నేను డిగ్రీ పూర్తి చేశాను. ఐఈఎస్, ఐఎస్‌ఎస్ పరీక్ష రాయాలనుకుంటున్నా. ఈ సర్వీసులో చేరటానికి అర్హతలేంటి? పరీక్ష విధానం ఎలా...
Question
నేను డిగ్రీ పూర్తి చేశాను. ఐఈఎస్, ఐఎస్‌ఎస్ పరీక్ష రాయాలనుకుంటున్నా. ఈ సర్వీసులో చేరటానికి అర్హతలేంటి? పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
ప్లానింగ్ క మిషన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, వివిధ మంత్రిత్వ శాఖలకు ఎకనామిక్స్ అడ్వైజర్స్, టారిఫ్ కమిషన్, ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్, నేషనల్ శాంపిల్ సర్వే విభాగాల్లో... ఖాళీల భర్తీకి యూపీఎస్‌సీ.. ఇండియన్ ఎకనామిక్స్ సర్వీసెస్ (ఐఈఎస్), ఇండియన్ స్టాటిస్టిక్ సర్వీసెస్ (ఐఎస్‌ఎస్)ను నిర్వహిస్తోంది. పీజీలో ఎకనామిక్స్, అప్లయిడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకనామిట్రిక్స్ చేసినవారు ఐఈఎస్‌కు... స్టాటికల్, మ్యాథమెటికల్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్ చేసినవారు ఐఎస్‌ఎస్‌కు అర్హులు. ఐఈఎస్, ఐఎస్‌ఎస్ నియామక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష 1000 మార్కులకు, ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంటుంది.