.nalsarlawuniv.ac.in
ద ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీ ఏడాది వ్యవధిగల పీజీ డిప్లొమా ఇన్ ఇంటలెక్చుకల్ ప్రాపర్టీ రైట్స్‌ను అందిస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు దీనికి అర్హులు.
వెబ్‌సైట్: www.ilidelhi.org
ద ఇండియన్ లా ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీ ఏడాది వ్యవధిగల పీజీ డిప్లొమా ఇన్ ఇంటలెక్చుకల్ ప్రాపర్టీ రైట్స్‌ను అందిస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు దీనికి అర్హులు.
వెబ్‌సైట్: www.ilidelhi.org
ఎల్‌ఎల్‌ఎం చేస్తున్నాను. ప్రాక్టీసు చేయూలన్న ఆసక్తి లేదు. నాకు ఉన్న ఈ విద్యార్హతలతో స్థిరపడడం ఎలా?
+
లా చదివి వారందరూ ప్రాక్టీసు చేయూలన్న నిబంధన ఏమీ లేదు. మీ ఆసక్తి, అభిరుచిని బట్టి వృత్తిని ఎంచుకునే అవకాశం ఉంది. మీరు బోధన, పరిశోధన, కన్సల్టింగ్, కంటెంట్ రైటర్, కార్పొరేట్ సంస్థల్లో పని చేయవచ్చు. ఇలాంటి ఉద్యోగ వివరాలను దినపత్రికలు, ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చు.
కార్పొరేట్ లా కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
+
కార్పొరేట్ లా కు సంబంధించి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ డిగ్రీకి అనుగుణంగా ఉండి, కెరీర్‌కు ఉపయోగపడే కోర్సును ఎంచుకోవడం మంచిది.
కార్పొరేట్ లా కోర్సును ఆఫర్ చేస్త్తున్న యూనివర్సిటీలు:
ఏఎస్‌సీఎల్ లా స్కూల్, పుణే డిప్లొమా ఇన్ కార్పొరేట్ లా కోర్సును దూరవిద్యా విధానంలో అందిస్త్తుంది. లా, కామర్స్, మేనేజ్‌మెంట్ విద్యార్థులతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్స్, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌కు కూడా ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది.
వెబ్‌సైట్: www.als.org.in
సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, పుణే: డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ లా అండ్ కార్పొరేట్ లా కోర్సును పార్ట్‌టైం విధానంలో అందిస్త్తుంది. 50 శాతం మార్కులతో మూడేళ్ల/ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమాన డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్: www.symlaw.ac.in
నల్సార్ యూనివర్సిటీ, హైదరాబాద్: కార్పొరేట్ లా స్పెషలైజేషన్‌గా ఎల్‌ఎల్‌ఎం డిగ్రీని ఆఫర్ చేస్తోంది. న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది. వెబ్‌సైట్: www.nalsar.ac.in

కెరీర్ ఉన్నతికి దోహదపడేలా ‘లా’ కోర్సులు చదవాలనుకుంటున్నాను. దూరవిద్య విధానంలో ‘లా’లో బ్యాచిలర్ డిగ్రీ అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
+
న్యాయశాస్ర్తానికి సంబంధించి డిస్టెన్స్ కోర్సులు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు..
మదురై కామరాజ్ యూనివర్సిటీ:
కోర్సు- బ్యాచిలర్ ఆఫ్ జనరల్ లా.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
వెబ్‌సైట్: www.mkudde.org
అన్నామలై యూనివర్సిటీ:
కోర్సు- బ్యాచిలర్ ఆఫ్ అకడెమిక్ ‘లా’స్; బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ లా; బ్యాచిలర్ ఆఫ్ జనరల్ లా.
అర్హత: బీఏల్, బీజీఎల్‌కు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ లా
అర్హత: పీయూసీ/ హయ్యర్ సెకండరీ/ మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా/ రెండేళ్ల డిప్లొమా ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: http://annamalaiuniversity.ac.in
కాకతీయ యూనివర్సిటీ- స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్: కోర్సు- బ్యాచిలర్ ఆఫ్ జనరల్ లా.
వెబ్‌సైట్: www.kuwarangal.com
అయితే ఈ కోర్సులు పూర్తి చేసినప్పటికీ ‘న్యాయవాద’ వృత్తిలో ప్రాక్టీస్ చేయడానికి అర్హత లభించదు. లాయర్‌గా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఫుల్‌టైం విధానంలో బ్యాచిలర్ ఆఫ్ లా లో ఉత్తీర్ణత తప్పనిసరి.

ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాను. తర్వాత ఎల్‌ఎల్‌ఎం లేదా ఎంబీఏ కోర్సుల్లో ఏదీ తీసుకుంటే మంచిది?
+
ఏ కోర్సు ఎంచుకోవాలనేది మీ ఆసక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు కాబట్టి తర్వాత ఎల్ ఎల్‌ఎం చదవడం వుంచిది. బ్యాచిలర్ స్థాయిలో చదివిన సబ్జెక్టుపై ఉన్న అవగాహనతో మాస్టర్ స్థాయిలో మీరు తీసుకున్న స్పెషలైజేషన్‌కు న్యాయం చేకూర్చగలుగుతారు. న్యాయ రంగంలో విజయువంతమైన కెరీర్ నిర్మించుకోవటానికి కూడా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. మేనేజ్‌మెంట్ విషయూనికొస్తే.. ఇది పూర్తిగా మీకు కొత్త రంగం. దాంతో ప్రతి అంశాన్ని మొదటి నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి. అరుుతే అభిరుచి, ఆసక్తి కష్టపడే తత్వం, స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటే ఎంబీఏలో రాణించవచ్చు.
ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తున్న సంస్థలు:
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ హ్యూమన్ రైట్స్, ఎన్విరాన్‌మెంటల్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, కార్పొరేట్ లా అండ్ గవర్నెన్స్, ఇన్సూరెన్స్ లాస్, కాన్‌స్టిట్యూషనల్ లా అండ్ క్రిమినల్ లా స్పెషలైజేషన్లుగా ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తుంది. కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/బీఎల్ పూర్తి చేసిన వారు అర్హు లు. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.
వెబ్‌సైట్: www.nalsarlawuniv.ac.in
కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్ కూడా ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తుంది. స్పెషలైజేషన్స్- అడ్మినిస్ట్రేటివ్ లా, కమ ర్షియల్ లా, కాన్‌స్టిట్యూషనల్ లా, కన్స్యుమర్ లా, క్రిమినల్ లా, ఎన్విరాన్‌మెంటల్ లా, హ్యూమన్ రైట్స్ లా, ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, లేబర్ లా, మారిటైమ్ లా. లా లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్: http://sls.cusat.ac.in
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బిజినెస్ లా అండ్ హ్యూమన్ రైట్స్ లా లో ఎల్‌ఎల్‌ఎం కోర్సు ఆఫర్ చేస్తుంది.కనీసం 50శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ చేసి ఉండాలి. ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.
వెబ్‌సైట్: www.nls.ac.in
మహాత్మా గాంధీ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఇండియన్ లీగల్ థాట్ - ఎల్‌ఎల్‌ఎం (హ్యూమన్ రైట్స్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, సైబర్ లా) కోర్సును ఆఫర్ చేస్తుంది. కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్ బీ పూర్తి చేసిన వారు అర్హులు. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

పేటెంట్ ‘లా’ లో డిప్లొమా కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?
+
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా- హైదరాబాద్.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ పేటెంట్ లా (కాంటాక్ట్ కమ్ వెబ్‌బేస్డ్ లెర్నింగ్) వెబ్‌సైట్: www.nalsarpro.org
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ స్టడీస్-ఎన్‌ఎంఐఎంఎస్ డీమ్డ్ వర్సిటీ, ముంబై.
కోర్సు: పీజీడీ- పేటెంట్ అండ్ ప్రాక్టీస్
వివరాలకు: www.iips.ac.in
అకాడెమీ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ స్టడీస్-ముంబై
కోర్సు: పీజీడీ -పేటెంట్ మేనేజ్‌మెంట్
వివరాలకు: www.aips.ac.in

లాసెట్ రాసేందుకు అర్హతలేమిటి?
+
న్యాయవాద వృత్తి పట్ల ఆసక్తి ఉన్నవారు లా కోర్సులో చేరొచ్చు. మన రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశం కోసం ఏటా లాసెట్ నిర్వహిస్తున్నారు. మూడేళ్ల బీఎల్ కోర్సుకు అర్హత ఏదైనా డిగ్రీ. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు అర్హత ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. మొత్తం 120 మార్కులకు ఉండే ఈ పరీక్ష గంటన్నర వ్యవధిలో రాయూలి.