ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరాలంటే ఎలా?
Question
ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరాలంటే ఎలా?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) ద్వారా భర్తీ చేసే ఆల్ ఇండియా సర్వీసెస్‌లలో ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) ఒకటి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు సీఎస్‌ఈకి అర్హులు. ఇందులో వచ్చిన ర్యాంక్, ప్రాధాన్యతలాధారంగా ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక చేస్తారు. ఈ సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్థులు విదేశాంగ శాఖ, విదేశాల్లోని భారత రాయబార/హై కమిషనర్ కార్యాలయాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు నిర్వహిస్తారు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సాధారణంగా ప్రిలిమ్స్ జూన్‌లో.. మెయిన్స్ అక్టోబర్/నవంబర్‌ల్లో.. ఇంటర్వ్యూ ఏప్రిల్‌లో ఉంటాయి
వివరాలకు www.upsc.gov.in చూడొచ్చు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సాధారణంగా ప్రిలిమ్స్ జూన్‌లో.. మెయిన్స్ అక్టోబర్/నవంబర్‌ల్లో.. ఇంటర్వ్యూ ఏప్రిల్‌లో ఉంటాయి
వివరాలకు www.upsc.gov.in చూడొచ్చు.