Skip to main content

పోటీ పరీక్షల్లో ‘భారతదేశ నైసర్గిక స్వరూపం’ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?

- శ్రీకర్, హైదరాబాద్.
Question
పోటీ పరీక్షల్లో ‘భారతదేశ నైసర్గిక స్వరూపం’ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
భారతదేశ భూగోళ శాస్త్రంలో ‘నైసర్గిక స్వరూపాలు’ విభాగానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. దీనిలోని హిమాలయాలు, గంగా - సింధు మైదానాలకు సంబంధించి 1, 2 ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి దీనిలోని ప్రధాన అంశాలైన హిమాలయాల పొడవు, వాటిలోని సమాంతర శ్రేణులు, ఆ శ్రేణుల్లో ఎత్తయిన శిఖరాలు, కనుమలు, లోయలు, మైదానాలు, దానిలోని భూ స్వరూపాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అలాగే గతంలో వచ్చిన ప్రశ్నల సరళిని పరిశీలిస్తూ మాదిరి ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా ఈ విభాగం నుంచి మంచి మార్కులు సాధించవచ్చు.

Photo Stories