Skip to main content

ప్రస్తుతం ఇంటర్‌(ఎంపీసీ) చేస్తున్నాను. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్‌డీఏ) గురించి సమాచారం అందించండి?
ఇంటర్‌ తర్వాత లభించే ఆర్మీ ఉద్యోగాల గురించి వివరించండి?

Question
ప్రస్తుతం ఇంటర్‌(ఎంపీసీ) చేస్తున్నాను. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్‌డీఏ) గురించి సమాచారం అందించండి?
ఇంటర్‌ తర్వాత లభించే ఆర్మీ ఉద్యోగాల గురించి వివరించండి?
నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ) పుణె సమీపంలోని కడక్‌వాస్లా వద్ద ఉంది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన, లేదా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు అర్హులు. అవివాహితులై ఉండాలి. వయస్సు 161/2 నుంచి 19 ఏళ్లలోపు ఉండాలి.

ప్రవేశ పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని అన్ని ప్రముఖ దినపత్రికల ద్వారా అందిస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు వారి ఆప్షన్‌ మేరకు ఆర్మీ, నేవీ, ఎరుుర్‌ఫోర్స్‌ విభాగాల్లో నాలుగేళ్ల శిక్షణ ఉంటుంది. ఇందులో మూడేళ్లు క్లాస్‌ రూం టీచింగ్‌ అందించి జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) వారి బీఎస్సీ సర్టి ఫికెట్‌ అందజేస్తారు. అనంతరం సంబంధిత అకాడెమీల్లో పద్దెనిమిది నెలల పాటు ప్రాక్టికల్స్‌ శిక్షణ ఉంటుంది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది.
రాత పరీక్ష: పేపర్‌-1 మ్యాథమెటిక్స్‌ 300 మార్కులకు ఉంటుంది. సమయం 2 1/2 గంటలు. పేపర్‌-2 జనరల్‌ ఎబిలిటీ 600 మార్కులకు ఉంటుంది. సమయం 2 1/2 గంటలు. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు.

సిలబస్‌ :
పేపర్‌ 1(మ్యాథమెటిక్స్‌) - అర్థిమెటిక్‌, మెన్సురేషన్‌, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగినోమెట్రీ, స్టాటిస్టిక్స్‌.
పేపర్‌ 2(జనరల్‌ ఎబిలిటీ) - పార్ట్‌-ఏ ఇంగ్లిష్‌ (200 మార్కులు) - పార్ట్‌-బీ జనరల్‌ నాలెడ్జ్‌(400 మార్కులు)

విభాగాల వారీగా పరిశీలిస్తే... సెక్షన్‌ ఏలో ఫిజిక్స్‌, సెక్షన్‌ బీలో కెమిస్ట్రీ, సెక్షన్‌ సీలో జనరల్‌ సైన్స్‌, సెక్షన్‌ డీలో (హిస్టరీ, ఫ్రీడమ్‌ మూమెంట్‌), సెక్షన్‌ ఈలో జాగ్రఫీ, సెక్షన్‌ ఎఫ్‌లో కరెంట్‌ అఫైర్స్‌.
ఎన్‌డీఏకు సంబంధించి ప్రకటన ప్రతి సంవత్సరం ఏప్రిల్‌/మే, అక్టోబర్‌/ నవంబర్‌ నెలలో వస్తుంది. సైనిక దళాల్లో ఇతర ఉద్యోగాలు :
ఎ) సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ:
కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత. ఉన్నత విద్యార్హతలు ఉంటే మార్కుల పర్సంటేజీ పరిగణనలోకి తీసుకోరు. వయస్సు 171/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి.

బి) సోల్జర్‌ టెక్నికల్‌ - ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌తో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత. వయస్సు 171/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి.

సి) సోల్జర్‌ క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ - కనీసం 50 శాతం మార్కులతో ఏ గ్రూపుతోనైనా ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి.
వయసు : 171/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి.

డి) సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ : కనీసం 50 శాతం మార్కులతో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయూలజీ, ఇంగ్లిష్‌తో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి. వయసు: 171/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి.

Photo Stories