Skip to main content

IFOS - Indian Forest Service

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో చేరాలనుకుంటున్నాను. దీనికి అర్హత ఏంటి? పరీక్ష విధానం తెలుపగలరు? ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది?
+
 ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ పరీక్షను యూపీఎస్‌సీ ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ప్రకటన ఫిబ్రవరిలో వెలువడుతుంది. డిగ్రీ స్థాయిలో... యానిమల్‌ హస్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, జియూలజీల్లో కనీసం ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. అగ్రికల్చర్‌, ఫారెస్ట్రీ కోర్సుల్లో డిగ్రీ, లేదా ఇంజినీరింగ్‌ చేసినవారూ అర్హులే. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీలకు సడలింపు ఉంటుంది. జనరల్‌ అభ్యర్థులు నాలుగుసార్లు మాత్రమే పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. ఓబీసీ విద్యార్థులు ఏడుసార్లు ఈ పరీక్ష రాయొచ్చు.

రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పరీక్ష వ్యాసరూప విధానంలో ఉంటుంది. రెండు కంపల్సరీతోపాటు రెండు ఆప్షనల్‌ పేపర్లను పరీక్షకోసం ఎన్నుకోవాలి. పాతప్రశ్నపత్రాలను తిరగేస్తే ప్రశ్నల సరళి తెలుస్తుంది. రాత పరీక్షకు 1400 మార్కులు. ఇంటర్వ్యూకు 300 మార్కులు కేటాయించారు. పూర్తి వివరాలకోసం www.upsc.gov.in చూడొచ్చు.
ఆప్షనల్స్‌ ప్రిపరేషన్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
+
నోటిఫికేషన్‌లో చాప్టర్లవారీగా ఇచ్చిన సిలబస్‌ ప్రకారం.. ఏ చాప్టర్‌లో ఏఏ అంశాలు ఉన్నాయో వాటినే బాగా చదవాలి. చదివే సమయంలోనే ముఖ్యాంశాలను పాయింట్లుగా రాసుకోవాలి. ఆప్షనల్‌ సిలబస్‌ బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయికి కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంబంధిత అంశాల మేరకు పీజీ లేదా రిఫరెన్స్‌ పుస్తకాలు కూడా చదవాలి.  గత మూడేళ్ల ప్రశ్నపత్రాన్ని బాగా అధ్యయనంతో ప్రశ్నల శైలి, క్లిష్టత స్థాయి తెలుస్తుంది. ఇన్‌స్టంట్‌ మెటీరియల్‌ (గైడ్ల) కు బదులు అకడమిక్‌ పుస్తకాలు ఆప్షనల్‌ ప్రిపరేషన్‌కు బాగుంటాయి. అవసరం అనుకుంటే ఆ సబ్జెక్ట్‌లో రిఫరెన్స్‌ పుస్తకాలు తిరగేయాలి. ఆప్షనల్‌ సబ్జెక్టులు చదువుతున్నప్పుడే రాయడాన్ని కూడా ప్రాక్టీస్‌ చేయాలి. చదవడానికి కేటాయించే మొత్తం సమయంలో 60 శాతం ఆప్షనల్స్‌కు కేటాయించుకోవాలి. ఎక్కువ పుస్తకాలు రిఫర్‌ చేసే బదులు పరిమిత పుస్తకాలు బాగా చదువుకోవాలి. సమాచార సేకరణకు ఎక్కువ సమయాన్ని వెచ్చించకూడదు.
జనరల్‌ నాలెడ్జ్‌లోని జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ కోసం ఏ పుస్తకాలు చదవాలి?
+
జాగ్రఫీ కోసం ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల జాగ్రఫీ పుస్తకాలు చదివితే సరిపోతుంది. ఈ విభాగంలో మ్యాప్‌పాయింట్‌ ప్రశ్నలడుగుతున్నారు. జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, వివిధరకాల అటవీప్రాంతాలకు సంబంధించిన ప్రదేశాలను మ్యాప్‌ పాయింట్‌ బాగా గుర్తుంచుకోవాలి.

హిస్టరీ కోసం ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల హిస్టరీ పుస్తకాలు చదవాలి. ఇందులో ప్రాచీన, మధ్యయుగ భారత దేశ చరిత్రకు ప్రాధాన్యం ఉంది. ముఖ్య పట్టణాలు, కవులు, రచయితలు-రచనలు, రాజులు-పాలనా కాలం-ఆ సమయంలోని కీలక ఘట్టాలు, రాజ శాసనాలు- బిరుదులు-రచనలు, ఆ సమయంలో సందర్శించిన ప్రముఖులు, రాజుకు సమకాలికులు... ఇలా అన్ని అంశాలూ పాయింట్లగా రాసుకుంటే ఎంతో ప్రయోజనం.

పాలిటీ: బిపిన్‌ చంద్ర, సుభాష్‌ కశ్యప్‌, లక్ష్మీకాంత్‌ వీరిలో మీకు నచ్చిన రచయిత పుస్తకం చదువుకుంటే చాలు. ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పాలిటీ పుస్తకాలు ఉపయోగపడతాయి.
జనరల్‌ నాలెడ్జ్‌ను ఏవిధంగా ప్రిపేర్‌ కావాలి?
+
ఈ విభాగంలోని  కరెంట్‌ అఫైర్స్‌ కోసం.. పరీక్ష తేదీకి సరిగ్గా ఏడాది ముందు వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు తెలుసుకోవాలి. విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌.. లాంటి దేశాల్లో జరిగిన ఆసక్తికర పరిణామాలు గుర్తుంచుకోవాలి. భారత్‌కు వివిధ దేశాలతో ఈ ఏడాది కాలంలో జరిగిన ఒప్పందాలు; ప్రధాని, రాష్టప్రతి, మంత్రుల విదేశీ పర్యటనలు మననం చేసుకోవాలి. సదస్సులు, సమావేశాలు, అవార్డులు, భారత్‌లో పర్యటించిన ప్రముఖులు, క్రీడలు-విజేతలు, పుస్తకాలు-రచయితలు, దేశంలో ఈ ఏడాదిలో సంభవించిన వివిధ సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు.. వీటన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఫారెస్ట్‌ సర్వీస్‌ పరీక్ష కాబట్టి అడవులు, వన్యప్రాణులు, సంరక్షణా కేంద్రాలు, వాతావరణ మార్పులు, ఈ అంశాల్లో తాజా పరిణామాలు అవలోకనం చేసుకుంటే ప్రయోజనం.
ఆప్షనల్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఏవిధంగా ఉంటాయి?
+
ఎంచుకున్న ఆప్షనల్‌ ఏదైనా ఒక్కో పేపర్‌లో 8 ప్రశ్నలుంటాయి. పేపర్‌లో పార్ట్‌-ఎ, పార్ట్‌-బి రెండు సెక్షన్‌లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌ నుంచి 4 ప్రశ్నలడుగుతారు. ఇలా రెండు సెక్షన్లలో అడిగే 8 ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. కానీ సమాధానాలుగా మాత్రం పార్ట్‌-ఎ, పార్ట్‌-బిల నుంచి ఒక్కో ప్రశ్న రాయడం తప్పనిసరి. దీంతోపాటు అదనంగా మళ్లీ ఒక్కో ప్రశ్నను రెండు సెక్షన్ల నుంచీ రాయాలి. అంటే... ఈ ప్రశ్నపత్రాన్ని వందశాతం పూర్తిచేయాలంటే ప్రతి సెక్షన్‌ నుంచీ రెండు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ఐదో ప్రశ్నకు సమాధానంగా నచ్చిన సెక్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో ప్రశ్నల సరళి ఏవిధంగా ఉంటుంది?
+
జనరల్‌ నాలెడ్జ్‌లో వర్తమాన వ్యవహారాలతోపాటు రోజువారీ సంఘటనలు, పరిశీలనల నుంచి ప్రశ్నలడుగుతారు. వీటికి సమాధానాలు రాయడానికి ఎందులోనూ ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. దైనందిన జీవితంలో ఎదురయ్యే వివిధ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సైన్స్‌ అంశాలపై ప్రశ్నలొస్తాయి. వీటితోపాటు రాజనీతి శాస్త్రం, రాజకీయ విధానం, భారత రాజ్యాంగం, భారత దేశ చరిత్ర, భూగోళశాస్ర్తాల్లో అభ్యర్థి అవగాహన తెలుసుకునేలా ప్రాథమిక  స్థాయి ప్రశ్నలడుగుతారు.
ఇంగ్లిష్‌ విభాగంలో ప్రశ్నల సరళి ఏవిధంగా ఉంటుంది?
+
జనరల్‌ ఇంగ్లిష్‌లో.. ఇంగ్లిష్‌లో వ్యాసం రాయాలి. అభ్యర్థి ఇంగ్లిష్‌ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడో తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. పదాల వినియోగం, పాసేజ్‌లు, ప్రెసీ, సమ్మరీ విభాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. వ్యాకరణంలో టెన్సెస్‌, డెరైక్‌,్ట ఇన్‌డెరైక్ట్‌ స్పీచ్‌, ఆర్టికల్స్‌, వెర్బ్స్‌, యాడ్వెర్బ్స్‌... తదితరాంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. లెటర్‌ రైటింగ్‌పై కూడా ప్రశ్న రావొచ్చు. ఇంగ్లిష్‌ ప్రిపరేషన్‌ కోసం  రెన్‌ అండ్‌ మార్టిన్‌ హైస్కూల్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ పుస్తకం సరిపోతుంది.
ఆప్షనల్‌ సబ్జెక్టులను వివరాలను తెలపండి?
+
అగ్రికల్చర్‌, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌, యానిమల్‌ హస్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌, బోటనీ, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఫారెస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, జువాలజీ.. వీటిలో ఏవైనా రెండు సబ్జెక్టులను ఎంచుకోవాలి.

కుదరని కాంబినేషన్లు: అగ్రికల్చర్‌ -అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌-యానిమల్‌ హస్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌, కెమిస్ట్రీ-కెమికల్‌ ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌-స్టాటిస్టిక్స్‌, ఏ రెండు ఇంజనీరింగ్‌ సబ్జెక్టులు కలిసి ఆప్షనల్‌గా తీసుకోకూడదు.
రాత పరీక్ష ఏవిధంగా ఉంటుంది?
+
 ఐఎఫ్‌ఎస్‌ కోసం నిర్వహించే రాత పరీక్షలో మొత్తం 1400 మార్కులకుగాను 6 పేపర్లు ఉంటాయి. ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌, ఇంగ్లిష్‌.. ఒక్కో పేపర్‌ 300 మార్కులకు ఉంటాయి. రెండు ఆప్షనల్‌ సబ్జెక్టులు వీటిలో ఒక్కో సబ్జెక్టు నుంచి రెండేసి పేపర్లు, ప్రతి పేపర్‌కూ 200 మార్కులు చొప్పున ఉంటాయి. ఈ ప్రకారం ఆప్షనల్స్‌ మొత్తం 800 మార్కులకు ఉంటాయి.
ఐఎఫ్‌ఎస్‌ ఎంపికప్రక్రియ ఏవిధంగా ఉంటుంది?
+
 ఐఎఫ్‌ఎస్‌ ఎంపికప్రక్రియ  రెండు దశల్లో ఉంటుంది. అవి..రాత పరీక్ష, ఇంటర్వ్యూ. రాత పరీక్ష వ్యాసరూప విధానంలో ఉంటుంది. రెండు కంపల్సరీతోపాటు రెండు ఆప్షనల్‌ పేపర్లను పరీక్ష కోసం ఎన్నుకోవాలి. పాతప్రశ్నపత్రాలను తిరగేస్తే ప్రశ్నల సరళి తెలుస్తుంది. రాత పరీక్షకు 1400 మార్కులు. ఇంటర్వ్యూకు 300 మార్కులు కేటారుుంచారు.
ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌)లో చేరాలనుకుంటున్నాను. దీనికి అర్హత ఏంటి?
+
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) కోసం జాతీయ స్థాయిలో పరీక్షను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ప్రకటన ఫిబ్రవరిలో వెలువడుతుంది.అర్హత: యానిమల్‌ హస్బెండరీ అండ్‌ వెటర్నరీ సెన్సైస్‌, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, జువాలజీలలో ఏదో ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా అగ్రికల్చర్‌, ఫారెస్ట్రీ, ఇంజనీరింగ్‌లలో ఏదో ఒక దానిలో బ్యాచిలర్‌ డిగ్రీ. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.  గరిష్ట వయోపరిమితి నిబంధనకు అనుగుణంగా జనరల్‌ అభ్యర్థులు నాలుగుసార్లు , ఓబీసీలు ఏడుసార్లు ఈ పరీక్ష రాయొచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి పరిమితి లేదు. ఎన్నిసారై్లనా పరీక్ష రాసుకోవచ్చు.
వివరాలకోసం www.upsc.gov.in